سورة الذاريات بالتيلجو
దుమ్ము ఎగురవేసే వాటి (గాలుల) సాక్షిగా |
మరియు (నీటి) భారాన్ని మోసే (మేఘాల) |
మరియు సముద్రంలో సులభంగా తేలియాడే (ఓడల) |
మరియు (ఆయన) ఆజ్ఞతో (అనుగ్రహాలను) పంచిపెట్టే (దేవదూతల సాక్షిగా) |
నిశ్చయంగా, మీకు చేయబడ్డ వాగ్దానం సత్యం |
మరియు నిశ్చయంగా తీర్పు రానున్నది |
మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా |
నిశ్చయంగా, మీరు భేదాభిప్రాయాలలో పడి ఉన్నారు |
(సత్యం నుండి) మరలింపబడిన వాడే, మోసగింపబడిన వాడు |
ఆధారం లేని అభిప్రాయాలు గలవారే నాశనం చేయబడేవారు |
ఎవరైతే నిర్లక్ష్యంలో పడి అశ్రద్ధగా ఉన్నారో |
వారు ఇలా అడుగుతున్నారు: తీర్పుదినం ఎప్పుడు రానున్నది |
ఆ దినమున, వారు అగ్నితో దహింపబడతారు (పరీక్షింపబడతారు) |
ذُوقُوا فِتْنَتَكُمْ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تَسْتَعْجِلُونَ(14) (వారితో ఇలా అనబడుతుంది): మీ పరీక్షను రుచి చూడండి! మీరు దీని కొరకే తొందర పెట్టేవారు |
నిశ్చయంగా, దైవభీతి గలవారు చెలమలు గల స్వర్గవనాలలో ఉంటారు |
آخِذِينَ مَا آتَاهُمْ رَبُّهُمْ ۚ إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ(16) తమ ప్రభువు తమకు ప్రసాదించిన వాటితో సంతోషపడుతూ! నిశ్చయంగా వారు అంతకు పూర్వం సజ్జనులై ఉండేవారు |
వారు రాత్రివేళలో చాలా తక్కువగా నిద్రపోయేవారు |
మరియు వారు రాత్రి చివరి ఘడియలలో క్షమాపణ వేడుకునే వారు |
మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి హక్కు ఉంటుంది |
మరియు భూమిలో కూడా నమ్మేవారి కొరకు ఎన్నో నిదర్శనాలు (ఆయాత్) ఉన్నాయి |
మరియు స్వయంగా మీలో కూడా ఉన్నాయి. ఏమీ? మీరు చూడలేరా |
మరియు ఆకాశంలో మీ జీవనోపాధి మరియు మీకు వాగ్దానం చేయబడినది ఉంది |
فَوَرَبِّ السَّمَاءِ وَالْأَرْضِ إِنَّهُ لَحَقٌّ مِّثْلَ مَا أَنَّكُمْ تَنطِقُونَ(23) కావున భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, ఇది సత్యం; ఏ విధంగానైతే మీరు మాట్లాడగలిగేది (సత్యమో) |
ఏమీ? ఇబ్రాహీమ్ యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా |
إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا ۖ قَالَ سَلَامٌ قَوْمٌ مُّنكَرُونَ(25) వారు అతని వద్దకు వచ్చినపుడు: మీకు సలాం!" అని అన్నారు. అతను: మీకూ సలాం!" అని జవాబిచ్చి : మీరు పరిచయం లేని (కొత్త) వారుగా ఉన్నారు." అని అన్నాడు |
తరువాత అతను తన ఇంటిలోకి పోయి బలిసిన (వేయించిన) ఒక ఆవు దూడను తీసుకొని వచ్చాడు |
దానిని వారి ముందుకు జరిపి: ఏమీ? మీరెందుకు తినటం లేదు?" అని అడిగాడు |
فَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً ۖ قَالُوا لَا تَخَفْ ۖ وَبَشَّرُوهُ بِغُلَامٍ عَلِيمٍ(28) (వారు తినకుండా ఉండటం చూసి), వారి నుండి భయపడ్డాడు. వారన్నారు: భయపడకు!" మరియు వారు అతనికి జ్ఞానవంతుడైన కుమారుని శుభవార్తనిచ్చారు |
فَأَقْبَلَتِ امْرَأَتُهُ فِي صَرَّةٍ فَصَكَّتْ وَجْهَهَا وَقَالَتْ عَجُوزٌ عَقِيمٌ(29) అప్పుడతని భార్య అరుస్తూ వారి ముందుకు వచ్చి, తన చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ: నేను ముసలిదాన్ని, గొడ్రాలను కదా!" అని అన్నది |
قَالُوا كَذَٰلِكِ قَالَ رَبُّكِ ۖ إِنَّهُ هُوَ الْحَكِيمُ الْعَلِيمُ(30) వారన్నారు: నీ ప్రభువు ఇలాగే అన్నాడు! నిశ్చయంగా, ఆయన మహావివేకవంతుడు, సర్వజ్ఞుడు |
(ఇబ్రాహీమ్) అడిగాడు: ఓ సందేశహరులారా (ఓ దేవదూతలారా)! అయితే మీరు వచ్చిన కారణమేమిటి |
వారన్నారు: వాస్తవానికి, మేము నేరస్థులైన జనుల వైపునకు పంపబడ్డాము |
వారి మీద (కాల్చబడిన) మట్టి రాళ్ళను కురిపించటం కోసం |
నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడిన (రాళ్ళు); మితిమీరి ప్రవర్తించేవారి కొరకు |
అప్పుడు మేము అందులో ఉన్న విశ్వాసులందరినీ బయటికి తీశాము |
فَمَا وَجَدْنَا فِيهَا غَيْرَ بَيْتٍ مِّنَ الْمُسْلِمِينَ(36) మేము అందు ఒక్క గృహం తప్ప! ఇతర విధేయుల (ముస్లింల) గృహాన్ని చూడలేదు |
وَتَرَكْنَا فِيهَا آيَةً لِّلَّذِينَ يَخَافُونَ الْعَذَابَ الْأَلِيمَ(37) మరియు బాధాకరమైన శిక్షకు భయపడేవారి కొరకు, మేము అక్కడ ఒక సూచన (ఆయత్) ను వదలి పెట్టాము |
وَفِي مُوسَىٰ إِذْ أَرْسَلْنَاهُ إِلَىٰ فِرْعَوْنَ بِسُلْطَانٍ مُّبِينٍ(38) ఇక మూసా (గాథలో) కూడా (ఒక సూచన వుంది) మేము అతనిని ఫిర్ఔన్ వద్దకు స్పష్టమైన ప్రమాణంతో పంపినపుడు |
అతడు (ఫిర్ఔన్) తన సభాసదులతో సహా మరలిపోతూ, ఇలా అన్నాడు: ఇతడు మాంత్రికుడు లేదా పిచ్చివాడు |
فَأَخَذْنَاهُ وَجُنُودَهُ فَنَبَذْنَاهُمْ فِي الْيَمِّ وَهُوَ مُلِيمٌ(40) కావున మేము అతనిని మరియు అతని సైనికులను పట్టుకొని, వారందరినీ సముద్రంలో ముంచి వేశాము మరియు దానికి అతడే నిందితుడు |
وَفِي عَادٍ إِذْ أَرْسَلْنَا عَلَيْهِمُ الرِّيحَ الْعَقِيمَ(41) ఇక ఆద్ జాతి వారిలో కూడా (ఒక సూచన వుంది): మేము వారిపై వినాశకరమైన గాలిని పంపినప్పుడు |
مَا تَذَرُ مِن شَيْءٍ أَتَتْ عَلَيْهِ إِلَّا جَعَلَتْهُ كَالرَّمِيمِ(42) అది దేని పైనయితే వీచిందో, దానిని క్షీణింపజేయకుండా వదలలేదు |
وَفِي ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا حَتَّىٰ حِينٍ(43) మరియు సమూద్ జాతి వారి గాథలో కూడా (ఒక సూచన ఉంది). వారితో: కొంతకాలం మీరు సుఖసంతోషాలను అనుభవించండి." అని అన్నాము |
فَعَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ فَأَخَذَتْهُمُ الصَّاعِقَةُ وَهُمْ يَنظُرُونَ(44) అప్పుడు వారు తమ ప్రభువు ఆజ్ఞను ఉపేక్షించారు. కావున వారు చూస్తూ ఉండగానే ఒక పెద్ద పిడుగు వారి మీద విరుచుకు పడింది |
فَمَا اسْتَطَاعُوا مِن قِيَامٍ وَمَا كَانُوا مُنتَصِرِينَ(45) అప్పుడు వారికి లేచి నిలబడే శక్తి కూడా లేకపోయింది మరియు వారు తమను తాము కూడా కాపాడు కోలేక పోయారు |
وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ(46) మరియు దీనికి ముందు నూహ్ జాతి వారిని కూడా (నాశనం చేశాము). నిశ్చయంగా, వారు కూడా అవిధేయులు |
وَالسَّمَاءَ بَنَيْنَاهَا بِأَيْدٍ وَإِنَّا لَمُوسِعُونَ(47) మరియు ఆకాశాన్ని మేము (మా) చేతులతో నిర్మించాము. మరియు నిశ్చయంగా, మేమే దానిని విస్తరింపజేయ గలవారము |
మరియు భూమిని మేము పరుపుగా చేశాము, మేమే చక్కగా పరిచేవారము |
وَمِن كُلِّ شَيْءٍ خَلَقْنَا زَوْجَيْنِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ(49) మరియు మేము ప్రతిదానిని జంటలుగా సృష్టించాము, మీరు గ్రహించాలని |
فَفِرُّوا إِلَى اللَّهِ ۖ إِنِّي لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ(50) కావున మీరు అల్లాహ్ వైపునకు పరుగెత్తండి. నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే |
وَلَا تَجْعَلُوا مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ ۖ إِنِّي لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ(51) మరియు మీరు అల్లాహ్ కు సాటిగా ఇతర దైవాన్ని నిలుపకండి! నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే |
كَذَٰلِكَ مَا أَتَى الَّذِينَ مِن قَبْلِهِم مِّن رَّسُولٍ إِلَّا قَالُوا سَاحِرٌ أَوْ مَجْنُونٌ(52) ఇదే విధంగా, వారికి పూర్వం గడిచిన వారి వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు: ఇతను మాంత్రికుడు లేదా పిచ్చివాడు." అని అనకుండా ఉండలేదు |
ఏమీ? దీనిని (ఇలా పలుకుటను) వారు ఒకరికొకరు వారసత్వంగా ఇచ్చుకున్నారా? అలా కాదు! అసలు వారు తలబిరుసుతనంతో ప్రవర్తించే జనం |
కావున నీవు వారి నుండి మరలిపో, ఇక నీపై ఎలాంటి నింద లేదు |
మరియు వారిని ఉపదేశిస్తూ వుండు, నిశ్చయంగా, ఉపదేశం విశ్వాసులకు ప్రయోజనకర మవుతుంది |
మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే |
مَا أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍ وَمَا أُرِيدُ أَن يُطْعِمُونِ(57) నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు |
إِنَّ اللَّهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِينُ(58) నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు |
فَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا ذَنُوبًا مِّثْلَ ذَنُوبِ أَصْحَابِهِمْ فَلَا يَسْتَعْجِلُونِ(59) కావున నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడినవారి పాపాలు వారి (పూర్వ) స్నేహితుల పాపాల వంటివే! కావున వారు నా (శిక్ష కొరకు) తొందర పెట్టనవసరం లేదు |
فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِن يَوْمِهِمُ الَّذِي يُوعَدُونَ(60) కావున సత్యతిరస్కారులకు వినాశం గలదు - వారికి వాగ్దానం చేయబడిన - ఆ దినమున |
المزيد من السور باللغة التيلجو:
تحميل سورة الذاريات بصوت أشهر القراء :
قم باختيار القارئ للاستماع و تحميل سورة الذاريات كاملة بجودة عالية
أحمد العجمي
خالد الجليل
سعد الغامدي
سعود الشريم
عبد الباسط
عبد الله الجهني
علي الحذيفي
فارس عباد
ماهر المعيقلي
محمد جبريل
المنشاوي
الحصري
مشاري العفاسي
ناصر القطامي
ياسر الدوسري
Wednesday, January 22, 2025
لا تنسنا من دعوة صالحة بظهر الغيب