Surah Al-Anfal with Telugu

  1. Surah mp3
  2. More
  3. Telugu
The Holy Quran | Quran translation | Language Telugu | Surah Anfal | الأنفال - Ayat Count 75 - The number of the surah in moshaf: 8 - The meaning of the surah in English: The Spoils of War.

يَسْأَلُونَكَ عَنِ الْأَنفَالِ ۖ قُلِ الْأَنفَالُ لِلَّهِ وَالرَّسُولِ ۖ فَاتَّقُوا اللَّهَ وَأَصْلِحُوا ذَاتَ بَيْنِكُمْ ۖ وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ إِن كُنتُم مُّؤْمِنِينَ(1)

 (ఓ ప్రవక్తా!) వారు నిన్ను విజయధనం (అన్ ఫాల్) ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: విజయధనం అల్లాహ్ ది మరియు ఆయన సందేశహరునిది." కనుక మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీ పరస్పర సంబంధాలను సరిదిద్దుకోండి. మీరు విశ్వాసులే అయితే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి

إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ إِذَا ذُكِرَ اللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَإِذَا تُلِيَتْ عَلَيْهِمْ آيَاتُهُ زَادَتْهُمْ إِيمَانًا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ(2)

 నిశ్చయంగా, విశ్వాసులైన వారి హృదయాలు అల్లాహ్ ప్రస్తావన వచ్చినపుడు భయంతో వణుకుతాయి. మరియు వారి ముందు ఆయన సూచనలు (ఖుర్ఆన్) పఠింపబడినప్పుడు వారి విశ్వాసం మరింత అధికమే అవుతుంది. మరియు వారు తమ ప్రభువు మీదే దృఢనమ్మకం కలిగి ఉంటారు

الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ(3)

 వారే నమాజ్ ను స్థాపిస్తారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి (ఇతరులపై) ఖర్చు చేస్తారు

أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا ۚ لَّهُمْ دَرَجَاتٌ عِندَ رَبِّهِمْ وَمَغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ(4)

 అలాంటి వారు! వారే, నిజమైన విశ్వాసులు. వారి ప్రభువు వద్ద వారికి ఉన్నత స్థానాలు, క్షమాపణ మరియు గౌరవనీయమైన జీవనోపాధి ఉంటాయి

كَمَا أَخْرَجَكَ رَبُّكَ مِن بَيْتِكَ بِالْحَقِّ وَإِنَّ فَرِيقًا مِّنَ الْمُؤْمِنِينَ لَكَارِهُونَ(5)

 (ఓ ప్రవక్తా!) ఎప్పుడైతే! నీ ప్రభువు నిన్ను సత్యస్థాపన కొరకు నీ గృహం నుండి (యుద్ధానికి) బయటకు తీసుకొని వచ్చాడో! అప్పుడు నిశ్చయంగా, విశ్వాసులలో ఒక పక్షం వారు దానికి ఇష్టపడలేదు

يُجَادِلُونَكَ فِي الْحَقِّ بَعْدَمَا تَبَيَّنَ كَأَنَّمَا يُسَاقُونَ إِلَى الْمَوْتِ وَهُمْ يَنظُرُونَ(6)

 సత్యం బహిర్గతమైన తరువాత కూడా, వారు దానిని గురించి నీతో వాదులాడుతున్నారు. అప్పుడు (వారి స్థితి) వారు చావును కళ్ళారా చూస్తూ ఉండగా! దాని వైపునకు లాగబడే వారి వలే ఉంది

وَإِذْ يَعِدُكُمُ اللَّهُ إِحْدَى الطَّائِفَتَيْنِ أَنَّهَا لَكُمْ وَتَوَدُّونَ أَنَّ غَيْرَ ذَاتِ الشَّوْكَةِ تَكُونُ لَكُمْ وَيُرِيدُ اللَّهُ أَن يُحِقَّ الْحَقَّ بِكَلِمَاتِهِ وَيَقْطَعَ دَابِرَ الْكَافِرِينَ(7)

 మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఆ రెండు పక్షాలలో, ఒక పక్షం మీ చేతికి తప్పక చిక్కుతుందని అల్లాహ్ మీతో వాగ్దానం చేసినప్పుడు; ఆయుధాలు లేని పక్షం మీకు దొరకాలని మీరు కోరుతూ ఉన్నారు. కాని అల్లాహ్ తాను ఇచ్చిన మాట ప్రకారం సత్యాన్ని సత్యంగా నిరూపించాలనీ మరియు అవిశ్వాసులను సమూలంగా నాశనం చేయాలనీ కోరాడు

لِيُحِقَّ الْحَقَّ وَيُبْطِلَ الْبَاطِلَ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ(8)

 అపరాధులు ఎంత అసహ్యించుకున్నా, సత్యాన్ని సత్యంగా నిరూపించాలని (నెగ్గించాలని) మరియు అసత్యాన్ని అసత్యంగా నిరూపించాలని (విఫలం చేయాలని) ఆయన (ఇచ్ఛ)

إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ أَنِّي مُمِدُّكُم بِأَلْفٍ مِّنَ الْمَلَائِكَةِ مُرْدِفِينَ(9)

 (జ్ఞాపకం చేసుకోండి!) మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించినపుడు ఆయన ఇలా జవాబిచ్చాడు: నిశ్చయంగా, నేను వేయి దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని పంపి మిమ్మల్ని బలపరుస్తాను

وَمَا جَعَلَهُ اللَّهُ إِلَّا بُشْرَىٰ وَلِتَطْمَئِنَّ بِهِ قُلُوبُكُمْ ۚ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِندِ اللَّهِ ۚ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ(10)

 మరియు మీకు శుభవార్తనిచ్చి, మీ హృదయాలకు శాంతి కలుగ జేయటానికే, ఈ విషయాన్ని అల్లాహ్ మీకు తెలిపాడు. మరియు వాస్తవానికి సహాయం (విజయం) కేవలం అల్లాహ్ నుంచే వస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు

إِذْ يُغَشِّيكُمُ النُّعَاسَ أَمَنَةً مِّنْهُ وَيُنَزِّلُ عَلَيْكُم مِّنَ السَّمَاءِ مَاءً لِّيُطَهِّرَكُم بِهِ وَيُذْهِبَ عَنكُمْ رِجْزَ الشَّيْطَانِ وَلِيَرْبِطَ عَلَىٰ قُلُوبِكُمْ وَيُثَبِّتَ بِهِ الْأَقْدَامَ(11)

 (జ్ఞాపకం చేసుకోండి!) ఆయన (అల్లాహ్), తన తరఫు నుండి మీకు మనశ్శాంతి కలుగజేయటానికి మీకు నిద్రమత్తును కలిగించాడు మరియు మీపై ఆకాశం నుండి నీటిని కురిపించాడు, దాని ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరచటానికి మీ నుండి షైతాన్ మాలిన్యాన్ని దూరం చేయటానికి మరియు మీ హృదయాలను బలపరచటానికి మరియు మీ పాదాలను స్థిరపరచటానికీ

إِذْ يُوحِي رَبُّكَ إِلَى الْمَلَائِكَةِ أَنِّي مَعَكُمْ فَثَبِّتُوا الَّذِينَ آمَنُوا ۚ سَأُلْقِي فِي قُلُوبِ الَّذِينَ كَفَرُوا الرُّعْبَ فَاضْرِبُوا فَوْقَ الْأَعْنَاقِ وَاضْرِبُوا مِنْهُمْ كُلَّ بَنَانٍ(12)

 నీ ప్రభువు దైవదూతలకు ఇచ్చిన దివ్యజ్ఞానాన్ని (జ్ఞాపకం చేసుకోండి): నేను నిశ్చయంగా, మీతో ఉన్నాను. కావున మీరు విశ్వాసులకు ఈ విధంగా ధైర్యస్థైర్యాలను కలిగించండి: `నేను సత్యతిరస్కారులైన వారి హృదయాలలో భయాన్ని కలిగిస్తాను, అప్పుడు మీరు వారి మెడలపై కొట్టండి మరియు వారి వ్రేళ్ళకొనలను నరికివేయండి

ذَٰلِكَ بِأَنَّهُمْ شَاقُّوا اللَّهَ وَرَسُولَهُ ۚ وَمَن يُشَاقِقِ اللَّهَ وَرَسُولَهُ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ(13)

 ఇది ఎందుకంటే! వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. కాబట్టి ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తాడో! నిశ్చయంగా, అల్లాహ్ (అలాంటి వానికి) శిక్ష విధించటంలో ఎంతో కఠినుడు

ذَٰلِكُمْ فَذُوقُوهُ وَأَنَّ لِلْكَافِرِينَ عَذَابَ النَّارِ(14)

 (ఓ సత్యతిరస్కారులారా!): ఇదే (మీ శిక్ష), దీనిని మీరు చవిచూడండి! నిశ్చయంగా, సత్యతిరస్కారులకు నరకాగ్ని శిక్ష ఉంటుంది

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمُ الَّذِينَ كَفَرُوا زَحْفًا فَلَا تُوَلُّوهُمُ الْأَدْبَارَ(15)

 ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు సత్యతిరస్కారుల సైన్యాలను యుద్ధరంగంలో ఎదుర్కొన్నప్పుడు, వారికి మీ వీపులు చూపకండి (పారిపోకండి)

وَمَن يُوَلِّهِمْ يَوْمَئِذٍ دُبُرَهُ إِلَّا مُتَحَرِّفًا لِّقِتَالٍ أَوْ مُتَحَيِّزًا إِلَىٰ فِئَةٍ فَقَدْ بَاءَ بِغَضَبٍ مِّنَ اللَّهِ وَمَأْوَاهُ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ(16)

 మరియు ఆ దినమున వారికి వీపు చూపినవాడు - యుద్ధతంత్రం కోసమో, లేక (తమవారి) మరొక సమూహంలో చేరటానికో (వెనుదిరిగితే తప్ప) - తప్పక అల్లాహ్ ఆగ్రహానికి పాత్రుడవుతాడు మరియు అతని ఆశ్రయం నరకమే. అది ఎంత చెడ్డ గమ్యస్థానం

فَلَمْ تَقْتُلُوهُمْ وَلَٰكِنَّ اللَّهَ قَتَلَهُمْ ۚ وَمَا رَمَيْتَ إِذْ رَمَيْتَ وَلَٰكِنَّ اللَّهَ رَمَىٰ ۚ وَلِيُبْلِيَ الْمُؤْمِنِينَ مِنْهُ بَلَاءً حَسَنًا ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ(17)

