సూరా అన్-నూర్
PDF —
64 వచనం Medinan PDF
Built right in your browser — download starts automatically

సూరా అన్-నూర్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అన్-నూర్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అన్-నూర్ అనువాదం. అన్-నూర్ (Medinan) 64 వచనం.



సూరా అన్-నూర్
64 వచనం · Medinan · తెలుగు
bismillah
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚ
ఇది ఒక సూరహ్! మేమే దీనిని అవతరింపజేశాము మరియు దీనిని విధిగా జేశాము మరియు బహుశా మీరు గుణపాఠం నేర్చుకుంటారని, మేమిందులో స్పష్టమైన సూచనలను (ఆయాత్ లను) అవతరింపజేశాము
ﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷ
వ్యభిచారిణి మరియు వ్యభిచారుడు, ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మరియు మీకు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసముంటే - అల్లాహ్ విధించిన ధర్మవిషయంలో - వారిద్దరి యెడల మీకు జాలి కలుగకూడదు. మరియు వారిద్దరి శిక్షను, విశ్వాసులలో కొందరు చూడాలి
ﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋ
ఒక వ్యభిచారి, ఒక వ్యభిచారిణిని లేక బహుదైవారాధకురాలయిన (ముష్రిక్) స్త్రీని మాత్రమే వివాహమాడుతాడు; మరియు ఒక వ్యభిచారిణిని, ఒక వ్యభిచారుడో లేక ఒక బహుదైవారాధకుడో మాత్రమే వివాహమాడుతాడు. మరియు ఇలాంటి విషయం విశ్వాసుల కొరకు నిషేధించబడింది
ﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠ
మరియు ఎవరైనా శీలవతులైన స్త్రీలపై అపనింద మోపిన తరువాత నలుగురు సాక్షులను తీసుకొని రాలేరో, వారికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి మరియు వారి సాక్ష్యాన్ని ఎన్నటికీ స్వీకరించకండి. అలాంటి వారు పరమ దుష్టులు (ఫాసిఖూన్)
ﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬ
కాని అటు పిమ్మట ఎవరైతే పశ్చాత్తాప పడి తమను తాము సవరించుకుంటారో! నిశ్చయంగా, అలాంటి వారి పట్ల అల్లాహ్ క్షమీశీలుడు, అపార కరుణా ప్రదాత
ﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟ
మరియు ఎవరైతే, తమ భార్యల మీద అపనింద మోపి, దానికి తాము స్వయమే తప్ప ఇతరులను సాక్షులుగా తేలేరో, వారు తమంతట తామే నాలుగు సార్లు అల్లాహ్ పై ప్రమాణం చేసి సాక్ష్యమిస్తూ; నిశ్చయంగా, తాను సత్యం పలుకుతున్నాననీ
ﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩ
మరియు ఐదవసారి అతడు ఒకవేళ అసత్యం పలుకుతున్నట్లయితే! నిశ్చయంగా, అల్లాహ్ ఆగ్రహం తన మీద విరుచుకు పడుగాక! అనీ అనాలి
ﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵ
ఇక ఆమె (భార్య) శిక్షను తప్పించుకోవటానికి, నాలుగు సార్లు అల్లాహ్ పై ప్రమాణం చేస్తూ; నిశ్చయంగా, అతడు అబద్ధం చెబుతున్నాడనీ
ﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿ
మరియు అయిదవసారి ఒకవేళ అతడు సత్యవంతుడైతే! నిశ్చయంగా, తన మీద అల్లాహ్ ఆగ్రహం విరుచుకు పడుగాక! అనీ అనాలి
ﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉ
మరియు మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే! (ఆయన మీ శిక్షను త్వరలోనే తెచ్చేవాడు) మరియు నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, మహా వివేకవంతుడు
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱ
నిశ్చయంగా, అపనింద మోపేవారు, మీలో నుంచే కొందరున్నారు. అది మీకు హానికరమైనదని భావించకండి. వాస్తవానికి అది మీకు మేలైనదే. వారిలో ప్రతి ఒక్కనికి తాను చేసిన పాపానికి తగిన శిక్ష లభిస్తుంది. మరియు వారిలో (ఈ అపనింద మోపటంలో), పెద్ద బాధ్యత వహించిన వానికి ఘోరమైన శిక్ష పడుతుంది
ﭲﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾ
విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు దానిని వినినప్పుడు, తమను గురించి తాము మంచి తలంపు వహించి: ఇది స్పష్టమైన అపనిందయే!" అని ఎందుకు అనలేదు
ﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎ
మరియు వారు దీనికై నలుగురు సాక్షులను ఎందుకు తీసుకురాలేదు? ఒకవేళ వారు సాక్షులను తీసుకొని రానప్పుడు, అల్లాహ్ వద్ద వారే అసత్యవాదులు
ﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞ
మరియు ఒకవేళ మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణ, ఇహలోకంలో మరియు పరలోకంలో లేకుంటే - మీరు ఏ విషయాలలో పడి పోయారో, వాటి పర్యవసానంగా - మీపై ఘోరమైన శిక్ష పడి ఉండేది
ﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯ
అప్పుడు మీరు దానిని (ఆ అపనిందను) మీ నాలుకలతో వ్యాపింపజేస్తూ పోయారు మరియు మీకు తెలియని దానిని మీ నోళ్ళతో పలుకసాగారు మరియు మీరు దానిని చిన్న విషయంగా భావించారు, కాని అల్లాహ్ దగ్గర (దృష్టిలో) అది ఎంతో గొప్ప విషయం (అపరాధం)
ﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟ
మరియు మీరు దానిని విన్నప్పుడు: ఇలాంటి మాట పలకడం మాకు తగదు, (ఓ మా ప్రభూ!) నీవు సర్వలోపాలకు అతీతుడవు, ఇది గొప్ప నిందారోపణ!" అని ఎందుకు అనలేదు
ﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩ
మీరు విశ్వాసులే అయితే, ఇక మీదట ఎన్నటికీ ఇటువంటి చేష్టలు మరల చేయకూడదని అల్లాహ్ మిమ్మల్ని ఉపదేశిస్తున్నాడు
ﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲ
మరియు అల్లాహ్ మీకు స్పష్టమైన ఆయాత్ లను చూపుతున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
ﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈ
నిశ్చయంగా, ఎవరైతే విశ్వాసవర్గంలో అశ్లీలత వ్యాపించాలని కోరుతారో, అలాంటి వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా కఠినశిక్ష పడుతుంది. మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కాని మీకు తెలియదు
ﰉﰊﰋﰌﰍﰎﰏﰐﰑﰒ
మరియు మీ యెడల అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే (మీరు నాశనమై పోయేవారు); మరియు నిశ్చయంగా, అల్లాహ్ మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷ
ఓ విశ్వాసులారా! షైతాన్ అడుగు జాడలలో నడవకండి. మరియు ఎవడు షైతాన్ అడుగుజాడలలో నడుస్తాడో! నిశ్చయంగా షైతాన్ అతనిని అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు మరియు మీ యెడల అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే, మీలో ఒక్కడూ కూడా నీతిమంతునిగా ఉండలేడు. కాని అల్లాహ్ తాను కోరిన వానిని నీతిమంతునిగా చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు సర్వజ్ఞుడు
ﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕ
మరియు మీలో (అల్లాహ్) అనుగ్రహం మరియు సమృద్ధిగా (సంపదలు) గలవారు, తమ బంధువులకు, పేదలకు, అల్లాహ్ మార్గంలో వలస (హిజ్రత్) పోయే వారికి, సహాయం చేయమని ప్రతిజ్ఞ చేయరాదు. వారిని మన్నించాలి, (వారి తప్పులను) ఉపేక్షించాలి. ఏమీ? అల్లాహ్ మీ తప్పులను క్షమించాలని మీరు కోరరా? వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
ﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠﮡﮢﮣ
నిశ్చయంగా, ఎవరైతే శీలవతులు, అమాయకులు అయిన విశ్వాస స్త్రీలపై అపనిందలు మోపుతారో, వారు ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ శపించబడతారు (బహిష్కరింపబడతారు) మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది
ﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭ
వారి నాలుకలు, వారి చేతులు మరియు వారి కాళ్ళు - వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి - వారికి విరుద్ధంగా సాక్ష్యమిచ్చే రోజు
ﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚ
ఆ రోజు! అల్లాహ్ వారికి, (వారి కర్మలకు) పూర్తి ప్రతిఫలమిస్తాడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్! ఆయనే పరమ సత్యమని వారు తెలుసుకుంటారు
ﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫﯬﯭﯮ
నికృష్టులైన స్త్రీలు, నికృష్టులైన పురుషులకు మరియు నికృష్టులైన పురుషులు, నికృష్టులైన స్త్రీలకు తగినవారు. మరియు నిర్మల స్త్రీలు, నిర్మల పురుషులకు మరియు నిర్మల పురుషులు, నిర్మల స్త్రీలకు తగినవారు. వారు (కపట విశ్వాసులలు) మోపే అపనిందలకు వీరు నిర్దోషులు. వీరికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి
ﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂ
ఓ విశ్వాసులారా! మీ ఇండ్లు తప్ప, ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటివారికి సలామ్ చేయకుండా ప్రవేశించకండి. ఈ పద్ధతి మీకు అతి ఉత్తమమైనది మీరు ఈ హితోపదేశం జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశింపబడుతోంది
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪ
మరియు ఒకవేళ మీకు దానిలో (ఆ ఇంటిలో) ఎవ్వరూ కనబడకపోయినా, మీకు అనుమతి ఇవ్వబడనంత వరకు అందులోకి ప్రవేశించకండి. మరియు (అనుమతి ఇవ్వక) మీతో తిరిగి పొమ్మని (ఆ ఇంటివారు) అంటే! తిరిగి వెళ్ళి పోండి. ఇదే మీ కొరకు శ్రేష్ఠమైన పద్ధతి. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
ﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽ
ఎవ్వరికీ నివాస స్థలం కాకుండా మీకు ప్రయోజనకరమైన వస్తువులున్న ఇండ్లలో ప్రవేశిస్తే, మీపై ఎట్టి దోషం లేదు. మరియు మీరు వ్యక్తపరిచేది మరియు మీరు దాచేది అంతా అల్లాహ్ కు బాగా తెలుసు
ﭾﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏ
విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. ఇది వారికి ఎంతో శ్రేష్ఠమైనది. నిశ్చయంగా, అల్లాహ్ వారి చేష్టలను బాగా ఎరుగును
ﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃ
మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు - (దానంతట అదే) ప్రదర్శనమయ్యేది తప్ప. వారిని, తమ తల మీది దుప్పటిని రొమ్ముల వరకు కప్పుకోమని చెప్పు. వారు తమ అలంకారాన్ని తమ భర్తలకు, తమ తండ్రులకు, తమ భర్తల తండ్రులకు, తమ కుమారులకు, తమ భర్తల కుమారులకు, తమ సోదరులకు, తమ సోదరుల కుమారులకు, తమ సోదరీమణుల కుమారులకు, తమ (తోటి స్త్రీలకు, తమ బానిస స్త్రీలకు, లేక కామ ఇచ్ఛలేని మగ సేవకులకు, లేక స్త్రీల గుప్తాంగాలను గురించి తెలియని బాలురకు తప్ప. ఇతరుల ముందు ప్రదర్శించకూడదని మరియు కనబడకుండా ఉన్న తమ అలంకారం తెలియబడేటట్లుగా, వారు తమ పాదాలను నేలపై కొడుతూ నడవకూడదని చెప్పు. మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు)
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤ
మీలోని పెండ్లికాని వారికి మరియు శీలవతులైన మీ బానిస పురుషులు మరియు బానిస స్త్రీలకు వివాహాలు చేయించండి. ఒకవేళ వారు పేదవారయితే, అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని సంపన్నులగా చేయవచ్చు! మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు
ﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙ
ఎవరికైతే, పెండ్లి చేసుకునే శక్తి లేదో వారు, అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేసే వరకు శీలశుద్ధతను పాటించాలి. మరియు మీ బానిసలలో ఎవరైనా స్వేచ్ఛాపత్రం వ్రాయించుకోగోరితే వారి యందు మీకు మంచితనం కనబడితే, వారికి స్వేచ్ఛాపత్రం వ్రాసి ఇవ్విండి. అల్లాహ్ మీకు ఇచ్చిన ధనం నుండి వారికి కూడా కొంత ఇవ్వండి. మీరు ఇహలోక ప్రయోజనాల నిమిత్తం, మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరితే వారిని వ్యభిచారానికి బలవంతపెట్టకండి, ఎవరైనా వారిని బలవంతపెడితే! నిశ్చయంగా, అల్లాహ్ వారిని (ఆ బానిస స్త్రీలకు) బలాత్కారం తరువాత క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత
ﮚﮛﮜﮝﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧ
మరియు వాస్తవానికి, మేము మీ వద్దకు స్పష్టమైన సూచనలను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను మరియు దైవభీతి గలవారికి బోధనలను (ఉపదేశాలను) అవతరింపజేశాము
ﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁ
అల్లాహ్ ఆకాశాలకూ మరియు భూమికీ జ్యోతి. ఆయన జ్యోతిని, గూటిలోని దీపంలో పోల్చవచ్చు. ఆ దీపం చుట్టూ గాజు ఉంది. ఆ గాజు ఒక నక్షత్రం వలే ప్రకాశిస్తున్నది. అదొక పావనమైన జైతూన్ వృక్షం (నూనె) తో వెలిగించబడుతున్నది, అది (ఆ వృక్షం) తూర్పుకు గానీ, పడమరకు గానీ చెందినది కాదు. దాని నూనె అగ్ని అంటకున్నా మండుతూనే ఉంటుంది. వెలుగు మీద వెలుగు! అల్లాహ్ తన వెలుగు వైపునకు తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. అల్లాహ్ ఉదాహరణల ద్వారా ప్రజలకు బోధిస్తాడు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు
ﰂﰃﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌﰍﰎﰏﰐ
అల్లాహ్ ఏ ఇండ్లను (మస్జిదులను) లేపి, వాటిలో ఆయన నామాన్ని స్మరించమని సెలవిచ్చాడో, అందులో వారు, ఆయన పవిత్రతను ఉదయం మరియు సాయంత్రం స్తుతిస్తూ ఉంటారు
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤ
ప్రజలలో కొందరిని - వారి వ్యాపారం గానీ మరియు క్రయవిక్రయాలు గానీ - అల్లాహ్ స్మరణ నుండీ, నమాజ్ స్థాపించడం నుండీ మరియు విధిదానం (జకాత్) ఇవ్వడం నుండీ తప్పించలేవు. హృదయాలు మరియు కనుగ్రుడ్లు గిరగిర తిరిగి పోయే, ఆ దినమును గురించి, వారు భయపడుతూ ఉంటారు
ﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴ
వారు ఇలా చేయటం, అల్లాహ్ వారికి వారి మంచిపనుల కొరకు ప్రతిఫలమివ్వటానికి; మరియు తన అనుగ్రహాలను వారిపై అధికం చేయటానికి. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు
ﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌ
ఇక సత్యాన్ని తిరస్కరించిన వారి కర్మలను ఎడారిలోని ఎండమావితో పోల్చ వచ్చు. దప్పిక గొన్నవాడు - దానిని నీరుగా భావించి దాని వద్దకు చేరి, చివరికి ఏమీ పొందలేక - అక్కడ అల్లాహ్ ను పొందుతాడు. అప్పుడు ఆయన అతని లెక్కను పూర్తిగా తీర్చుతాడు. మరియు అల్లాహ్ లెక్క తీర్చటంలో అతి శీఘ్రుడు
ﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰ
లేక (సత్యతిరస్కారుల పరిస్థితి) చాలా లోతుగల సముద్రంలోని చీకట్లవలే ఉంటుంది. దానిపై ఒక గొప్ప అల క్రమ్ముకొని ఉంటుంది. దానిపై మరొక గొప్ప అల, దానిపై మేఘాలు. చీకట్లు ఒకదానిపై నొకటి క్రమ్ముకొని ఉంటాయి. అపుడు ఎవడైనా తన చేతిని (చూడాలని) చాచితే, వాడు దానిని చూడలేడు. మరియు ఎవనికైతే అల్లాహ్ వెలుగునివ్వడో, అతనికి ఏ మాత్రం వెలుగు దొరకదు
ﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩ
ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా) ? నిశ్చయంగా, భూమ్యాకాశాలలో ఉన్న సర్వమూ మరియు రెక్కలు విప్పి ఎగిరే పక్షులు సైతం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయని? వాస్తవానికి ప్రతిదానికి తన నమాజ్ మరియు స్తోత్రం చేసే పద్ధతి తెలుసు. మరియు అవి చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
ﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲ
మరియు భూమ్యాకాశాల మీద సర్వాధిపత్యం అల్లాహ్ దే! మరియు అల్లాహ్ వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది
ﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌﰍﰎﰏﰐﰑﰒﰓﰔﰕﰖﰗﰘﰙﰚ
ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా) ? నిశ్చయంగా, అల్లాహ్ యే మేఘాలను మెల్లమెల్లగా నడుపుతూ, వాటిని ఒక దానితో ఒకటి కలుపుతాడని, ఆ తరువాత వాటిని ప్రోగు చేస్తాడని! ఆ పిదప వాటి నుండి వర్షాన్ని కురిపించేది నీవు చూస్తున్నావు కదా! మరియు ఆయనే ఆకాశంలో ఉన్న కొండల వంటి (మేఘాల) నుండి వడగండ్ల చల్లని (వర్షాన్ని) తాను కోరిన వారిపై కురిపిస్తాడు. మరియు తాను కోరిన వారిని వాటి నుండి తప్పిస్తాడు. వాటి పిడుగు యొక్క మెరుపు కంటి చూపులను దాదాపు హరించేలా ఉంటుంది
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜ
అల్లాహ్ యే రేయింబవళ్లను మార్చుతున్నాడు. నిశ్చయంగా, కన్నులు గలవారికి ఇందులో గుణపాఠముంది
ﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿ
మరియు అల్లాహ్ ప్రతి ప్రాణిని నీటి నుండి సృష్టించాడు. వాటిలో కొన్ని తమ కడుపు మీద ప్రాకేవి ఉన్నాయి. మరియు వాటిలో కొన్ని రెండు కాళ్ళ మీద నడిచేవి ఉన్నాయి. మరియు వాటిలో మరికొన్ని నాలుగు (కాళ్ళ) మీద నడిచేవి ఉన్నాయి. అల్లాహ్ తాను కోరిన దానిని సృష్టిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు
ﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌ
వాస్తవంగా! మేము సుస్పష్టమైన సూచనలను (ఆయాత్ లను) అవతరింపజేశాము. మరియు అల్లాహ్ తాను కోరిన వానికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు
ﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝ
వారు (కపట విశ్వాసులు) అంటారు: మేము అల్లాహ్ ను మరియు సందేశహరుణ్ణి విశ్వసించాము మరియు విధేయుల మయ్యాము." కాని దాని తరువాత వారిలో ఒక వర్గం వారు వెను దిరిగి పోతారు. మరియు అలాంటి వారు విశ్వసించిన వారు కారు
ﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩ
మరియు వారి మధ్య తీర్పు చేయటానికి, వారిని అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని వద్దకు పిలిచినప్పుడు, వారిలోని ఒక వర్గం వారు ముఖం త్రిప్పుకుంటారు
ﮪﮫﮬﮭﮮﮯﮰﮱ
మరియు ఒకవేళ తీర్పు (సత్యం) వారికి అనుకూలమైనదిగా ఉంటే, వారు వినమ్రతతో దానిని స్వీకరిస్తారు
ﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤ
ఏమీ? వారి హృదయాలలో రోగముందా? లేక వారు సందేహంలో పడి పోయారా? లేక అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు తమకు న్యాయం చేయరని వారికి భయమా? అలా కాదు! అసలు వారే అన్యాయపరులు
ﯥﯦﯧﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸ
కాని వాస్తవానికి ఒకవేళ విశ్వాసులను, వారి మధ్య తీర్పు చేయటానికి అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని వద్దకు పిలిచినప్పుడు, వారి పలుకులు కేవలం ఇలాగే ఉంటాయి: మేము విన్నాము మరియు విధేయత చూపాము" మరియు ఇలాంటి వారే సాఫల్యం పొందేవారు
ﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃ
మరియు అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి విధేయత చూపేవారు మరియు అల్లాహ్ కు భయపడి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారు, ఇలాంటి వారే సాఫల్యం (విజయం) పొందేవారు
ﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌﰍﰎﰏﰐﰑﰒﰓﰔﰕﰖﰗﰘﰙ
మరియు నీవు ఒకవేళ ఆజ్ఞాపిస్తే, అంతా వదలి తప్పక బయలుదేర గలమని వారు (ఆ కపట విశ్వాసులు) అల్లాహ్ పేరుతో గట్టి ప్రమాణాలు చేస్తారు. వారితో అను: ప్రమాణాలు చేయకండి; మీ విధేయత తెలిసిందే. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫ
వారితో అను: అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు సందేశహరుణ్ణి అనుసరించండి. కాని ఒకవేళ మీరు మరలిపోతే, అతనిపై (ప్రవక్తపై) విధించబడినదాని బాధ్యత అతనిది; మరియు మీపై విధించబడినదాని బాధ్యత మీది. మీరు అతనిని (ప్రవక్తను) అనుసరిస్తే మార్గదర్శకత్వం పొందుతారు. మరియు సందేశహరుని బాధ్యత కేవలం స్పష్టంగా సందేశాన్ని అందజేయటం మాత్రమే
ﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔ
మరియు మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారితో: వారికి పూర్వం వారిని భూమికి ఉత్తరాధికారులుగా చేసినట్లు, వారిని కూడా ఉత్తరాధికారులుగా చేస్తానని; మరియు వారి కొరకు తాను సమ్మతించిన ధర్మాన్ని (ఇస్లాంను) స్థిరపరుస్తానని; మరియు వారి పూర్వపు భయస్థితిని వారి కొరకు శాంతిస్థితిగా మార్చుతానని, అల్లాహ్ వాగ్దానం చేశాడు. (ఇదంతా) వారు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించాలని మరియు నాకు ఎవరినీ సాటిగా (భాగస్వాములగా) కల్పించరాదని, మరియు దీని తరువాత కూడా ఎవరైనా సత్యతిరస్కారానికి పాల్పబడితే అలాంటి వారు, వారే అవిధేయులు
ﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝ
మరియు మీరు కరుణించబడాలి అంటే నమాజ్ స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు సందేశహరునికి విధేయులై ఉండండి
ﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫ
సత్యతిరస్కారులు భూమిలో తప్పించుకుంటారని భావించవద్దు. వారి నివాసం నరకాగ్నియే! అది ఎంత అధ్వాన్నమైన గమ్యస్థానం
ﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄ
ఓ విశ్వాసులారా! మీ బానిసలు మరియు యుక్తవయస్సుకు చేరని మీ పిల్లలు, మూడు సమయాలలో అనుమతి తీసుకొనే మీ వద్దకు రావాలి. (అవి) ఉదయపు (ఫజ్ర్) నమాజ్ కు ముందు, మధ్యాహ్నం (జుహ్ర్) తరువాత - మీరు మీ వస్త్రాలు విడిచి ఉన్నప్పుడు - మరియు రాత్రి (ఇషా) నమాజ్ తరువాత. ఈ మూడు, మీ కొరకు ఏకాంత (పరదా) సమయాలు. వీటి తరువాత వారు మరియు మీరు ఒకరి వద్దకు మరొకరు వచ్చి పోతూ వుంటే, వారిపై గానీ, మీపై గానీ ఎలాంటి దోషం లేదు. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦ
మరియు మీ పిల్లలు యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు; వారి కంటే పెద్దవారు (ముందువారు) అనుమతి తీసుకున్నట్లు వారు కూడా అనుమతి తీసుకోవాలి. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
ﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀ
మరియు ఋతుస్రావం ఆగిపోయి, వివాహ ఉత్సాహంలేని స్త్రీలు - తమ సౌందర్యం బయట పడకుండా ఉండేటట్లుగా - తమపై వస్త్రాలను (దుప్పట్లను) తీసి వేస్తే, వారిపై దోషం లేదు. కాని వారు అట్లు చేయకుండా ఉండటమే వారికి ఉత్తమమైనది. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
ﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱ
అంధుని మీద నిందలేదు మరియు కుంటివాని మీద నిందలేదు మరియు రోగి మీద నిందలేదు మరియు మీ మీద కూడా నిందలేదు: ఒకవేళ మీరు మీ ఇండ్లలో లేదా మీ తండ్రితాతల ఇండ్లలో లేదా మీ తల్లి నాయనమ్మల ఇండ్లలో లేదా మీ సోదరుల ఇండ్లలో లేదా మీ సోదరీమణుల ఇండ్లలో లేదా పినతండ్రుల (తండ్రి సోదరుల) ఇండ్లలో లేదా మీ మేనత్తల (తండ్రిసోదరీమణుల) ఇండ్లలో లేదా మీ మేనమామల (తల్లి సోదరుల) ఇండ్లలో లేదా మీ పిన్నమ్మల (తల్లి సోదరీమణుల) ఇండ్లలో లేదా మీ ఆధీనంలో తాళపు చెవులు ఉన్నవారి ఇండ్లలో లేదా మీ స్నేహితుల ఇండ్లలో తింటే! మీరు అందరితో కలిసి తిన్నా లేదా వేరుగా తిన్నా కూడా మీపై నింద లేదు. అయితే మీరు ఇండ్లలోనికి ప్రవేశించినపుడు, మీరు ఒకరి కొకరు సలాం చేసుకోవాలి. ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన దీవెన, శుభప్రదమైనది మేలైనది. ఈ విధంగా, అల్లాహ్ - మీరు అర్థం చేసుకుంటారని - తన ఆజ్ఞలను మీకు విశదీకరిస్తున్నాడు
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻ
అల్లాహ్ ను ఆయన ప్రవక్తను హృదయపూర్వకంగా విశ్వసించిన వారే నిజమైన విశ్వాసులు మరియు వారు ఏదైనా సామూహిక కార్యం నిమిత్తం అతనితో (దైవప్రవక్తతో) ఉన్నప్పుడు, అతని అనుమతి లేనిదే వెళ్ళిపోకూడదు. నిశ్చయంగా, ఎవరైతే నీతో (ఓ ముహమ్మద్!) అనుమతి అడుగుతారో అలాంటి వారే వాస్తవంగా! అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించిన వారు. కనుక వారు తమ ఏ పని కొరకైనా అనుమతి అడిగితే, వారిలో నీవు కోరిన వారికి అనుమతినివ్వు. మరియు వారిని క్షమించమని అల్లాహ్ ను ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
ﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙ
(ఓ విశ్వాసులారా!) సందేశహరుని పిలుపును మీరు, మీలో ఒకరి నొకరు పిలుచుకునే పిలుపుగా భావించకండి. మీలో ఒకరి చాటున ఒకరు దాక్కుంటూ మెల్లగా జారిపోయే వారిని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించే వారు, తాము ఏదైనా ఆపదలో చిక్కుకు పోతారేమోననీ లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడాలి
ﮚﮛﮜﮝﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓ
వినండి! నిశ్చయంగా, ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్తమూ అల్లాహ్ దే! మీ స్థితి ఆయనకు బాగా తెలుసు మరియు అందరూ ఆయన వద్దకు మరలింపబడిన రోజు వారు చేసి వచ్చిన కర్మలన్నీ ఆయన వారికి తెలియజేస్తాడు. మరియు అల్లాహ్ కు ప్రతి దానిని గురించి పూర్తి జ్ఞానముంది

పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers