Surah Al-Qasas with Telugu

  1. Surah mp3
  2. More
  3. Telugu
The Holy Quran | Quran translation | Language Telugu | Surah Qasas | القصص - Ayat Count 88 - The number of the surah in moshaf: 28 - The meaning of the surah in English: The Stories.

طسم(1)

 తా-సీన్-మీమ్

تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ(2)

 ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయాత్)

نَتْلُو عَلَيْكَ مِن نَّبَإِ مُوسَىٰ وَفِرْعَوْنَ بِالْحَقِّ لِقَوْمٍ يُؤْمِنُونَ(3)

 విశ్వసించే ప్రజల కొరకు, మేము మూసా మరియు ఫిర్ఔన్ ల యొక్క నిజ వృత్తాంతాన్ని నీకు వినిపిస్తున్నాము

إِنَّ فِرْعَوْنَ عَلَا فِي الْأَرْضِ وَجَعَلَ أَهْلَهَا شِيَعًا يَسْتَضْعِفُ طَائِفَةً مِّنْهُمْ يُذَبِّحُ أَبْنَاءَهُمْ وَيَسْتَحْيِي نِسَاءَهُمْ ۚ إِنَّهُ كَانَ مِنَ الْمُفْسِدِينَ(4)

 నిశ్చయంగా, ఫిర్ఔన్ భూమి మీద అహంకారంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. మరియు అందులోని ప్రజలను వర్గాలుగా విభజించి, వారిలోని ఒక తెగ వారిని నీచపరచి వారి పుత్రులను వధిస్తూ ఉండేవాడు మరియు వారి స్త్రీలను బ్రతకనిచ్చేవాడు. నిశ్చయంగా, అతడు దౌర్జన్యపరులలోని వాడిగా ఉండేవాడు

وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى الَّذِينَ اسْتُضْعِفُوا فِي الْأَرْضِ وَنَجْعَلَهُمْ أَئِمَّةً وَنَجْعَلَهُمُ الْوَارِثِينَ(5)

 మరియు భూమి మీద అణచి వేయబడిన వారిని కనికరించాలని మరియు వారిని నాయకులుగా చేయాలని మరియు వారిని వారసులుగా చేయాలని మేము కోరాము

وَنُمَكِّنَ لَهُمْ فِي الْأَرْضِ وَنُرِيَ فِرْعَوْنَ وَهَامَانَ وَجُنُودَهُمَا مِنْهُم مَّا كَانُوا يَحْذَرُونَ(6)

 మరియు (ఇస్రాయీల్ సంతతి) వారికి భూమిలో అధికారం ఒసంగాలనీ మరియు ఫిర్ఔన్, హామాన్ మరియు వారి సైనికులకు - దేనిని గురించైతే (ఫిర్ఔన్ జాతి) వారు భయపడుతూ ఉండేవారో - అదే వారికి చూపాలని

وَأَوْحَيْنَا إِلَىٰ أُمِّ مُوسَىٰ أَنْ أَرْضِعِيهِ ۖ فَإِذَا خِفْتِ عَلَيْهِ فَأَلْقِيهِ فِي الْيَمِّ وَلَا تَخَافِي وَلَا تَحْزَنِي ۖ إِنَّا رَادُّوهُ إِلَيْكِ وَجَاعِلُوهُ مِنَ الْمُرْسَلِينَ(7)

 మేము మూసా తల్లి మనస్సులో ఇలా సూచించాము: నీవు అతనికి (మూసాకు) పాలు ఇస్తూ ఉండు. కాని అతనికి ప్రమాదమున్నదని, నీవు భావిస్తే అతనిని నదిలో విడిచి పెట్టు. మరియు నీవు భయపడకు మరియు దుఃఖించకు; నిశ్చయంగా మేము అతనిని నీ వద్దకు తిరిగి చేర్చుతాము. మరియు అతనిని (మా) సందేశహరులలో ఒకనిగా చేస్తాము

فَالْتَقَطَهُ آلُ فِرْعَوْنَ لِيَكُونَ لَهُمْ عَدُوًّا وَحَزَنًا ۗ إِنَّ فِرْعَوْنَ وَهَامَانَ وَجُنُودَهُمَا كَانُوا خَاطِئِينَ(8)

 తరువాత ఫిర్ఔన్ కుటుంబంవారు - తమకు శత్రువై, దుఃఖకారణుడవటానికి - అతనిని ఎత్తుకున్నారు. నిశ్చయంగా ఫిర్ఔన్, హామాన్ మరియు వారి సైనికులు పాపిష్ఠులు

وَقَالَتِ امْرَأَتُ فِرْعَوْنَ قُرَّتُ عَيْنٍ لِّي وَلَكَ ۖ لَا تَقْتُلُوهُ عَسَىٰ أَن يَنفَعَنَا أَوْ نَتَّخِذَهُ وَلَدًا وَهُمْ لَا يَشْعُرُونَ(9)

 మరియు ఫిర్ఔన్ భార్య (అతనితో) ఇలా అన్నది: ఇతను నీకూ మరియు నాకూ కంటి చలువ! ఇతనిని చంపకు, బహుశా ఇతడు మనకు ఉపయోగకారి కావచ్చు! లేదా మనం ఇతనిని కుమారునిగా చేసుకోవచ్చు!" కాని వారు (వాస్తవాన్ని) తెలుసుకోలేక పోయారు

وَأَصْبَحَ فُؤَادُ أُمِّ مُوسَىٰ فَارِغًا ۖ إِن كَادَتْ لَتُبْدِي بِهِ لَوْلَا أَن رَّبَطْنَا عَلَىٰ قَلْبِهَا لِتَكُونَ مِنَ الْمُؤْمِنِينَ(10)

 మరియు మూసా తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఆమె విశ్వసించినవారిలో ఉండటానికి మేము, ఆమె హృదయాన్ని దృఢపరచి ఉండకపోతే, ఆమె అతనిని (మూసాను) గురించి అంతా బట్టబయలు చేసి ఉండేది

وَقَالَتْ لِأُخْتِهِ قُصِّيهِ ۖ فَبَصُرَتْ بِهِ عَن جُنُبٍ وَهُمْ لَا يَشْعُرُونَ(11)

 ఆమె, అతని (మూసా) సోదరితో అన్నది: అతని వెంట వెళ్ళు." కావున ఆమె దూరం నుండియే అతనిని గమనించసాగింది. కానీ, వారది గ్రహించలేక పోయారు

۞ وَحَرَّمْنَا عَلَيْهِ الْمَرَاضِعَ مِن قَبْلُ فَقَالَتْ هَلْ أَدُلُّكُمْ عَلَىٰ أَهْلِ بَيْتٍ يَكْفُلُونَهُ لَكُمْ وَهُمْ لَهُ نَاصِحُونَ(12)

 మరియు మేము అతనిని (ఇతరుల) పాలు త్రాగకుండా మొదటనే నిషేధించి ఉన్నాము. (అతని సోదరి) వారితో అన్నది: మీ కొరకు అతనిని (పాలిచ్చి) పోషించగల ఒక కుటుంబం వారిని నేను మీకు చూపనా? మరియు వారు అతనిని మంచిగా చూసుకునే వారై ఉంటారు

فَرَدَدْنَاهُ إِلَىٰ أُمِّهِ كَيْ تَقَرَّ عَيْنُهَا وَلَا تَحْزَنَ وَلِتَعْلَمَ أَنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ(13)

 ఈ విధంగా మేము అతనిని (మూసాను) - అతని తల్లి కళ్ళు చల్లబడటానికి, ఆమె దుఃఖించకుండా ఉండటానికి మరియు అల్లాహ్ వాగ్దానం సత్యమైనదని ఆమె తెలుసుకోవటానికి - తిరిగి ఆమె వద్దకు చేర్చాము. కాని వాస్తవానికి చాలా మందికి ఇది తెలియదు

وَلَمَّا بَلَغَ أَشُدَّهُ وَاسْتَوَىٰ آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ(14)

 మరియు అతను (మూసా) యుక్తవయస్సుకు చేరి పరిపూర్ణుడు అయినప్పుడు, మేము అతనికి వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు ఈ విధంగా, మేము సజ్జనులకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము

وَدَخَلَ الْمَدِينَةَ عَلَىٰ حِينِ غَفْلَةٍ مِّنْ أَهْلِهَا فَوَجَدَ فِيهَا رَجُلَيْنِ يَقْتَتِلَانِ هَٰذَا مِن شِيعَتِهِ وَهَٰذَا مِنْ عَدُوِّهِ ۖ فَاسْتَغَاثَهُ الَّذِي مِن شِيعَتِهِ عَلَى الَّذِي مِنْ عَدُوِّهِ فَوَكَزَهُ مُوسَىٰ فَقَضَىٰ عَلَيْهِ ۖ قَالَ هَٰذَا مِنْ عَمَلِ الشَّيْطَانِ ۖ إِنَّهُ عَدُوٌّ مُّضِلٌّ مُّبِينٌ(15)

 మరియు (ఒకరోజు) నగరవాసులు ఏమరుపాటులో ఉన్నప్పుడు, అతను నగరంలోకి ప్రవేశించాడు, అతను ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడం చూశాడు, వారిలో ఒకడు అతని జాతికి చెందినవాడు, మరొకడు విరోధి జాతికి చెందినవాడు. అతని జాతికి చెందిన వాడు, విరోధి జాతివానికి వ్యతిరేకంగా సహాయపడమని అతనిని (మూసాను) అర్థించాడు. మూసా అతడిని ఒక గుద్దుగుద్దాడు. అది అతడిని అంతమొందించింది. (అప్పుడు) అతను (మూసా) అన్నాడు: ఇది షైతాన్ పనే! నిశ్చయంగా, అతడు శత్రువు మరియు స్పష్టంగా దారి తప్పించేవాడు

قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي فَغَفَرَ لَهُ ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ(16)

 (మూసా) ఇలా ప్రార్థించాడు: ఓ నా ప్రభూ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. కావున నన్ను క్షమించు!" (అల్లాహ్) అతనిని క్షమించాడు. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

قَالَ رَبِّ بِمَا أَنْعَمْتَ عَلَيَّ فَلَنْ أَكُونَ ظَهِيرًا لِّلْمُجْرِمِينَ(17)

 (మూసా) అన్నాడు: ఓ నా ప్రభూ! నీవు నాకు మహోపకారం చేశావు. కావున నేను ఇక ఎన్నటికీ నేరస్తులకు సహాయపడను

فَأَصْبَحَ فِي الْمَدِينَةِ خَائِفًا يَتَرَقَّبُ فَإِذَا الَّذِي اسْتَنصَرَهُ بِالْأَمْسِ يَسْتَصْرِخُهُ ۚ قَالَ لَهُ مُوسَىٰ إِنَّكَ لَغَوِيٌّ مُّبِينٌ(18)

 మరుసటి రోజు ఉదయం అతను (మూసా) భయపడుతూ అతని జాగ్రత్తగా (ఇటూ అటూ చూస్తూ) నగరంలోకి వెళ్ళాడు. అప్పుడు అకస్మాత్తుగా అంతకు ముందు రోజు, అతనిని సహాయానికి పిలిచినవాడే, మళ్ళీ సహాయానికై అరవసాగాడు. మూసా వానితో అన్నాడు: నిశ్చయంగా, నీవు స్పష్టమైన తప్పు దారికి లాగేవాడవు

فَلَمَّا أَنْ أَرَادَ أَن يَبْطِشَ بِالَّذِي هُوَ عَدُوٌّ لَّهُمَا قَالَ يَا مُوسَىٰ أَتُرِيدُ أَن تَقْتُلَنِي كَمَا قَتَلْتَ نَفْسًا بِالْأَمْسِ ۖ إِن تُرِيدُ إِلَّا أَن تَكُونَ جَبَّارًا فِي الْأَرْضِ وَمَا تُرِيدُ أَن تَكُونَ مِنَ الْمُصْلِحِينَ(19)

 ఆ తరువాత అతను తమ ఇద్దరికీ విరోధి అయిన వాడిని గట్టిగా పట్టుకోబోగా, అతడు అరిచాడు: ఓ మూసా! ఏమీ? నీవు నిన్న ఒక వ్యక్తిని చంపినట్లు నన్ను కూడా చంపదలచుకున్నావా? నీవు ఈ దేశంలో క్రూరునిగా మారి ఉండదలుచుకున్నావా? సద్వర్తనునిగా ఉండదలుచుకోలేదా

وَجَاءَ رَجُلٌ مِّنْ أَقْصَى الْمَدِينَةِ يَسْعَىٰ قَالَ يَا مُوسَىٰ إِنَّ الْمَلَأَ يَأْتَمِرُونَ بِكَ لِيَقْتُلُوكَ فَاخْرُجْ إِنِّي لَكَ مِنَ النَّاصِحِينَ(20)

 మరియు ఒక వ్యక్తి నగరపు ఒక వైపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: ఓ మూసా! నాయకులందరూ కలిసి నిన్ను హత్య చేయాలని సంప్రదింపులు చేస్తున్నారు. కావున నీవు వెళ్ళిపో, నేను నిశ్చయంగా, నీ శ్రేయోభిలాషిని

فَخَرَجَ مِنْهَا خَائِفًا يَتَرَقَّبُ ۖ قَالَ رَبِّ نَجِّنِي مِنَ الْقَوْمِ الظَّالِمِينَ(21)

 అప్పుడతను భయపడుతూ, అతి జాగ్రత్తగా అక్కడి నుండి బయలు దేరాడు. అతను ఇలా ప్రార్థించాడు: ఓ నా ప్రభూ! నన్ను దుర్మార్గుల నుండి కాపాడు

وَلَمَّا تَوَجَّهَ تِلْقَاءَ مَدْيَنَ قَالَ عَسَىٰ رَبِّي أَن يَهْدِيَنِي سَوَاءَ السَّبِيلِ(22)

 ఆ తరువాత మద్ యన్ వైపుకు బయలు దేరుతూ, ఇలా అనుకున్నాడు: బహుశా, నా ప్రభువు నాకు సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తున్నాడు

وَلَمَّا وَرَدَ مَاءَ مَدْيَنَ وَجَدَ عَلَيْهِ أُمَّةً مِّنَ النَّاسِ يَسْقُونَ وَوَجَدَ مِن دُونِهِمُ امْرَأَتَيْنِ تَذُودَانِ ۖ قَالَ مَا خَطْبُكُمَا ۖ قَالَتَا لَا نَسْقِي حَتَّىٰ يُصْدِرَ الرِّعَاءُ ۖ وَأَبُونَا شَيْخٌ كَبِيرٌ(23)

 ఇత అతను మద్ యన్ లోని ఒక బావి వద్దకు చేరుకున్నప్పుడు; అక్కడ చాలా మంది ప్రజలు, తమ తమ పశువులకు నీరు త్రాగించటాన్ని మరియు వారికి దూరంగా ఒక ప్రక్కన ఇద్దరు స్త్రీలు తమ పశువులను ఆపుతూ ఉండటాన్ని చూశాడు. (మూసా) ఆ స్త్రీలను అడిగాడు: మీరిద్దరి చిక్కు ఏమిటి?" వారిద్దరన్నారు: ఈ పశువుల కాపరులంతా పోయే వరకు మేము (మా పశువులకు) నీరు త్రాపలేము. మరియు మా తండ్రి చాలా వృద్ధుడు

فَسَقَىٰ لَهُمَا ثُمَّ تَوَلَّىٰ إِلَى الظِّلِّ فَقَالَ رَبِّ إِنِّي لِمَا أَنزَلْتَ إِلَيَّ مِنْ خَيْرٍ فَقِيرٌ(24)

 అప్పుడు అతను వారిద్దరి పశువులకు నీరు త్రాపాడు. తరువాత నీడలోకి పోయి ఇలా ప్రార్థించాడు: ఓ నా ప్రభూ! నీవు నాపై ఏ మేలును అవతరింపజేసినా, నేను దాని ఆవశ్యకత గలవాడనే

فَجَاءَتْهُ إِحْدَاهُمَا تَمْشِي عَلَى اسْتِحْيَاءٍ قَالَتْ إِنَّ أَبِي يَدْعُوكَ لِيَجْزِيَكَ أَجْرَ مَا سَقَيْتَ لَنَا ۚ فَلَمَّا جَاءَهُ وَقَصَّ عَلَيْهِ الْقَصَصَ قَالَ لَا تَخَفْ ۖ نَجَوْتَ مِنَ الْقَوْمِ الظَّالِمِينَ(25)

 తరువాత ఆ ఇద్దరిలో ఒకామె సిగ్గుపడుతూ మెల్లగా అతని వద్దకు వచ్చి ఇలా అన్నది: వాస్తవానికి నా తండ్రి - నీవు మా కొరకు (మా పశువులకు) నీరు త్రాపించి నందుకు - ప్రతిఫలమివ్వటానికి, నిన్ను పిలుస్తున్నాడు." అతను, అతని వద్దకు పోయి తన వృత్తాంతాన్ని వినిపించాడు. అప్పుడతను అన్నాడు: నీవు ఏ మాత్రం భయపడకు. నీవు దుర్మార్గ ప్రజల నుండి విముక్తి పొందావు

قَالَتْ إِحْدَاهُمَا يَا أَبَتِ اسْتَأْجِرْهُ ۖ إِنَّ خَيْرَ مَنِ اسْتَأْجَرْتَ الْقَوِيُّ الْأَمِينُ(26)

 వారిద్దరిలో ఒకామె ఇలా అన్నది: నాన్నా! ఇతనిని పని కొరకు పెట్టుకో. నిశ్చయంగా, ఇలాంటి బలవంతుని మరియు నమ్మదగిన వానిని పని కొరకు పెట్టుకోవటం ఎంతో మేలైనది

قَالَ إِنِّي أُرِيدُ أَنْ أُنكِحَكَ إِحْدَى ابْنَتَيَّ هَاتَيْنِ عَلَىٰ أَن تَأْجُرَنِي ثَمَانِيَ حِجَجٍ ۖ فَإِنْ أَتْمَمْتَ عَشْرًا فَمِنْ عِندِكَ ۖ وَمَا أُرِيدُ أَنْ أَشُقَّ عَلَيْكَ ۚ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ مِنَ الصَّالِحِينَ(27)

 (వారి తండ్రి) అన్నాడు: నీవు నా వద్ద ఎనిమిది సంవత్సరాలు పని చేస్తూ ఉండటానికి ఒప్పుకుంటే, నేను నా ఈ ఇద్దరు కుమార్తెలలో ఒకామెను నీకిచ్చి వివాహం చేయగోరుతున్నాను. నీవు ఒకవేళ పది సంవత్సరాలు పూర్తి చేయదలిస్తే అది నీ ఇష్టం! నేను నీకు కష్టం కలిగించ దలచుకోలేదు. అల్లాహ్ కోరితే, నీవు నన్ను సద్వర్తనునిగా పొందుతావు

قَالَ ذَٰلِكَ بَيْنِي وَبَيْنَكَ ۖ أَيَّمَا الْأَجَلَيْنِ قَضَيْتُ فَلَا عُدْوَانَ عَلَيَّ ۖ وَاللَّهُ عَلَىٰ مَا نَقُولُ وَكِيلٌ(28)

 (మూసా) అన్నాడు: ఈ విషయం నీకూ మరియు నాకూ మధ్య నిశ్చయమే! ఈ రెండు గడువులలో నేను దేనిని పూర్తి చేసినా, నా పై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. మరియు మన ఈ మాటలకు అల్లాహ్ యే సాక్షి

۞ فَلَمَّا قَضَىٰ مُوسَى الْأَجَلَ وَسَارَ بِأَهْلِهِ آنَسَ مِن جَانِبِ الطُّورِ نَارًا قَالَ لِأَهْلِهِ امْكُثُوا إِنِّي آنَسْتُ نَارًا لَّعَلِّي آتِيكُم مِّنْهَا بِخَبَرٍ أَوْ جَذْوَةٍ مِّنَ النَّارِ لَعَلَّكُمْ تَصْطَلُونَ(29)

 ఆ తరువాత మూసా తన గడువు పూర్తి చేసి, తన కుటుంబం వారిని తీసుకొని పోతుండగా, తూర్ పర్వతపు దిక్కులో ఒక మంటను చూశాడు. (అప్పుడు) తన ఇంటి వారితో అన్నాడు: ఆగండి! నేను ఒక మంటను చూశాను, బహుశా! నేను అక్కడి నుండి ఏదైనా మంచి వార్తను తీసుకొని రావచ్చు, లేదా ఒక అగ్ని కొరవినైనా! అప్పుడు మీరు దానితో చలి కాచుకోవచ్చు

فَلَمَّا أَتَاهَا نُودِيَ مِن شَاطِئِ الْوَادِ الْأَيْمَنِ فِي الْبُقْعَةِ الْمُبَارَكَةِ مِنَ الشَّجَرَةِ أَن يَا مُوسَىٰ إِنِّي أَنَا اللَّهُ رَبُّ الْعَالَمِينَ(30)

 కాని అతను దాని (అగ్ని) వద్దకు చేరుకున్నప్పుడు, ఆ లోయ కుడివైపు ఉన్న ఒక శుభవంతమైన స్థలములో ఉన్న ఒక చెట్టు నుండి: ఓ మూసా! నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! సర్వలోకాల ప్రభువును." అనే మాటలు వినిపించాయి

وَأَنْ أَلْقِ عَصَاكَ ۖ فَلَمَّا رَآهَا تَهْتَزُّ كَأَنَّهَا جَانٌّ وَلَّىٰ مُدْبِرًا وَلَمْ يُعَقِّبْ ۚ يَا مُوسَىٰ أَقْبِلْ وَلَا تَخَفْ ۖ إِنَّكَ مِنَ الْآمِنِينَ(31)

 (ఇంకా ఇలా వినిపించింది): నీ చేతి కర్రను పడవేయి!" అతను (మూసా) దానిని పామువలే కదలటం చూసి వెనక్కి మరలి పరుగెత్తాడు, తిరిగి కూడా చూడలేదు. (తరువాత ఇలా సెలవీయబడింది): ఓ మూసా, ముందుకు రా, భయపడకు! నిశ్చయంగా, నీవు సురక్షితంగా ఉన్నావు

اسْلُكْ يَدَكَ فِي جَيْبِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ وَاضْمُمْ إِلَيْكَ جَنَاحَكَ مِنَ الرَّهْبِ ۖ فَذَانِكَ بُرْهَانَانِ مِن رَّبِّكَ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ(32)

 నీ చేతిని నీ చంకలోకి దూర్చుకో, అది ఎలాంటి లోపం లేకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. నీవు భయపడకుండా ఉండటానికి నీ చేతిని నీ ప్రక్కకు అదుముకో! ఈ రెండు, నీవు ఫిర్ఔన్ మరియు అతని నాయకులకు (చూపటానికి) నీ ప్రభువు ప్రసాదించిన నిదర్శనాలు (ఆయాత్). నిశ్చయంగా వారు చాలా దుష్టులయి పోయారు

قَالَ رَبِّ إِنِّي قَتَلْتُ مِنْهُمْ نَفْسًا فَأَخَافُ أَن يَقْتُلُونِ(33)

 (మూసా) అన్నాడు: ఓ నా ప్రభూ! నేను వారి మనిషిని ఒకనిని చంపాను. కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను

وَأَخِي هَارُونُ هُوَ أَفْصَحُ مِنِّي لِسَانًا فَأَرْسِلْهُ مَعِيَ رِدْءًا يُصَدِّقُنِي ۖ إِنِّي أَخَافُ أَن يُكَذِّبُونِ(34)

 మరియు నా సోదరుడు హారూన్ మాట్లాడటంలో నా కంటే మంచి వాగ్ధాటి గలవాడు. నన్ను సమర్థించటానికి అతనిని నాకు సహాయకునిగా నాతో పాటు పంపు. వాస్తవానికి వారు నన్ను అసత్యవాదివని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను

قَالَ سَنَشُدُّ عَضُدَكَ بِأَخِيكَ وَنَجْعَلُ لَكُمَا سُلْطَانًا فَلَا يَصِلُونَ إِلَيْكُمَا ۚ بِآيَاتِنَا أَنتُمَا وَمَنِ اتَّبَعَكُمَا الْغَالِبُونَ(35)

 ఆయన (అల్లాహ్) అన్నాడు: మేము నీ సోదరుని ద్వారా నీ చేతులను బలపరుస్తాము. మరియు మేము మీ ఇద్దరికీ విశేష శక్తి నొసంగుతాము. వారు మీ ఇద్దరికి ఏ మాత్రం హాని చేయలేరు. మా సూచనల ద్వారా మీరిద్దరూ మరియు మిమ్మల్ని అనుసరించే వారు గెలుపొందుతారు

فَلَمَّا جَاءَهُم مُّوسَىٰ بِآيَاتِنَا بَيِّنَاتٍ قَالُوا مَا هَٰذَا إِلَّا سِحْرٌ مُّفْتَرًى وَمَا سَمِعْنَا بِهَٰذَا فِي آبَائِنَا الْأَوَّلِينَ(36)

 ఆ తరువాత మూసా మా స్పష్టమైన సూచనలను తీసుకొని వారి వద్దకు పోగా వారన్నారు: ఇది కల్పితమైన మాయాజాలం మాత్రమే. ఇలాంటిది పూర్వీకులైన మా తాతముత్తాతల కాలంలో కూడా జరిగినట్లు మేము వినలేదు

وَقَالَ مُوسَىٰ رَبِّي أَعْلَمُ بِمَن جَاءَ بِالْهُدَىٰ مِنْ عِندِهِ وَمَن تَكُونُ لَهُ عَاقِبَةُ الدَّارِ ۖ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ(37)

 ఇక మూసా అన్నాడు: నా ప్రభువు తరఫు నుండి ఎవడు మార్గదర్శకత్వం తీసుకొని వచ్చాడో మరియు చివరికి ఎవరి పర్యవసానం మంచిదవుతుందో ఆయనకు బాగా తెలుసు. నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు

وَقَالَ فِرْعَوْنُ يَا أَيُّهَا الْمَلَأُ مَا عَلِمْتُ لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرِي فَأَوْقِدْ لِي يَا هَامَانُ عَلَى الطِّينِ فَاجْعَل لِّي صَرْحًا لَّعَلِّي أَطَّلِعُ إِلَىٰ إِلَٰهِ مُوسَىٰ وَإِنِّي لَأَظُنُّهُ مِنَ الْكَاذِبِينَ(38)

 మరియు ఫిర్ఔన్ అన్నాడు: ఓ నాయకులారా! నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు గలడని నాకు తెలియదు. కావున ఓ హామాన్! కాల్చిన మట్టి ఇటుకలతో నాకొక ఎత్తైన గోపురాన్ని నిర్మించు. దానిపై ఎక్కి నేను బహుశా, మూసా దేవుణ్ణి చూడగలనేమో! నిశ్చయంగా, నేను ఇతనిని అసత్యవాదిగా భావిస్తున్నాను

وَاسْتَكْبَرَ هُوَ وَجُنُودُهُ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَظَنُّوا أَنَّهُمْ إِلَيْنَا لَا يُرْجَعُونَ(39)

 మరియు, అతడు మరియు అతడి సైనికులు భూమిపై అన్యాయంగా అహంభావాన్ని ప్రదర్శించారు. మరియు నిశ్చయంగా, మా వైపుకు తాము ఎన్నడూ మరలిరారని భావించారు

فَأَخَذْنَاهُ وَجُنُودَهُ فَنَبَذْنَاهُمْ فِي الْيَمِّ ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الظَّالِمِينَ(40)

 కావున మేము అతనిని మరియు అతని సేనలను పట్టుకొని సముద్రంలోకి విసరివేశాము. ఇక చూడు! దుర్మార్గుల పర్యవసానం ఏమయిందో

وَجَعَلْنَاهُمْ أَئِمَّةً يَدْعُونَ إِلَى النَّارِ ۖ وَيَوْمَ الْقِيَامَةِ لَا يُنصَرُونَ(41)

 మరియు మేము వారిని నరకం వైపునకు పిలిచే నాయకులుగా చేశాము. మరియు పునరుత్థాన దినమున వారికెలాంటి సహాయం దొరకదు

وَأَتْبَعْنَاهُمْ فِي هَٰذِهِ الدُّنْيَا لَعْنَةً ۖ وَيَوْمَ الْقِيَامَةِ هُم مِّنَ الْمَقْبُوحِينَ(42)

 మరియు మేము ఈ లోకంలో కూడా అభిశాపం వారిని వెంటాడేటట్లు చేశాము. మరియు పునరుత్థాన దినమున వారు తృణీకరింప బడేవారిలో చేరుతారు

وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ مِن بَعْدِ مَا أَهْلَكْنَا الْقُرُونَ الْأُولَىٰ بَصَائِرَ لِلنَّاسِ وَهُدًى وَرَحْمَةً لَّعَلَّهُمْ يَتَذَكَّرُونَ(43)

 మరియు వాస్తవానికి - పూర్వ తరాల వారిని నాశనం చేసిన తరువాత - మేము మానవులకు జ్ఞానవృద్ధి చేయటానికి మరియు వారికి మార్గదర్శకత్వంగా కారుణ్యంగా ఉండటానికి, మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. బహుశా వారు హితబోధ నేర్చుకుంటారని

وَمَا كُنتَ بِجَانِبِ الْغَرْبِيِّ إِذْ قَضَيْنَا إِلَىٰ مُوسَى الْأَمْرَ وَمَا كُنتَ مِنَ الشَّاهِدِينَ(44)

 మరియు (ఓ ముహమ్మద్!) మేము మూసాపై మా ఆదేశం (తౌరాత్) పూర్తిగా అవతరింప జేసినపుడు, నీవు (తూర్ పర్వతపు) కుడి వైపునా లేవు. మరియు నీవు అక్కడ ప్రత్యక్ష సాక్షులలో కూడా లేవు

وَلَٰكِنَّا أَنشَأْنَا قُرُونًا فَتَطَاوَلَ عَلَيْهِمُ الْعُمُرُ ۚ وَمَا كُنتَ ثَاوِيًا فِي أَهْلِ مَدْيَنَ تَتْلُو عَلَيْهِمْ آيَاتِنَا وَلَٰكِنَّا كُنَّا مُرْسِلِينَ(45)

 కాని నిశ్చయంగా, (ఆ తరువాత కూడా) మేము అనేక తరాలను ప్రభవింపజేశాము. వారి మీదుగా ఒక సుదీర్ఘకాలం గడిచి పోయింది. మా సూచనలను వినిపించటానికి నీవు మద్ యన్ వాసులతో కూడా లేవు, కాని మేము (ఎల్లప్పుడూ) మా సందేశహరులను పంపుతూ వచ్చాము

وَمَا كُنتَ بِجَانِبِ الطُّورِ إِذْ نَادَيْنَا وَلَٰكِن رَّحْمَةً مِّن رَّبِّكَ لِتُنذِرَ قَوْمًا مَّا أَتَاهُم مِّن نَّذِيرٍ مِّن قَبْلِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ(46)

 మరియు మేము (మూసాను) పిలిచినపుడు, నీవు (ఓ ముహమ్మద్!) తూర్ పర్వతం దగ్గర లేవు. కాని నీవు నీ ప్రభువు యొక్క కారుణ్యంతో, నీకు పూర్వం హెచ్చరిక చేసేవాడు రానటువంటి జాతివారిని హెచ్చరించటానికి - బహుశా వారు హితబోధ నేర్చుకుంటారేమోనని - (పంపబడ్డావు)

وَلَوْلَا أَن تُصِيبَهُم مُّصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ فَيَقُولُوا رَبَّنَا لَوْلَا أَرْسَلْتَ إِلَيْنَا رَسُولًا فَنَتَّبِعَ آيَاتِكَ وَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ(47)

 మరియు వారు తమ చేతులారా, చేసుకొని పంపిన కర్మల ఫలితంగా వారిపై ఆపద వచ్చి పడినపుడు, వారు: ఓ మా ప్రభూ! నీవు మా వద్దకు ఒక సందేశహరుణ్ణి ఎందుకు పంపలేదు, అలా చేస్తే మేము నీ సూచనలను అనుసరిస్తూ, విశ్వాసులైన వారిలో చేరి ఉండేవారం కదా!" (అని తీర్పు దినమున అనకూడదని)

فَلَمَّا جَاءَهُمُ الْحَقُّ مِنْ عِندِنَا قَالُوا لَوْلَا أُوتِيَ مِثْلَ مَا أُوتِيَ مُوسَىٰ ۚ أَوَلَمْ يَكْفُرُوا بِمَا أُوتِيَ مُوسَىٰ مِن قَبْلُ ۖ قَالُوا سِحْرَانِ تَظَاهَرَا وَقَالُوا إِنَّا بِكُلٍّ كَافِرُونَ(48)

 ఆ తర్వాత మా తరఫు నుండి వారి వద్దకు సత్యం వచ్చినపుడు, వారిలా అన్నారు: మూసాకు ఇవ్వ బడినటువంటిది, ఇతనికి ఎందుకు ఇవ్వబడలేదు!" ఏమీ? దీనికి పూర్వం మూసాకు ఇవ్వబడిన దానిని వారు తిరస్కరించలేదా? వారన్నారు: రెండూ మాయాజాలాలే! అవి ఒకదాని కొకటి సహాయపడుతున్నాయి." ఇంకా ఇలా అన్నారు: నిశ్చయంగా, మేము వీటన్నింటినీ తిరస్కరిస్తున్నాము

قُلْ فَأْتُوا بِكِتَابٍ مِّنْ عِندِ اللَّهِ هُوَ أَهْدَىٰ مِنْهُمَا أَتَّبِعْهُ إِن كُنتُمْ صَادِقِينَ(49)

 (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: మీరు నిజాయితీపరులే అయితే, అల్లాహ్ దగ్గర నుండి ఈ రెండింటి కంటే ఉత్తమమైన మార్గం చూపే ఒక గ్రంథాన్ని తీసుకురండి. దానిని నేను అనుసరిస్తాను

فَإِن لَّمْ يَسْتَجِيبُوا لَكَ فَاعْلَمْ أَنَّمَا يَتَّبِعُونَ أَهْوَاءَهُمْ ۚ وَمَنْ أَضَلُّ مِمَّنِ اتَّبَعَ هَوَاهُ بِغَيْرِ هُدًى مِّنَ اللَّهِ ۚ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ(50)

 వారు నీకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే, వారు కేవలం తమ కోరికలను అనుసరిస్తున్నారని తెలుసుకో! మరియు అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని విడిచి కేవలం తన కోరికలను అనుసరించే వాని కంటే ఎక్కువ మార్గభ్రష్టుడు ఎవడు? నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు

۞ وَلَقَدْ وَصَّلْنَا لَهُمُ الْقَوْلَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ(51)

 మరియు వారు హితబోధ పొందాలని, వాస్తవంగా మేము ఈ వచనాన్ని (ఖుర్ఆన్ ను) క్రమక్రమంగా అందజేశాము

الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ مِن قَبْلِهِ هُم بِهِ يُؤْمِنُونَ(52)

 ఎవరికైతే పూర్వం మేము గ్రంథాన్ని ఇచ్చామో వారు దీనిని (ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు

وَإِذَا يُتْلَىٰ عَلَيْهِمْ قَالُوا آمَنَّا بِهِ إِنَّهُ الْحَقُّ مِن رَّبِّنَا إِنَّا كُنَّا مِن قَبْلِهِ مُسْلِمِينَ(53)

 మరియు వారికి ఇది వినిపించబడి నప్పుడు, వారు ఇలా అంటారు: మేము దీనిని విశ్వసించాము, నిశ్చయంగా ఇది మా ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నిశ్చయంగా, మేము మొదటి నుండియో అల్లాహ్ కు విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము

أُولَٰئِكَ يُؤْتَوْنَ أَجْرَهُم مَّرَّتَيْنِ بِمَا صَبَرُوا وَيَدْرَءُونَ بِالْحَسَنَةِ السَّيِّئَةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ(54)

 వీరే, తమ సహనానికి ఫలితంగా రెండింతలు ప్రతిఫలమొసంగపడే వారు. వీరే మంచితో చెడును నివారించే వారు. మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి ఖర్చు చేసేవారు

وَإِذَا سَمِعُوا اللَّغْوَ أَعْرَضُوا عَنْهُ وَقَالُوا لَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ سَلَامٌ عَلَيْكُمْ لَا نَبْتَغِي الْجَاهِلِينَ(55)

 మరియు వారు వ్యర్థమైన మాటలు విన్నప్పుడు, ఇలా అంటూ దూరంగా తొలగి పోతారు: మాకు మా కర్మలు మరియు మీకు మీ కర్మలు, మీకు సలాం! మాకు మూర్ఖులతో పనిలేదు

إِنَّكَ لَا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَٰكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۚ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ(56)

 (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేయలేవు, కాని అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకత్వం పొందే వారెవరో బాగా తెలుసు

وَقَالُوا إِن نَّتَّبِعِ الْهُدَىٰ مَعَكَ نُتَخَطَّفْ مِنْ أَرْضِنَا ۚ أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا آمِنًا يُجْبَىٰ إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِّزْقًا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ(57)

 వారు ఇలా అంటారు: ఒకవేళ నీతో పాటు మేము కూడా ఈ మార్గదర్శకత్వాన్ని అవలంబిస్తే! మేము మా భూమి నుండియే పారద్రోలబడతాము." ఏమీ? మేము వారిని శాంతికి నిలయమైన ఒక పవిత్ర స్థలం (మక్కా) లో స్థిరనివాసము నొసంగి వారికి మా తరఫు నుండి జీవనోపాధిగా అన్ని రకాల ఫలాలను సమకూర్చలేదా? కాని వాస్తవానికి వారిలో చాలా మందికి ఇది తెలియదు

وَكَمْ أَهْلَكْنَا مِن قَرْيَةٍ بَطِرَتْ مَعِيشَتَهَا ۖ فَتِلْكَ مَسَاكِنُهُمْ لَمْ تُسْكَن مِّن بَعْدِهِمْ إِلَّا قَلِيلًا ۖ وَكُنَّا نَحْنُ الْوَارِثِينَ(58)

 మరియు మేము ఎన్నో నగరాలను, జీవన సుఖసంపదలతో ఉప్పొంగిపోతూ ఉండగా, వాటిని నాశనం చేయలేదా! అవిగో వారి నివాసాలు, వారి తరువాత వాటిలో నివసించిన వారు చాలా తక్కువ! మరియు నిశ్చయంగా, మేమే వాటికి వారసులయ్యాము

وَمَا كَانَ رَبُّكَ مُهْلِكَ الْقُرَىٰ حَتَّىٰ يَبْعَثَ فِي أُمِّهَا رَسُولًا يَتْلُو عَلَيْهِمْ آيَاتِنَا ۚ وَمَا كُنَّا مُهْلِكِي الْقُرَىٰ إِلَّا وَأَهْلُهَا ظَالِمُونَ(59)

 మరియు నీ ప్రభువు నగరాలను ఏ మాత్రమూ నాశనం చేసేవాడు కాదు, ఎంత వరకైతే వాటి ముఖ్య నగరానికి మా సూచన (ఆయాత్) లను వినిపించే సందేశహరులను పంపమో! మేము నగరాలను వాటి ప్రజలు దుర్మార్గులై పోతే తప్ప, నాశనం చేసే వారం కాము

وَمَا أُوتِيتُم مِّن شَيْءٍ فَمَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا وَزِينَتُهَا ۚ وَمَا عِندَ اللَّهِ خَيْرٌ وَأَبْقَىٰ ۚ أَفَلَا تَعْقِلُونَ(60)

 మరియు మీకు ఇవ్వబడిన వన్నీ ఈ ప్రాపంచిక జీవితపు సుఖసంతోషాల సామాగ్రి మరియు దాని అలంకరణలు మాత్రమే! కాని అల్లాహ్ వద్ద ఉన్నది దీని కంటే ఎంతో ఉత్తమమైనది మరియు నిత్యమైనది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా

أَفَمَن وَعَدْنَاهُ وَعْدًا حَسَنًا فَهُوَ لَاقِيهِ كَمَن مَّتَّعْنَاهُ مَتَاعَ الْحَيَاةِ الدُّنْيَا ثُمَّ هُوَ يَوْمَ الْقِيَامَةِ مِنَ الْمُحْضَرِينَ(61)

 ఏమీ? మేము చేసిన మంచి వాగ్దానాన్ని తప్పకుండా పొందేవాడు, మేము ఒసంగిన ఈ ప్రాపంచిక సుఖసంతోషాలు పొంది, పునరుత్థాన దినమున మా ముందు (శిక్షకై) హాజరు చేయబడే వాడితో సమానుడు కాగలడా

وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ أَيْنَ شُرَكَائِيَ الَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ(62)

 మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ రోజు ఆయన (అల్లాహ్) వారిని పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: మీరు నా భాగస్వాములని నొక్కి చెప్పిన వారు (భావించిన వారు) ఇప్పుడు ఎక్కడున్నారు

قَالَ الَّذِينَ حَقَّ عَلَيْهِمُ الْقَوْلُ رَبَّنَا هَٰؤُلَاءِ الَّذِينَ أَغْوَيْنَا أَغْوَيْنَاهُمْ كَمَا غَوَيْنَا ۖ تَبَرَّأْنَا إِلَيْكَ ۖ مَا كَانُوا إِيَّانَا يَعْبُدُونَ(63)

 ఎవరైతే ఆ మాట (శిక్ష) వర్తిస్తుందో, వారిలా విన్నవించుకుంటారు: ఓ మా ప్రభూ! మేము దారి తప్పించిన వారు వీరే! మేము దారి తప్పిన విధంగానే వీరిని కూడా దారి తప్పించాము. వీరితో మాకెలాంటి సంబంధం లేదని నీ ముందు ప్రకటిస్తున్నాము. అసలు వీరు మమ్మల్ని ఆరాధించనేలేదు

وَقِيلَ ادْعُوا شُرَكَاءَكُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا لَهُمْ وَرَأَوُا الْعَذَابَ ۚ لَوْ أَنَّهُمْ كَانُوا يَهْتَدُونَ(64)

 మరియు వారితో ఇలా అనబడుతుంది: మీరు సాటి కల్పించిన మీ భాగస్వాములను పిలువండి!" అప్పుడు వారు, వారిని (భాగస్వాములను) పిలుస్తారు, కాని వారు, వారికి సమాధానమివ్వరు. మరియు వారు శిక్షను చూసి (అనుకుంటారు): ఒకవేళ వాస్తవానికి తాము సన్మార్గాన్ని అవలంబించి వుంటే ఎంత బాగుండేది!" అని

وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ مَاذَا أَجَبْتُمُ الْمُرْسَلِينَ(65)

 మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆయన (అల్లాహ్) వారిని పిలిచిన రోజు ఇలా ప్రశ్నిస్తాడు: మేము పంపిన సందేశహరులకు మీరు ఏ విధంగా సమాధానమిచ్చారు

فَعَمِيَتْ عَلَيْهِمُ الْأَنبَاءُ يَوْمَئِذٍ فَهُمْ لَا يَتَسَاءَلُونَ(66)

 ఆ రోజు వారి సమాధానాలన్నీ (కారణాలన్నీ) అస్పష్టమై పోతాయి మరియు వారు ఒకరితో నొకరు సంప్రదించుకోనూ లేరు

فَأَمَّا مَن تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحًا فَعَسَىٰ أَن يَكُونَ مِنَ الْمُفْلِحِينَ(67)

 కాని ఎవడైతే పశ్చాత్తాప పడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో! అతడు సాఫల్యం పొందే వారిలో చేరగలడని ఆశించవచ్చు

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ ۗ مَا كَانَ لَهُمُ الْخِيَرَةُ ۚ سُبْحَانَ اللَّهِ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ(68)

 మరియు నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు ఎన్నుకుంటాడు. మరియు ఎన్నుకునే హక్కు వారికి ఏ మాత్రం లేదు. అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు, వారు సాటి కల్పించే భాగస్వాముల కంటే మహోన్నతుడు

وَرَبُّكَ يَعْلَمُ مَا تُكِنُّ صُدُورُهُمْ وَمَا يُعْلِنُونَ(69)

 మరియు వారు తమ హృదయాలలో దాచుకున్నది మరియు బహిర్గతం చేసేది అంతా నీ ప్రభువుకు తెలుసు

وَهُوَ اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ لَهُ الْحَمْدُ فِي الْأُولَىٰ وَالْآخِرَةِ ۖ وَلَهُ الْحُكْمُ وَإِلَيْهِ تُرْجَعُونَ(70)

 మరియు ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! మొదట (ఇహలోకంలో) మరియు చివరకు (పరలోకంలో) స్తుతింపదగినవాడు కేవలం ఆయనే! మరియు విశ్వన్యాయాధిపత్యం ఆయనదే. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు

قُلْ أَرَأَيْتُمْ إِن جَعَلَ اللَّهُ عَلَيْكُمُ اللَّيْلَ سَرْمَدًا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَنْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ يَأْتِيكُم بِضِيَاءٍ ۖ أَفَلَا تَسْمَعُونَ(71)

 వారితో అను: ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపైన పునరుత్థాన దినం వరకు ఎడతెగకుండా రాత్రి ఆవరింపజేస్తే, అల్లాహ్ తప్ప మరే దేవుడైనా, మీకు వెలుగును తేగలడా? అయితే మీరెందుకు వినరు

قُلْ أَرَأَيْتُمْ إِن جَعَلَ اللَّهُ عَلَيْكُمُ النَّهَارَ سَرْمَدًا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَنْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ يَأْتِيكُم بِلَيْلٍ تَسْكُنُونَ فِيهِ ۖ أَفَلَا تُبْصِرُونَ(72)

 ఇంకా ఇలా అను: ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపై పునరుత్థాన దినము వరకు ఎడతెగకుండా పగటిని అవతరింపజేస్తే, అల్లాహ్ తప్ప మరే దేవుడైనా మీకు విశ్రాంతి పొందటానికి రాత్రిని తేగలడా? అయితే, మీరెందుకు చూడలేరు

وَمِن رَّحْمَتِهِ جَعَلَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ لِتَسْكُنُوا فِيهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ(73)

 ఆయన తన కారుణ్యంతో మీ కొరకు రాత్రిని మరియు పగటిని, విశ్రాంతి పొందటానికి మరియు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి చేశాడు, బహుశా మీరు కృతజ్ఞులౌతారేమోనని

وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ أَيْنَ شُرَكَائِيَ الَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ(74)

 మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆయన (అల్లాహ్), వారిని ఆ రోజు పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: మీరు నాకు భాగస్వాములని నొక్కి చెప్పిన వారు (భావించిన వారు) ఇప్పుడు ఎక్కడున్నారు

وَنَزَعْنَا مِن كُلِّ أُمَّةٍ شَهِيدًا فَقُلْنَا هَاتُوا بُرْهَانَكُمْ فَعَلِمُوا أَنَّ الْحَقَّ لِلَّهِ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ(75)

 మరియు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని నిలబెట్టి ఇలా అంటాము: మీ నిదర్శనాన్ని తీసుకురండి!" అప్పుడు వారు సత్యం, నిశ్చయంగా అల్లాహ్ వైపే ఉందని తెలుసుకుంటారు. మరియు వారు కల్పించుకున్నవన్నీ వారిని త్యజించి ఉంటాయి

۞ إِنَّ قَارُونَ كَانَ مِن قَوْمِ مُوسَىٰ فَبَغَىٰ عَلَيْهِمْ ۖ وَآتَيْنَاهُ مِنَ الْكُنُوزِ مَا إِنَّ مَفَاتِحَهُ لَتَنُوءُ بِالْعُصْبَةِ أُولِي الْقُوَّةِ إِذْ قَالَ لَهُ قَوْمُهُ لَا تَفْرَحْ ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْفَرِحِينَ(76)

 వాస్తవానికి, ఖారూన్, మూసా జాతికి చెందినవాడే. కాని అతడు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. మరియు మేము అతడికి ఎన్నో నిధులను ఇచ్చి ఉంటిమి. వాటి తాళవు చెవులను బలవంతులైన పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కూడా ఎంతో కష్టంతో మాత్రమే మోయగలిగే వారు. అతడి జాతి వారు అతనితో అన్నారు: నీవు విర్రవీగకు, నిశ్చయంగా, అల్లాహ్ విర్రవీగే వారిని ప్రేమించడు

وَابْتَغِ فِيمَا آتَاكَ اللَّهُ الدَّارَ الْآخِرَةَ ۖ وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ الدُّنْيَا ۖ وَأَحْسِن كَمَا أَحْسَنَ اللَّهُ إِلَيْكَ ۖ وَلَا تَبْغِ الْفَسَادَ فِي الْأَرْضِ ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُفْسِدِينَ(77)

 మరియు అల్లాహ్ నీకు ఇచ్చిన సంపదతో పరలోక గృహాన్ని పొందటానికి ప్రయత్నించు. మరియు ఇహలోకం నుండి లభించే భాగాన్ని మరచిపోకు. నీకు అల్లాహ్ మేలు చేసినట్లు, నీవు కూడా (ప్రజలకు) మేలు చేయి. భూమిపై కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నించకు. నిశ్చయంగా, అల్లాహ్ కల్లోలం రేకెత్తించేవారిని ప్రేమించడు

قَالَ إِنَّمَا أُوتِيتُهُ عَلَىٰ عِلْمٍ عِندِي ۚ أَوَلَمْ يَعْلَمْ أَنَّ اللَّهَ قَدْ أَهْلَكَ مِن قَبْلِهِ مِنَ الْقُرُونِ مَنْ هُوَ أَشَدُّ مِنْهُ قُوَّةً وَأَكْثَرُ جَمْعًا ۚ وَلَا يُسْأَلُ عَن ذُنُوبِهِمُ الْمُجْرِمُونَ(78)

 అతడు (ఖారూన్) అన్నాడు: నిశ్చయంగా, ఇది (ఈ ధనం) నాకు నా జ్ఞానం వల్లనే ఇవ్వబడింది!" ఏమీ? అతడికి తెలియదా? నిశ్చయంగా అల్లాహ్ అతడికి ముందు ఎన్నో తరాల వారిని - అతడి కంటే ఎక్కువ బలం మరియు ఎక్కువ ధనసంపదలు గలవారిని కూడా - నాశనం చేశాడని? మరియు పాపాత్ములు వారి పాపాలను గురించి ప్రశ్నింపబడరు

فَخَرَجَ عَلَىٰ قَوْمِهِ فِي زِينَتِهِ ۖ قَالَ الَّذِينَ يُرِيدُونَ الْحَيَاةَ الدُّنْيَا يَا لَيْتَ لَنَا مِثْلَ مَا أُوتِيَ قَارُونُ إِنَّهُ لَذُو حَظٍّ عَظِيمٍ(79)

 తరువాత అతడు తన వైభవంతో తన జాతి వారి ఎదుటకు వచ్చాడు. ఇహలోక జీవితపు సుఖాలు కోరేవారు ఇలా అన్నారు: అయ్యో! మా దౌర్భాగ్యం! ఖారూన్ కు లభించినటు వంటివి (ధనసంపత్తులు) మాకు కూడా లభించి ఉంటే ఎంత బాగుండేది? నిశ్చయంగా అతడు ఎంతో అదృష్టవంతుడు

وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ وَيْلَكُمْ ثَوَابُ اللَّهِ خَيْرٌ لِّمَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا وَلَا يُلَقَّاهَا إِلَّا الصَّابِرُونَ(80)

 కాని జ్ఞానసంపన్నులు అన్నారు: మీ దౌర్భాగ్యం! అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలమే, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ఎంతో శ్రేష్ఠమైనది. మరియు ఈ మహాభాగ్యం, సహనం వహించే వారికి తప్ప ఇతరులకు లభించదు

فَخَسَفْنَا بِهِ وَبِدَارِهِ الْأَرْضَ فَمَا كَانَ لَهُ مِن فِئَةٍ يَنصُرُونَهُ مِن دُونِ اللَّهِ وَمَا كَانَ مِنَ الْمُنتَصِرِينَ(81)

 ఆ పిదప మేము అతనిని, అతని గృహంతో సహా భూమిలోకి అణగద్రొక్కాము. అతడిని, అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించగల, అతడి తెగవారు ఎవ్వరూ లేకపోయారు మరియు అతడు కూడా తనను తాను కాపాడు కోలేకపోయాడు

وَأَصْبَحَ الَّذِينَ تَمَنَّوْا مَكَانَهُ بِالْأَمْسِ يَقُولُونَ وَيْكَأَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ ۖ لَوْلَا أَن مَّنَّ اللَّهُ عَلَيْنَا لَخَسَفَ بِنَا ۖ وَيْكَأَنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ(82)

 మరియు నిన్నటి వరకు అతడి (ఖారూన్) వలే కావలెనని ఎవరైతే కోరుతూ వచ్చారో, వారు ఇప్పుడు ఇలా పలుకసాగారు: తెలుసుకోండి! అల్లాహ్ తన దాసులలో, తాను కోరిన వారికి జీవనోపాధిని విస్తరింపజేస్తాడు. మరియు (తాను కోరిన వారికి) తగ్గిస్తాడు. ఒకవేళ అల్లాహ్ అనుగ్రహమే మాపై లేకుంటే ఆయన మమ్మల్ని కూడా భూమిలోకి అణగద్రొక్కి ఉండేవాడు. తెలుసుకోండి! సత్యతిరస్కారులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు

تِلْكَ الدَّارُ الْآخِرَةُ نَجْعَلُهَا لِلَّذِينَ لَا يُرِيدُونَ عُلُوًّا فِي الْأَرْضِ وَلَا فَسَادًا ۚ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ(83)

 ఆ పరలోక జీవితపు గృహాన్ని మేము భూమిలో పెద్దరికం చూపగోరని వారి కొరకు మరియు కల్లోలం రేకెత్తించని వారి కొరకు ప్రత్యేకిస్తాము. మరియు దైవభీతి గలవారికే (మేలైన) పర్యవసానం ఉంటుంది

مَن جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ خَيْرٌ مِّنْهَا ۖ وَمَن جَاءَ بِالسَّيِّئَةِ فَلَا يُجْزَى الَّذِينَ عَمِلُوا السَّيِّئَاتِ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ(84)

 మంచి పనులు చేసి వచ్చిన వారికి వాటి కంటే ఉత్తమమైన (ప్రతిఫలం) లభిస్తుంది. మరియు చెడ్డపనులు చేసి వచ్చిన వారికి, వారు చేస్తూ ఉండిన చెడ్డపనులకు తగినంత ప్రతిఫలమే ఇవ్వబడుతుంది

إِنَّ الَّذِي فَرَضَ عَلَيْكَ الْقُرْآنَ لَرَادُّكَ إِلَىٰ مَعَادٍ ۚ قُل رَّبِّي أَعْلَمُ مَن جَاءَ بِالْهُدَىٰ وَمَنْ هُوَ فِي ضَلَالٍ مُّبِينٍ(85)

 (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ను నీకు విధిగా చేసినవాడు (అల్లాహ్) తప్పక నిన్ను నీ నిర్ణీత స్థానానికి తిరిగి తెస్తాడు. వారితో ఇలా అను: ఎవడు మార్గదర్శకత్వంలో ఉన్నాడో మరియు ఎవడు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాడో, నా ప్రభువుకు బాగా తెలుసు

وَمَا كُنتَ تَرْجُو أَن يُلْقَىٰ إِلَيْكَ الْكِتَابُ إِلَّا رَحْمَةً مِّن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ ظَهِيرًا لِّلْكَافِرِينَ(86)

 మరియు నీకు ఈ గ్రంథం (ఖుర్ఆన్) ఇవ్వబడుతుందని నీవెన్నడూ ఆశించలేదు, ఇది కేవలం నీ ప్రభువు కారుణ్యం వల్లనే లభించింది. కావున నీవు ఎన్నటికీ సత్యతిరస్కారులకు తోడ్పడే వాడవు కావద్దు

وَلَا يَصُدُّنَّكَ عَنْ آيَاتِ اللَّهِ بَعْدَ إِذْ أُنزِلَتْ إِلَيْكَ ۖ وَادْعُ إِلَىٰ رَبِّكَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ(87)

 మరియు అల్లాహ్ ఆయతులు, నీపై అవతరింపజేయబడిన తరువాత; వారు (సత్యతిరస్కారులు) వాటి (పఠనం / ప్రచారం) నుండి నిన్ను ఏ మాత్రం తొలగింపనివ్వరాదు. మరియు (ప్రజలను) నీ ప్రభువు వైపునకు ఆహ్వానించు. మరియు నీవు బహుదైవారాధకులలో చేరిపోకు

وَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ ۘ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ كُلُّ شَيْءٍ هَالِكٌ إِلَّا وَجْهَهُ ۚ لَهُ الْحُكْمُ وَإِلَيْهِ تُرْجَعُونَ(88)

 మరియు అల్లాహ్ తో పాటు ఏ ఇతర దైవాన్నీ ఆరాధించకు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. కేవలం ఆయన ఉనికి (ముఖం) తప్ప ప్రతిదీ నశిస్తుంది. సర్వన్యాయాధిపత్యం కేవలం ఆయనదే మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు


More surahs in Telugu:


Al-Baqarah Al-'Imran An-Nisa'
Al-Ma'idah Yusuf Ibrahim
Al-Hijr Al-Kahf Maryam
Al-Hajj Al-Qasas Al-'Ankabut
As-Sajdah Ya Sin Ad-Dukhan
Al-Fath Al-Hujurat Qaf
An-Najm Ar-Rahman Al-Waqi'ah
Al-Hashr Al-Mulk Al-Haqqah
Al-Inshiqaq Al-A'la Al-Ghashiyah

Download surah Al-Qasas with the voice of the most famous Quran reciters :

surah Al-Qasas mp3 : choose the reciter to listen and download the chapter Al-Qasas Complete with high quality
surah Al-Qasas Ahmed El Agamy
Ahmed Al Ajmy
surah Al-Qasas Bandar Balila
Bandar Balila
surah Al-Qasas Khalid Al Jalil
Khalid Al Jalil
surah Al-Qasas Saad Al Ghamdi
Saad Al Ghamdi
surah Al-Qasas Saud Al Shuraim
Saud Al Shuraim
surah Al-Qasas Abdul Basit Abdul Samad
Abdul Basit
surah Al-Qasas Abdul Rashid Sufi
Abdul Rashid Sufi
surah Al-Qasas Abdullah Basfar
Abdullah Basfar
surah Al-Qasas Abdullah Awwad Al Juhani
Abdullah Al Juhani
surah Al-Qasas Fares Abbad
Fares Abbad
surah Al-Qasas Maher Al Muaiqly
Maher Al Muaiqly
surah Al-Qasas Muhammad Siddiq Al Minshawi
Al Minshawi
surah Al-Qasas Al Hosary
Al Hosary
surah Al-Qasas Al-afasi
Mishari Al-afasi
surah Al-Qasas Yasser Al Dosari
Yasser Al Dosari


Thursday, November 21, 2024

لا تنسنا من دعوة صالحة بظهر الغيب