సూరా అద్-దుహా అరబిక్ మరియు తెలుగు

సూరా అద్-దుహాని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (11 వచనం — مكية). అద్-దుహా వినండి, అద్-దుహా అనువాదం, అద్-దుహా mp3, అద్-దుహా pdf.

సూరా అద్-దుహా చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
وَالضُّحَىٰ ۝١
📖 అనువాదం వచనం 1
ప్రకాశవంతమైన ప్రొద్దుటి పూట (పూర్వాహ్ణం) సాక్షిగా
وَاللَّيْلِ إِذَا سَجَىٰ ۝٢
📖 అనువాదం వచనం 2
మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా
مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ ۝٣
📖 అనువాదం వచనం 3
(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు
وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ ۝٤
📖 అనువాదం వచనం 4
మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది
وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ ۝٥
📖 అనువాదం వచనం 5
మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు
أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ ۝٦
📖 అనువాదం వచనం 6
(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా
وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ ۝٧
📖 అనువాదం వచనం 7
మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం చేయలేదా
وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ ۝٨
📖 అనువాదం వచనం 8
మరియు ఆయన, పేదవానిగా చూసి, నిన్ను సంపన్నుడిగా చేయలేదా
فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ ۝٩
📖 అనువాదం వచనం 9
కాబట్టి నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు
وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ ۝١٠
📖 అనువాదం వచనం 10
మరియు యాచకుణ్ణి కసరుకోకు
وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ ۝١١
📖 అనువాదం వచనం 11
మరియు నీ ప్రభువు అనుగ్రహాలను బహిరంగంగా ప్రకటిస్తూ ఉండు
← 92 అద్-దుహా (93/114) 94 →
చదవండి సూరా అద్-దుహా తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

93الضحى Ad-Duha 📚 11 వచనం مكية

వచనానికి వచనం – సూరా అద్-దుహా — 11 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers