La sourate Al-Inshiqaq en Telugu
ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు |
మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం |
మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు |
మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు |
అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం |
يَا أَيُّهَا الْإِنسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ(6) ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు |
అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి |
అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు |
మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు |
ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు |
అప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు |
మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు |
వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు |
వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు |
అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు |
కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను |
రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా |
పూర్ణచంద్రుని సాక్షిగా |
మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది |
అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు |
మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు |
అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు |
మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు |
కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు |
إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ(25) విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Inshiqaq : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Inshiqaq complète en haute qualité.















Donnez-nous une invitation valide