📖 0/604 చదివిన పేజీలు
📄 69
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِن تُطِيعُواْ ٱلَّذِينَ كَفَرُواْ يَرُدُّوكُمۡ عَلَىٰٓ أَعۡقَٰبِكُمۡ فَتَنقَلِبُواْ خَٰسِرِينَ  ۝١٤٩ بَلِ ٱللَّهُ مَوۡلَىٰكُمۡۖ وَهُوَ خَيۡرُ ٱلنَّٰصِرِينَ  ۝١٥٠ سَنُلۡقِي فِي قُلُوبِ ٱلَّذِينَ كَفَرُواْ ٱلرُّعۡبَ بِمَآ أَشۡرَكُواْ بِٱللَّهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهِۦ سُلۡطَٰنًاۖ وَمَأۡوَىٰهُمُ ٱلنَّارُۖ وَبِئۡسَ مَثۡوَى ٱلظَّٰلِمِينَ  ۝١٥١ وَلَقَدۡ صَدَقَكُمُ ٱللَّهُ وَعۡدَهُۥٓ إِذۡ تَحُسُّونَهُم بِإِذۡنِهِۦۖ حَتَّىٰٓ إِذَا فَشِلۡتُمۡ وَتَنَٰزَعۡتُمۡ فِي ٱلۡأَمۡرِ وَعَصَيۡتُم مِّنۢ بَعۡدِ مَآ أَرَىٰكُم مَّا تُحِبُّونَۚ مِنكُم مَّن يُرِيدُ ٱلدُّنۡيَا وَمِنكُم مَّن يُرِيدُ ٱلۡأٓخِرَةَۚ ثُمَّ صَرَفَكُمۡ عَنۡهُمۡ لِيَبۡتَلِيَكُمۡۖ وَلَقَدۡ عَفَا عَنكُمۡۗ وَٱللَّهُ ذُو فَضۡلٍ عَلَى ٱلۡمُؤۡمِنِينَ  ۝١٥٢ ۞ إِذۡ تُصۡعِدُونَ وَلَا تَلۡوُۥنَ عَلَىٰٓ أَحَدٍ وَٱلرَّسُولُ يَدۡعُوكُمۡ فِيٓ أُخۡرَىٰكُمۡ فَأَثَٰبَكُمۡ غَمَّۢا بِغَمٍّ لِّكَيۡلَا تَحۡزَنُواْ عَلَىٰ مَا فَاتَكُمۡ وَلَا مَآ أَصَٰبَكُمۡۗ وَٱللَّهُ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ  ۝١٥٣
3:149
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِن تُطِيعُواْ ٱلَّذِينَ كَفَرُواْ يَرُدُّوكُمۡ عَلَىٰٓ أَعۡقَٰبِكُمۡ فَتَنقَلِبُواْ خَٰسِرِينَ  ۝١٤٩
ఓ విశ్వాసులారా! మీరు సత్యతిరస్కారుల సలహాలను పాటిస్తే, వారు మిమ్మల్ని వెనుకకు (అవిశ్వాసం వైపునకు) మరలిస్తారు. అప్పుడు మీరే నష్టపడిన వారవుతారు
3:150
بَلِ ٱللَّهُ مَوۡلَىٰكُمۡۖ وَهُوَ خَيۡرُ ٱلنَّٰصِرِينَ  ۝١٥٠
వాస్తవానికి! అల్లాహ్ యే మీ సంరక్షకుడు. మరియు ఆయనే అత్యుత్తమ సహాయకుడు
3:151
سَنُلۡقِي فِي قُلُوبِ ٱلَّذِينَ كَفَرُواْ ٱلرُّعۡبَ بِمَآ أَشۡرَكُواْ بِٱللَّهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهِۦ سُلۡطَٰنًاۖ وَمَأۡوَىٰهُمُ ٱلنَّارُۖ وَبِئۡسَ مَثۡوَى ٱلظَّٰلِمِينَ  ۝١٥١
ఆయన ఏ విధమైన ప్రమాణం అవతరింపజేయనిదే, అల్లాహ్ కు సాటి కల్పించినందుకు, మేము సత్యతిరస్కారుల హృదయాలలో ఘోర భయాన్ని కల్పిస్తాము. వారి ఆశ్రయం నరకాగ్నియే! అది దుర్మార్గులకు లభించే, అతి చెడ్డ నివాసం
3:152
وَلَقَدۡ صَدَقَكُمُ ٱللَّهُ وَعۡدَهُۥٓ إِذۡ تَحُسُّونَهُم بِإِذۡنِهِۦۖ حَتَّىٰٓ إِذَا فَشِلۡتُمۡ وَتَنَٰزَعۡتُمۡ فِي ٱلۡأَمۡرِ وَعَصَيۡتُم مِّنۢ بَعۡدِ مَآ أَرَىٰكُم مَّا تُحِبُّونَۚ مِنكُم مَّن يُرِيدُ ٱلدُّنۡيَا وَمِنكُم مَّن يُرِيدُ ٱلۡأٓخِرَةَۚ ثُمَّ صَرَفَكُمۡ عَنۡهُمۡ لِيَبۡتَلِيَكُمۡۖ وَلَقَدۡ عَفَا عَنكُمۡۗ وَٱللَّهُ ذُو فَضۡلٍ عَلَى ٱلۡمُؤۡمِنِينَ  ۝١٥٢
మరియు వాస్తవానికి అల్లాహ్ మీకు చేసిన తన వాగ్దానాన్ని సత్యపరచాడు. ఎప్పుడైతే మీరు ఆయన అనుమతితో, వారిని (సత్యతిరస్కారులను) చంపుతూ ఉన్నారో! తరువాత మీరు పిరికితనాన్ని ప్రదర్శించి, మీ కర్తవ్య విషయంలో పరస్పర విభేదాలకు గురి అయ్యి - ఆయన (అల్లాహ్) మీకు, మీరు వ్యామోహపడుతున్న దానిని చూపగానే - (మీ నాయకుని) ఆజ్ఞను ఉల్లంఘించారు. (ఎందుకంటే) మీలో కొందరు ఇహలోకాన్ని కోరేవారున్నారు మరియు మీలో కొందరు పరలోకాన్ని కోరేవారున్నారు. తరువాత మిమ్మల్ని పరీక్షించటానికి ఆయన (అల్లాహ్) మీరు మీ విరోధులను ఓడించకుండా చేశాడు. మరియు వాస్తవానికి ఇపుడు ఆయన మిమ్మలన్ని క్షమించాడు. మరియు అల్లాహ్ విశ్వాసుల పట్ల ఎంతో అనుగ్రహుడు
3:153
۞ إِذۡ تُصۡعِدُونَ وَلَا تَلۡوُۥنَ عَلَىٰٓ أَحَدٍ وَٱلرَّسُولُ يَدۡعُوكُمۡ فِيٓ أُخۡرَىٰكُمۡ فَأَثَٰبَكُمۡ غَمَّۢا بِغَمٍّ لِّكَيۡلَا تَحۡزَنُواْ عَلَىٰ مَا فَاتَكُمۡ وَلَا مَآ أَصَٰبَكُمۡۗ وَٱللَّهُ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ  ۝١٥٣
(జ్ఞాపకం చేసుకోండి!) ఎప్పుడయితే మీరు పారిపోతూ ఉన్నారో మరియు వెనుకకు కూడా తిరిగి ఎవరినీ చూడకుండా ఉన్నారో మరియు ప్రవక్త మీ వెనుక నుండి, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడో! అప్పుడు (మీ ఈ వైఖరికి) ప్రతిఫలంగా (అల్లాహ్) మీకు దుఃఖం మీద దుఃఖం కలుగజేసాడు; మీరు ఏదైనా పోగొట్టుకున్నా, లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించకుండా ఉండేందుకు. మరియు మీ కర్మలన్నింటినీ అల్లాహ్ బాగా ఎరుగును


📚 4 📄69 / 604



M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
0:00
0:00
-

పవిత్ర ఖురాన్


Sunday, October 4, 2026

Don't forget us in your sincere prayers