PDF —
26 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-గాషియా pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-గాషియా pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-గాషియా అనువాదం. సూరా అల్-గాషియా (Meccan) 26 వచనం.

← అల్-ఆలాసూరా అల్-గాషియా అల్-ఫజ్ర్ →


26 వచనం · Meccan · తెలుగు
bismillah
ﭽﭾﭿﮀﮁ
88:1 హఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు (పునరుత్థాన దినపు) సమాచారం నీకు అందిందా
ﮂﮃﮄﮅ
88:2 కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి
ﮆﮇﮈ
88:3 (ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి
ﮉﮊﮋﮌ
88:4 వారు దహించే అగ్నిలో పడి కాలుతారు
ﮍﮎﮏﮐﮑ
88:5 వారికి సలసల కాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది
ﮒﮓﮔﮕﮖﮗﮘ
88:6 వారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు
ﮙﮚﮛﮜﮝﮞﮟ
88:7 అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు
ﮠﮡﮢﮣ
88:8 ఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి
ﮤﮥﮦ
88:9 తాము చేసుకున్న సత్కార్యాలకు (ఫలితాలకు) వారు సంతోషపడుతూ ఉంటారు
ﮧﮨﮩﮪ
88:10 అత్యున్నతమైన స్వర్గవనంలో
ﮫﮬﮭﮮﮯ
88:11 అందులో వారు ఎలాంటి వృథా మాటలు వినరు
ﮰﮱﯓﯔ
88:12 అందులో ప్రవహించే సెలయేళ్ళు ఉంటాయి
ﯕﯖﯗﯘ
88:13 అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి
ﯙﯚﯛ
88:14 మరియు పేర్చబడిన (మధు) పాత్రలు
ﯜﯝﯞ
88:15 మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు
ﯟﯠﯡ
88:16 మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు
ﯢﯣﯤﯥﯦﯧﯨ
88:17 ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో
ﯩﯪﯫﯬﯭ
88:18 మరియు ఆకాశం వైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో
ﯮﯯﯰﯱﯲ
88:19 మరియు కొండల వైపుకు చూడరా?అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో
ﯳﯴﯵﯶﯷ
88:20 మరియు భూమి వైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో
ﯸﯹﯺﯻﯼ
88:21 కావున (ఓ ముహమ్మద్!) నీవు హితోపదేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసే వాడవు మాత్రమే
ﯽﯾﯿﰀ
88:22 నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు
ﭑﭒﭓﭔﭕ
88:23 ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో
ﭖﭗﭘﭙﭚ
88:24 అప్పుడు అతనికి అల్లాహ్ ఘోరశిక్ష విధిస్తాడు
ﭛﭜﭝﭞ
88:25 నిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది
ﭟﭠﭡﭢﭣ
88:26 ఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers