Surah Ar-Rum with Telugu

  1. Surah mp3
  2. More
  3. Telugu
The Holy Quran | Quran translation | Language Telugu | Surah Rum | الروم - Ayat Count 60 - The number of the surah in moshaf: 30 - The meaning of the surah in English: Rome - Byzantium.

الم(1)

 అలిఫ్-లామ్-మీమ్

غُلِبَتِ الرُّومُ(2)

 రోమన్ లు పరాజితులయ్యారు

فِي أَدْنَى الْأَرْضِ وَهُم مِّن بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُونَ(3)

 తమ పొరుగు భూభాగంలోనే! మరియు వారు తమ ఈ పరాజయం తరువాత, తిరిగి విజేతలు కాగలరు

فِي بِضْعِ سِنِينَ ۗ لِلَّهِ الْأَمْرُ مِن قَبْلُ وَمِن بَعْدُ ۚ وَيَوْمَئِذٍ يَفْرَحُ الْمُؤْمِنُونَ(4)

 (రాబోయే) కొన్ని సంవత్సరాలలోనే. మొదట నయినా, తరువాత నయినా నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ దే మరియు ఆ రోజు విశ్వాసులు సంతోష పడతారు

بِنَصْرِ اللَّهِ ۚ يَنصُرُ مَن يَشَاءُ ۖ وَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ(5)

 అల్లాహ్ ప్రసాదించిన సహాయానికి. ఆయన తనకు ఇష్టమైన వారికి సహాయం చేస్తాడు. మరియు ఆయనే సర్వశక్తి మంతుడు, అపార కరుణా ప్రదాత

وَعْدَ اللَّهِ ۖ لَا يُخْلِفُ اللَّهُ وَعْدَهُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ(6)

 మరియు (ఇది) అల్లాహ్ చేసిన వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగ పరచడు, కానీ వాస్తవానికి చాలా మందికి ఇది తెలియదు

يَعْلَمُونَ ظَاهِرًا مِّنَ الْحَيَاةِ الدُّنْيَا وَهُمْ عَنِ الْآخِرَةِ هُمْ غَافِلُونَ(7)

 వారికి ఇహలోక జీవితపు బాహ్యరూపం మాత్రమే తెలుసు మరియు వారు పరలోకాన్ని గురించి ఏమరుపాటులో పడి ఉన్నారు

أَوَلَمْ يَتَفَكَّرُوا فِي أَنفُسِهِم ۗ مَّا خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ بِلِقَاءِ رَبِّهِمْ لَكَافِرُونَ(8)

 ఏమీ? వారు తమలో తాము (ఎన్నడూ) ఆలోచించలేదా? ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్య ఉన్నదంతా, అల్లాహ్ సత్యంతో ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడని? అయినా నిశ్చయంగా ప్రజలలో చాలా మంది తమ ప్రభువును దర్శించవలసి వున్న వాస్తవాన్ని తిరస్కరిస్తున్నారు

أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوا أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا الْأَرْضَ وَعَمَرُوهَا أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ ۖ فَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ(9)

 ఏమీ? వీరు భూమిపై ప్రయాణం చేయలేదా? వీరి పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరి కంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు, సేద్యం చేసేవారు మరియు దానిపై, వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు మరియు వారి వద్దకు వారి సందేశహరులు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు

ثُمَّ كَانَ عَاقِبَةَ الَّذِينَ أَسَاءُوا السُّوأَىٰ أَن كَذَّبُوا بِآيَاتِ اللَّهِ وَكَانُوا بِهَا يَسْتَهْزِئُونَ(10)

 చివరకు చెడుకార్యాలు చేసిన వారి ముగింపు చెడుగానే జరిగింది. ఎందుకంటే, వారు అల్లాహ్ సూచనలను అబద్ధాలని నిరాకరించేవారు. వాటిని గురించి ఎగతాళి చేసేవారు

اللَّهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ(11)

 అల్లాహ్ యే సృష్టి ప్రారంభిస్తాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి (పూర్వ స్థితిలోకి) తెస్తాడు. ఆ తరువాత మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు

وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُبْلِسُ الْمُجْرِمُونَ(12)

 మరియు ఆ ఘడియ (పునరుత్థానం) ఆసన్నమైన రోజు, అపరాధులందరూ నిరాశ చెందుతారు

وَلَمْ يَكُن لَّهُم مِّن شُرَكَائِهِمْ شُفَعَاءُ وَكَانُوا بِشُرَكَائِهِمْ كَافِرِينَ(13)

 మరియు వారు అల్లాహ్ కు భాగస్వాములుగా కల్పించిన వారెవ్వరూ వారి సిఫారసు చేయజాలరు. మరియు వారు కల్పించుకున్న తమ భాగస్వాములను తిరస్కరిస్తారు

وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يَوْمَئِذٍ يَتَفَرَّقُونَ(14)

 మరియు ఆ ఘడియ (పునరుత్థానం) ఆసన్నమైన రోజు, ఆ రోజు వారు (ప్రజలు), వేర్వేరు వర్గాలలో విభజింప బడతారు

فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَهُمْ فِي رَوْضَةٍ يُحْبَرُونَ(15)

 అప్పుడు ఎవరైతే, విశ్వసించి, సత్కార్యాలు చేసి ఉంటారో, వారు ఉద్యానవనంలో ఆనందంగా ఉంచబడతారు

وَأَمَّا الَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا وَلِقَاءِ الْآخِرَةِ فَأُولَٰئِكَ فِي الْعَذَابِ مُحْضَرُونَ(16)

 మరియు ఎవరైతే సత్యతిరస్కారులై మా సూచనలను మరియు పరలోక సమావేశాన్ని తిరస్కరించారో, అలాంటి వారు శిక్ష కొరకు హాజరు చేయబడతారు

فَسُبْحَانَ اللَّهِ حِينَ تُمْسُونَ وَحِينَ تُصْبِحُونَ(17)

 కావున, మీరు సాయంత్రము వేళ మరియు ఉదయం పూట అల్లాహ్ పవిత్రతను కొనియాడండి

وَلَهُ الْحَمْدُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَعَشِيًّا وَحِينَ تُظْهِرُونَ(18)

 మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ సర్వస్తోత్రాలు ఆయన (అల్లాహ్) కే మరియు సంధ్యాకాలంలోనూ మరియు మధ్యాహ్న కాలంలోనూ (స్తోత్రాలు ఆయనకే)

يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَيُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ وَكَذَٰلِكَ تُخْرَجُونَ(19)

 ఆయన సజీవిని నిర్జీవి నుండి తీస్తాడు. మరియు నిర్జీవిని సజీవి నుండి తీస్తాడు. మరియు ఆయన భూమి మృతి చెందిన తరువాత దానికి ప్రాణం పోస్తాడు. ఇదే విధంగా మీరు కూడా (గోరీల నుండి) వెలికి తీయబడతారు

وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ إِذَا أَنتُم بَشَرٌ تَنتَشِرُونَ(20)

 మరియు ఆయన సూచనలలో ఒకటి మిమ్మల్ని మట్టి నుండి సృష్టించటం. ఆ తరువాత మీరు మానవులుగా (భూమిలో) వ్యాపిస్తున్నారు

وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا لِّتَسْكُنُوا إِلَيْهَا وَجَعَلَ بَيْنَكُم مَّوَدَّةً وَرَحْمَةً ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ(21)

 మరియు ఆయన సూచనలలో; ఆయన మీ కొరకు మీ జాతి నుండియే - మీరు వారి వద్ద సౌఖ్యం పొందటానికి - మీ సహవాసులను (అజ్వాజ్ లను) పుట్టించి, మీ మధ్య ప్రేమను మరియు కారుణ్యాన్ని కలిగించడం. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలున్నాయి

وَمِنْ آيَاتِهِ خَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافُ أَلْسِنَتِكُمْ وَأَلْوَانِكُمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْعَالِمِينَ(22)

 మరియు ఆయన సూచనలలో ఆయన ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించడం; మరియు మీ భాషలలో మరియు మీ రంగులలో ఉన్న విభేదాలు కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో జ్ఞానులకు ఎన్నో సూచనలున్నాయి

وَمِنْ آيَاتِهِ مَنَامُكُم بِاللَّيْلِ وَالنَّهَارِ وَابْتِغَاؤُكُم مِّن فَضْلِهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ(23)

 మరియు ఆయన సూచనలలో, మీరు రాత్రిపూట మరియు పగటి పూట, నిద్ర పోవటం మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో శ్రద్ధతో వినేవారికి ఎన్నో సూచనలున్నాయి

وَمِنْ آيَاتِهِ يُرِيكُمُ الْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنَزِّلُ مِنَ السَّمَاءِ مَاءً فَيُحْيِي بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ(24)

 మరియు ఆయన సూచనలలో, ఆయన మీకు మెరుపును చూపించి, భయాన్ని మరియు ఆశను కలుగజేయడం; మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి దానితో నిర్జీవి అయిన భూమికి ప్రాణం పోయడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో బుద్ధిమంతులకు ఎన్నో సూచనలున్నాయి

وَمِنْ آيَاتِهِ أَن تَقُومَ السَّمَاءُ وَالْأَرْضُ بِأَمْرِهِ ۚ ثُمَّ إِذَا دَعَاكُمْ دَعْوَةً مِّنَ الْأَرْضِ إِذَا أَنتُمْ تَخْرُجُونَ(25)

 మరియు ఆయన సూచనలలో, ఆయన ఆజ్ఞతో భూమ్యాకాశాలు నిలకడ కలిగి ఉండటం. ఆ తరువాత ఆయన మిమ్మల్ని ఒక్క పిలుపు పిలువగానే మీరంతా భూమి నుండి లేచి ఒకేసారి బయటికి రావటం కూడా ఉన్నాయి

وَلَهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ كُلٌّ لَّهُ قَانِتُونَ(26)

 మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ ఆయనదే. అన్నీ ఆయనకే ఆజ్ఞావర్తనులై ఉంటాయి

وَهُوَ الَّذِي يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ ۚ وَلَهُ الْمَثَلُ الْأَعْلَىٰ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ(27)

 మరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు. ఇది ఆయనకు ఎంతో సులభమైనది. భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది. ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేచనా పరుడు

ضَرَبَ لَكُم مَّثَلًا مِّنْ أَنفُسِكُمْ ۖ هَل لَّكُم مِّن مَّا مَلَكَتْ أَيْمَانُكُم مِّن شُرَكَاءَ فِي مَا رَزَقْنَاكُمْ فَأَنتُمْ فِيهِ سَوَاءٌ تَخَافُونَهُمْ كَخِيفَتِكُمْ أَنفُسَكُمْ ۚ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْقِلُونَ(28)

 ఆయన, స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని మీకు తెలుపుతున్నాడు. ఏమీ? మేము మీకు జీవనోపాధిగా సమకూర్చిన దానిలో మీ బానిసలు మీతో పాటు సరిసమానులుగా, భాగస్వాములు కాగలరా? మీరు పరస్పరం ఒకరి పట్ల నొకరు భీతి కలిగి ఉన్నట్లు, వారి పట్ల కూడా భీతి కలిగి ఉంటారా? ఈ విధంగా మేము బుద్ధిమంతులకు మా సూచనలను వివరిస్తూ ఉంటాము

بَلِ اتَّبَعَ الَّذِينَ ظَلَمُوا أَهْوَاءَهُم بِغَيْرِ عِلْمٍ ۖ فَمَن يَهْدِي مَنْ أَضَلَّ اللَّهُ ۖ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ(29)

 కాని దుర్మార్గులైనటువంటి వారు, తెలివి లేనిదే, తమ కోరికలను అనుసరిస్తారు. అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలిన వ్యక్తికి మార్గదర్శకత్వం ఎవడు చేయగలడు? మరియు వారికి సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు

فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ اللَّهِ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ(30)

 కావున నీవు నీ ముఖాన్ని, ఏకాగ్రచిత్తంతో, సత్యధర్మం (ఇస్లాం) దిశలో స్థిరంగా నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావం పైననే వారు ఉంటారు. అల్లాహ్ సృష్టి స్వభావాన్ని (ఎవ్వరూ) మార్చలేరు. ఇదే సరైన ధర్మం, కాని చాలా మంది ఇది ఎరుగరు

۞ مُنِيبِينَ إِلَيْهِ وَاتَّقُوهُ وَأَقِيمُوا الصَّلَاةَ وَلَا تَكُونُوا مِنَ الْمُشْرِكِينَ(31)

 (ఎల్లప్పుడు) మీరు ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతూ ఉండండి. మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నమాజ్ స్థాపించండి. మరియు ఆయన (అల్లాహ్) కు సాటి (భాగస్వాములు) కల్పించే వారిలో చేరిపోకండి

مِنَ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ(32)

 వారిలో ఎవరైతే, తమ ధర్మాన్ని విభజించి వేర్వేరు తెగలుగా చేసుకున్నారో! ప్రతివర్గం వారు తమ వద్దనున్న దాని (సిద్ధాంతం) తోనే సంతోషపడుతున్నారు

وَإِذَا مَسَّ النَّاسَ ضُرٌّ دَعَوْا رَبَّهُم مُّنِيبِينَ إِلَيْهِ ثُمَّ إِذَا أَذَاقَهُم مِّنْهُ رَحْمَةً إِذَا فَرِيقٌ مِّنْهُم بِرَبِّهِمْ يُشْرِكُونَ(33)

 మరియు మానవులకు ఆపద వచ్చినపుడు, వారు తమ ప్రభువు వైపునకు పశ్చాత్తాపంతో మరలి ఆయనను వేడుకుంటారు. ఆ తరువాత ఆయన కారుణ్యం నుండి కొంత వారికి రుచి చూపించినప్పుడు, వారిలో కొందరు తమ ప్రభువుకు సాటి (భాగస్వాములను) కల్పించసాగుతారు

لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ ۚ فَتَمَتَّعُوا فَسَوْفَ تَعْلَمُونَ(34)

 మేము వారికి ప్రసాదించిన దానికి (అనుగ్రహాలకు) కృతఘ్నత చూపటానికి (వారు అలా చేస్తారు). సరే! మీరు కొంత కాలం సుఖసంతోషాలు అనుభవించండి, త్వరలోనే మీరు (మీ ముగింపును) తెలుసుకుంటారు

أَمْ أَنزَلْنَا عَلَيْهِمْ سُلْطَانًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوا بِهِ يُشْرِكُونَ(35)

 లేక మేము వారిపై ఏదైనా ప్రమాణాన్ని అవతరింప జేశామా, అది వారు ఆయనకు కల్పించే భాగస్వాములను గురించి పలుకటానికి

وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً فَرِحُوا بِهَا ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ(36)

 మరియు మేము మానవులకు కారణ్యపు రుచి చూపించినప్పుడు వారు దానితో చాలా సంతోషపడతారు. కాని వారు తమ చేతులారా చేసుకున్న కర్మల ఫలితంగా వారికేదైనా కీడు కలిగితే నిరాశ చెందుతారు

أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ(37)

 ఏమీ? వారికి తెలియదా? అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ఇస్తాడని మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడని? నిశ్చయంగా, ఇందులో విశ్వసించేవారికి ఎన్నో సూచనలున్నాయి

فَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ وَالْمِسْكِينَ وَابْنَ السَّبِيلِ ۚ ذَٰلِكَ خَيْرٌ لِّلَّذِينَ يُرِيدُونَ وَجْهَ اللَّهِ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ(38)

 కావున నీవు నీ బంధువుకు అతని హక్కు ఇవ్వు మరియు యాచించని పేదవానికి మరియు బాటసారికి (కూడా). ఇది అల్లాహ్ ప్రసన్నతను కోరేవారికి ఎంతో ఉత్తమమైనది. మరియు ఇలాంటి వారే సాఫల్యము పొందేవారు

وَمَا آتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَ فِي أَمْوَالِ النَّاسِ فَلَا يَرْبُو عِندَ اللَّهِ ۖ وَمَا آتَيْتُم مِّن زَكَاةٍ تُرِيدُونَ وَجْهَ اللَّهِ فَأُولَٰئِكَ هُمُ الْمُضْعِفُونَ(39)

 మరియు మీరు ప్రజలకు - రిబా (వడ్డీ మీద డబ్బు /కానుకలు) ఇచ్చి దాని ద్వారా వారి సంపద నుండి వృద్ధి పొందాలని - ఇచ్చే ధనం, అల్లాహ్ దృష్టిలో ఏ మాత్రం వృద్ధి పొందదు. మరియు మీరు అల్లాహ్ ప్రసన్నతను పొందే ఉద్దేశంతో ఏదైనా దానం (జకాత్) చేస్తే అలాంటి వారి (సంపద) ఎన్నో రెట్లు అధికమవుతుంది

اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۖ هَلْ مِن شُرَكَائِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَيْءٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ(40)

 అల్లాహ్ యే మిమ్మల్ని పుట్టించాడు, తరువాత జీవనోపాధినిచ్చాడు. తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మళ్ళీ బ్రతికిస్తాడు. అయితే? మీరు (అల్లాహ్ కు) సాటిగా (భాగస్వాములుగా) కల్పించిన వారిలో, ఎవడైనా వీటిలో నుండి ఏదైనా ఒక్క పనిని చేయగలవాడు ఉన్నాడా! ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే భాగస్వాముల కంటే ఆయన మహోన్నతుడు

ظَهَرَ الْفَسَادُ فِي الْبَرِّ وَالْبَحْرِ بِمَا كَسَبَتْ أَيْدِي النَّاسِ لِيُذِيقَهُم بَعْضَ الَّذِي عَمِلُوا لَعَلَّهُمْ يَرْجِعُونَ(41)

 మానవులు తమ చేజేతులా సంపాదించుకున్న దాని ఫలితంగా భూమిలో మరియు సముద్రంలో కల్లోలం వ్యాపించింది. ఇది వారిలో కొందరు చేసిన దుష్కర్మల ఫలితాన్ని రుచి చూపటానికి, బహుశా ఇలాగైనా వారు (అల్లాహ్ వైపునకు) మరలుతారేమోనని

قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلُ ۚ كَانَ أَكْثَرُهُم مُّشْرِكِينَ(42)

 వారితో ఇలా అను: భూమిలో ప్రయాణం చేసి చూడండి, మీకు పూర్వం గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో! వారిలో చాలా మంది బహుదైవారాధకు లుండిరి

فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ الْقَيِّمِ مِن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُ مِنَ اللَّهِ ۖ يَوْمَئِذٍ يَصَّدَّعُونَ(43)

 కావున నీవు నీ ముఖాన్ని సరైన ధర్మం (ఇస్లాం) వైపునకే స్థిరంగా నిలుపు - అల్లాహ్ తరఫు నుండి - ఆ రోజు రాకముందే దేనినైతే ఎవ్వడూ తొలగించలేడో! ఆ రోజు వారు పరస్పరం చెదిరిపోయి వేరవుతారు

مَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُ ۖ وَمَنْ عَمِلَ صَالِحًا فَلِأَنفُسِهِمْ يَمْهَدُونَ(44)

 సత్యాన్ని తిరస్కరించినవాడు, తన తిరస్కార ఫలితాన్ని అనుభవిస్తాడు. మరియు సత్కార్యాలు చేసిన వారు, తమ కొరకే (సాఫల్యమార్గాన్ని) తయారు చేసుకుంటారు

لِيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِن فَضْلِهِ ۚ إِنَّهُ لَا يُحِبُّ الْكَافِرِينَ(45)

 ఇది ఆయన (అల్లాహ్), తన అనుగ్రహంతో విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ప్రతిఫల మివ్వటానికి. నిశ్చయంగా, ఆయన సత్యతిరస్కారులను ప్రేమించడు

وَمِنْ آيَاتِهِ أَن يُرْسِلَ الرِّيَاحَ مُبَشِّرَاتٍ وَلِيُذِيقَكُم مِّن رَّحْمَتِهِ وَلِتَجْرِيَ الْفُلْكُ بِأَمْرِهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ(46)

 ఇక ఆయన సూచనలలో ఆయన గాలులను శుభవార్తలిచ్చేవిగా పంపి మీకు తన కారుణ్యాన్ని రుచి చూపటం మరియు ఆయన ఆజ్ఞతో ఓడలను నడిపి, మిమ్మల్ని ఆయన అనుగ్రహాన్ని అన్వేషించనివ్వటం కూడా ఉన్నాయి. ఇవన్నీ, బహుశా మీరు కృతజ్ఞతలు చూపుతారేమోనని

وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَاءُوهُم بِالْبَيِّنَاتِ فَانتَقَمْنَا مِنَ الَّذِينَ أَجْرَمُوا ۖ وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ الْمُؤْمِنِينَ(47)

 మరియు వాస్తవానికి మేము నీకు పూర్వం కూడా, సందేశహరులను తమ తమ జాతి వారి వద్దకు పంపాము. వారు, వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకొని వచ్చారు. ఆ తరువాత కూడా నేరం చేసిన వారికి తగిన ప్రతీకారం చేశాము. మరియు విశ్వాసులకు సహాయం చేయటం మా కర్తవ్యం

اللَّهُ الَّذِي يُرْسِلُ الرِّيَاحَ فَتُثِيرُ سَحَابًا فَيَبْسُطُهُ فِي السَّمَاءِ كَيْفَ يَشَاءُ وَيَجْعَلُهُ كِسَفًا فَتَرَى الْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَالِهِ ۖ فَإِذَا أَصَابَ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ(48)

 అల్లాహ్ యే గాలులను పంపేవాడు, కావున అవి మేఘాలను పైకి ఎత్తుతాయి, ఆ తరువాత ఆయన వాటిని తాను కోరినట్లు ఆకాశంలో వ్యాపింపజేస్తాడు. మరియు వాటిని ముక్కలు ముక్కలుగా చేసి, తరువాత వాటి మధ్య నుండి వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన దానిని తన దాసులలో తాను కోరిన వారిపై కురిపించగా వారు సంతోషపడతారు

وَإِن كَانُوا مِن قَبْلِ أَن يُنَزَّلَ عَلَيْهِم مِّن قَبْلِهِ لَمُبْلِسِينَ(49)

 మరియు వాస్తవానికి, అది (వర్షం) కురవక ముందు వారు ఎంతో నిరాశ చెంది ఉండేవారు

فَانظُرْ إِلَىٰ آثَارِ رَحْمَتِ اللَّهِ كَيْفَ يُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ ذَٰلِكَ لَمُحْيِي الْمَوْتَىٰ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ(50)

 కావున (ఓ మానవుడా!) అల్లాహ్ కారుణ్య చిహ్నాలను చూడు: ఆయన నిర్జీవంగా ఉన్న భూమిలో ఏ విధంగా ప్రాణం పోస్తాడో! నిశ్చయంగా, ఇదే విధంగా ఆయన (మరణానంతరం) మృతులకు కూడా ప్రాణం పోస్తాడు! మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు

وَلَئِنْ أَرْسَلْنَا رِيحًا فَرَأَوْهُ مُصْفَرًّا لَّظَلُّوا مِن بَعْدِهِ يَكْفُرُونَ(51)

 మరియు మేము గాలిని పంపితే, దాని నుండి వారి పంటలను పసుపు పచ్చగా మారి పోవటాన్ని చూసిన తరువాత వారు కృతఘ్నతకు లోనవుతారు (సత్యతిరస్కారులవుతారు)

فَإِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَىٰ وَلَا تُسْمِعُ الصُّمَّ الدُّعَاءَ إِذَا وَلَّوْا مُدْبِرِينَ(52)

 నిశ్చయంగా, నీవు (ఓ ముహమ్మద్!) మృతులకు వినిపించలేవు. మరియు నీవు వెనుదిరిగి పోయే చెవిటివారికి కూడా సందేశాన్ని వినిపించలేవు

وَمَا أَنتَ بِهَادِ الْعُمْيِ عَن ضَلَالَتِهِمْ ۖ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِآيَاتِنَا فَهُم مُّسْلِمُونَ(53)

 మరియు నీవు అంధులను, వారి మార్గభ్రష్టత్వం నుండి తప్పించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. నీవు కేవలం విశ్వసించి, అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మాత్రమే మా సూచనలు వినిపించగలవు

۞ اللَّهُ الَّذِي خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِن بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِن بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۖ وَهُوَ الْعَلِيمُ الْقَدِيرُ(54)

 అల్లాహ్ యే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించిన వాడు. మళ్ళీ ఆ బలహీన స్థితి తరువాత మీకు బలాన్ని ఇచ్చాడు. ఆ బలం తరువాత మళ్ళీ మిమ్మల్ని బలహీనులుగా, ముసలివారిగా చేశాడు. ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. మరియు కేవలం ఆయనే సర్వజ్ఞుడు, సర్వసమర్ధుడు

وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُقْسِمُ الْمُجْرِمُونَ مَا لَبِثُوا غَيْرَ سَاعَةٍ ۚ كَذَٰلِكَ كَانُوا يُؤْفَكُونَ(55)

 మరియు ఆ ఘడియ సంభవించిన రోజు, అపరాధులు, ప్రమాణం చేస్తూ: మేము ఒక ఘడియ సేపు కంటే ఎక్కువ కాలం (ప్రపంచంలో) ఉండలేదు" అని అంటారు. ఇదే విధంగా వారు (ప్రాపంచిక జీవితంలో) భ్రమలో ఉండేవారు

وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ وَالْإِيمَانَ لَقَدْ لَبِثْتُمْ فِي كِتَابِ اللَّهِ إِلَىٰ يَوْمِ الْبَعْثِ ۖ فَهَٰذَا يَوْمُ الْبَعْثِ وَلَٰكِنَّكُمْ كُنتُمْ لَا تَعْلَمُونَ(56)

 మరియు జ్ఞానం మరియు విశ్వాసం అనుగ్రహింప బడినవారు ఇలా అంటారు: వాస్తవానికి అల్లాహ్ మూలగ్రంథం ప్రకారం మీరు పునరుత్థాన దినం వరకు (ఇహలోకంలో) ఉంటిరి. ఇక ఇదే ఆ పునరుత్థాన దినం, కాని నిశ్చయంగా! మీరిది తెలుసు కోలేక పోయారు

فَيَوْمَئِذٍ لَّا يَنفَعُ الَّذِينَ ظَلَمُوا مَعْذِرَتُهُمْ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ(57)

 కనుక ఆ రోజు దుర్మార్గులకు, వారి సాకులు ఏ మాత్రం ప్రయోజనకరం కావు మరియు వారికి తమను తాము సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వబడదు

وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِن كُلِّ مَثَلٍ ۚ وَلَئِن جِئْتَهُم بِآيَةٍ لَّيَقُولَنَّ الَّذِينَ كَفَرُوا إِنْ أَنتُمْ إِلَّا مُبْطِلُونَ(58)

 మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజలకు, ప్రతి ఒక్క విషయపు ఉపమానాన్ని బోధించాము. అయినా నీవు వారి వద్దకు ఏ అద్భుత సూచన (ఆయత్) తెచ్చినా, వారిలో సత్యతిరస్కారులైన వారు ఇలా అంటారు: మీరు కేవలం బూటకాలే పలుకుతున్నారు

كَذَٰلِكَ يَطْبَعُ اللَّهُ عَلَىٰ قُلُوبِ الَّذِينَ لَا يَعْلَمُونَ(59)

 ఈ విధంగా, అల్లాహ్ జ్ఞానహీనుల హృదయాల మీద ముద్ర వేస్తాడు

فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۖ وَلَا يَسْتَخِفَّنَّكَ الَّذِينَ لَا يُوقِنُونَ(60)

 కావున నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం! కావున విశ్వాసహీనులు నిన్ను వ్యాకుల పరచరాదు సుమా


More surahs in Telugu:


Al-Baqarah Al-'Imran An-Nisa'
Al-Ma'idah Yusuf Ibrahim
Al-Hijr Al-Kahf Maryam
Al-Hajj Al-Qasas Al-'Ankabut
As-Sajdah Ya Sin Ad-Dukhan
Al-Fath Al-Hujurat Qaf
An-Najm Ar-Rahman Al-Waqi'ah
Al-Hashr Al-Mulk Al-Haqqah
Al-Inshiqaq Al-A'la Al-Ghashiyah

Download surah Ar-Rum with the voice of the most famous Quran reciters :

surah Ar-Rum mp3 : choose the reciter to listen and download the chapter Ar-Rum Complete with high quality
surah Ar-Rum Ahmed El Agamy
Ahmed Al Ajmy
surah Ar-Rum Bandar Balila
Bandar Balila
surah Ar-Rum Khalid Al Jalil
Khalid Al Jalil
surah Ar-Rum Saad Al Ghamdi
Saad Al Ghamdi
surah Ar-Rum Saud Al Shuraim
Saud Al Shuraim
surah Ar-Rum Abdul Basit Abdul Samad
Abdul Basit
surah Ar-Rum Abdul Rashid Sufi
Abdul Rashid Sufi
surah Ar-Rum Abdullah Basfar
Abdullah Basfar
surah Ar-Rum Abdullah Awwad Al Juhani
Abdullah Al Juhani
surah Ar-Rum Fares Abbad
Fares Abbad
surah Ar-Rum Maher Al Muaiqly
Maher Al Muaiqly
surah Ar-Rum Muhammad Siddiq Al Minshawi
Al Minshawi
surah Ar-Rum Al Hosary
Al Hosary
surah Ar-Rum Al-afasi
Mishari Al-afasi
surah Ar-Rum Yasser Al Dosari
Yasser Al Dosari


Wednesday, January 22, 2025

لا تنسنا من دعوة صالحة بظهر الغيب