సూరా అల్-ముల్క్ అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-ముల్క్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (30 వచనం — مكية). అల్-ముల్క్ వినండి, అల్-ముల్క్ అనువాదం, అల్-ముల్క్ mp3, అల్-ముల్క్ pdf.

సూరా అల్-ముల్క్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ۝١
📖 అనువాదం వచనం 1
ఎవరి చేతిలోనయితే విశ్వసామ్రాజ్యాధిపత్యం ఉందో! ఆయన సర్వశ్రేష్ఠుడు (శుభదాయకుడు) మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు
الَّذِي خَلَقَ الْمَوْتَ وَالْحَيَاةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۚ وَهُوَ الْعَزِيزُ الْغَفُورُ ۝٢
📖 అనువాదం వచనం 2
ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు
الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا ۖ مَّا تَرَىٰ فِي خَلْقِ الرَّحْمَٰنِ مِن تَفَاوُتٍ ۖ فَارْجِعِ الْبَصَرَ هَلْ تَرَىٰ مِن فُطُورٍ ۝٣
📖 అనువాదం వచనం 3
ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలను సృష్టించాడు. ఆ అనంత కరుణా మయుని సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్నీ చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు: ఏమీ? నీకేమైనా లోపం కనిపిస్తుందా
ثُمَّ ارْجِعِ الْبَصَرَ كَرَّتَيْنِ يَنقَلِبْ إِلَيْكَ الْبَصَرُ خَاسِئًا وَهُوَ حَسِيرٌ ۝٤
📖 అనువాదం వచనం 4
ఇంకా, మాటిమాటికీ నీ చూపులు త్రిప్పి చూడు. అది (నీ చూపు) విఫలమై అలిసి సొలిసి తిరిగి నీ వైపుకే వస్తుంది
وَلَقَدْ زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ وَجَعَلْنَاهَا رُجُومًا لِّلشَّيَاطِينِ ۖ وَأَعْتَدْنَا لَهُمْ عَذَابَ السَّعِيرِ ۝٥
📖 అనువాదం వచనం 5
మరియు వాస్తవంగా, మేము భూమికి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని దీపాలతో అలంకరించాము. మరియు వాటిని, షైతాన్ లను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము. మరియు వారి కొరకు (షైతానుల కొరకు) మేము భగభగ మండే అగ్నిజ్వాలల శిక్షను సిద్ధపరచి ఉంచాము
وَلِلَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ ۖ وَبِئْسَ الْمَصِيرُ ۝٦
📖 అనువాదం వచనం 6
మరియు తన ప్రభువును (అల్లాహ్ ను) తిరస్కరించే వారికి నరకశిక్ష ఉంది. అది ఎంత చెడ్డ గమ్యస్థానం
إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ ۝٧
📖 అనువాదం వచనం 7
వారు అందులోకి విసిరి వేయ బడినప్పుడు వారు దాని (భయంకరమైన) గర్జనను వింటారు. మరియు అది మరిగి పొంగుతూ ఉంటుంది
تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ ۖ كُلَّمَا أُلْقِيَ فِيهَا فَوْجٌ سَأَلَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ نَذِيرٌ ۝٨
📖 అనువాదం వచనం 8
అది దాదాపు ఉద్రేకంగా ప్రేలిపోతూ ఉంటుంది. ప్రతిసారి అందులోకి (పాపుల) గుంపు పడవేయబడి నప్పుడు! దాని కాపలాదారులు వారితో: ఏమీ? మీ వద్దకు ఏ హెచ్చరిక చేసేవాడు రాలేదు?" అని ప్రశ్నిస్తారు
قَالُوا بَلَىٰ قَدْ جَاءَنَا نَذِيرٌ فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ اللَّهُ مِن شَيْءٍ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ كَبِيرٍ ۝٩
📖 అనువాదం వచనం 9
వారంటారు: ఎందుకు రాలేదు! వాస్తవానికి మా వద్దకు హెచ్చరిక చేసేవాడు వచ్చాడు, కాని మేము అతనిని అసత్యుడవని తిరస్కరించాము మరియు అతనితో ఇలా అన్నాము: `అల్లాహ్ దేనినీ (ఏ దివ్యజ్ఞానాన్ని) అవతరింప జేయలేదు; మీరు కేవలం ఘోర మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు
وَقَالُوا لَوْ كُنَّا نَسْمَعُ أَوْ نَعْقِلُ مَا كُنَّا فِي أَصْحَابِ السَّعِيرِ ۝١٠
📖 అనువాదం వచనం 10
ఇంకా వారు ఇలా అంటారు: ఒకవేళ మేము విని ఉంటే లేదా గ్రహించి ఉంటే, మేము మండే అగ్నిజ్వాలలో పడి వుండే వారితో చేరే వారము కాము కదా
فَاعْتَرَفُوا بِذَنبِهِمْ فَسُحْقًا لِّأَصْحَابِ السَّعِيرِ ۝١١
📖 అనువాదం వచనం 11
అప్పుడు వారే స్వయంగా తమ పాపాన్ని ఒప్పుకుంటారు. కావున భగభగమండే అగ్నిజ్వాలలు దూరమై పోవుగాక
إِنَّ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ ۝١٢
📖 అనువాదం వచనం 12
నిశ్చయంగా, ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి
وَأَسِرُّوا قَوْلَكُمْ أَوِ اجْهَرُوا بِهِ ۖ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ۝١٣
📖 అనువాదం వచనం 13
మరియు మీరు మీ మాటలను రహస్యంగా ఉంచినా సరే! లేక వాటిని వెల్లడి చేసినా సరే! నిశ్చయంగా, ఆయనకు హృదయాల స్థితి బాగా తెలుసు
أَلَا يَعْلَمُ مَنْ خَلَقَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ ۝١٤
📖 అనువాదం వచనం 14
ఏమిటీ? పుట్టించిన వాడికే తెలియదా? మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు
هُوَ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ ذَلُولًا فَامْشُوا فِي مَنَاكِبِهَا وَكُلُوا مِن رِّزْقِهِ ۖ وَإِلَيْهِ النُّشُورُ ۝١٥
📖 అనువాదం వచనం 15
భూమిని మీ అధీనంలో ఉంచినవాడు ఆయనే! కావున మీరు దాని దారులలో తిరగండి. మరియు ఆయన ప్రసాదించిన జీవనోపాధిని తినండి, మరియు మీరు ఆయన వైపునకే సజీవులై మరలి పోవలసి ఉంది
أَأَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يَخْسِفَ بِكُمُ الْأَرْضَ فَإِذَا هِيَ تَمُورُ ۝١٦
📖 అనువాదం వచనం 16
ఏమీ? మీరు నిర్భయంగా ఉన్నారా? ఆకాశాలలో ఉన్నవాడు, మిమ్మల్ని భూమిలోకి అణగద్రొక్కడని, ఎప్పుడైతే అది తీవ్రకంపనాలకు గురి అవుతుందో
أَمْ أَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ۖ فَسَتَعْلَمُونَ كَيْفَ نَذِيرِ ۝١٧
📖 అనువాదం వచనం 17
లేక ఆకాశాలలో ఉన్నవాడు, మీపైకి రాళ్ళు కురిపించే గాలివాన పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? నా హెచ్చరిక ఎలాంటిదో అప్పుడు మీరు తెలుసుకోగలరు
وَلَقَدْ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَكَيْفَ كَانَ نَكِيرِ ۝١٨
📖 అనువాదం వచనం 18
మరియు వాస్తవానికి వారికి పూర్వం గతించిన వారు కూడా (ప్రవక్తలను) తిరస్కరించారు. నా పట్టు (శిక్ష) ఎంత తీవ్రంగా ఉండిందో (చూశారా)
أَوَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ فَوْقَهُمْ صَافَّاتٍ وَيَقْبِضْنَ ۚ مَا يُمْسِكُهُنَّ إِلَّا الرَّحْمَٰنُ ۚ إِنَّهُ بِكُلِّ شَيْءٍ بَصِيرٌ ۝١٩
📖 అనువాదం వచనం 19
ఏమీ? వారు తమ ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ, ఎగురుతున్నాయో చూడటం లేదా? ఆ అనంత కరుణామయుడు తప్ప మరెవ్వరూ వాటిని అలా నిలిపి ఉంచలేరు కదా! నిశ్చయంగా ఆయన ప్రతి దానినీ చూస్తున్నాడు
أَمَّنْ هَٰذَا الَّذِي هُوَ جُندٌ لَّكُمْ يَنصُرُكُم مِّن دُونِ الرَّحْمَٰنِ ۚ إِنِ الْكَافِرُونَ إِلَّا فِي غُرُورٍ ۝٢٠
📖 అనువాదం వచనం 20
ఏమీ? అనంత కరుణామయుడు తప్ప మీకు సేన వలే అడ్డుగా నిలిచి, మీకు సహాయపడ గల వాడెవడైనా ఉన్నాడా? ఈ సత్యతిరస్కారులు కేవలం మోసంలో పడి వున్నారు
أَمَّنْ هَٰذَا الَّذِي يَرْزُقُكُمْ إِنْ أَمْسَكَ رِزْقَهُ ۚ بَل لَّجُّوا فِي عُتُوٍّ وَنُفُورٍ ۝٢١
📖 అనువాదం వచనం 21
ఒకవేళ ఆయన మీ జీవనోపాధిని ఆపి వేస్తే, మీకు జీవనోపాధి ఇచ్చేవాడు ఎవడున్నాడు? అయినా వారు తలబిరుసుతనంలో మునిగి (సత్యానికి) దూరమై పోతున్నారు
أَفَمَن يَمْشِي مُكِبًّا عَلَىٰ وَجْهِهِ أَهْدَىٰ أَمَّن يَمْشِي سَوِيًّا عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ۝٢٢
📖 అనువాదం వచనం 22
ఏమీ? ఎవడైతే తన ముఖం మీద దేవులాడుతూ నడుస్తాడో, అతడు సరైన మార్గం పొందుతాడా? లేక చక్కగా ఋజుమార్గం మీద నడిచేవాడు పొందుతాడా
قُلْ هُوَ الَّذِي أَنشَأَكُمْ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۖ قَلِيلًا مَّا تَشْكُرُونَ ۝٢٣
📖 అనువాదం వచనం 23
వారితో ఇలా అను: ఆయనే మిమ్మల్ని సృజించాడు. మరియు ఆయనే మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలనూ ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలిపేది చాలా తక్కువ
قُلْ هُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ ۝٢٤
📖 అనువాదం వచనం 24
(ఇంకా) ఇలా అను: ఆయనే మిమ్మల్ని భూమిలో వ్యాపింపజేశాడు మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశ పరచబడతారు
وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ ۝٢٥
📖 అనువాదం వచనం 25
మరియు వారు ఇలా అడుగుతున్నారు: మీరు సత్యవంతులే అయితే, ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది
قُلْ إِنَّمَا الْعِلْمُ عِندَ اللَّهِ وَإِنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ ۝٢٦
📖 అనువాదం వచనం 26
వారితో ఇలా అను: నిశ్చయంగా, దాని జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది. మరియు నేను స్పష్టంగా హెచ్చరిక చేసే వాడిని మాత్రమే
فَلَمَّا رَأَوْهُ زُلْفَةً سِيئَتْ وُجُوهُ الَّذِينَ كَفَرُوا وَقِيلَ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تَدَّعُونَ ۝٢٧
📖 అనువాదం వచనం 27
తరువాత వారు దానిని సమీపంలో ఉండటం చూసినప్పుడు, సత్యతిరస్కారుల ముఖాలు దుఃఖంతో నిండి నల్లబడిపోతాయి. మరియు వారితో ఇలా అనబడుతుంది: మీరు దేనినయితే అడుగుతూ ఉండేవారో అది (ఆ వాగ్దానం) ఇదే
قُلْ أَرَأَيْتُمْ إِنْ أَهْلَكَنِيَ اللَّهُ وَمَن مَّعِيَ أَوْ رَحِمَنَا فَمَن يُجِيرُ الْكَافِرِينَ مِنْ عَذَابٍ أَلِيمٍ ۝٢٨
📖 అనువాదం వచనం 28
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: ఏమీ? మీరు ఆలోచించరా? ఒకవేళ అల్లాహ్ నన్ను మరియు నా తోటి వారిని నాశనం చేయనూ వచ్చు! లేదా మమ్మల్ని కరుణించనూ వచ్చు. కాని సత్యతిరస్కారులను బాధాకరమైన శిక్ష నుండి ఎవడు రక్షించగలడు
قُلْ هُوَ الرَّحْمَٰنُ آمَنَّا بِهِ وَعَلَيْهِ تَوَكَّلْنَا ۖ فَسَتَعْلَمُونَ مَنْ هُوَ فِي ضَلَالٍ مُّبِينٍ ۝٢٩
📖 అనువాదం వచనం 29
వారితో ఇంకా ఇలా అను: ఆయనే అనంత కరుణామయుడు, మేము ఆయననే విశ్వసించాము మరియు ఆయననే నమ్ముకున్నాము. ఇక ఎవరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారో త్వరలోనే మీరు తెలుసుకోగలరు
قُلْ أَرَأَيْتُمْ إِنْ أَصْبَحَ مَاؤُكُمْ غَوْرًا فَمَن يَأْتِيكُم بِمَاءٍ مَّعِينٍ ۝٣٠
📖 అనువాదం వచనం 30
వారితో ఇలా అను: ఏమీ? మీరు ఆలోచించరా? ఒకవేళ మీ బావులలోని నీరు, భూమిలోనికి ఇంకి పోతే, ప్రవహించే ఈ నీటి ఊటలను మీ కొరకు ఎవడు బయటికి తేగలడు
← 66 అల్-ముల్క్ (67/114) 68 →
చదవండి సూరా అల్-ముల్క్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

67الملك Al-Mulk 📚 30 వచనం مكية



పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers