La sourate Al-Qiyamah en Telugu
అలా కాదు! నేను పునరుత్థాన దినపు శపథం చేస్తున్నాను |
అలా కాదు! నేను తనను తాను నిందించుకునే అంతరాత్మ శపథం చేస్తున్నాను |
ఏమిటి? మేము అతని ఎముకలను ప్రోగు చేయలేమని మానవుడు భావిస్తున్నాడా |
వాస్తవానికి! మేము అతని వ్రేళ్ళ కొనలను గూడా సరిగ్గా సవరించగల సమర్ధులము |
అయినా, మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు |
అతడు: అయితే ఈ పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుంది?" అని అడుగుతున్నాడు |
కళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు |
మరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు |
మరియు సూర్యచంద్రులు కలిపి వేయబడినప్పుడు |
మానవుడు ఆ రోజు: ఎక్కడికి పారి పోవాలి?" అని అంటాడు |
అది కాదు! (అతనికి) ఎక్కడా శరణం ఉండదు |
ఆ రోజు నీ ప్రభువు వద్దనే ఆశ్రయం ఉంటుంది |
يُنَبَّأُ الْإِنسَانُ يَوْمَئِذٍ بِمَا قَدَّمَ وَأَخَّرَ(13) ఆ రోజు మానవుడికి, తాను చేసి పంపంది మరియు వెనక వదలింది అంతా తెలుపబడుతుంది |
అలా కాదు! మానవుడు తనకు విరుద్ధంగా, తానే సాక్షి అవుతాడు |
మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే |
నీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను గ్రహించటానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు |
నిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే |
కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు |
ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే |
అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు |
మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు |
ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి |
తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి |
మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి |
నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి |
అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు |
మరియు: ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది |
మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు |
మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది |
ఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది |
కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపనూ లేదు |
మరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు |
ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు |
(ఓ సత్యతిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది |
అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది |
ఏమిటీ? మానవుడు తనను విచ్చల విడిగా వదలిపెట్టండం జరుగుతుందని భావిస్తున్నాడా |
ఏమీ? అతడు ప్రసరింప జేయబడిన ఒక వీర్యబిందువు కాడా |
తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు |
ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు |
أَلَيْسَ ذَٰلِكَ بِقَادِرٍ عَلَىٰ أَن يُحْيِيَ الْمَوْتَىٰ(40) అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Qiyamah : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Qiyamah complète en haute qualité.















Donnez-nous une invitation valide