PDF —
45 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా ఖాఫ్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా ఖాఫ్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా ఖాఫ్ అనువాదం. సూరా ఖాఫ్ (Meccan) 45 వచనం.



45 వచనం · Meccan · తెలుగు
bismillah
ﭑﭒﭓﭔﭕ
50:1 ఖాఫ్, మరియు దివ్యమైన ఈ ఖుర్ఆన్ సాక్షిగా
ﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡ
50:2 అలా కాదు! హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వారిలో నుంచే వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది, కావున సత్యతిరస్కారులు ఇలా అన్నారు: ఇది ఆశ్చర్యకరమైన విషయం
ﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪ
50:3 మేము మరణించి మట్టిగా మారి పోయినా (మరల బ్రతికించ బడతామా)? ఈ విధంగా మరల (సజీవులై) రావటం చాలా అసంభవమైన విషయం
ﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵ
50:4 వాస్తవానికి వారి (శరీరాల)లో నుండి భూమి దేనిని తగ్గిస్తుందో మాకు బాగా తెలుసు. మరియు మా దగ్గర అంతా ఒక సురక్షితమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది
ﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿ
50:5 కాని వారు, సత్యం వారి వద్దకు వచ్చినపుడు దానిని అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు ఈ విషయం గురించి కలవరపడుతున్నారు
ﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌ
50:6 వారు, తమ మీద ఉన్న ఆకాశం వైపునకు చూడటం లేదా ఏమిటి? మేము దానిని ఏ విధంగా నిర్మించి అలంకరించామో మరియు దానిలో ఎలాంటి చీలికలూ (పగుళ్ళూ) లేవు
ﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘ
50:7 ఇక భూమిని! మేము దానిని విస్తరింపజేసి, దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము. మరియు అందులో అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పత్తి చేశాము
ﮙﮚﮛﮜﮝﮞ
50:8 (అల్లాహ్) వైపునకు మరలే ప్రతి దాసునికి సూచనగా మరియు బోధనగా
ﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩ
50:9 మరియు మేము ఆకాశం నుండి శుభదాయకమైన నీటిని కురిపించి దాని ద్వారా తోటలను ఉత్పత్తి చేశాము మరియు ధాన్యాలను పండించాము
ﮪﮫﮬﮭﮮﮯ
50:10 మరియు ఎత్తయిన ఖర్జూరపు చెట్లను పెంచి, వాటికి వరుసలలో పండ్ల గుత్తులను (పుట్టించాము)
ﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛ
50:11 మా దాసులకు జీవనోపాధిగా మరియు దానితో (ఆ నీటితో) చచ్చిన భూమికి ప్రాణం పోశాము. ఇదే విధంగా (చచ్చిన వారిని) కూడా లేపుతాము
ﯜﯝﯞﯟﯠﯡﯢﯣ
50:12 వారికి పూర్వం నూహ్ జాతి వారు, అర్ రస్ వాసులు మరియు సమూద్ జాతి వారు కూడా, సత్యాన్ని తిరస్కరించారు
ﯤﯥﯦﯧﯨ
50:13 మరియు ఆద్ జాతి వారు, ఫిర్ఔన్ జాతి వారు మరియు లూత్ సహోదరులు కూడా
ﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳ
50:14 మరియు అయ్ కహ్ (వన) వాసులు మరియు తుబ్బఅ జాతి వారు కూడాను. ప్రతి ఒక్కరూ తమ ప్రవక్తలను అసత్యులని తిరస్కరించారు, కావున నా బెదరింపు వారి విషయంలో సత్యమయింది
ﯴﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿ
50:15 ఏమిటి? మేము మొదటి సృష్టితోనే అలసిపోయామా? అలా కాదు, అసలు వారు కొత్త సృష్టి (పునరుత్థానమును) గురించి సందేహంలో పడి ఉన్నారు
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠ
50:16 మరియు వాస్తవంగా, మేమే మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనస్సులో మెదిలే ఊహలను కూడా మేము ఎరుగుతాము. మరియు మేము అతనికి అతని కంఠ రక్తనాళం కంటే కూడా అతి దగ్గరగా ఉన్నాము
ﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩ
50:17 (జ్ఞాపకముంచుకోండి) అతని కుడి మరియు ఎడమ ప్రక్కలలో కూర్చుండి (ప్రతి విషయాన్ని వ్రాసే) ఇద్దరు పర్యవేక్షకులు (దేవదూతలు) అతనిని కలుసుకొన్న తరువాత నుంచి
ﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲ
50:18 అతనితో బాటు ఒక పర్యవేక్షకుడైనా సిద్ధంగా లేనిదే - అతడు ఏ మాటనూ పలకలేడు
ﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽ
50:19 మరియు మరణ మూర్ఛ వచ్చేది సత్యం. అది, ఇదే! దేని నుండైతే నీవు తప్పించుకో గోరుతూ ఉండేవాడివో
ﭾﭿﮀﮁﮂﮃﮄﮅ
50:20 మరియు బాకా (సూర్) ఊదబడుతుంది. ఆ హెచ్చరించబడిన (పునరుత్థాన) దినం అదే
ﮆﮇﮈﮉﮊﮋﮌ
50:21 మరియు ప్రతి ఆత్మ (ప్రాణి) ఒక తోలేవాడితో మరొక సాక్ష్యమిచ్చేవాడితో సహా వస్తుంది
ﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙ
50:22 (ఇలా అనబడుతుంది): వాస్తవానికి నీవు (ఈ దినాన్ని గురించి) నిర్లక్ష్యంగా ఉండే వాడివి. కావున ఇపుడు మేము నీ ముందున్న తెరను తొలగించాము. కావున, ఈ రోజు నీ దృష్టి చాలా చురుకుగా ఉంది
ﮚﮛﮜﮝﮞﮟﮠ
50:23 మరియు అతని సహచరుడు (ఖరీనున్) ఇలా అంటాడు: ఇదిగో నా దగ్గర సిద్ధంగా ఉన్న (ఇతని కర్మ పత్రం) ఇది
ﮡﮢﮣﮤﮥﮦﮧ
50:24 (ఇలా ఆజ్ఞ వస్తుంది): మూర్ఖపు పట్టు (హఠము) గల ప్రతి సత్యతిరస్కారుణ్ణి మీరిద్దరు కలసి నరకంలో విసరివేయండి
ﮨﮩﮪﮫﮬ
50:25 మంచిని నిషేధించే వాడిని, హద్దులు మీరి ప్రవర్తిస్తూ సందేహాలను వ్యాపింప జేసేవాడిని
ﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘ
50:26 అల్లాహ్ కు సాటిగా ఇతర ఆరాధ్య దైవాన్ని కల్పించినవాడు ఇతడే. కావున ఇతనిని మీరిద్దరూ కలిసి ఘోరశిక్షలో పడవేయండి
ﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤ
50:27 అతని స్నేహితుడు (ఖరీనున్) ఇలా అంటాడు: ఓ మా ప్రభూ! నేను ఇతని తలబిరుసుతనాన్ని ప్రోత్సహించలేదు, కాని ఇతడే స్వయంగా, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళి పోయాడు
ﯥﯦﯧﯨﯩﯪﯫﯬﯭ
50:28 ఆయన (అల్లాహ్) ఇలా అంటాడు: మీరు నా దగ్గర వాదులాడకండి మరియు వాస్తవానికి నేను ముందుగానే మీ వద్దకు హెచ్చరికను పంపి ఉన్నాను
ﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶ
50:29 నా దగ్గర మాట మార్చటం జరుగదు మరియు నేను నా దాసులకు అన్యాయం చేసేవాడను కాను
ﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀ
50:30 ఆ రోజు మేము నరకంతో: నీవు నిండిపోయావా?" అని ప్రశ్నిస్తాము. మరియు అది: ఇంకా ఏమైనా ఉందా ఏమిటి?" అని అడుగుతుంది
ﰁﰂﰃﰄﰅﰆ
50:31 మరియు స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకురాబడుతుంది! అది వారి నుండి ఏ మాత్రం దూరంగా ఉండదు
ﰇﰈﰉﰊﰋﰌﰍ
50:32 (వారితో ఇలా అనబడుతుంది): ఇదే మీకు వాగ్దానం చేయబడినది. మళ్ళీ మళ్ళీ మా వైపుకు మరలే ప్రతివానికి, (మా హద్దును) లక్ష్యపెట్టిన (పాటించిన) వానికి
ﰎﰏﰐﰑﰒﰓﰔﰕ
50:33 అగోచరుడైన ఆ కరుణామయునికి భయపడేవానికి మరియు మా వైపునకు పశ్చాత్తాప హృదయంతో మరలేవానికి
ﰖﰗﰘﰙﰚﰛﰜ
50:34 ఇందులో (ఈ స్వర్గంలో), శాంతితో ప్రవేశించండి. ఇదే శాశ్వాత జీవిత దినం
ﰝﰞﰟﰠﰡﰢﰣ
50:35 అందులో వారికి, వారు కోరేదంతా ఉంటుంది. మరియు మా దగ్గర ఇంకా చాలా ఉంది
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠ
50:36 మరియు మేము, వీరికి పూర్వం ఎన్నో తరాల వారిని నాశనం చేశాము. వారు వీరి కంటే ఎక్కువ శక్తిమంతులు. కాని, (మా శిక్ష పడినప్పుడు) వారు దేశదిమ్మరులై పోయారు. ఏమీ? వారికి తప్పించుకునే మార్గం ఏదైనా దొరికిందా
ﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮ
50:37 నిశ్చయంగా, హృదయమున్న వాడికి, శ్రద్ధతో వినేవాడికి మరియు లక్ష్యపెట్టే వాడికి ఇందులో ఒక గుణపాఠముంది
ﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼ
50:38 మరియు వాస్తవంగా! మేము ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాము. కాని మాకు ఎలాంటి అలసట కలుగలేదు
ﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉ
50:39 కావున (ఓ ముహమ్మద్!) వారు పలికే మాటలకు సహనం వహించు మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా
ﮊﮋﮌﮍﮎﮏ
50:40 మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు మరియు సాష్టాంగం (సజ్దా) చేసిన తరువాత కూడా స్తుతించు
ﮐﮑﮒﮓﮔﮕﮖﮗ
50:41 మరియు చెవి యొగ్గి విను, చాటింపు చేసేవాడు అతి దగ్గరి నుంచే పిలిచే రోజున
ﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠ
50:42 ఆ రోజు మీరు ఒక భయంకర శబ్దం వినేది సత్యం. (గోరీలలో నుండి) బయటికి వచ్చే దినం అదే
ﮡﮢﮣﮤﮥﮦﮧ
50:43 నిశ్చయంగా, మేమే జీవనమిచ్చే వారం మరియు మేమే మరణింపజేసే వారం మరియు మీ అందరి మరలింపు మా వైపునకే జరుగుతుంది
ﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓ
50:44 ఆ రోజు భూమి చీలిపోయి వారందరూ పరుగిడుతూ బయటికి వస్తారు. అదే సమావేశ సమయం. అది మాకెంతో సులభం
ﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣ
50:45 వారనేది మాకు బాగా తెలుసు. నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేయలేవు. కావున నా హెచ్చరికకు భయపడే వాడికి మాత్రమే నీవు ఈ ఖుర్ఆన్ ద్వారా హితబోధ చెయ్యి

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers