La sourate Al-Insan en Telugu
هَلْ أَتَىٰ عَلَى الْإِنسَانِ حِينٌ مِّنَ الدَّهْرِ لَمْ يَكُن شَيْئًا مَّذْكُورًا(1) అనంత కాలచక్రంలో, మానవుడు తాను చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉన్న సమయం గడవలేదా |
إِنَّا خَلَقْنَا الْإِنسَانَ مِن نُّطْفَةٍ أَمْشَاجٍ نَّبْتَلِيهِ فَجَعَلْنَاهُ سَمِيعًا بَصِيرًا(2) నిశ్చయంగా, మేము మానవుణ్ణి ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము. అతనిని పరీక్షించటానికి, మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము |
إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا(3) నిశ్చయంగా, మేము అతనికి మార్గం చూపాము. ఇక అతడు కృతజ్ఞుడు కావచ్చు, లేదా కృతఘ్నుడూ కావచ్చు |
إِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَلَاسِلَ وَأَغْلَالًا وَسَعِيرًا(4) నిశ్చయంగా, మేము సత్యతిరస్కారుల కొరకు సంకెళ్ళను, మెడలో పట్టాలను మరియు భగభగ మండే నరకాగ్నిని (సఈరానుసిద్ధపరచి ఉంటాము) |
إِنَّ الْأَبْرَارَ يَشْرَبُونَ مِن كَأْسٍ كَانَ مِزَاجُهَا كَافُورًا(5) నిశ్చయంగా, పుణ్యాత్ములు కాఫూర్ అనే ఒక చెలమ నుండి ఒక గిన్నెలో తెచ్చిన (పానీయాన్ని) త్రాగుతారు |
عَيْنًا يَشْرَبُ بِهَا عِبَادُ اللَّهِ يُفَجِّرُونَهَا تَفْجِيرًا(6) ధారాళంగా పొంగి ప్రవహింప జేయబడే ఊటల నుండి, అల్లాహ్ దాసులు త్రాగుతూ ఉంటారు |
يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا(7) వారు తమ మొక్కుబడులను పూర్తి చేసుకున్నవారై ఉంటారు. మరియు దాని హాని అన్ని వైపులా క్రమ్ముకొనే, ఆ దినమును గురించి భయపడుతూ ఉంటారు |
وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَىٰ حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا(8) మరియు అది తమకు ప్రీతికరమైనప్పటికీ వారు నిరుపేదలకు మరియు అనాథలకు మరియు ఖైదీలకు, ఆహారం పెట్టేవారై ఉంటారు |
إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللَّهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَاءً وَلَا شُكُورًا(9) వార (వారితో ఇలా అంటారు): వాస్తవానికి మేము అల్లాహ్ ప్రసన్నత కొరకే మీకు ఆహారం పెడుతున్నాము. మేము మీ నుండి ఎలాంటి ప్రతిఫలం గానీ, లేదా కృతజ్ఞతలు గానీ ఆశించటం లేదు |
إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا(10) నిశ్చయంగా, మేము మా ప్రభువు నుండి వచ్చే ఉగ్రమైన, దుర్భరమైన, ఆ దినానికి భయపడుతున్నాము |
فَوَقَاهُمُ اللَّهُ شَرَّ ذَٰلِكَ الْيَوْمِ وَلَقَّاهُمْ نَضْرَةً وَسُرُورًا(11) కావున అల్లాహ్ వారిని ఆ దినపు కీడు నుండి కాపాడాడు. మరియు వారికి ఉల్లాసాన్ని మరియు ఆనందాన్ని ప్రసాదించాడు |
మరియు వారి సహనానికి ప్రతిఫలంగా వారికి స్వర్గాన్ని మరియు పట్టు వస్త్రాలను ఇచ్చాడు |
مُّتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ ۖ لَا يَرَوْنَ فِيهَا شَمْسًا وَلَا زَمْهَرِيرًا(13) అందులో, వారు ఎత్తైన పీఠాల మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. అందులో వారు ఎండ (బాధ) గానీ, చలి తీవ్రతను గానీ చూడరు |
وَدَانِيَةً عَلَيْهِمْ ظِلَالُهَا وَذُلِّلَتْ قُطُوفُهَا تَذْلِيلًا(14) మరియు అందులో వారిపై నీడలు పడుతుంటాయి. దాని ఫలాల గుత్తులు వారికి అందుబాటులో ఉంటాయి |
وَيُطَافُ عَلَيْهِم بِآنِيَةٍ مِّن فِضَّةٍ وَأَكْوَابٍ كَانَتْ قَوَارِيرَا(15) మరియు వారి మధ్య వెండి పాత్రలు మరియు గాజుగ్లాసులు త్రిప్ప బడుతూ ఉంటాయి |
ఆ గాజు గ్లాసులు స్ఫటికం వలే తెల్లవైన వెండితో చేయబడి ఉంటాయి. అవి నియమబద్ధాం నింపబడి ఉంటాయి |
وَيُسْقَوْنَ فِيهَا كَأْسًا كَانَ مِزَاجُهَا زَنجَبِيلًا(17) మరియు వారికి సొంటి కలిపిన మధుపాత్రలు త్రాగటానికి ఇవ్వబడతాయి |
అది స్వర్గంలోని సల్ సబీల్ అనే పేరు గల ఒక ఊట |
۞ وَيَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ إِذَا رَأَيْتَهُمْ حَسِبْتَهُمْ لُؤْلُؤًا مَّنثُورًا(19) మరియు వారి మద్య శాశ్వతంగా, యవ్వనులుగా ఉంటే బాలురు తిరుగుతూ ఉంటారు. మరియు నీవు వారిని చూస్తే, వారిని వెదజల్లిన ముత్యాలుగా భావిస్తావు |
وَإِذَا رَأَيْتَ ثَمَّ رَأَيْتَ نَعِيمًا وَمُلْكًا كَبِيرًا(20) మరియు నీవు అక్కడ (స్వర్గంలో) చూస్తే, ఎక్కడ చూసినా ఆనందమే పొందుతావు. మరియు ఒక మహత్తర సామ్రాజ్య వైభవం కనిపిస్తుంది |
వారి ఒంటి మీద సన్నని ఆకుపచ్చని శ్రేష్ఠమైన పట్టు వస్త్రాలు మరియు బంగారు జలతారు అల్లిన దుస్తులుంటాయి. మరియు వారికి వెండి కంకణాలు తొడిగించబడతాయి. మరియు వారి ప్రభువు వారికి నిర్మలమైన పానీయాన్ని త్రాగటానికి ప్రసాదిస్తాడు |
إِنَّ هَٰذَا كَانَ لَكُمْ جَزَاءً وَكَانَ سَعْيُكُم مَّشْكُورًا(22) (వారితో ఇలా అనబడుతుంది): నిశ్చయంగా, ఇది మీకు ఇవ్వబడే ప్రతిఫలం. ఎందుకంటే, మీ శ్రమ అంగీరించబడింది |
నిశ్చయంగా, మేమే, ఈ ఖుర్ఆన్ ను, నీ పై (ఓ ముహమ్మద్!) క్రమక్రమంగా అవతరింపజేశాము |
فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تُطِعْ مِنْهُمْ آثِمًا أَوْ كَفُورًا(24) కావున నీవు నీ ప్రభువు యొక్క ఆజ్ఞపై స్థిరంగా ఉండు మరియు వీరిలోని ఏ పాపి యొక్క లేదా సత్యతిరస్కారుని యొక్క మాట గాని వినకు |
మరియు నీ ప్రభువు నామాన్ని ఉదయం మరియు సాయంత్రం స్మరిస్తూ ఉండు |
وَمِنَ اللَّيْلِ فَاسْجُدْ لَهُ وَسَبِّحْهُ لَيْلًا طَوِيلًا(26) మరియు రాత్రివేళ ఆయన సన్నిధిలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉండు మరియు రాత్రివేళ సుదీర్ఘ కాలం, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు |
إِنَّ هَٰؤُلَاءِ يُحِبُّونَ الْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَاءَهُمْ يَوْمًا ثَقِيلًا(27) నిశ్చయంగా, వీరు అనిశ్చితమైన ఈ ప్రాపంచిక జీవితం పట్ల మోహితులై వున్నారు. మరియు మున్ముందు రానున్న భారమైన దినాని విస్మరిస్తున్నారు |
نَّحْنُ خَلَقْنَاهُمْ وَشَدَدْنَا أَسْرَهُمْ ۖ وَإِذَا شِئْنَا بَدَّلْنَا أَمْثَالَهُمْ تَبْدِيلًا(28) మేమే వీరిని సృష్టించినవారము మరియు వీరి శరీరాన్ని దృఢ పరిచిన వారము. మరియు మేము కోరినప్పుడు వీరికి బదులుగా వీరి వంటి వారిని తేగలము |
إِنَّ هَٰذِهِ تَذْكِرَةٌ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا(29) నిశ్చయంగా, ఇదొక హితోపదేశం కావున ఇష్టపడినవాడు తన ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు |
وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا(30) మరియు అల్లాహ్ కోరకపోతే, మీరు కోరేదీ (జరగదు)! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు |
يُدْخِلُ مَن يَشَاءُ فِي رَحْمَتِهِ ۚ وَالظَّالِمِينَ أَعَدَّ لَهُمْ عَذَابًا أَلِيمًا(31) ఆయన తాను కోరినవారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. మరియు దుర్మార్గుల కొరకు ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Insan : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Insan complète en haute qualité.















Donnez-nous une invitation valide