La sourate Al-Mutaffifin en Telugu
కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చే వారికి వినాశముంది |
వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు |
మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచి గానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు |
ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా |
ఒక గొప్ప దినమున |
సర్వ లోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు |
అలా కాదు! నిశ్చయంగా, దుష్టుల కర్మపత్రం సిజ్జీనులో ఉంది |
ఆ సిజ్జీన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు |
వ్రాసి పెట్టబడిన (చెరగని) గ్రంథం |
సత్యాన్ని తిరస్కరించే వారికి ఆ రోజు వినాశముంది |
వారికే! ఎవరైతే తీర్పుదినాన్ని తిరస్కరిస్తారో |
మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పు దినాన్ని) తిరస్కరించడు |
إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ(13) మా సూచనలు (ఆయాత్ లు) అతడికి వినిపించ బడినప్పుడు అతడు: ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు |
كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ(14) అలా కాదు! వాస్తవానికి వారి హృదయాలకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది |
كَلَّا إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ(15) అంతేకాదు, ఆ రోజు నిశ్చయంగా, వారు తమ ప్రభువు కారుణ్యం నుండి నిరోధింప బడతారు |
తరువాత వారు నిశ్చయంగా, భగభగ మండే నరకాగ్నిలోకి పోతారు |
అప్పుడు వారితో: దేనినైతే మీరు అసత్యమని తిరస్కరిస్తూ వచ్చారో, అది ఇదే!" అని చెప్పబడుతుంది |
అలా కాదు! నిశ్చయంగా, ధర్మనిష్ఠాపరుల (పుణ్యాత్ముల) కర్మపత్రం మహోన్నత గ్రంథం (ఇల్లియ్యూన్)లో ఉంది |
మరి ఆ ఇల్లియ్యూన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు |
అది వ్రాసిపెట్టబడిన ఒక గ్రంథం |
దానికి, (అల్లాహ్ కు) సన్నిహితులైన వారు (దేవదూతలు) సాక్ష్యంగా ఉంటారు |
నిశ్చయంగా, పుణ్యాత్ములు సుఖసంతోషాలలో ఉంటారు |
ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ |
వారి ముఖాలు సుఖసంతోషాలతో కళకళలాడుతూ ఉండటం నీవు చూస్తావు |
సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది |
خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ(26) దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాస పడాలి |
మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్ కలుపబడి ఉంటుంది |
అదొక చెలమ, (అల్లాహ్) సాన్నిధ్యం పొందినవారే దాని నుండి త్రాగుతారు |
إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ(29) వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు |
మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయి నప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు |
وَإِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انقَلَبُوا فَكِهِينَ(31) మరియు (అవిశ్వాసులు) తమ ఇంటి వారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు |
మరియు (విశ్వాసులను) చూసినపుడల్లా: నిశ్చయంగా, వీరు దారి తప్పినవారు!" అని అనేవారు |
మరియు వారు (అవిశ్వాసులు) వీరి (విశ్వాసుల) మీద కాపలాదారులుగా పంపబడలేదు |
فَالْيَوْمَ الَّذِينَ آمَنُوا مِنَ الْكُفَّارِ يَضْحَكُونَ(34) కాని ఈ రోజు (పునరుత్థాన దినం నాడు) విశ్వసించినవారు, సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు |
ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ (ఇలా అంటారు) |
ఇక! ఈ సత్యతిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Mutaffifin : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Mutaffifin complète en haute qualité.















Donnez-nous une invitation valide