సూరా అన్-నబా అరబిక్ మరియు తెలుగు

సూరా అన్-నబాని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (40 వచనం — مكية). అన్-నబా వినండి, అన్-నబా అనువాదం, అన్-నబా mp3, అన్-నబా pdf.

సూరా అన్-నబా చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
عَمَّ يَتَسَاءَلُونَ ۝١
📖 అనువాదం వచనం 1
ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు
عَنِ النَّبَإِ الْعَظِيمِ ۝٢
📖 అనువాదం వచనం 2
ఆ మహా వార్తను గురించేనా
الَّذِي هُمْ فِيهِ مُخْتَلِفُونَ ۝٣
📖 అనువాదం వచనం 3
దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో
كَلَّا سَيَعْلَمُونَ ۝٤
📖 అనువాదం వచనం 4
అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు
ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ ۝٥
📖 అనువాదం వచనం 5
ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు
أَلَمْ نَجْعَلِ الْأَرْضَ مِهَادًا ۝٦
📖 అనువాదం వచనం 6
ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా
وَالْجِبَالَ أَوْتَادًا ۝٧
📖 అనువాదం వచనం 7
మరియు పర్వతాలను మేకులుగా
وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا ۝٨
📖 అనువాదం వచనం 8
మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము
وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا ۝٩
📖 అనువాదం వచనం 9
మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము
وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا ۝١٠
📖 అనువాదం వచనం 10
మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము
وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا ۝١١
📖 అనువాదం వచనం 11
మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము
وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا ۝١٢
📖 అనువాదం వచనం 12
మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము
وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا ۝١٣
📖 అనువాదం వచనం 13
మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము
وَأَنزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا ۝١٤
📖 అనువాదం వచనం 14
మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము
لِّنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا ۝١٥
📖 అనువాదం వచనం 15
దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి
وَجَنَّاتٍ أَلْفَافًا ۝١٦
📖 అనువాదం వచనం 16
మరియు దట్టమైన తోటలను
إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا ۝١٧
📖 అనువాదం వచనం 17
నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం
يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا ۝١٨
📖 అనువాదం వచనం 18
ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు
وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا ۝١٩
📖 అనువాదం వచనం 19
మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి
وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا ۝٢٠
📖 అనువాదం వచనం 20
మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి
إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا ۝٢١
📖 అనువాదం వచనం 21
నిశ్చయంగా, నరకం ఒక మాటు
لِّلطَّاغِينَ مَآبًا ۝٢٢
📖 అనువాదం వచనం 22
ధిక్కారుల గమ్యస్థానం
لَّابِثِينَ فِيهَا أَحْقَابًا ۝٢٣
📖 అనువాదం వచనం 23
అందులో వారు యుగాల తరబడి ఉంటారు
لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا ۝٢٤
📖 అనువాదం వచనం 24
అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు
إِلَّا حَمِيمًا وَغَسَّاقًا ۝٢٥
📖 అనువాదం వచనం 25
సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప
جَزَاءً وِفَاقًا ۝٢٦
📖 అనువాదం వచనం 26
(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా
إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا ۝٢٧
📖 అనువాదం వచనం 27
వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు
وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا ۝٢٨
📖 అనువాదం వచనం 28
పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు
وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا ۝٢٩
📖 అనువాదం వచనం 29
మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము
فَذُوقُوا فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا ۝٣٠
📖 అనువాదం వచనం 30
కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము
إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا ۝٣١
📖 అనువాదం వచనం 31
నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది
حَدَائِقَ وَأَعْنَابًا ۝٣٢
📖 అనువాదం వచనం 32
ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ
وَكَوَاعِبَ أَتْرَابًا ۝٣٣
📖 అనువాదం వచనం 33
మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు
وَكَأْسًا دِهَاقًا ۝٣٤
📖 అనువాదం వచనం 34
మరియు నిండి పొర్లే (మధు) పాత్ర
لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّابًا ۝٣٥
📖 అనువాదం వచనం 35
అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు
جَزَاءً مِّن رَّبِّكَ عَطَاءً حِسَابًا ۝٣٦
📖 అనువాదం వచనం 36
(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం
رَّبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الرَّحْمَٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا ۝٣٧
📖 అనువాదం వచనం 37
భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు
يَوْمَ يَقُومُ الرُّوحُ وَالْمَلَائِكَةُ صَفًّا ۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمَٰنُ وَقَالَ صَوَابًا ۝٣٨
📖 అనువాదం వచనం 38
ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు
ذَٰلِكَ الْيَوْمُ الْحَقُّ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ مَآبًا ۝٣٩
📖 అనువాదం వచనం 39
అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి
إِنَّا أَنذَرْنَاكُمْ عَذَابًا قَرِيبًا يَوْمَ يَنظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنتُ تُرَابًا ۝٤٠
📖 అనువాదం వచనం 40
నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు
← 77 అన్-నబా (78/114) 79 →
చదవండి సూరా అన్-నబా తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

78النبأ An-Naba 📚 40 వచనం مكية

వచనానికి వచనం – సూరా అన్-నబా — 40 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers