📖 0/604 చదివిన పేజీలు
📄 96
وَٱسۡتَغۡفِرِ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا  ۝١٠٦ وَلَا تُجَٰدِلۡ عَنِ ٱلَّذِينَ يَخۡتَانُونَ أَنفُسَهُمۡۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ مَن كَانَ خَوَّانًا أَثِيمًا  ۝١٠٧ يَسۡتَخۡفُونَ مِنَ ٱلنَّاسِ وَلَا يَسۡتَخۡفُونَ مِنَ ٱللَّهِ وَهُوَ مَعَهُمۡ إِذۡ يُبَيِّتُونَ مَا لَا يَرۡضَىٰ مِنَ ٱلۡقَوۡلِۚ وَكَانَ ٱللَّهُ بِمَا يَعۡمَلُونَ مُحِيطًا  ۝١٠٨ هَٰٓأَنتُمۡ هَٰٓؤُلَآءِ جَٰدَلۡتُمۡ عَنۡهُمۡ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا فَمَن يُجَٰدِلُ ٱللَّهَ عَنۡهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ أَم مَّن يَكُونُ عَلَيۡهِمۡ وَكِيلًا  ۝١٠٩ وَمَن يَعۡمَلۡ سُوٓءًا أَوۡ يَظۡلِمۡ نَفۡسَهُۥ ثُمَّ يَسۡتَغۡفِرِ ٱللَّهَ يَجِدِ ٱللَّهَ غَفُورًا رَّحِيمًا  ۝١١٠ وَمَن يَكۡسِبۡ إِثۡمًا فَإِنَّمَا يَكۡسِبُهُۥ عَلَىٰ نَفۡسِهِۦۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًا  ۝١١١ وَمَن يَكۡسِبۡ خَطِيٓـَٔةً أَوۡ إِثۡمًا ثُمَّ يَرۡمِ بِهِۦ بَرِيٓـًٔا فَقَدِ ٱحۡتَمَلَ بُهۡتَٰنًا وَإِثۡمًا مُّبِينًا  ۝١١٢ وَلَوۡلَا فَضۡلُ ٱللَّهِ عَلَيۡكَ وَرَحۡمَتُهُۥ لَهَمَّت طَّآئِفَةٌ مِّنۡهُمۡ أَن يُضِلُّوكَ وَمَا يُضِلُّونَ إِلَّآ أَنفُسَهُمۡۖ وَمَا يَضُرُّونَكَ مِن شَيۡءٍۚ وَأَنزَلَ ٱللَّهُ عَلَيۡكَ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَعَلَّمَكَ مَا لَمۡ تَكُن تَعۡلَمُۚ وَكَانَ فَضۡلُ ٱللَّهِ عَلَيۡكَ عَظِيمًا  ۝١١٣
4:106
وَٱسۡتَغۡفِرِ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا  ۝١٠٦
మరియు అల్లాహ్ ను క్షమాభిక్ష కొరకు ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
4:107
وَلَا تُجَٰدِلۡ عَنِ ٱلَّذِينَ يَخۡتَانُونَ أَنفُسَهُمۡۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ مَن كَانَ خَوَّانًا أَثِيمًا  ۝١٠٧
మరియు ఆత్మద్రోహం చేసుకునే వారి పక్షమున నీవు వాదించకు. నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసఘాతకుణ్ణి, పాపిని ప్రేమించడు
4:108
يَسۡتَخۡفُونَ مِنَ ٱلنَّاسِ وَلَا يَسۡتَخۡفُونَ مِنَ ٱللَّهِ وَهُوَ مَعَهُمۡ إِذۡ يُبَيِّتُونَ مَا لَا يَرۡضَىٰ مِنَ ٱلۡقَوۡلِۚ وَكَانَ ٱللَّهُ بِمَا يَعۡمَلُونَ مُحِيطًا  ۝١٠٨
వారు (తమ దుష్కర్మలను) మానవుల నుండి దాచగలరు, కాని అల్లాహ్ నుండి దాచలేరు. ఎందుకంటే ఆయన (అల్లాహ్) కు సమ్మతం లేని విషయాలను గురించి వారు రాత్రులలో రహస్య సమాలోచనలను చేసేటపుడు కూడా ఆయన వారితో ఉంటాడు. మరియు వారి సకల చర్యలను అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు
4:109
هَٰٓأَنتُمۡ هَٰٓؤُلَآءِ جَٰدَلۡتُمۡ عَنۡهُمۡ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا فَمَن يُجَٰدِلُ ٱللَّهَ عَنۡهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ أَم مَّن يَكُونُ عَلَيۡهِمۡ وَكِيلًا  ۝١٠٩
అవును, మీరే! వారి (ఈ అపరాధుల) పక్షమున ఇహలోక జీవితంలోనైతే వాదించారు. అయితే! తీర్పుదినమున వారి పక్షమున అల్లాహ్ తో ఎవడు వాదించగలడు? లేదా వారికి ఎవడు రక్షకుడు కాగలడు
4:110
وَمَن يَعۡمَلۡ سُوٓءًا أَوۡ يَظۡلِمۡ نَفۡسَهُۥ ثُمَّ يَسۡتَغۡفِرِ ٱللَّهَ يَجِدِ ٱللَّهَ غَفُورًا رَّحِيمًا  ۝١١٠
మరియు పాపం చేసినవాడు, లేదా తనకు తాను అన్యాయం చేసుకున్నవాడు, తరువాత అల్లాహ్ ను క్షమాభిక్షకై వేడుకుంటే అలాంటి వాడు, అల్లాహ్ ను క్షమాశీలుడుగా, అపార కరుణా ప్రదాతగా పొందగలడు
4:111
وَمَن يَكۡسِبۡ إِثۡمًا فَإِنَّمَا يَكۡسِبُهُۥ عَلَىٰ نَفۡسِهِۦۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًا  ۝١١١
కాని ఎవడైనా పాపాన్ని అర్జిస్తే, దాని (ఫలితం) అతడే స్వయంగా భరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు
4:112
وَمَن يَكۡسِبۡ خَطِيٓـَٔةً أَوۡ إِثۡمًا ثُمَّ يَرۡمِ بِهِۦ بَرِيٓـًٔا فَقَدِ ٱحۡتَمَلَ بُهۡتَٰنًا وَإِثۡمًا مُّبِينًا  ۝١١٢
మరియు ఎవడు అపరాధం గానీ, లేదా పాపం గానీ చేసి, తరువాత దానిని ఒక అమాయకునిపై మోపుతాడో! వాస్తవానికి, అలాంటి వాడు తీవ్రమైన అపనిందను మరియు ఘోర పాపాన్ని తన మీద మోపుకున్నవాడే
4:113
وَلَوۡلَا فَضۡلُ ٱللَّهِ عَلَيۡكَ وَرَحۡمَتُهُۥ لَهَمَّت طَّآئِفَةٌ مِّنۡهُمۡ أَن يُضِلُّوكَ وَمَا يُضِلُّونَ إِلَّآ أَنفُسَهُمۡۖ وَمَا يَضُرُّونَكَ مِن شَيۡءٍۚ وَأَنزَلَ ٱللَّهُ عَلَيۡكَ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَعَلَّمَكَ مَا لَمۡ تَكُن تَعۡلَمُۚ وَكَانَ فَضۡلُ ٱللَّهِ عَلَيۡكَ عَظِيمًا  ۝١١٣
మరియు (ఓ ప్రవక్తా!) అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యమే నీపై లేకుంటే, వారిలోని ఒక వర్గం వారు నిన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయగోరారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు వారు నీ కెలాంటి హానీ చేయలేరు. మరియు అల్లాహ్ నీ పై ఈ గ్రంథాన్ని మరియు వివేకాన్ని అవతరింపజేశాడు. మరియు నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. మరియు నీ పై ఉన్న అల్లాహ్ అనుగ్రహం చాలా గొప్పది


📚 5 📄96 / 604



M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
0:00
0:00
-

పవిత్ర ఖురాన్


Tuesday, October 6, 2026

Don't forget us in your sincere prayers