La sourate Al-Jaathiyah en Telugu
حم(1) హా - మీమ్ |
ఈ గ్రంథం (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది |
إِنَّ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّلْمُؤْمِنِينَ(3) నిశ్చయంగా, విశ్వసించేవారి కొరకు, ఆకాశాలలో మరియు భూమిలో అనేక సూచనలు (ఆయాత్) ఉన్నాయి |
وَفِي خَلْقِكُمْ وَمَا يَبُثُّ مِن دَابَّةٍ آيَاتٌ لِّقَوْمٍ يُوقِنُونَ(4) మరియు మీ సృష్టిలోనూ మరియు (భూమిలో) ఆయన వ్యాపింపజేసిన జీవరాసులలోనూ, దృఢవిశ్వాసమున్న వారి కొరకు ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి |
మరియు రేయింబవళ్ళ అనుక్రమంలో మరియు అల్లాహ్ ఆకాశం నుండి జీవనోపాధిని (వర్షాన్ని) పంపి, దాని ద్వారా భూమికి దాని మరణం తర్వాత, తిరిగి జీవం పోయటంలో మరియు వాయువుల మారటంలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి |
ఇవి అల్లాహ్ సూచనలు (ఆయాత్), మేము వీటిని నీకు యథాతథంగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ ను మరియు ఆయన సూచనలను (ఆయాత్ లను) కాక మరే సమాచారాన్ని విశ్వసిస్తారు |
అపవాదుడు, పాపిష్ఠుడు అయిన ప్రతి వ్యక్తికి తీవ్రమైన వ్యధ గలదు |
అతడు తన ముందు పఠించబడే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) వింటున్నాడు ఆ తరువాత మూర్ఖపు పట్టుతో దురహంకారంతో వాటిని విననట్లు వ్యవహరిస్తున్నాడు. కావున అతనికి బాధాకరమైన శిక్ష పడనున్నదనే వార్తను వినిపించు |
وَإِذَا عَلِمَ مِنْ آيَاتِنَا شَيْئًا اتَّخَذَهَا هُزُوًا ۚ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ(9) మరియు మా సూచన (ఆయాత్) లకు సంబంధించిన విషయం అతనికి తెలిసినప్పుడు, వాటిని గురించి ఎగతాళి చేస్తాడు. అటువంటి వారందరికీ అవమానకరమైన శిక్ష ఉంది |
వారి ముందు నరకముంటుంది. మరియు వారి సంపాదన వారికి ఏ మాత్రం పనికిరాదు మరియు అల్లాహ్ ను వదలి వారు సంరక్షకులుగా చేసుకున్నవారు కూడా వారికి ఏ విధంగానూ ఉపయోగపడరు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది |
هَٰذَا هُدًى ۖ وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ(11) ఇది (ఈ ఖుర్ఆన్) మార్గదర్శకత్వం. మరియు ఎవరైతే తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తారో, వారికి అధమమైన, బాధాకరమైన శిక్ష ఉంది |
అల్లాహ్! ఆయనే, సముద్రాన్ని మీకు ఉపయుక్తంగా చేశాడు; దానిలో తన ఆజ్ఞతో ఓడలు పయనించటానికి మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు బహుశా మీరు కృతజ్ఞులవుతారని |
మరియు ఆయన ఆకాశాలలో మరియు భూమిలోనున్న సమస్తాన్ని, తన అనుగ్రహంతో మీకు ఉపయుక్తంగా చేశాడు. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి |
(ఓ ప్రవక్తా!) విశ్వసించిన వారితో: ఒక జాతి వారికి తమ కర్మలకు తగిన ప్రతిఫలమిచ్చే అల్లాహ్ దినాలు వస్తాయని నమ్మనివారిని క్షమించండి." అని చెప్పు |
مَنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهِ ۖ وَمَنْ أَسَاءَ فَعَلَيْهَا ۖ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ تُرْجَعُونَ(15) సత్కార్యం చేసేవాడు తన మేలుకే చేస్తాడు. మరియు దుష్కార్యం చేసేవాడు దాని (ఫలితాన్ని) అనుభవిస్తాడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలింప బడతారు |
మరియు వాస్తవంగా, మేము ఇస్రాయీల్ సంతతి వారికి గ్రంథాన్ని (తౌరాత్ ను), వివేకాన్ని మరియు ప్రవక్త పదవులను ప్రసాదించి ఉన్నాము మరియు వారికి మంచి జీవనోపాధిని ప్రసాదించి ఉన్నాము మరియు వారిని (వారి కాలపు) ప్రజలపై ప్రత్యేకంగా ఆదరించి ఉన్నాము |
మరియు వారికి ధర్మ విషయంలో స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి ఉన్నాము. వారు తమ పరస్పర ద్వేషాల వల్ల వారికి జ్ఞానం వచ్చిన పిదపనే విభేదాలకు లోనయ్యారు. నిశ్చయంగా, నీ ప్రభువు వారి మధ్య ఉన్న విభేదాలను గురించి పునరుత్థాన దినమున, వారి మధ్య తీర్పు చేస్తాడు |
తరువాత (ఓ ముహమ్మద్!) మేము, నిన్ను (మేము) నియమించిన ధర్మ విధానం మీద ఉంటాము. కావున నీవు దానినే అనుసరించు మరియు నీవు జ్ఞానం లేని వారి కోరికలను అనుసరించకు |
నిశ్చయంగా వారు, నీకు - అల్లాహ్ కు ప్రతిగా - ఏ మాత్రం ఉపయోగపడలేరు. మరియు నిశ్చయంగా, దుర్మార్గులు ఒకరికొకరు రక్షకులు. మరియు అల్లాహ్ యే దైవభీతి గలవారి సంరక్షకుడు |
هَٰذَا بَصَائِرُ لِلنَّاسِ وَهُدًى وَرَحْمَةٌ لِّقَوْمٍ يُوقِنُونَ(20) ఇది (ఈ ఖుర్ఆన్) మానవులకు అంతర్దృష్టి (పరిజ్ఞానం) ఇచ్చేదిగానూ మరియు విశ్వసించే జనులకు మార్గదర్శకత్వంగానూ మరియు కారుణ్యంగానూ ఉంది |
దుష్కార్యాలకు పాల్పడిన వారు, వారి ఇహలోక జీవితంలోనూ మరియు వారి మరణానంతర జీవితంలోనూ - వారినీ మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారినీ - మేము ఒకే విధంగా పరిగణిస్తామని భావిస్తున్నారా ఏమిటి? వారి నిర్ణయాలు ఎంత చెడ్డవి |
మరియు అల్లాహ్ ఆకాశాలనూ మరియు భూమినీ సత్యంతో సృష్టించాడు మరియు ప్రతి వ్యక్తికి తన కర్మలకు తగిన ప్రతిఫల మివ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు |
తన మనోవాంఛలను తన దైవంగా చేసుకున్న వానిని నీవు చూశావా? మరియు అతడు జ్ఞానవంతుడు అయినప్పటికీ, అల్లాహ్! అతనిని మార్గభ్రష్టత్వంలో వదిలాడు మరియు అతని చెవుల మీద మరియు అతని హృదయం మీద ముద్ర వేశాడు మరియు అతని కళ్ళ మీద తెరవేశాడు; ఇక అల్లాహ్ తప్ప అతనికి మార్గదర్శకత్వం చేసే వాడెవడున్నాడు? ఇది మీరు గ్రహించలేరా |
మరియు వారిలా అంటారు: మా (జీవితం) కేవలం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మేము మరణించేది మరియు జీవించేది ఇక్కడే మరియు మమ్మల్ని నశింపజేసేది ఈ కాలచక్రం మాత్రమే!" మరియు వాస్తవానికి, దానిని గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు |
మరియు వారి ముందు స్పష్టమైన మా సూచనలు (ఆయాత్) వినిపించబడి నప్పుడు: మీరు సత్యవంతులే అయితే మా తాతముత్తాతలను (బ్రతికించి) తీసుకురండి!" అని మాత్రమే వాదిస్తారు |
వారిలో ఇలా అను: అల్లాహ్ యే మీకు జీవితమిచ్చేవాడు తరువాత మరణింప జేసేవాడు, ఆ పిదప పునరుత్థాన దినమున సమావేశ పరిచేవాడూను! ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలా మంది జనులకు ఇది తెలియదు |
మరియు ఆకాశాల మరియు భూమి యొక్క సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందినది. మరియు ఆ ఘడియ ఆసన్నమైననాడు, ఆ దినమున అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు |
మరియు ప్రతి సమాజం వారిని నీవు మోకరిల్లి ఉండటాన్ని చూస్తావు. ప్రతి జాతి వారిని తమ కర్మపత్రం వైపునకు పిలవడం జరుగుతుంది. (వారితో ఇలా అనబడుతుంది): ఈ రోజు మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది |
هَٰذَا كِتَابُنَا يَنطِقُ عَلَيْكُم بِالْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ(29) ఇది మేము వ్రాసి పెట్టిన (మీ కర్మ) పత్రం, ఇది మీ గురించి సత్యమే పలుకుతుంది. నిశ్చయంగా, మేము మీరు చేస్తున్న కర్మలన్నింటినీ వ్రాస్తూ ఉండేవారము |
కావున విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండిన వారిని, వారి ప్రభువు తన కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకుంటాడు. ఇదే ఆ స్పష్టమైన విజయం |
మరియు సత్యాన్ని తిరస్కరించిన వారితో (ఇలా అనబడుతుంది): మీకు మా సూచనలు వినిపించబడలేదా? కాని మీరు దురహంకారంలో పడి పోయారు మరియు అపరాధులై పోయారు |
మరియు: నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం మరియు అంతిమ ఘడియను గురించి ఎలాంటి సందేహం లేదు." అని అన్నప్పుడు మీరన్నారు: ఆ అంతిమ ఘడియ ఏమిటో మాకు తెలియదు. అది కేవలం ఒక ఊహాగానం తప్ప మరేమీ కాదని మేము భావిస్తున్నాము. మేము దానిని ఏ మాత్రం నమ్మే వారము కాము |
وَبَدَا لَهُمْ سَيِّئَاتُ مَا عَمِلُوا وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ(33) అప్పుడు వారి ముందు వారు చేస్తూ ఉండిన దుష్కార్యాలు, ప్రత్యక్షమవుతాయి. మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, అదే వారిని క్రమ్ముకుంటుంది |
మరియు వారితో ఇలా అనబడుతుంది: ఈ రోజు మేము మిమ్మల్ని మరచి పోతాము, ఏ విధంగానైతే మీరు మీ సమావేశపు ఈ దినాన్ని మరచిపోయారో! మరియు మీ నివాసం నరకాగ్నియే మరియు మీకు సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు |
ఇది ఎందుకంటే, వాస్తవానికి మీరు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకున్నారు. మరియు ఇహలోక జీవితం మిమ్మల్ని మోసపుచ్చింది. కావున ఈ రోజు వారిని దాని (నరకం) నుండి బయటికి తీయడం జరగదు. మరియు వారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశమూ దొరకదు |
فَلِلَّهِ الْحَمْدُ رَبِّ السَّمَاوَاتِ وَرَبِّ الْأَرْضِ رَبِّ الْعَالَمِينَ(36) ఇక సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆయనే ఆకాశాలకూ ప్రభువు మరియు భూమికీ ప్రభువు; ఆయనే సర్వలోకాలకు కూడా ప్రభువు |
وَلَهُ الْكِبْرِيَاءُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ(37) ఆకాశాలలో మరియు భూమిలో ఘనత (మహనీయత) ఆయనకే చెందుతుంది. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Jaathiyah : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Jaathiyah complète en haute qualité.
Ahmed Al Ajmy Bandar Balila Khalid Al Jalil Saad Al Ghamdi Saud Al Shuraim Abdul Basit Abdul Rashid Sufi Abdullah Basfar Abdullah Al Juhani Fares Abbad Maher Al Muaiqly Al Minshawi Al Hosary Mishari Al-afasi Yasser Al Dosari
Donnez-nous une invitation valide