La sourate Al-Burooj en Telugu
విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా |
వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా |
చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా |
అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు |
ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు |
వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు |
మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు |
وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَن يُؤْمِنُوا بِاللَّهِ الْعَزِيزِ الْحَمِيدِ(8) మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే |
الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ(9) ఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి |
ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది |
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అదే గొప్ప విజయం |
నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది |
నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు |
మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు |
సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు, మహత్త్వపూర్ణుడు |
తాను తలచింది చేయగలవాడు |
ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా |
ఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల) |
అలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు |
మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు |
వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన ఖుర్ఆన్ |
సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్) లో (వ్రాయబడి) ఉన్నది |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Burooj : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Burooj complète en haute qualité.















Donnez-nous une invitation valide