సూరా అల్-ఆలా pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అల్-ఆలా pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ఆలా అనువాదం. సూరా అల్-ఆలా (Meccan) 19 వచనం.
Related
- సూరా అల్-ఆలా అనువాదంతెలుగు
- సూరా అల్-ఆలా mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అల్-ఆలా

ﮟﮠﮡﮢﮣ
87:1
అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు
ﮤﮥﮦﮧ
87:2
ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు
ﮨﮩﮪﮫ
87:3
మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు
ﮬﮭﮮﮯ
87:4
మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు
ﮰﮱﯓﯔ
87:5
మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు
ﯕﯖﯗﯘ
87:6
మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు
ﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣ
87:7
అల్లాహ్ కోరింది తప్ప! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు
ﯤﯥﯦ
87:8
మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము
ﯧﯨﯩﯪﯫ
87:9
కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు
ﯬﯭﯮﯯ
87:10
(అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు
ﭑﭒﭓ
87:11
మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు
ﭔﭕﭖﭗﭘ
87:12
అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు
ﭙﭚﭛﭜﭝﭞﭟ
87:13
అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు
ﭠﭡﭢﭣﭤ
87:14
సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు
ﭥﭦﭧﭨﭩ
87:15
మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు
ﭪﭫﭬﭭﭮ
87:16
అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు
ﭯﭰﭱﭲ
87:17
కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది
ﭳﭴﭵﭶﭷﭸ
87:18
నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది
ﭹﭺﭻﭼ
87:19
ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







