Surah An-Naml with Telugu

  1. Surah mp3
  2. More
  3. Telugu
The Holy Quran | Quran translation | Language Telugu | Surah Naml | النمل - Ayat Count 93 - The number of the surah in moshaf: 27 - The meaning of the surah in English: The Ants.

طس ۚ تِلْكَ آيَاتُ الْقُرْآنِ وَكِتَابٍ مُّبِينٍ(1)

 తా-సీన్. ఇవి దివ్యఖుర్ఆన్ ఆయతులు మరియు ఇది ఒక స్పష్టమైన గ్రంథము

هُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ(2)

 ఇవి విశ్వాసులకు మార్గదర్శకత్వం గానూ మరియు శుభవార్తలు ఇచ్చేవి గానూ ఉన్నాయి

الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ(3)

 ఎవరైతే నమాజ్ స్థాపిస్తారో మరియు విధిదానం (జకాత్) ఇస్తారో మరియు పరలోక జీవితాన్ని నమ్ముతారో

إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ زَيَّنَّا لَهُمْ أَعْمَالَهُمْ فَهُمْ يَعْمَهُونَ(4)

 నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో, వారికి మేము వారి చేష్టను ఆకర్షణీయమైనవిగా చేశాము. అందువల్ల వారు అంధుల వలే దారి తప్పి తిరుగుతూ ఉంటారు

أُولَٰئِكَ الَّذِينَ لَهُمْ سُوءُ الْعَذَابِ وَهُمْ فِي الْآخِرَةِ هُمُ الْأَخْسَرُونَ(5)

 ఇలాంటి వారికి చెడ్డ శిక్ష ఉంది. మరియు చివరకు వారే అందరి కంటే ఎక్కువగా నష్టపడేవారు

وَإِنَّكَ لَتُلَقَّى الْقُرْآنَ مِن لَّدُنْ حَكِيمٍ عَلِيمٍ(6)

 మరియు (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా నీవు ఈ ఖుర్ఆన్ ను మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు అయిన (అల్లాహ్) నుండి పొందుతున్నావు

إِذْ قَالَ مُوسَىٰ لِأَهْلِهِ إِنِّي آنَسْتُ نَارًا سَآتِيكُم مِّنْهَا بِخَبَرٍ أَوْ آتِيكُم بِشِهَابٍ قَبَسٍ لَّعَلَّكُمْ تَصْطَلُونَ(7)

 (జ్ఞాపకం చేసుకోండి!) మూసా తన ఇంటివారితో: నిశ్చయంగా నాకు ఒక అగ్ని కనిపిస్తోంది. నేను దాని నుండి మీ వద్దకు ఏదైనా వార్తను తీసుకు వస్తాను లేదా మీరు కాచుకోవడానికి మండే కొరివినైనా తీసుకువస్తాను." అని అన్నాడు

فَلَمَّا جَاءَهَا نُودِيَ أَن بُورِكَ مَن فِي النَّارِ وَمَنْ حَوْلَهَا وَسُبْحَانَ اللَّهِ رَبِّ الْعَالَمِينَ(8)

 కాని అతడు అక్కడికి చేరినప్పుడు ఒక ధ్వని ఇలా వినిపించింది: ఈ అగ్నిలో ఉన్న వానికీ మరియు దాని పరిసరాలలో ఉన్నవానికీ శుభాలు కలుగుగాక! సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు

يَا مُوسَىٰ إِنَّهُ أَنَا اللَّهُ الْعَزِيزُ الْحَكِيمُ(9)

 ఓ మూసా! నిశ్చయంగా ఆయన అల్లాహ్ ను నేనే! సర్వశక్తిమంతుడను, మహా వివేకవంతుడను

وَأَلْقِ عَصَاكَ ۚ فَلَمَّا رَآهَا تَهْتَزُّ كَأَنَّهَا جَانٌّ وَلَّىٰ مُدْبِرًا وَلَمْ يُعَقِّبْ ۚ يَا مُوسَىٰ لَا تَخَفْ إِنِّي لَا يَخَافُ لَدَيَّ الْمُرْسَلُونَ(10)

 నీ చేతికర్రను పడవేయి!" అతను దానిని (పడవేసి) చూశాడు. అది పామువలే కదలసాగింది. అతడు వెనుదిరిగి చూడకుండా పరుగెత్తసాగాడు. (అల్లాహ్ అన్నాడు): ఓ మూసా! భయపడకు. నిశ్చయంగా, నా సన్నిధిలో సందేశహరులకు ఎలాంటి భయం ఉండదు

إِلَّا مَن ظَلَمَ ثُمَّ بَدَّلَ حُسْنًا بَعْدَ سُوءٍ فَإِنِّي غَفُورٌ رَّحِيمٌ(11)

 కాని ఎవడైనా తప్పు చేస్తే తప్ప! ఆ తరువాత అతడు దానికి బదులుగా మంచి పనులు చేస్తే! నిశ్చయంగా, నేను క్షమించేవాడను, కరుణా ప్రదాతను

وَأَدْخِلْ يَدَكَ فِي جَيْبِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ ۖ فِي تِسْعِ آيَاتٍ إِلَىٰ فِرْعَوْنَ وَقَوْمِهِ ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ(12)

 ఇక నీ చేతిని నీ చంకలో (జేబులో) పెట్టి (తీయి), అది ఎలాంటి లోపం లేకుండా తెల్లగా (ప్రకాశిస్తూ) బయటికి వస్తుంది. ఈ తొమ్మిది అద్భుత సూచనలు (ఆయాత్) తీసుకొని నీవు ఫిరఔన్ మరియు అతని జాతి వారి వద్దకు వెళ్ళు. నిశ్చయంగా, వారు అవిధేయులై పోయారు

فَلَمَّا جَاءَتْهُمْ آيَاتُنَا مُبْصِرَةً قَالُوا هَٰذَا سِحْرٌ مُّبِينٌ(13)

 కాని వారి ముందుకు మా ప్రత్యక్ష సూచనలు వచ్చినపుడు వారు: ఇది స్పష్టమైన మాయాజాలమే!" అని అన్నారు

وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا ۚ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ(14)

 మరియు వారి హృదయాలు వాటిని అంగీకరించినా వారు అన్యాయంగా, అహంకారంతో తిరస్కరించారు. ఇక చూడు ఆ దౌర్జన్యపరుల గతి ఏమయి పోయిందో

وَلَقَدْ آتَيْنَا دَاوُودَ وَسُلَيْمَانَ عِلْمًا ۖ وَقَالَا الْحَمْدُ لِلَّهِ الَّذِي فَضَّلَنَا عَلَىٰ كَثِيرٍ مِّنْ عِبَادِهِ الْمُؤْمِنِينَ(15)

 మరియు వాస్తవంగా, మేము దావూద్ మరియు సులైమాన్ లకు జ్ఞానాన్ని ప్రసాదించాము. వారిద్దరు అన్నారు: విశ్వాసులైన తన అనేక దాసులలో, మా ఇద్దరికి ఘనతను ప్రసాదించిన ఆ అల్లాహ్ యే సర్వస్తోత్రములకు అర్హుడు

وَوَرِثَ سُلَيْمَانُ دَاوُودَ ۖ وَقَالَ يَا أَيُّهَا النَّاسُ عُلِّمْنَا مَنطِقَ الطَّيْرِ وَأُوتِينَا مِن كُلِّ شَيْءٍ ۖ إِنَّ هَٰذَا لَهُوَ الْفَضْلُ الْمُبِينُ(16)

 మరియు సులైమాన్, దావూద్ కు వారసుడయ్యాడు. మరియు అతను (సులైమాన్) అన్నాడు: ఓ ప్రజలారా! మాకు పక్షుల భాష నేర్పబడింది. మరియు మాకు ప్రతి వస్తువు ఒసంగబడింది. నిశ్చయంగా, ఇది ఒక స్పష్టమైన (అల్లాహ్) అనుగ్రహమే

وَحُشِرَ لِسُلَيْمَانَ جُنُودُهُ مِنَ الْجِنِّ وَالْإِنسِ وَالطَّيْرِ فَهُمْ يُوزَعُونَ(17)

 మరియు సులైమాన్ కొరకు జిన్నాతుల, మానవుల మరియు పక్షుల సైన్యాలు సమీకరింపబడి ఉండేవి. తరువాత వాటిని తమ తమ స్థానాల ప్రకారం వరుసలలో పెట్టి (బయలు దేరారు)

حَتَّىٰ إِذَا أَتَوْا عَلَىٰ وَادِ النَّمْلِ قَالَتْ نَمْلَةٌ يَا أَيُّهَا النَّمْلُ ادْخُلُوا مَسَاكِنَكُمْ لَا يَحْطِمَنَّكُمْ سُلَيْمَانُ وَجُنُودُهُ وَهُمْ لَا يَشْعُرُونَ(18)

 చివరకు వారు చీమల లోయకు (కనుమకు) చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా అన్నది: ఓ చీమలారా! మీరు మీ ఇండ్లలోకి ప్రవేశించండి, లేకపోతే సులైమాన్ మరియు అతన సైనికులు - వారికి తెలియకుండానే - మిమ్మల్ని నలిపి వేయవచ్చు

فَتَبَسَّمَ ضَاحِكًا مِّن قَوْلِهَا وَقَالَ رَبِّ أَوْزِعْنِي أَنْ أَشْكُرَ نِعْمَتَكَ الَّتِي أَنْعَمْتَ عَلَيَّ وَعَلَىٰ وَالِدَيَّ وَأَنْ أَعْمَلَ صَالِحًا تَرْضَاهُ وَأَدْخِلْنِي بِرَحْمَتِكَ فِي عِبَادِكَ الصَّالِحِينَ(19)

 (సులైమాన్) దాని మాటలకు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: ఓ నా ప్రభూ! నీవు నన్ను - నాకూ మరియు నా తల్లిదండ్రులకు చూపిన అనుగ్రహాలకు - కృతజ్ఞత తెలిపేవానిగా మరియు నీకు నచ్చే సత్కార్యాలు చేసేవానిగా, ప్రోత్సాహపరచు. మరియు నన్ను నీ కారుణ్యంతో సద్వర్తనులైన నీ దాసులలో చేర్చుకో

وَتَفَقَّدَ الطَّيْرَ فَقَالَ مَا لِيَ لَا أَرَى الْهُدْهُدَ أَمْ كَانَ مِنَ الْغَائِبِينَ(20)

 మరియు (ఒకరోజు) అతను పక్షులను పరిశీలిస్తూ ఇలా అన్నాడు: ఏమిటీ, నాకు వడ్రంగి పిట్ట (హుద్ హుద్) కనిపించడం లేదే! అది ఎలా అదృశ్యమైపోయింది

لَأُعَذِّبَنَّهُ عَذَابًا شَدِيدًا أَوْ لَأَذْبَحَنَّهُ أَوْ لَيَأْتِيَنِّي بِسُلْطَانٍ مُّبِينٍ(21)

 నేను దానిని కఠినంగా శిక్షిస్తాను. లేదా దానిని కోసివేస్తాను, అది నాకు సరైన కారణం చూపితేనే తప్ప

فَمَكَثَ غَيْرَ بَعِيدٍ فَقَالَ أَحَطتُ بِمَا لَمْ تُحِطْ بِهِ وَجِئْتُكَ مِن سَبَإٍ بِنَبَإٍ يَقِينٍ(22)

 ఆ తరువాత ఎంతో సేపు గడవక ముందే అది వచ్చి ఇలా అన్నది: నీకు తెలియని విషయమొకటి నేను తెలుసుకొని వచ్చాను. నేను సబాను గురించి ఒక నమ్మకమైన వార్తను నీ కొరకు తెచ్చాను

إِنِّي وَجَدتُّ امْرَأَةً تَمْلِكُهُمْ وَأُوتِيَتْ مِن كُلِّ شَيْءٍ وَلَهَا عَرْشٌ عَظِيمٌ(23)

 నిశ్చయంగా, నేను అక్కడ ఒక స్త్రీని చూశాను. ఆమె వారిపై (రాణిగా) పరిపాలన చేస్తుంది. ఆమెకు ప్రతి వస్తువు ఒసంగబడి ఉంది. ఆమె దగ్గర ఒక గొప్ప సింహాసనం ఉంది

وَجَدتُّهَا وَقَوْمَهَا يَسْجُدُونَ لِلشَّمْسِ مِن دُونِ اللَّهِ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَصَدَّهُمْ عَنِ السَّبِيلِ فَهُمْ لَا يَهْتَدُونَ(24)

 మరియు నేను ఆమెను మరియు ఆమె జాతివారిని అల్లాహ్ ను వదలి సూర్యునికి సాష్టాంగం (సజ్దా) చేయటం చూశాను మరియు షైతాన్ వారి కర్మలను, వారికి మంచివిగా తోచేటట్లు చేశాడు. కావున వారిని సన్మార్గం నుండి నిరోధించాడు, కాబట్టి వారు సన్మార్గం పొందలేక పోయారు

أَلَّا يَسْجُدُوا لِلَّهِ الَّذِي يُخْرِجُ الْخَبْءَ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَيَعْلَمُ مَا تُخْفُونَ وَمَا تُعْلِنُونَ(25)

 అందుకే వారు - ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ దాని వున్న వాటిని బయటికి తీసేవాడూ మరియు మీరు దాచే వాటినీ మరియు వ్యక్త పరిచే వాటినీ ఎరుగువాడూ అయిన - అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేయటం లేదు

اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ ۩(26)

 అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఆయనే సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు

۞ قَالَ سَنَنظُرُ أَصَدَقْتَ أَمْ كُنتَ مِنَ الْكَاذِبِينَ(27)

 (సులైమాన్) అన్నాడు: నీవు సత్యం పలుకుతున్నావో, లేదా అబద్ధాలాడే వారిలో చేరిన వాడవో, మేము ఇప్పుడే చూస్తాము

اذْهَب بِّكِتَابِي هَٰذَا فَأَلْقِهْ إِلَيْهِمْ ثُمَّ تَوَلَّ عَنْهُمْ فَانظُرْ مَاذَا يَرْجِعُونَ(28)

 నా ఈ ఉత్తరం తీసుకొని పో! దీనిని వారి వద్ద పడవేయి, తరువాత వారి నుండి ఒక వైపుకు తొలగిపోయి వారేమి సమాధానమిస్తారో చూడు

قَالَتْ يَا أَيُّهَا الْمَلَأُ إِنِّي أُلْقِيَ إِلَيَّ كِتَابٌ كَرِيمٌ(29)

 (రాణి) అన్నది: ఓ నా ఆస్థాన నాయకులారా! ఇదిగో నా వైపుకు ఒక విశేషమైన ఉత్తరం పంపబడింది

إِنَّهُ مِن سُلَيْمَانَ وَإِنَّهُ بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ(30)

 నిశ్చయంగా, ఇది సులైమాన్ దగ్గర నుండి వచ్చింది. మరియు ఇది: ``అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో,` ప్రారంభించబడింది

أَلَّا تَعْلُوا عَلَيَّ وَأْتُونِي مُسْلِمِينَ(31)

 (ఇందులో ఇలా వ్రాయబడి ఉంది): `నా పై ఆధిక్యత చూపకండి. నా సన్నిధిలోకి అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయి రండి

قَالَتْ يَا أَيُّهَا الْمَلَأُ أَفْتُونِي فِي أَمْرِي مَا كُنتُ قَاطِعَةً أَمْرًا حَتَّىٰ تَشْهَدُونِ(32)

 (రాణి) అన్నది: ఓ నాయకులారా! ఈ విషయంలో మీరు నాకు సలహా ఇవ్వండి. నేను ఏ విషయంలోనూ, మీరు లేనిదే ఎలాంటి నిర్ణయం తీసుకోనే

قَالُوا نَحْنُ أُولُو قُوَّةٍ وَأُولُو بَأْسٍ شَدِيدٍ وَالْأَمْرُ إِلَيْكِ فَانظُرِي مَاذَا تَأْمُرِينَ(33)

 వారిలా జవాబిచ్చారు: మనం చాలా బలవంతులం. మరియు గొప్ప యుద్ధ నిపుణులం, కాని నిర్ణయం మాత్రం నీదే! కావున, నీవు ఏమి ఆజ్ఞాపించ దలచుకున్నావో అలోచించు

قَالَتْ إِنَّ الْمُلُوكَ إِذَا دَخَلُوا قَرْيَةً أَفْسَدُوهَا وَجَعَلُوا أَعِزَّةَ أَهْلِهَا أَذِلَّةً ۖ وَكَذَٰلِكَ يَفْعَلُونَ(34)

 (రాణి) అన్నది: రాజులు ఏ దేశంలోనైనా జొరబడినప్పుడు, వారందులో కల్లోలం రేకెత్తిస్తారు మరియు అక్కడి గౌరవనీయులైన ప్రజలను అవమాన పరుస్తారు. వీరు కూడా అదే విధంగా చేయవచ్చు

وَإِنِّي مُرْسِلَةٌ إِلَيْهِم بِهَدِيَّةٍ فَنَاظِرَةٌ بِمَ يَرْجِعُ الْمُرْسَلُونَ(35)

 కావున నేను తప్పక, వారి వద్దకు ఒక కానుకను పంపుతాను. ఆ తరువాత నా దూతలు ఏమి జవాబు తెస్తారో చూస్తాను

فَلَمَّا جَاءَ سُلَيْمَانَ قَالَ أَتُمِدُّونَنِ بِمَالٍ فَمَا آتَانِيَ اللَّهُ خَيْرٌ مِّمَّا آتَاكُم بَلْ أَنتُم بِهَدِيَّتِكُمْ تَفْرَحُونَ(36)

 (రాయబారులు) సులైమాన్ వద్దకు వచ్చినపుడు, అతను అన్నాడు: ఏమీ? మీరు నాకు ధనసహాయం చేయదలచారా? అల్లాహ్ నాకు ఇచ్చింది, మీకు ఇచ్చిన దాని కంటే ఎంతో ఉత్తమమైనది, ఇక మీ కానుకతో మీరే సంతోషపడండి

ارْجِعْ إِلَيْهِمْ فَلَنَأْتِيَنَّهُم بِجُنُودٍ لَّا قِبَلَ لَهُم بِهَا وَلَنُخْرِجَنَّهُم مِّنْهَا أَذِلَّةً وَهُمْ صَاغِرُونَ(37)

 (సులైమాన్) అన్నాడు): నీవు వారి వద్దకు తిరిగిపో, మేము వారిపైకి గొప్ప సేనలతో వస్తాము. వారు వాటిని ఎదిరించజాలరు. మేము వారిని పరాభవించి అచ్చటి నుండి వెడల గొడ్తాము. మరియు వారు అవమానితులై ఉండిపోతారు

قَالَ يَا أَيُّهَا الْمَلَأُ أَيُّكُمْ يَأْتِينِي بِعَرْشِهَا قَبْلَ أَن يَأْتُونِي مُسْلِمِينَ(38)

 (తరువాత సులైమాన్) ఇలా అన్నాడు: ఓ నాయకులారా! వారు అల్లాహ్ కు విధేయులై (ముస్లింలై) రాకముందే, ఆమె సింహాసనాన్ని నా వద్దకు మీలో ఎవరు తేగలరు

قَالَ عِفْرِيتٌ مِّنَ الْجِنِّ أَنَا آتِيكَ بِهِ قَبْلَ أَن تَقُومَ مِن مَّقَامِكَ ۖ وَإِنِّي عَلَيْهِ لَقَوِيٌّ أَمِينٌ(39)

 జిన్నాతులలో బలిష్ఠుడైన ఒకడు ఇలా అన్నాడు: నీవు నీ స్థానం నుండి లేవక ముందే నేను దానిని తీసుకువస్తాను. నిశ్చయంగా నేను ఇలా చేసే బలం గలవాడను, నమ్మదగిన వాడను

قَالَ الَّذِي عِندَهُ عِلْمٌ مِّنَ الْكِتَابِ أَنَا آتِيكَ بِهِ قَبْلَ أَن يَرْتَدَّ إِلَيْكَ طَرْفُكَ ۚ فَلَمَّا رَآهُ مُسْتَقِرًّا عِندَهُ قَالَ هَٰذَا مِن فَضْلِ رَبِّي لِيَبْلُوَنِي أَأَشْكُرُ أَمْ أَكْفُرُ ۖ وَمَن شَكَرَ فَإِنَّمَا يَشْكُرُ لِنَفْسِهِ ۖ وَمَن كَفَرَ فَإِنَّ رَبِّي غَنِيٌّ كَرِيمٌ(40)

 గ్రంథజ్ఞానం గల ఒకతను ఇలా అన్నాడు: నేను కనురెప్పపాటు కాలంలో దానిని నీ వద్దకు తేగలను!" ఆ తరువాత (సులైమాన్) దానిని వాస్తవంగా తన ముందు పెట్టబడి ఉండటాన్ని చూసి ఇలా అన్నాడు: ఇది నా ప్రభువు అనుగ్రహం. నేను కృతజ్ఞతలు చూపుదునా లేక కృతఘ్నుడ నవుదునా అని పరీక్షించటానికి ఇలా చేయబడింది. కృతజ్ఞతలు తెలిపేవాడు, నిశ్చయంగా, తన మేలు కొరకే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. కాని ఎవడైనా కృతఘ్నతకు పాల్పడితే, నిశ్చయంగా, నా ప్రభువు స్వయం సమృద్ధుడు, పరమ దాత (అని తెలుసుకోవాలి)

قَالَ نَكِّرُوا لَهَا عَرْشَهَا نَنظُرْ أَتَهْتَدِي أَمْ تَكُونُ مِنَ الَّذِينَ لَا يَهْتَدُونَ(41)

 (సులైమాన్) అన్నాడు: ఆమె గుర్తించ లేకుండా ఆమె సింహాసనపు రూపాన్ని మార్చి వేయండి. మనం చూద్దాం! ఆమె మార్గదర్శకత్వం పొందుతుందా, లేక మార్గదర్శకత్వం పొందని వారిలో చేరి పోతుందా

فَلَمَّا جَاءَتْ قِيلَ أَهَٰكَذَا عَرْشُكِ ۖ قَالَتْ كَأَنَّهُ هُوَ ۚ وَأُوتِينَا الْعِلْمَ مِن قَبْلِهَا وَكُنَّا مُسْلِمِينَ(42)

 ఆ తరువాత ఆమె అక్కడికి రాగానే: ఏమీ? నీ సింహాసనం విధంగానే ఉంటుందా?" అని అడుగ్గా, ఆమె: నిశ్చయంగా, ఇది దాని మాదిరిగానే ఉంది!"అని అన్నది. మరియు (సులైమాన్ అన్నాడు): మనకు ఈమె కంటే ముందు (దివ్య) జ్ఞానం ప్రసాదించ బడింది (లభించింది) కావున మనం అల్లాహ్ కు విధేయులం (ముస్లింలం) అయ్యాము

وَصَدَّهَا مَا كَانَت تَّعْبُدُ مِن دُونِ اللَّهِ ۖ إِنَّهَا كَانَتْ مِن قَوْمٍ كَافِرِينَ(43)

 మరియు అల్లాహ్ ను వదలి ఆమె ఆరాధిస్తున్నది, ఆమెను (ఇస్లాం నుండి) తొలగించింది. అందుకే! ఆమె వాస్తవానికి, సత్యతిరస్కారులలో చేరి ఉండేది

قِيلَ لَهَا ادْخُلِي الصَّرْحَ ۖ فَلَمَّا رَأَتْهُ حَسِبَتْهُ لُجَّةً وَكَشَفَتْ عَن سَاقَيْهَا ۚ قَالَ إِنَّهُ صَرْحٌ مُّمَرَّدٌ مِّن قَوَارِيرَ ۗ قَالَتْ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي وَأَسْلَمْتُ مَعَ سُلَيْمَانَ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ(44)

 ఆమెతో: రాజగృహంలో ప్రవేశించు!" అని చెప్పగా! ఆమె దానిని చూసి, అదొక నీటి కొలనని భావించి (తన వస్త్రాలను) పైకెత్తగా ఆమె పిక్కలు కనబడ్డాయి. అప్పుడు (సులైమాన్): ఇది గాజుతో నిర్మించబడిన నున్నని నేల మాత్రమే!" అని అన్నాడు. (రాణి) అన్నది: ఓ నా ప్రభూ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. మరియు నేను సులైమాన్ తో పాటు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు విధేయతను (ఇస్లాంను) స్వీకరిస్తున్నాను

وَلَقَدْ أَرْسَلْنَا إِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَالِحًا أَنِ اعْبُدُوا اللَّهَ فَإِذَا هُمْ فَرِيقَانِ يَخْتَصِمُونَ(45)

 మరియు వాస్తవంగా! మేము సమూద్ జాతివారి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ ను: మీరు అల్లాహ్ నే ఆరాధించండి." అనే (సందేశంతో) పంపాము. కాని వారు రెండు వర్గాలుగా చీలి పోయి పరస్పరం కలహించుకోసాగారు

قَالَ يَا قَوْمِ لِمَ تَسْتَعْجِلُونَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ ۖ لَوْلَا تَسْتَغْفِرُونَ اللَّهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ(46)

 (సాలిహ్) అన్నాడు: ఓ నా జాతి ప్రజలారా! మీరు సుస్థితికి ముందు దుస్థితి కొరకు ఎందుకు తొందరపెడుతున్నారు? మీరు అల్లాహ్ ను మీ తప్పులను క్షమించమని ఎందుకు వేడుకోరు? బహశా మీరు కరుణించబడవచ్చు

قَالُوا اطَّيَّرْنَا بِكَ وَبِمَن مَّعَكَ ۚ قَالَ طَائِرُكُمْ عِندَ اللَّهِ ۖ بَلْ أَنتُمْ قَوْمٌ تُفْتَنُونَ(47)

 వారన్నారు: మేము నిన్నూ మరియు నీ అనుచరులను అపశకునపు సూచనలుగా పరిగణిస్తున్నాము!" (సాలిహ్) అన్నాడు: మీ శకునం అల్లాహ్ వద్ద ఉంది. వాస్తవానికి, మీరు పరీక్షించ బడుతున్నారు

وَكَانَ فِي الْمَدِينَةِ تِسْعَةُ رَهْطٍ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ(48)

 మరియు ఆ నగరంలో తొమ్మిది మంది ఉండేవారు. వారు దేశంలో కల్లోలం రేకెత్తిస్తూ ఉండేవారు. మరియు ఎలాంటి సంస్కరణ చేసేవారు కాదు

قَالُوا تَقَاسَمُوا بِاللَّهِ لَنُبَيِّتَنَّهُ وَأَهْلَهُ ثُمَّ لَنَقُولَنَّ لِوَلِيِّهِ مَا شَهِدْنَا مَهْلِكَ أَهْلِهِ وَإِنَّا لَصَادِقُونَ(49)

 వారు పరస్పరం ఇలా అనుకున్నారు: అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా ప్రతిజ్ఞ చేయండి. మనం అతనిపై మరియు అతనితో పాటు ఉన్న వారిపై రాత్రివేళ దాడి చేద్దాము. తరువాత అతని వారసులతో: `మీ సంబంధీకులను వధించింది మేము చూడనే లేదు. మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము.` అని అందాము

وَمَكَرُوا مَكْرًا وَمَكَرْنَا مَكْرًا وَهُمْ لَا يَشْعُرُونَ(50)

 మరియు ఈ విధంగా, వారు పన్నాగం పన్నారు మరియు మేము కూడా ఒక పన్నాగం పన్నాము. కాని వారికది తెలియదు

فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ مَكْرِهِمْ أَنَّا دَمَّرْنَاهُمْ وَقَوْمَهُمْ أَجْمَعِينَ(51)

 ఇక చూడండి! వారి పన్నాగపు పర్యవసానం ఏమయిందో! వాస్తవానికి మేము వారిని మరియు వారి వంశం వారినందరినీ సర్వనాశనం చేశాము

فَتِلْكَ بُيُوتُهُمْ خَاوِيَةً بِمَا ظَلَمُوا ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَعْلَمُونَ(52)

 అవిగో వారి గృహాలు! వారు చేసిన దుర్మార్గాలకు అవి ఎలా పాడుపడి పోయాయో చూడండి. నిశ్చయంగా ఇందులో తెలుసుకునే వారికి గొప్ప సూచన ఉంది

وَأَنجَيْنَا الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ(53)

 మరియు విశ్వసించి, దైవభీతి కలిగి ఉన్న వారిని మేము కాపాడాము

وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ أَتَأْتُونَ الْفَاحِشَةَ وَأَنتُمْ تُبْصِرُونَ(54)

 మరియు లూత్ ను (జ్ఞాపకం చేసుకోండి)! అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీరు బహిరంగంగా అశ్లీల కార్యాలు చేస్తారా

أَئِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِّن دُونِ النِّسَاءِ ۚ بَلْ أَنتُمْ قَوْمٌ تَجْهَلُونَ(55)

 ఏమీ? మీరు స్త్రీలను వదలి పురుషుల వద్దకు, మీ కామ ఇచ్ఛను తీర్చుకోవటానికి పోతారా? వాస్తవానికి, మీరు మూఢ జనులు

۞ فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا أَخْرِجُوا آلَ لُوطٍ مِّن قَرْيَتِكُمْ ۖ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ(56)

 కాని, అతని జాతివారి జవాబు ఈ విధంగా మాత్రమే ఉండింది. వారు అన్నారు: లూత్ కుటుంబాన్ని మీ పట్టణం నుండి వెళ్ళ గొట్టండి. వాస్తవానికి, వారు తమను తాము చాలా పవిత్రులుగా పరిగణిస్తున్నారు

فَأَنجَيْنَاهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَاهَا مِنَ الْغَابِرِينَ(57)

 కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని కాపాడాము - అతని భార్య తప్ప - ఆమెను వెనుక ఉండిపోయే వారిలో చేర్చాలని నిర్ణయించాము

وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَسَاءَ مَطَرُ الْمُنذَرِينَ(58)

 మరియు వారిపై (రాళ్ళ) వర్షాన్ని కురిపించాము. కాని అది, హెచ్చరించబడిన వారిపై కురిపించబడ్డ ఎంతో ఘోరమైన వర్షం

قُلِ الْحَمْدُ لِلَّهِ وَسَلَامٌ عَلَىٰ عِبَادِهِ الَّذِينَ اصْطَفَىٰ ۗ آللَّهُ خَيْرٌ أَمَّا يُشْرِكُونَ(59)

 (ఓ ముహమ్మద్!) ఇలా అను: సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఆయన ఎన్నుకొన్న, ఆయన దాసులకు శాంతి కలుగు గాక (సలాం)! ఏమీ? అల్లాహ్ శ్రేష్ఠుడా? లేక వారు ఆయనకు సాటి కల్పించే భాగస్వాములా

أَمَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ لَكُم مِّنَ السَّمَاءِ مَاءً فَأَنبَتْنَا بِهِ حَدَائِقَ ذَاتَ بَهْجَةٍ مَّا كَانَ لَكُمْ أَن تُنبِتُوا شَجَرَهَا ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ بَلْ هُمْ قَوْمٌ يَعْدِلُونَ(60)

 ఏమీ? ఆయనే కాడా? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించినవాడు మరియు మీ కొరకు ఆకాశం నుండి నీటిని కురిపించిన వాడు? దానితో మేము మనోహరమైన తోటలను పుట్టించాము. వాటిలో ఒక్క చెట్టును కూడా మొలిపించటం మీకు సాధ్యమయ్యే పని కాదు కదా? ఏమీ? అల్లాహ్ తో బాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? అలా కాదు! వారే (ఇతరులను) ఆయనకు సమానులుగా చేసే ప్రజలు

أَمَّن جَعَلَ الْأَرْضَ قَرَارًا وَجَعَلَ خِلَالَهَا أَنْهَارًا وَجَعَلَ لَهَا رَوَاسِيَ وَجَعَلَ بَيْنَ الْبَحْرَيْنِ حَاجِزًا ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ(61)

 ఏమీ? ఆయనే కాడా? భూమిని నివాసస్థలంగా చేసి, దాని మధ్య నదులను ఏర్పరచి, అది కదలకుండా దానిపై పర్వతాలను మేకులుగా నాటినవాడు మరియు రెండు సముద్రాల మధ్య అడ్డుతెరను నిర్మించిన వాడు? ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వాస్తవానికి చాలా మంది ఇది తెలుసుకోలేరు

أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ(62)

 ఏమీ? ఆయనే కాడా? బాధితుడు వేడుకున్నప్పుడు అతడి మొరను ఆలకించి ఆపదను తొలగించేవాడు మరియు భూమిలో మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసినవాడు? ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? మీరు ఆలోచించేది చాలా తక్కువ

أَمَّن يَهْدِيكُمْ فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ وَمَن يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ تَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ(63)

 ఏమీ? ఆయనే కాడా? నేల మరియు సముద్రాల, అంధకారంలో మీకు మార్గదర్శకత్వం చేసేవాడు మరియు తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలతో పంపేవాడు? ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వారు సాటిగా కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ అత్యున్నతుడు

أَمَّن يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَمَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ(64)

 ఏమీ? ఆయనే కాడా? సృష్టిని తొలిసారి ప్రారంభించి, తరువాత దానిని మరల ఉనికిలోకి తేగలవాడు మరియు మీకు ఆకాశం నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడు. ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వారితో అను: మీరు సత్యవంతులే అయితే మీ నిదర్శనాన్ని తీసుకురండి

قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ ۚ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ(65)

 వారితో అను: ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న అగోచర విషయజ్ఞానం గలవాడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు. మరియు వారు తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా వారికి తెలియదు

بَلِ ادَّارَكَ عِلْمُهُمْ فِي الْآخِرَةِ ۚ بَلْ هُمْ فِي شَكٍّ مِّنْهَا ۖ بَلْ هُم مِّنْهَا عَمُونَ(66)

 వాస్తవానికి, పరలోక జీవితం గురించి వారి జ్ఞానం శూన్యమే. అలా కాదు! దానిని గురించి వారు సంశయంలో పడి వున్నారు. అలా కాదు! దాని విషయంలో వారు అంధులై పోయారు

وَقَالَ الَّذِينَ كَفَرُوا أَإِذَا كُنَّا تُرَابًا وَآبَاؤُنَا أَئِنَّا لَمُخْرَجُونَ(67)

 సత్యతిరస్కారులు అంటారు: ఏమీ? మేమూ మరియు మా తండ్రితాతలు మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవానికి మరల (సజీవులుగా) వెలికి తీయబడతామా

لَقَدْ وُعِدْنَا هَٰذَا نَحْنُ وَآبَاؤُنَا مِن قَبْلُ إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ(68)

 వాస్తవానికి ఇంతకు పూర్వం కూడా మాకు మరియు మా తండ్రితాతలకు ఇదే విధంగా వాగ్దానం చేయబడింది. ఇవి కేవలం పూర్వకాలపు గాథలు మాత్రమే

قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِينَ(69)

 వారితో అను: భూమిలో ప్రయాణం చేసి చూడండి. అపరాధుల గతి ఏమయిందో

وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُن فِي ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ(70)

 మరియు నీవు వారి గురించి దుఃఖపడకు మరియు వారి కుట్రలకు బాధపడకు

وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ(71)

 వారంటున్నారు: మీరు సత్యవంతులే అయితే! ఈ వాగ్దానం ఎప్పుడు పూర్తి కానున్నది

قُلْ عَسَىٰ أَن يَكُونَ رَدِفَ لَكُم بَعْضُ الَّذِي تَسْتَعْجِلُونَ(72)

 వారితో అను: మీరు దేనిని (ఏ శిక్షను) గురించి తొందర పెడుతున్నారో? అందులోని కొంతభాగం బహుశా మీకు సమీపంలోనే ఉండవచ్చు

وَإِنَّ رَبَّكَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَشْكُرُونَ(73)

 మరియు నిశ్చయంగా, నీ ప్రభువు మానవులపై ఎంతో అనుగ్రహం కలవాడు, కాని వారిలో చాలా మంది కృతజ్ఞతలు చూపరు

وَإِنَّ رَبَّكَ لَيَعْلَمُ مَا تُكِنُّ صُدُورُهُمْ وَمَا يُعْلِنُونَ(74)

 మరియు నిశ్చయంగా వారి హృదయాలు ఏమి దాస్తున్నాయో మరియు ఏమి వ్యక్తపరుస్తున్నాయో, నీ ప్రభువుకు బాగా తెలుసు

وَمَا مِنْ غَائِبَةٍ فِي السَّمَاءِ وَالْأَرْضِ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ(75)

 మరియు ఆకాశంలో మరియు భూమిలో అగోచరంగా ఉన్నది ఏదీ కూడా, స్పష్టమైన ఒక గ్రంథంలో వ్రాయబడకుండా లేదు

إِنَّ هَٰذَا الْقُرْآنَ يَقُصُّ عَلَىٰ بَنِي إِسْرَائِيلَ أَكْثَرَ الَّذِي هُمْ فِيهِ يَخْتَلِفُونَ(76)

 నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ఇస్రాయీల్ సంతతి వారు విభేదిస్తూ వున్న పెక్కు విషయాల వాస్తవాన్ని వారికి తెలుపుతున్నది

وَإِنَّهُ لَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ(77)

 మరియు నిశ్చయంగా, ఇది విశ్వాసులకు మార్గదర్శిని మరియు కారుణ్యం

إِنَّ رَبَّكَ يَقْضِي بَيْنَهُم بِحُكْمِهِ ۚ وَهُوَ الْعَزِيزُ الْعَلِيمُ(78)

 నిశ్చయంగా, నీ ప్రభువు వారి మధ్య న్యాయంగా తీర్పు చేస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు

فَتَوَكَّلْ عَلَى اللَّهِ ۖ إِنَّكَ عَلَى الْحَقِّ الْمُبِينِ(79)

 కావున నీవు అల్లాహ్ పై ఆధారపడి ఉండు. నిశ్చయంగా, నీవు స్పష్టమైన సత్యంపై ఉన్నావు

إِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَىٰ وَلَا تُسْمِعُ الصُّمَّ الدُّعَاءَ إِذَا وَلَّوْا مُدْبِرِينَ(80)

 నిశ్చయంగా, నీవు మృతులకు వినిపింపజేయలేవు మరియు వీపు త్రిప్పి మరలి పోయే చెవిటివారికి కూడా నీ పిలుపును వినిపింప జేయలేవు

وَمَا أَنتَ بِهَادِي الْعُمْيِ عَن ضَلَالَتِهِمْ ۖ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِآيَاتِنَا فَهُم مُّسْلِمُونَ(81)

 మరియు నీవు అంధులను మార్గభ్రష్టత్వం నుండి తొలగించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. మా సూచనలను (ఆయాత్ లను) విశ్వసించి, అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయ్యే వారికి మాత్రమే నీవు (నీ మాటలను) వినిపించగలవు

۞ وَإِذَا وَقَعَ الْقَوْلُ عَلَيْهِمْ أَخْرَجْنَا لَهُمْ دَابَّةً مِّنَ الْأَرْضِ تُكَلِّمُهُمْ أَنَّ النَّاسَ كَانُوا بِآيَاتِنَا لَا يُوقِنُونَ(82)

 మరియు వారిని గురించిన (శిక్ష) వాగ్దానం పూర్తికానున్నప్పుడు, మేము వారి కొరకు భూమి నుండి ఒక జంతువును బయటికి తీస్తాము. అది వారితో నిశ్చయంగా, మానవులు మా సూచలను (ఆయాత్ లను) నమ్మేవారు కాదని చెబుతుంది

وَيَوْمَ نَحْشُرُ مِن كُلِّ أُمَّةٍ فَوْجًا مِّمَّن يُكَذِّبُ بِآيَاتِنَا فَهُمْ يُوزَعُونَ(83)

 మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు (పునరుత్థాన దినమున) మేము ప్రతి జాతివారిలో నుండి మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన జనసమూహాన్ని సమీకరిస్తాము. మరియు వారు (వారి పాపాల ప్రకారం) వివిధ వరుసలలో నిలబెట్టబడతారు

حَتَّىٰ إِذَا جَاءُوا قَالَ أَكَذَّبْتُم بِآيَاتِي وَلَمْ تُحِيطُوا بِهَا عِلْمًا أَمَّاذَا كُنتُمْ تَعْمَلُونَ(84)

 చివరకు అందరూ వచ్చిన తరువాత వారి (ప్రభువు) వారిని ప్రశ్నిస్తాడు: ఏమీ? మీరు నా సూచనలను, మీ జ్ఞానంతో గ్రహించకుండానే వాటిని అసత్యాలని తిరస్కరించారా? ఇదిగాక మీరు ఏమి చేస్తూ ఉండేవారు

وَوَقَعَ الْقَوْلُ عَلَيْهِم بِمَا ظَلَمُوا فَهُمْ لَا يَنطِقُونَ(85)

 మరియు వారు చేసిన దుర్మార్గం వలన వారికి చేయబడిన వాగ్దానం (శిక్ష) పూర్తి అవుతుంది, కావున వారేమీ మాట్లాడలేరు

أَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا اللَّيْلَ لِيَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ(86)

 ఏమీ? వారికి తెలియదా? మేము రాత్రిని వారు విశ్రాంతి పొందటానికి మరియు పగటిని (చూడగలగటానికి) ప్రకాశవంతంగా చేశామని? నిశ్చయంగా, విశ్వసించేవారికి ఇందులో ఎన్నో సూచనలున్నాయి

وَيَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَفَزِعَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ ۚ وَكُلٌّ أَتَوْهُ دَاخِرِينَ(87)

 మరియు (జ్ఞాపకముంచుకోండి) బాకా (సూర్) ఊదబడే దినమున - అల్లాహ్ కోరిన వారు తప్ప - ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్నవన్నీ భయంతో కంపించి పోతాయి. మరియు ఆన్నీ అత్యంత వినమ్రతతో ఆయన ముందు హాజరవుతాయి

وَتَرَى الْجِبَالَ تَحْسَبُهَا جَامِدَةً وَهِيَ تَمُرُّ مَرَّ السَّحَابِ ۚ صُنْعَ اللَّهِ الَّذِي أَتْقَنَ كُلَّ شَيْءٍ ۚ إِنَّهُ خَبِيرٌ بِمَا تَفْعَلُونَ(88)

 మరియు నీవు పర్వతాలను చూసి అవి స్థిరంగా ఉన్నాయని అనుకుంటున్నావు. కాని అవి అప్పుడు మేఘాల వలే ఎగురుతూ పోతుంటాయి. ఇది అల్లాహ్ కార్యం! ఆయన ప్రతి కార్యాన్ని నేర్పుతో చేస్తాడు. నిశ్చయంగా మీరు చేసేదంతా ఆయన ఎరుగును

مَن جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ خَيْرٌ مِّنْهَا وَهُم مِّن فَزَعٍ يَوْمَئِذٍ آمِنُونَ(89)

 మంచిపనులు చేసి వచ్చిన వారికి, అంతకంటే మంచి (ప్రతిఫలం) ఉంటుంది. మరియు వారు ఆ దినపు మహా భీతి నుండి సురక్షితంగా ఉంటారు

وَمَن جَاءَ بِالسَّيِّئَةِ فَكُبَّتْ وُجُوهُهُمْ فِي النَّارِ هَلْ تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ(90)

 మరియు చెడుపనులు చేసి వచ్చిన వారు నరకాగ్నిలో బోర్లా త్రోయబడతారు. (వారితో అనబడుతుంది): మీకు ఇవ్వబడే ప్రతిఫలం మీ కర్మలకు భిన్నంగా ఉండగలదా

إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هَٰذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَهَا وَلَهُ كُلُّ شَيْءٍ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ(91)

 (ఓ ముహమ్మద్!) వారితో (ఇలా అను): నిశ్చయంగా, ఈ (మక్కా) నగరపు ప్రభువునే ఆరాధించాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఆయనే! దీనిని పవిత్ర క్షేత్రంగా చేశాడు మరియు ప్రతి వస్తువు ఆయనకు చెందినదే! మరియు నేను ఆయనకు విధేయుడనై (ముస్లింనై) ఉండాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది

وَأَنْ أَتْلُوَ الْقُرْآنَ ۖ فَمَنِ اهْتَدَىٰ فَإِنَّمَا يَهْتَدِي لِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَقُلْ إِنَّمَا أَنَا مِنَ الْمُنذِرِينَ(92)

 మరియు ఈ ఖుర్ఆన్ ను చదివి వినిపించాలని కూడా (ఆజ్ఞ ఇవ్వబడింది). కావున మార్గదర్శకత్వం పొందినవాడు తన మేలుకే, మార్గదర్శకత్వం పొందుతాడు. మరియు మార్గభ్రష్టుడైన వాడితో అను: నిశ్చయంగా, నేను హెచ్చరిక చేసేవాడను మాత్రమే

وَقُلِ الْحَمْدُ لِلَّهِ سَيُرِيكُمْ آيَاتِهِ فَتَعْرِفُونَهَا ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ(93)

 వారితో (ఇంకా) ఇలా అను: సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! త్వరలోనే ఆయన మీకు తన సూచనలను చూపుతాడు, అప్పుడు మీకు తెలుస్తుంది. మరియు మీరు చేస్తున్న కార్యాలను నీ ప్రభువు ఎరుగకుండా లేడు


More surahs in Telugu:


Al-Baqarah Al-'Imran An-Nisa'
Al-Ma'idah Yusuf Ibrahim
Al-Hijr Al-Kahf Maryam
Al-Hajj Al-Qasas Al-'Ankabut
As-Sajdah Ya Sin Ad-Dukhan
Al-Fath Al-Hujurat Qaf
An-Najm Ar-Rahman Al-Waqi'ah
Al-Hashr Al-Mulk Al-Haqqah
Al-Inshiqaq Al-A'la Al-Ghashiyah

Download surah An-Naml with the voice of the most famous Quran reciters :

surah An-Naml mp3 : choose the reciter to listen and download the chapter An-Naml Complete with high quality
surah An-Naml Ahmed El Agamy
Ahmed Al Ajmy
surah An-Naml Bandar Balila
Bandar Balila
surah An-Naml Khalid Al Jalil
Khalid Al Jalil
surah An-Naml Saad Al Ghamdi
Saad Al Ghamdi
surah An-Naml Saud Al Shuraim
Saud Al Shuraim
surah An-Naml Abdul Basit Abdul Samad
Abdul Basit
surah An-Naml Abdul Rashid Sufi
Abdul Rashid Sufi
surah An-Naml Abdullah Basfar
Abdullah Basfar
surah An-Naml Abdullah Awwad Al Juhani
Abdullah Al Juhani
surah An-Naml Fares Abbad
Fares Abbad
surah An-Naml Maher Al Muaiqly
Maher Al Muaiqly
surah An-Naml Muhammad Siddiq Al Minshawi
Al Minshawi
surah An-Naml Al Hosary
Al Hosary
surah An-Naml Al-afasi
Mishari Al-afasi
surah An-Naml Yasser Al Dosari
Yasser Al Dosari


Thursday, November 21, 2024

لا تنسنا من دعوة صالحة بظهر الغيب