La sourate Al-Mursalat en Telugu
ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా |
మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా |
మరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా |
మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా |
సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా |
సాకుగా లేక హెచ్చరికగా |
నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది |
అప్పుడు ఎప్పడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో |
మరియు ఆకాశం చీలిపోతుందో |
మరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో |
మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో |
ఏ దినానికి గాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి |
ఆ తీర్పుదినం కొరకా |
మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు |
ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది |
ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా |
తరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము |
ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము |
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా |
తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము |
ఒక నిర్ణీత కాలం వరకు |
ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము |
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
ఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా |
జీవులకూ మరియు మృతులకూను |
وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُم مَّاءً فُرَاتًا(27) మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా |
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
(సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి |
(దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి |
కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు |
వాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది |
వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి |
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
ఆ దినాన వారు మాట్లాడలేరు |
మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు |
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
అది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము |
కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి |
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
నిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు |
మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి |
(వారితో ఇలా అనబడుతుంది): మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి |
నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము |
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
(ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు |
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
మరియు వారితో: (అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు |
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
దీని (ఈ ఖుర్ఆన్) తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్నివిశ్వసిస్తారు |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Mursalat : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Mursalat complète en haute qualité.















Donnez-nous une invitation valide