La sourate Al-Alaq en Telugu
చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు |
ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు |
చదువు! మరియు నీ ప్రభువు పరమదాత |
ఆయన కలం ద్వారా నేర్పాడు |
మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు |
అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు |
ఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు |
నిశ్చయంగా నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది |
నీవు నిరోధించే వ్యక్తిని చూశావా |
నమాజ్ చేసే (అల్లాహ్) దాసుణ్ణి |
ఒకవేళ అతను (ముహమ్మద్!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి |
ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే |
ఒకవేళ (ఆ నిరోధించే) వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే |
వాస్తవానికి, అల్లాహ్ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా |
అలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము |
అది అబద్ధాలలో, అపరాధాలలో మునిగివున్న నుదురు |
అయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను |
మేము కూడా నరక దూతలను పిలుస్తాము |
అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Alaq : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Alaq complète en haute qualité.















Donnez-nous une invitation valide