📖 0/604 చదివిన పేజీలు
📄 164
حَقِيقٌ عَلَىٰٓ أَن لَّآ أَقُولَ عَلَى ٱللَّهِ إِلَّا ٱلۡحَقَّۚ قَدۡ جِئۡتُكُم بِبَيِّنَةٍ مِّن رَّبِّكُمۡ فَأَرۡسِلۡ مَعِيَ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ  ۝١٠٥ قَالَ إِن كُنتَ جِئۡتَ بِـَٔايَةٍ فَأۡتِ بِهَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ  ۝١٠٦ فَأَلۡقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعۡبَانٌ مُّبِينٌ  ۝١٠٧ وَنَزَعَ يَدَهُۥ فَإِذَا هِيَ بَيۡضَآءُ لِلنَّٰظِرِينَ  ۝١٠٨ قَالَ ٱلۡمَلَأُ مِن قَوۡمِ فِرۡعَوۡنَ إِنَّ هَٰذَا لَسَٰحِرٌ عَلِيمٌ  ۝١٠٩ يُرِيدُ أَن يُخۡرِجَكُم مِّنۡ أَرۡضِكُمۡۖ فَمَاذَا تَأۡمُرُونَ  ۝١١٠ قَالُوٓاْ أَرۡجِهۡ وَأَخَاهُ وَأَرۡسِلۡ فِي ٱلۡمَدَآئِنِ حَٰشِرِينَ  ۝١١١ يَأۡتُوكَ بِكُلِّ سَٰحِرٍ عَلِيمٍ  ۝١١٢ وَجَآءَ ٱلسَّحَرَةُ فِرۡعَوۡنَ قَالُوٓاْ إِنَّ لَنَا لَأَجۡرًا إِن كُنَّا نَحۡنُ ٱلۡغَٰلِبِينَ  ۝١١٣ قَالَ نَعَمۡ وَإِنَّكُمۡ لَمِنَ ٱلۡمُقَرَّبِينَ  ۝١١٤ قَالُواْ يَٰمُوسَىٰٓ إِمَّآ أَن تُلۡقِيَ وَإِمَّآ أَن نَّكُونَ نَحۡنُ ٱلۡمُلۡقِينَ  ۝١١٥ قَالَ أَلۡقُواْۖ فَلَمَّآ أَلۡقَوۡاْ سَحَرُوٓاْ أَعۡيُنَ ٱلنَّاسِ وَٱسۡتَرۡهَبُوهُمۡ وَجَآءُو بِسِحۡرٍ عَظِيمٍ  ۝١١٦ ۞ وَأَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنۡ أَلۡقِ عَصَاكَۖ فَإِذَا هِيَ تَلۡقَفُ مَا يَأۡفِكُونَ  ۝١١٧ فَوَقَعَ ٱلۡحَقُّ وَبَطَلَ مَا كَانُواْ يَعۡمَلُونَ  ۝١١٨ فَغُلِبُواْ هُنَالِكَ وَٱنقَلَبُواْ صَٰغِرِينَ  ۝١١٩ وَأُلۡقِيَ ٱلسَّحَرَةُ سَٰجِدِينَ  ۝١٢٠
7:105
حَقِيقٌ عَلَىٰٓ أَن لَّآ أَقُولَ عَلَى ٱللَّهِ إِلَّا ٱلۡحَقَّۚ قَدۡ جِئۡتُكُم بِبَيِّنَةٍ مِّن رَّبِّكُمۡ فَأَرۡسِلۡ مَعِيَ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ  ۝١٠٥
అల్లాహ్ ను గురించి సత్యం తప్ప మరే విషయాన్ని పలకని బాధ్యత గలవాడను. వాస్తవానికి, నేను మీ వద్దకు, మీ ప్రభువు తరఫు నుండి స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాను, కావున ఇస్రాయీల్ సంతతి వారిని నా వెంట పోనివ్వు
7:106
قَالَ إِن كُنتَ جِئۡتَ بِـَٔايَةٍ فَأۡتِ بِهَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ  ۝١٠٦
(ఫిర్ఔన్) అన్నాడు: నీవు ఏదైనా సూచనను తీసుకొని వచ్చి ఉంటే - నీవు సత్యవంతుడవే అయితే - దానిని తీసుకొనిరా
7:107
فَأَلۡقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعۡبَانٌ مُّبِينٌ  ۝١٠٧
అప్పుడు (మూసా) తన చేతికర్రను విసిరాడు, అకస్మాత్తుగా అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా (సుఅబాన్ గా) మారిపోయింది
7:108
وَنَزَعَ يَدَهُۥ فَإِذَا هِيَ بَيۡضَآءُ لِلنَّٰظِرِينَ  ۝١٠٨
మరియు అతడు తన చేతిని బయటికి తీశాడు. ఇక అది చూసే వారికి తెల్లగా మెరుస్తూ కనిపించింది
7:109
قَالَ ٱلۡمَلَأُ مِن قَوۡمِ فِرۡعَوۡنَ إِنَّ هَٰذَا لَسَٰحِرٌ عَلِيمٌ  ۝١٠٩
(ఇది చూసి), ఫిర్ఔన్ జాతి నాయకులు అన్నారు: నిశ్చయంగా, ఇతడు నేర్పు గల ఒక గొప్ప మాంత్రికుడు
7:110
يُرِيدُ أَن يُخۡرِجَكُم مِّنۡ أَرۡضِكُمۡۖ فَمَاذَا تَأۡمُرُونَ  ۝١١٠
(ఫిర్ఔన్ అన్నాడు): ఇతడు మిమ్మల్ని మీ భూమి నుండి వెడల గొట్ట గోరుతున్నాడు. అయితే! మీ సలహా ఏమిటి
7:111
قَالُوٓاْ أَرۡجِهۡ وَأَخَاهُ وَأَرۡسِلۡ فِي ٱلۡمَدَآئِنِ حَٰشِرِينَ  ۝١١١
వారన్నారు: అతనికి (మూసాకు) మరియు అతని సోదరునికి కొంత వ్యవధి నిచ్చి, అన్ని నగరాలకు బంటులను పంపు
7:112
يَأۡتُوكَ بِكُلِّ سَٰحِرٍ عَلِيمٍ  ۝١١٢
వారు నిపుణులైన ప్రతి మాంత్రికుణ్ణి నీ వద్దకు తీసుకొని వస్తారు
7:113
وَجَآءَ ٱلسَّحَرَةُ فِرۡعَوۡنَ قَالُوٓاْ إِنَّ لَنَا لَأَجۡرًا إِن كُنَّا نَحۡنُ ٱلۡغَٰلِبِينَ  ۝١١٣
మరియు మాంత్రికులందరూ ఫిర్ఔన్ వద్దకు వచ్చి: ఒకవేళ మేము గెలిస్తే మాకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది కదా!" అని అన్నారు
7:114
قَالَ نَعَمۡ وَإِنَّكُمۡ لَمِنَ ٱلۡمُقَرَّبِينَ  ۝١١٤
(ఫిర్ఔన్) అన్నాడు: అవును, నిశ్చయంగా మీరు నా సాన్నిధ్యాన్ని కూడా పొందుతారు
7:115
قَالُواْ يَٰمُوسَىٰٓ إِمَّآ أَن تُلۡقِيَ وَإِمَّآ أَن نَّكُونَ نَحۡنُ ٱلۡمُلۡقِينَ  ۝١١٥
వారన్నారు: ఓ మూసా! (ముందు) నీవు విసురుతావా? లేక మేము విసరాలా
7:116
قَالَ أَلۡقُواْۖ فَلَمَّآ أَلۡقَوۡاْ سَحَرُوٓاْ أَعۡيُنَ ٱلنَّاسِ وَٱسۡتَرۡهَبُوهُمۡ وَجَآءُو بِسِحۡرٍ عَظِيمٍ  ۝١١٦
(మూసా) అన్నాడు: (ముందు) మీరే విసరండి!" వారు (తమ కర్రలను) విసిరి, ప్రజల చూపులను మంత్రముగ్ధం చేస్తూ వారికి భయం కలిగించే ఒక అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించారు
7:117
۞ وَأَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنۡ أَلۡقِ عَصَاكَۖ فَإِذَا هِيَ تَلۡقَفُ مَا يَأۡفِكُونَ  ۝١١٧
మేము మూసాకు: నీ చేతికర్రను విసురు." అని ఆదేశమిచ్చాము. అప్పుడది వారి (మాంత్రికుల) బూటక (మాయాజాలాన్ని) మ్రింగి వేసింది
7:118
فَوَقَعَ ٱلۡحَقُّ وَبَطَلَ مَا كَانُواْ يَعۡمَلُونَ  ۝١١٨
ఈ విధంగా సత్యం స్థాపితమయ్యింది మరియు వారు (మాంత్రికులు) చేసిందంతా విఫలమయ్యింది
7:119
فَغُلِبُواْ هُنَالِكَ وَٱنقَلَبُواْ صَٰغِرِينَ  ۝١١٩
ఈ విధంగా వారక్కడ అపజయం పొంది అవమానంతో కృంగిపోయారు
7:120
وَأُلۡقِيَ ٱلسَّحَرَةُ سَٰجِدِينَ  ۝١٢٠
మరియు మాంత్రికులు సాష్టాంగ పడ్డారు


📚Juz 9 📄164 / 604



Mishary Rashid Alafasy
Mahmoud Khalil Al-Husary
Abdurrahman As-Sudais
Mohamed Siddiq Al-Minshawi
Abdul Basit Abdul Samad
Ali Al-Hudhaify
Ahmed ibn Ali al-Ajamy
Abu Bakr Ash-Shaatree
Muhammad Ayyoub
Abdullah Basfar
Abdullah Al-Juhani
Maher Al Muaiqly
0:00
0:00
-

పవిత్ర ఖురాన్


Saturday, August 22, 2026

Don't forget us in your sincere prayers