సూరా అల్-ఇన్షికాక్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అల్-ఇన్షికాక్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ఇన్షికాక్ అనువాదం. సూరా అల్-ఇన్షికాక్ (Meccan) 25 వచనం.
Related
- సూరా అల్-ఇన్షికాక్ అనువాదంతెలుగు
- సూరా అల్-ఇన్షికాక్ mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అల్-ఇన్షికాక్

ﭣﭤﭥﭦ
84:1
ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు
ﭧﭨﭩﭪ
84:2
మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం
ﭫﭬﭭﭮ
84:3
మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు
ﭯﭰﭱﭲﭳ
84:4
మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు
ﭴﭵﭶﭷ
84:5
అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం
ﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀ
84:6
ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు
ﮁﮂﮃﮄﮅﮆ
84:7
అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి
ﮇﮈﮉﮊﮋ
84:8
అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు
ﮌﮍﮎﮏﮐ
84:9
మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు
ﮑﮒﮓﮔﮕﮖﮗ
84:10
ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు
ﮘﮙﮚﮛ
84:11
అప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు
ﮜﮝﮞ
84:12
మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు
ﮟﮠﮡﮢﮣﮤ
84:13
వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు
ﮥﮦﮧﮨﮩﮪ
84:14
వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు
ﮫﮬﮭﮮﮯﮰﮱﯓ
84:15
అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు
ﯔﯕﯖﯗ
84:16
కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను
ﯘﯙﯚﯛ
84:17
రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా
ﯜﯝﯞﯟ
84:18
పూర్ణచంద్రుని సాక్షిగా
ﯠﯡﯢﯣﯤ
84:19
మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది
ﯥﯦﯧﯨﯩ
84:20
అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు
ﯪﯫﯬﯭﯮﯯﯰﯱ
84:21
మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు
ﯲﯳﯴﯵﯶ
84:22
అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు
ﯷﯸﯹﯺﯻ
84:23
మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
ﯼﯽﯾﯿ
84:24
కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚ
84:25
విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







