La sourate An-Naziat en Telugu
(అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసే వారి (దేవదూతల) సాక్షిగా |
(విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవదూతల) సాక్షిగా |
(విశ్వంలో) తేలియాడుతూ పోయే వారి సాక్షిగా |
మరియు పందెంలో వలే (ఒకరితో నొకరు) పోటీ పడే వారి సాక్షిగా |
మరియు (తమ ప్రభువు) ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించేవారి (దేవదూతల) సాక్షిగా |
ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది |
దాని తర్వాత రెండవ సారి బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు) |
ఆ రోజు (కొన్ని) హృదయాలు (భయంతో) దడదడలాడుతూ ఉంటాయి |
వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి |
వారు ఇలా అంటున్నారు: ఏమీ? మనం మన పూర్వ స్థితిలోకి మళ్ళీ తీసుకు రాబడతామా |
మనం శిథిలమైన ఎముకలుగా మారి పోయిన తరువాత కూడానా |
వారు (ఇంకా ఇలా) అంటారు: అయితే ఈ తిరిగి రావటమనేది చాల నష్టదాయకమైనదే |
కాని అది వాస్తవానికి, ఒకే ఒక (తీవ్రమైన) ధ్వని |
అప్పుడు వారందరూ, ఒకేసారి లేచి మైదానంలోకి వచ్చి ఉంటారు |
ఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా |
అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు |
(ఇలా అన్నాడు): ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు |
ఇక (అతనితో) ఇట్లను: `ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా |
మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా |
తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు |
కాని అతడు (ఫిర్ఔన్) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు |
ఆ తర్వాత అతడు (ఫిర్ఔన్) వెనక్కి మరలి పోయి, (కుట్రలు) పన్నసాగాడు |
పిదప (ప్రజలను) సమావేశపరచి, ఎలుగెత్తి చాటుతూ |
ఇలా అన్నాడు: నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును |
కావున అల్లాహ్ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురి చేశాడు |
నిశ్చయంగా, ఇందులో (అల్లాహ్ కు) భయపడే ప్రతి వ్యక్తి కొరకు గుణపాఠముంది |
ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠినమయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది |
ఆయన దాని కప్పు (ఎత్తు)ను చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు |
మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు |
మరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు |
దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు |
మరియు పర్వతాలను (దానిలో) స్థిరంగా నాటాడు |
మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా |
ఇక ఆ గొప్ప దుర్ఘటన (పునరుత్థాన దినం) వచ్చినప్పుడు |
ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు |
మరియు చూసే వారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది |
ఇక ధిక్కారంతో హద్దులు మీరి ప్రవర్తించిన వాడికి |
మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చిన వాడికి |
నిశ్చయంగా, నరకాగ్నియే, వాని నివాస స్థానమవుతుంది |
وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ(40) మరియు తన ప్రభువు ముందు నిలబడ వలసి వుంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి |
నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థానమవుతుంది |
(ఓ ముహమ్మద్!) వీరు నిన్ను - ఆ ఘడియను గురించి: అసలు అది ఎప్పుడొస్తుంది?" అని అడుగుతున్నారు |
దాని గురించి చెప్పడానికి దాంతో నీకేమి సంబంధం |
దాని వాస్తవ జ్ఞానం నీ ప్రభువుకే ఉంది |
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు, దానికి భయపడే వారిని హెచ్చరించే వాడవు మాత్రమే |
كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوا إِلَّا عَشِيَّةً أَوْ ضُحَاهَا(46) వారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate An-Naziat : choisissez le récitateur pour écouter et télécharger la sourate An-Naziat complète en haute qualité.















Donnez-nous une invitation valide