PDF —
52 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-హాక్కా pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-హాక్కా pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-హాక్కా అనువాదం. సూరా అల్-హాక్కా (Meccan) 52 వచనం.

← అల్-ఖలమ్సూరా అల్-హాక్కా అల్-మఆరిజ్ →


52 వచనం · Meccan · తెలుగు
bismillah
ﮯﮰ
69:1 ఆ అనివార్య సంఘటన (పునరుత్థానం)
ﮱﯓﯔ
69:2 ఏమిటా అనివార్య సంఘటన
ﯕﯖﯗﯘﯙ
69:3 మరియు ఆ అనివార్య సంఘటన, అంటే ఏమిటో నీకేమి తెలుసు
ﯚﯛﯜﯝﯞ
69:4 సమూద్ మరియు ఆద్ జాతి వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ ఉపద్రవాన్ని అసత్యమని తిరస్కరించారు
ﯟﯠﯡﯢﯣ
69:5 కావున సమూద్ జాతి వారైతే ఒక భయంకరమైన గర్జన ద్వారా నాశనం చేయబడ్డారు
ﯤﯥﯦﯧﯨﯩﯪ
69:6 మరియు ఆద్ జాతి వారేమో అతి తీవ్రమైన తుఫాను గాలి ద్వారా నాశనం చేయబడ్డారు
ﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻ
69:7 ఆయన (అల్లాహ్), దానిని వారి మీద ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళ వరకు ఎడతెగకుండా ఆవరింపజేశాడు. దాని వలన వారు వేళ్ళతో పెళ్ళగించబడిన ఖర్జూరపు బోదెల వలే పాడై పోవటం, నీవు చూస్తావు
ﯼﯽﯾﯿﰀﰁ
69:8 అయితే ఇప్పుడు వారిలో ఎవరైనా మిగిలి ఉన్నట్లు నీవు చూస్తున్నావా
ﭑﭒﭓﭔﭕﭖﭗ
69:9 ఫిర్ఔన్ మరియు అతనికి పూర్వం గతించిన వారూ మరియు తలక్రిందులు చేయబడిన నగరాల వారూ, అందరూ గొప్ప నేరాలకు పాల్పడినవారే
ﭘﭙﭚﭛﭜﭝﭞ
69:10 మరియు వారు తమ ప్రభువు పంపిన ప్రవక్తలకు అవిధేయత కనబరచారు, కావున ఆయన వారిని కఠినమైన పట్టుతో పట్టుకున్నాడు
ﭟﭠﭡﭢﭣﭤﭥﭦ
69:11 నిశ్చయంగా, ఎప్పుడైతే (నూహ్ తుఫాన్) నీరు హద్దు లేకుండా ఉప్పొంగి పోయిందో! అప్పుడు మేము, మిమ్మల్ని పయనించే (నావలో) ఎక్కించాము
ﭧﭨﭩﭪﭫﭬﭭ
69:12 దానిని, మీకొక హితబోధగానూ మరియు జ్ఞాపకముంచుకోగల చెవి, దానిని జ్ఞాపకం ఉంచుకోవటానికి అనువైనదిగా చేశాము
ﭮﭯﭰﭱﭲﭳﭴ
69:13 ఇక ఎప్పుడైతే ఒక పెద్ద ధ్వనితో బాకా ఊదబడుతుందో
ﭵﭶﭷﭸﭹﭺﭻ
69:14 మరియు భూమి మరియు పర్వతాలు పైకి ఎత్తబడి ఒక పెద్ద దెబ్బతో తుత్తునియలుగా చేయబడతాయో
ﭼﭽﭾﭿ
69:15 అప్పుడు, ఆ రోజున సంభవించవలసిన ఆ అనివార్య సంఘటన సంభవిస్తుంది
ﮀﮁﮂﮃﮄﮅ
69:16 మరియు ఆ రోజున ఆకాశం బ్రద్దలై పోతుంది మరియు దాని వ్యవస్థ సడలి పోతుంది
ﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐ
69:17 మరియు దేవదూతలు దాని (అర్ష్) ప్రక్కలలో ఉంటారు. మరియు నీ ప్రభువు యొక్క సింహాసనాన్ని (అర్ష్ ను), ఆ రోజు ఎనిమిది మంది (దేవదూతలు) ఎత్తుకొని ఉంటారు
ﮑﮒﮓﮔﮕﮖﮗ
69:18 ఆ రోజు మీరు (తీర్పు కొరకు) హాజరు చేయబడతారు. మీరు దాచిన ఏ రహస్యం కూడా (ఆ రోజు) దాగి ఉండదు
ﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠﮡ
69:19 ఇక ఎవనికైతే తన కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు: ఇదిగో నా కర్మపత్రాన్ని తీసుకొని చదవండి
ﮢﮣﮤﮥﮦﮧ
69:20 నిశ్చయంగా, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను భావించేవాడిని
ﮨﮩﮪﮫﮬ
69:21 కావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు
ﮭﮮﮯﮰ
69:22 అత్యున్నతమైన స్వర్గవనంలో
ﮱﯓﯔ
69:23 దాని పండ్లగుత్తులు, సమీపంలో వ్రేలాడుతూ ఉంటాయి
ﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝ
69:24 (వారితో ఇలా అనబడుతుంది): గడిచి పోయిన దినాలలో మీరు చేసి పంపిన కర్మలకు ప్రతిఫలంగా, ఇప్పుడు మీరు హాయిగా తినండి మరియు త్రాగండి
ﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨ
69:25 ఇక ఎవడికైతే, తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతడు ఇలా వాపోతాడు: అయ్యో! నా పాడుగాను! నా కర్మపత్రం అసలు నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది
ﯩﯪﯫﯬﯭ
69:26 మరియు నా లెక్క ఏమిటో నాకు తెలియకుంటే ఎంత బాగండేది
ﯮﯯﯰﯱ
69:27 అయ్యో! నా పాడుగాను! అది (ఆ మరణమే) నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది
ﯲﯳﯴﯵﯶﯷ
69:28 నా సంపద నాకేమీ పనికి రాలేదు
ﯸﯹﯺﯻ
69:29 నా అధికారమంతా అంతమై పోయింది
ﯼﯽﯾ
69:30 (అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి
ﯿﰀﰁﰂ
69:31 తరువాత అతనిని భగభగమండే నరకాగ్నిలో వేయండి
ﰃﰄﰅﰆﰇﰈﰉﰊ
69:32 ఆ తరువాత అతనిని డెబ్భై మూరల పొడవు గల గొలుసుతో బంధించండి
ﰋﰌﰍﰎﰏﰐﰑ
69:33 వాస్తవానికి అతడు సర్వోత్తముడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు
ﰒﰓﰔﰕﰖﰗ
69:34 మరియు నిరుపేదలకు ఆహారం పెట్టమని ప్రోత్సహించేవాడు కాదు
ﰘﰙﰚﰛﰜﰝ
69:35 కావున, ఈనాడు అతనికి ఇక్కడ ఏ స్నేహితుడూ లేడు
ﭑﭒﭓﭔﭕﭖ
69:36 మరియు అసహ్యకరమైన గాయాల కడుగు తప్ప, మరొక ఆహారమూ లేదు
ﭗﭘﭙﭚﭛ
69:37 దానిని పాపులు తప్ప మరెవ్వరూ తినరు
ﭜﭝﭞﭟﭠ
69:38 కావున, నేను మీరు చూడగలిగే వాటి శపథం చేస్తున్నాను
ﭡﭢﭣﭤ
69:39 మరియు మీరు చూడలేనట్టని వాటి (శపథం) కూడా
ﭥﭦﭧﭨﭩ
69:40 నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుని (పై అవతరింప జేయబడిన) వాక్కు
ﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲ
69:41 మరియు ఇది ఒక కవి యొక్క వాక్కు కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ
ﭳﭴﭵﭶﭷﭸﭹﭺ
69:42 మరియు ఇది ఏ జ్యాతిష్యుని వాక్కు కూడా కాదు! మీరు గ్రహించేది చాలా తక్కువ
ﭻﭼﭽﭾﭿ
69:43 ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది
ﮀﮁﮂﮃﮄﮅ
69:44 ఒకవేళ ఇతను (ఈ ప్రవక్త), మా (అల్లాహ్ ను) గురించి ఏదైనా అబద్ధపు మాట కల్పించి ఉంటే
ﮆﮇﮈﮉ
69:45 మేము అతని కుడి చేతిని పట్టుకునే వారం
ﮊﮋﮌﮍﮎ
69:46 తరువాత అతని (మెడ) రక్తనాళాన్ని కోసేవారం
ﮏﮐﮑﮒﮓﮔﮕ
69:47 అప్పుడు మీలో నుండి ఏ ఒక్కడు కూడా అతనిని (మా శిక్ష నుండి) కాపాడ లేక పోయేవాడు
ﮖﮗﮘﮙ
69:48 మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) దైవభీతి గల వారికొక హితోపదేశం
ﮚﮛﮜﮝﮞﮟ
69:49 మరియు నిశ్చయంగా మీలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని అనేవారు ఉన్నారని మాకు బాగా తెలుసు
ﮠﮡﮢﮣﮤ
69:50 మరియు నిశ్చయంగా, ఇది (ఈ తిరస్కారం) సత్యతిరస్కారులకు దుఃఖ కారణమవుతుంది
ﮥﮦﮧﮨ
69:51 మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నమ్మదగిన సత్యం
ﮩﮪﮫﮬﮭ
69:52 కావున నీవు సర్వోత్తముడైన నీ ప్రభువు పవిత్ర నామాన్ని స్తుతించు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers