La sourate At-Takwir en Telugu
సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు |
మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు |
మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు |
మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు |
మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు |
మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు |
మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు |
మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు |
ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని |
మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు |
మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు |
మరియు నరకాగ్ని మండించబడినప్పుడు |
మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు |
ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది |
అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను |
(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో |
మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా |
మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా |
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు |
అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు |
అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు |
మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు |
మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు |
మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు |
మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు |
మరి మీరు ఎటు పోతున్నారు |
ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం |
మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు |
وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ(29) మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate At-Takwir : choisissez le récitateur pour écouter et télécharger la sourate At-Takwir complète en haute qualité.















Donnez-nous une invitation valide