 మీరు వారిని చంపలేదు, కానీ అల్లాహ్ వారిని చంపాడు. (ప్రవక్తా!) నీవు (దుమ్ము) విసిరినపుడు, నీవు కాదు విసిరింది, కాని అల్లాహ్ విసిరాడు. మరియు విశ్వాసులను దీనితో పరీక్షించి, వారికి మంచి ఫలితాన్ని ఇవ్వటానికి ఆయన ఇలా చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

ذَٰلِكُمْ وَأَنَّ اللَّهَ مُوهِنُ كَيْدِ الْكَافِرِينَ(18)

 ఇదే (ఆయన ఇచ్ఛ!) మరియు నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారుల ఎత్తుగడలను బలహీనపరుస్తాడు

إِن تَسْتَفْتِحُوا فَقَدْ جَاءَكُمُ الْفَتْحُ ۖ وَإِن تَنتَهُوا فَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَإِن تَعُودُوا نَعُدْ وَلَن تُغْنِيَ عَنكُمْ فِئَتُكُمْ شَيْئًا وَلَوْ كَثُرَتْ وَأَنَّ اللَّهَ مَعَ الْمُؤْمِنِينَ(19)

 (ఓ అవిశ్వాసులారా!) మీరు తీర్పు కోరితే, వాస్తవానికి మీకు తీర్పు లభించింది. ఇక మీద మీరు (దుర్మార్గాన్ని) మానుకుంటే అది మీకే మేలైనది. ఒకవేళ మీరు తిరిగి ఇలా చేస్తే మేము కూడా తిరిగి చేస్తాము. అప్పుడు మీ సైనికదళం ఎంత హెచ్చుగా ఉన్నా మీకెలాంటి లాభం చేకూర్చదు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసులతో ఉంటాడు

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَوَلَّوْا عَنْهُ وَأَنتُمْ تَسْمَعُونَ(20)

 ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. మరియు మీరు (అతని సందేశాలను) వింటూ కూడా, అతని (ప్రవక్త) నుండి మరలి పోకండి

وَلَا تَكُونُوا كَالَّذِينَ قَالُوا سَمِعْنَا وَهُمْ لَا يَسْمَعُونَ(21)

 మరియు వాస్తవానికి వినకుండానే: మేము విన్నాము!" అని అనే వారి వలే కాకండి

۞ إِنَّ شَرَّ الدَّوَابِّ عِندَ اللَّهِ الصُّمُّ الْبُكْمُ الَّذِينَ لَا يَعْقِلُونَ(22)

 తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే, నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో నీచాతినీచమైన పశుజాతికి చెందినవారు

وَلَوْ عَلِمَ اللَّهُ فِيهِمْ خَيْرًا لَّأَسْمَعَهُمْ ۖ وَلَوْ أَسْمَعَهُمْ لَتَوَلَّوا وَّهُم مُّعْرِضُونَ(23)

 మరియు అల్లాహ్ వారిలో కొంతైనా మంచితనాన్ని చూసి ఉంటే, వారిని వినేటట్లు చేసి ఉండేవాడు. (కాని వారిలో మంచితనం లేదు కాబట్టి), ఆయన వారిని వినేటట్లు చేసినా, వారు (తమ మూర్ఖత్వంలో) ముఖాలు త్రిప్పుకొని వెనుదిరిగి పోయేవారు

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَجِيبُوا لِلَّهِ وَلِلرَّسُولِ إِذَا دَعَاكُمْ لِمَا يُحْيِيكُمْ ۖ وَاعْلَمُوا أَنَّ اللَّهَ يَحُولُ بَيْنَ الْمَرْءِ وَقَلْبِهِ وَأَنَّهُ إِلَيْهِ تُحْشَرُونَ(24)

 ఓ విశ్వాసులారా! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీకు జీవనమిచ్చే దాని వైపునకు, మిమ్మల్ని పిలిచినప్పుడు దానికి జవాబు ఇవ్వండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మానవునికి మరియు అతని హృదయకాంక్షలకు మధ్య ఉన్నాడనీ మరియు నిశ్చయంగా, మీరంతా ఆయన వద్దనే సమీకరించబడతారని తెలుసుకోండి

وَاتَّقُوا فِتْنَةً لَّا تُصِيبَنَّ الَّذِينَ ظَلَمُوا مِنكُمْ خَاصَّةً ۖ وَاعْلَمُوا أَنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ(25)

 మరియు మీలోని దుర్మార్గులకు మాత్రమే గాక (అందరికీ) సంభవించబోయే ఆ విపత్తు గురించి భీతిపరులై ఉండండి. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడని తెలుసుకోండి

وَاذْكُرُوا إِذْ أَنتُمْ قَلِيلٌ مُّسْتَضْعَفُونَ فِي الْأَرْضِ تَخَافُونَ أَن يَتَخَطَّفَكُمُ النَّاسُ فَآوَاكُمْ وَأَيَّدَكُم بِنَصْرِهِ وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ لَعَلَّكُمْ تَشْكُرُونَ(26)

 మరియు ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి: అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉన్నారు. భూమిపై మీరు బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని పారద్రోలుతారని (హింసిస్తారని) భయపడే వారు. అప్పుడు ఆయన మీకు ఆశ్రయమిచ్చి తన సహాయంతో మిమ్మల్ని బలపరచి, మీకు మంచి జీవనోపాధిని సమకూర్చాడు, బహుశా మీరు కృతజ్ఞులవుతారని

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَخُونُوا اللَّهَ وَالرَّسُولَ وَتَخُونُوا أَمَانَاتِكُمْ وَأَنتُمْ تَعْلَمُونَ(27)

 ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చేయకండి మరియు తెలిసి ఉండి కూడా మీ (పరస్పర) అమానతుల విషయంలో నమ్మకద్రోహం చేయకండి

وَاعْلَمُوا أَنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ وَأَنَّ اللَّهَ عِندَهُ أَجْرٌ عَظِيمٌ(28)

 మరియు వాస్తవానికి మీ ఆస్తిపాస్తులు, మీ సంతానం పరీక్షా సాధనాలనీ మరియు నిశ్చయంగా, అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం ఉన్నదనీ తెలుసుకోండి

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تَتَّقُوا اللَّهَ يَجْعَل لَّكُمْ فُرْقَانًا وَيُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَيَغْفِرْ لَكُمْ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ(29)

 ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మీకు (మంచి-చెడులను గుర్తించే) విచక్షణా శక్తిని ప్రసాదించి, మీ నుండి మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో సర్వోత్తముడు

وَإِذْ يَمْكُرُ بِكَ الَّذِينَ كَفَرُوا لِيُثْبِتُوكَ أَوْ يَقْتُلُوكَ أَوْ يُخْرِجُوكَ ۚ وَيَمْكُرُونَ وَيَمْكُرُ اللَّهُ ۖ وَاللَّهُ خَيْرُ الْمَاكِرِينَ(30)

 మరియు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారులు, నిన్ను బంధించటానికి నిన్ను హతమార్చటానికి, లేదా నిన్ను వెడలగొట్టటానికి కుట్రలు పన్నుతున్న విషయాన్ని (జ్ఞప్తికి తెచ్చుకో!) వారు కుట్రలు పన్నుతూ ఉన్నారు మరియు అల్లాహ్ కూడా కుట్రలు పన్నుతూ ఉన్నాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే కుట్రలు పన్నటంలో అందరి కంటే ఉత్తముడు

وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا قَالُوا قَدْ سَمِعْنَا لَوْ نَشَاءُ لَقُلْنَا مِثْلَ هَٰذَا ۙ إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ(31)

 మరియు మా సూచనలు (ఆయాత్) వారికి వినిపించబడి నప్పుడు వారు: వాస్తవానికి, మేము విన్నాము మేము కోరితే మేము కూడా ఇటువంటివి రచించగలము (చెప్పగలము). ఇవి కేవలం పూర్వీకుల గాథలు మాత్రమే!" అని అంటారు

وَإِذْ قَالُوا اللَّهُمَّ إِن كَانَ هَٰذَا هُوَ الْحَقَّ مِنْ عِندِكَ فَأَمْطِرْ عَلَيْنَا حِجَارَةً مِّنَ السَّمَاءِ أَوِ ائْتِنَا بِعَذَابٍ أَلِيمٍ(32)

 మరియు వారు: ఓ అల్లాహ్! ఇది (ఈ ఖుర్ఆన్) నిజంగా నీ తరపు నుండి వచ్చిన సత్యమే అయితే! మాపై ఆకాశం నుండి రాళ్ళ వర్షం కురిపించు! లేదా ఏదైనా బాధాకరమైన శిక్షను మా పైకి తీసుకొనిరా!" అని పలికిన మాట (జ్ఞాపకం చేసుకోండి)

وَمَا كَانَ اللَّهُ لِيُعَذِّبَهُمْ وَأَنتَ فِيهِمْ ۚ وَمَا كَانَ اللَّهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُونَ(33)

 కాని (ఓ ముహమ్మద్!) నీవు వారి మధ్య ఉన్నంత వరకు అల్లాహ్ వారిని ఏ మాత్రం శిక్షించడు. మరియు వారు క్షమాభిక్ష కోరుతూ ఉన్నంత వరకు కూడా! అల్లాహ్ వారిని ఏ మాత్రం శిక్షించడు

وَمَا لَهُمْ أَلَّا يُعَذِّبَهُمُ اللَّهُ وَهُمْ يَصُدُّونَ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَمَا كَانُوا أَوْلِيَاءَهُ ۚ إِنْ أَوْلِيَاؤُهُ إِلَّا الْمُتَّقُونَ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ(34)

 వారి వాదమేమిటీ? అల్లాహ్ వారిని ఎందుకు శిక్షించకూడదు? వారు దాని ధర్మకర్తలు కాకున్నా, వారు ప్రజలను మస్జిద్ అల్ హరామ్ నుండి ఆవుతున్నారు. దాని ధర్మకర్తలు కేవలం దేవభీతి గలవారే కాగలరు. కాని వాస్తవానికి, చాలా మంది ఇది తెలుసుకోలేరు

وَمَا كَانَ صَلَاتُهُمْ عِندَ الْبَيْتِ إِلَّا مُكَاءً وَتَصْدِيَةً ۚ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ(35)

 మరియు (అల్లాహ్) గృహం (కఅబహ్) వద్ద వారి ప్రార్థనలు, కేవలం ఈలలు వేయటం (ముకాఅ) మరియు చప్పట్లు కొట్టడం (తస్దియహ్) తప్ప మరేమీ లేవు. కావున మీ సత్యతిరస్కారానికి బదులుగా ఈ శిక్షను రుచి చూడండి

إِنَّ الَّذِينَ كَفَرُوا يُنفِقُونَ أَمْوَالَهُمْ لِيَصُدُّوا عَن سَبِيلِ اللَّهِ ۚ فَسَيُنفِقُونَهَا ثُمَّ تَكُونُ عَلَيْهِمْ حَسْرَةً ثُمَّ يُغْلَبُونَ ۗ وَالَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ يُحْشَرُونَ(36)

 నిశ్చయంగా, సత్యతిరస్కారులు, ప్రజలను అల్లాహ్ మార్గం వైపునకు రాకుండా ఆపటానికి, తమ ధనం ఖర్చు చేస్తారు. వారు ఇలాగే ఖర్చు చేస్తూ ఉంటారు; చివరకు అది వారి వ్యసనానికి (దుఃఖానికి) కారణమవుతుంది. తరువాత వారు పరాధీనులవుతారు. మరియు సత్యతిరస్కారులైన వారు నరకం వైపుకు సమీకరించబడతారు

لِيَمِيزَ اللَّهُ الْخَبِيثَ مِنَ الطَّيِّبِ وَيَجْعَلَ الْخَبِيثَ بَعْضَهُ عَلَىٰ بَعْضٍ فَيَرْكُمَهُ جَمِيعًا فَيَجْعَلَهُ فِي جَهَنَّمَ ۚ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ(37)

 ఇదంతా అల్లాహ్, చెడును (దుష్టులను) మంచి (సత్పురుషుల) నుండి వేరు చేసి, దుష్టులందరినీ ఒకరితో పాటు మరొకరిని చేకూర్చి, ఒక గుంపుగా చేసి వారందరినీ నరకంలో పడవేయటానికి. ఇలాంటి వారు, వారే నష్టపోయేవారు

قُل لِّلَّذِينَ كَفَرُوا إِن يَنتَهُوا يُغْفَرْ لَهُم مَّا قَدْ سَلَفَ وَإِن يَعُودُوا فَقَدْ مَضَتْ سُنَّتُ الْأَوَّلِينَ(38)

 సత్యతిరస్కారులతో ఇలా అను: ఒకవేళ వారు మానుకుంటే గడిచిపోయింది క్షమించబడుతుంది. కాని వారు (పూర్వ వైఖరినే) మళ్ళీ అవలంబిస్తే! వాస్తవానికి, (దుష్టులైన) పూర్వీకుల విషయంలో జరిగిందే, మరల వారికి సంభవిస్తుంది

وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ كُلُّهُ لِلَّهِ ۚ فَإِنِ انتَهَوْا فَإِنَّ اللَّهَ بِمَا يَعْمَلُونَ بَصِيرٌ(39)

 మరియు అధర్మం (ఫిత్న) ఏ మాత్రం మిగలకుండా పోయే వరకు మరియు ఆరాధన (ధర్మం) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడనంత వరకు వారితో (సత్యతిరస్కారులతో) పోరాడుతూ ఉండండి. కాని వారు (పోరాడటం) మానుకుంటే! నిశ్చయంగా అల్లాహ్ వారి కర్మలను గమనిస్తున్నాడు

وَإِن تَوَلَّوْا فَاعْلَمُوا أَنَّ اللَّهَ مَوْلَاكُمْ ۚ نِعْمَ الْمَوْلَىٰ وَنِعْمَ النَّصِيرُ(40)

 మరియు ఒకవేళ వారు తిరిగిపోతే! నిశ్చయంగా, అల్లాహ్ మీ స్నేహితుడు (సంరక్షకుడు) అని తెలుసుకోండి. ఆయనే ఉత్తమ స్నేహితుడు (సంరక్షకుడు) మరియు ఉత్తమ సహాయకుడూను

۞ وَاعْلَمُوا أَنَّمَا غَنِمْتُم مِّن شَيْءٍ فَأَنَّ لِلَّهِ خُمُسَهُ وَلِلرَّسُولِ وَلِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ إِن كُنتُمْ آمَنتُم بِاللَّهِ وَمَا أَنزَلْنَا عَلَىٰ عَبْدِنَا يَوْمَ الْفُرْقَانِ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ(41)

 మరియు మీ విజయధనంలో నిశ్చయంగా, అయిదవ భాగం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు మరియు (అతని) దగ్గరి బంధువులకు మరియు అనాధులకు మరియు యాచించని పేదవారికి మరియు ప్రయాణీకులకు ఉందని తెలుసుకోండి, ఒకవేళ మీరు - అల్లాహ్ ను మరియు మేము సత్యాసత్యాల అంతరాన్ని విశదం చేసే దినమున, ఆ రెండు సైన్యాలు మార్కొనిన (బద్ర్ యుద్ధ) దినమున, మా దాసునిపై అవతరింపజేసిన దానిని - విశ్వసించేవారే అయితే! మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు

إِذْ أَنتُم بِالْعُدْوَةِ الدُّنْيَا وَهُم بِالْعُدْوَةِ الْقُصْوَىٰ وَالرَّكْبُ أَسْفَلَ مِنكُمْ ۚ وَلَوْ تَوَاعَدتُّمْ لَاخْتَلَفْتُمْ فِي الْمِيعَادِ ۙ وَلَٰكِن لِّيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا لِّيَهْلِكَ مَنْ هَلَكَ عَن بَيِّنَةٍ وَيَحْيَىٰ مَنْ حَيَّ عَن بَيِّنَةٍ ۗ وَإِنَّ اللَّهَ لَسَمِيعٌ عَلِيمٌ(42)

 (ఆ దినాన్ని గుర్తుకు తెచ్చుకోండి!) అప్పుడు మీరు లోయలో (మదీనాకు) సమీపంగా ఉన్న స్థలంలో ఉన్నారు మరియు వారు (ముష్రికులు) దూరంగా ఉన్న స్థలంలో ఉన్నారు. మరియు బిడారం మీకు క్రింది (ఒడ్డు) వైపునకు. ఒకవేళ మీరు (ఇరువురు) యుద్ధం చేయాలని నిర్ణయించుకొని ఉంటే! మీరు మీ నిర్ణయాన్ని పాటించకుండా ఉండేవారు. కాని అల్లాహ్ తాను నిర్ణయించిన కార్యాన్ని పూర్తి చేయటానికి, నశించేవాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత నశించాలని మరియు జీవించేవాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత జీవించాలని అలా చేశాడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

إِذْ يُرِيكَهُمُ اللَّهُ فِي مَنَامِكَ قَلِيلًا ۖ وَلَوْ أَرَاكَهُمْ كَثِيرًا لَّفَشِلْتُمْ وَلَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَلَٰكِنَّ اللَّهَ سَلَّمَ ۗ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ(43)

 (ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు, నీ స్వప్నంలో వారిని కొద్దిమందిగా చూపింది (జ్ఞాపకం చేసుకో)! వారిని ఎక్కువ మందిగా నీకు చూపి ఉంటే, మీరు తప్పక ధైర్యాన్ని కోల్పోయి (యుద్ధ) విషయంలో వాదులాడే వారు. కాని వాస్తవానికి, అల్లాహ్ మిమ్మల్ని రక్షించాడు. నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు

وَإِذْ يُرِيكُمُوهُمْ إِذِ الْتَقَيْتُمْ فِي أَعْيُنِكُمْ قَلِيلًا وَيُقَلِّلُكُمْ فِي أَعْيُنِهِمْ لِيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا ۗ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ(44)

 మరియు (జ్ఞాపకం చేసుకోండి) అల్లాహ్ నెరవేర్చవలసిన పనిని నెరవేర్చటానికి - మీరు (బద్ర్ యుద్ధరంగంలో) మార్కొనినపుడు - వారి (అవిశ్వాసుల) సైన్యాన్ని మీ కన్నులకు కొద్దిగా చూపాడు మరియు మిమ్మల్ని కొద్దిమందిగా వారికి చూపాడు. మరియు అన్ని వ్యవహారాలూ (నిర్ణయానికి) అల్లాహ్ వైపునకే మరలింపబడతాయి

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمْ فِئَةً فَاثْبُتُوا وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ(45)

 ఓ విశ్వాసులారా! మీరు ఏ సైన్యాన్నైనా ఎదుర్కొనేటప్పుడు, స్థైర్యంతో ఉండండి. మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తే, మీరు సాఫల్యం పొందవచ్చు

وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَنَازَعُوا فَتَفْشَلُوا وَتَذْهَبَ رِيحُكُمْ ۖ وَاصْبِرُوا ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ(46)

 మరియు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి మరియు పరస్పర కలహాలకు గురి కాకండి, అట్లు చేస్తే మీరు బలహీనులవుతారు మరియు మీ బలసాహసాలు తగ్గిపోతాయి. మరియు సహనం వహించండి నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించే వారితో ఉంటాడు

وَلَا تَكُونُوا كَالَّذِينَ خَرَجُوا مِن دِيَارِهِم بَطَرًا وَرِئَاءَ النَّاسِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ ۚ وَاللَّهُ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ(47)

 మరియు తమ గృహాల నుండి, ప్రజలకు చూపటానికి దురాభిమానంతో బయలుదేరి ఇతరులను అల్లాహ్ మార్గం నుండి ఆపేవారి వలే కాకండి. మరియు వారు చేసే క్రియలన్నింటినీ అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు

وَإِذْ زَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ وَقَالَ لَا غَالِبَ لَكُمُ الْيَوْمَ مِنَ النَّاسِ وَإِنِّي جَارٌ لَّكُمْ ۖ فَلَمَّا تَرَاءَتِ الْفِئَتَانِ نَكَصَ عَلَىٰ عَقِبَيْهِ وَقَالَ إِنِّي بَرِيءٌ مِّنكُمْ إِنِّي أَرَىٰ مَا لَا تَرَوْنَ إِنِّي أَخَافُ اللَّهَ ۚ وَاللَّهُ شَدِيدُ الْعِقَابِ(48)

 మరియు (జ్ఞాపకం చేసుకోండి అవిశ్వాసులకు) వారి కర్మలు ఉత్తమమైనవిగా చూపించి షైతాన్ వారితో అన్నాడు: ఈ రోజు ప్రజలలో ఎవ్వడునూ మిమ్మల్ని జయించలేడు, (ఎందుకంటే) నేను మీకు తోడుగా ఉన్నాను." కాని ఆ రెండు పక్షాలు పరస్పరం ఎదురు పడినపుడు, అతడు తన మడమలపై వెనకకు మరలి అన్నాడు: వాస్తవంగా, నాకు మీతో ఎలాంటి సంబంధం లేదు, మీరు చూడనిది నేను చూస్తున్నాను. నిశ్చయంగా, నేను అల్లాహ్ కు భయపడుతున్నాను. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడు

إِذْ يَقُولُ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ غَرَّ هَٰؤُلَاءِ دِينُهُمْ ۗ وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَإِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ(49)

 కపట విశ్వాసులు మరియు ఎవరి హృదయాలలో రోగముందో వారు: వీరిని (ఈ విశ్వాసులను) వీరి ధర్మం మోసపుచ్చింది." అని అంటారు, కాని అల్లాహ్ యందు నమ్మకం గలవాని కొరకు, నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు

وَلَوْ تَرَىٰ إِذْ يَتَوَفَّى الَّذِينَ كَفَرُوا ۙ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ وَذُوقُوا عَذَابَ الْحَرِيقِ(50)

 మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దేవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ ఇలా అంటారు: భగభగమండే ఈ నరకాగ్ని శిక్షను చవి చూడండి

ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ(51)

 ఇది మీరు స్వయంగా మీ చేతులారా చేసి పంపిన కర్మల ఫలితమే! మరియు నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఏ మాత్రం అన్యాయం చేయడు

كَدَأْبِ آلِ فِرْعَوْنَ ۙ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَفَرُوا بِآيَاتِ اللَّهِ فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ ۗ إِنَّ اللَّهَ قَوِيٌّ شَدِيدُ الْعِقَابِ(52)

 ఫిర్ఔన్ జాతి వారి మరియు వారికి పూర్వం వారి మాదిరిగా, వీరు కూడా అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారి పాపాల ఫలితంగా వారిని శిక్షించాడు. నిశ్చయంగా అల్లాహ్ మహా బలవంతుడు, శిక్ష విధించటంలో చాలా కఠినుడు

ذَٰلِكَ بِأَنَّ اللَّهَ لَمْ يَكُ مُغَيِّرًا نِّعْمَةً أَنْعَمَهَا عَلَىٰ قَوْمٍ حَتَّىٰ يُغَيِّرُوا مَا بِأَنفُسِهِمْ ۙ وَأَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ(53)

 ఇది ఎందుకంటే! వాస్తవానికి, ఒక జాతి వారు, తమ నడవడికను తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారికి ప్రసాదించిన తన అనుగ్రహాన్ని ఉపసంహరించుకోడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

كَدَأْبِ آلِ فِرْعَوْنَ ۙ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَّبُوا بِآيَاتِ رَبِّهِمْ فَأَهْلَكْنَاهُم بِذُنُوبِهِمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ ۚ وَكُلٌّ كَانُوا ظَالِمِينَ(54)

 ఫిర్ఔన్ జాతివారు మరియు వారికి పూర్వం వారి మాదిరిగా! వీరు కూడా తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) అబద్ధాలను నిరాకరించారు. కాబట్టి వారి పాపాలకు ఫలితంగా వారిని నాశనం చేశాము. మరియు ఫిర్ఔను జాతి వారిని ముంచి వేశాము. మరియు వారందరూ దుర్మార్గులు

إِنَّ شَرَّ الدَّوَابِّ عِندَ اللَّهِ الَّذِينَ كَفَرُوا فَهُمْ لَا يُؤْمِنُونَ(55)

 నిశ్చయంగా, అల్లాహ్ దృష్టిలో సత్యాన్ని తిరస్కరించే వారు నీచాతినీచమైన జీవులు, ఇక వారు విశ్వసించరు

الَّذِينَ عَاهَدتَّ مِنْهُمْ ثُمَّ يَنقُضُونَ عَهْدَهُمْ فِي كُلِّ مَرَّةٍ وَهُمْ لَا يَتَّقُونَ(56)

 వారిలో ఎవరితోనైతే నీవు ఒడంబడిక చేసుకున్నావో! వారు ప్రతిసారీ తమ ఒడంబడికను భంగపరుస్తున్నారు. మరియు వారికి దైవభీతి లేదు

فَإِمَّا تَثْقَفَنَّهُمْ فِي الْحَرْبِ فَشَرِّدْ بِهِم مَّنْ خَلْفَهُمْ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ(57)

 ఒకవేళ నీవు యుద్ధరంగంలో వారిపై ప్రాబల్యం పొందితే - వారి వెనుక ఉన్నవారు చెల్లాచెదరై పోయేటట్లుగా - వారిని శిక్షించు. బహుశా వారు గుణపాఠం నేర్చుకోవచ్చు

وَإِمَّا تَخَافَنَّ مِن قَوْمٍ خِيَانَةً فَانبِذْ إِلَيْهِمْ عَلَىٰ سَوَاءٍ ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْخَائِنِينَ(58)

 మరియు ఒకవేళ నీకు ఏ జాతి వారి వల్లనైనా నమ్మకద్రోహం జరుగుతుందనే భయం ఉంటే - మీరు ఇరుపక్షం వారు సరిసమానులని తెలుపటానికి - (వారి ఒప్పందాన్ని) వారి వైపుకు విసరివేయి. నిశ్చయంగా, అల్లాహ్ నమ్మకద్రోహులంటే ఇష్టపడడు

وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا سَبَقُوا ۚ إِنَّهُمْ لَا يُعْجِزُونَ(59)

 మరియు సత్యతిరస్కారులు, తాము తప్పించుకున్నామని భావించ నవసరంలేదు. నిశ్చయంగా, వారు (అల్లాహ్ శిక్ష నుండి) తప్పించుకోలేరు

وَأَعِدُّوا لَهُم مَّا اسْتَطَعْتُم مِّن قُوَّةٍ وَمِن رِّبَاطِ الْخَيْلِ تُرْهِبُونَ بِهِ عَدُوَّ اللَّهِ وَعَدُوَّكُمْ وَآخَرِينَ مِن دُونِهِمْ لَا تَعْلَمُونَهُمُ اللَّهُ يَعْلَمُهُمْ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فِي سَبِيلِ اللَّهِ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ(60)

 మరియు మీరు మీ శక్తి మేరకు బలసామగ్రిని, యుద్ధపు గుర్రాలను సిద్ధపరచుకొని, దాని ద్వారా అల్లాహ్ కు శత్రువులైన మీ శత్రువులను మరియు అల్లాహ్ కు తెలిసి, మీకు తెలియని ఇతరులను కూడా భయకంపితులుగా చేయండి. మరియు అల్లాహ్ మార్గంలో మీరు ఏమి ఖర్చు చేసినా దాని ఫలితం మీకు పూర్తిగా చెల్లించ బడుతుంది. మరియు మీకెలాంటి అన్యాయం జరగదు

۞ وَإِن جَنَحُوا لِلسَّلْمِ فَاجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ(61)

 కాని ఒకవేళ వారు శాంతి వైపుకు మొగ్గితే నీవు కూడా దానికి దిగు మరియు అల్లాహ్ పై ఆధారపడు. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

وَإِن يُرِيدُوا أَن يَخْدَعُوكَ فَإِنَّ حَسْبَكَ اللَّهُ ۚ هُوَ الَّذِي أَيَّدَكَ بِنَصْرِهِ وَبِالْمُؤْمِنِينَ(62)

 కాని ఒకవేళ వారు నిన్ను మోసగించాలని సంకల్పిస్తే! నిశ్చయంగా, నీకు అల్లాహ్ యే చాలు. ఆయనే తన సహాయం ద్వారా మరియు విశ్వాసుల ద్వారా నిన్ను బలపరుస్తాడు

وَأَلَّفَ بَيْنَ قُلُوبِهِمْ ۚ لَوْ أَنفَقْتَ مَا فِي الْأَرْضِ جَمِيعًا مَّا أَلَّفْتَ بَيْنَ قُلُوبِهِمْ وَلَٰكِنَّ اللَّهَ أَلَّفَ بَيْنَهُمْ ۚ إِنَّهُ عَزِيزٌ حَكِيمٌ(63)

 మరియు ఆయనే వారి (విశ్వాసుల) హృదయాలను కలిపాడు. ఒకవేళ నీవు భూమిలో ఉన్న సమస్తాన్ని ఖర్చు చేసినా, వారి హృదయాలను కలుపజాలవు. కాని అల్లాహ్ యే వారి మధ్య ప్రేమను కలిగించాడు. నిశ్చయంగా, ఆయన సర్వ శక్తిసంపన్నుడు, మహా వివేచనాపరుడు

يَا أَيُّهَا النَّبِيُّ حَسْبُكَ اللَّهُ وَمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ(64)

 ఓ ప్రవక్తా! నీకూ మరియు నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాహ్ యే చాలు

يَا أَيُّهَا النَّبِيُّ حَرِّضِ الْمُؤْمِنِينَ عَلَى الْقِتَالِ ۚ إِن يَكُن مِّنكُمْ عِشْرُونَ صَابِرُونَ يَغْلِبُوا مِائَتَيْنِ ۚ وَإِن يَكُن مِّنكُم مِّائَةٌ يَغْلِبُوا أَلْفًا مِّنَ الَّذِينَ كَفَرُوا بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ(65)

 ఓ ప్రవక్తా! విశ్వాసులను యుద్ధానికి ప్రోత్సహించు. మీలో ఇరవై మంది స్థైర్యం గల వారుంటే, వారు రెండు వందల మందిని జయించగలరు. మరియు మీరు వంద మంది ఉంటే వేయి మంది సత్యతిరస్కారులను జయించగలరు. ఎందుకంటే వారు (సత్యాన్ని) గ్రహించలేని జాతికి చెందిన వారు

الْآنَ خَفَّفَ اللَّهُ عَنكُمْ وَعَلِمَ أَنَّ فِيكُمْ ضَعْفًا ۚ فَإِن يَكُن مِّنكُم مِّائَةٌ صَابِرَةٌ يَغْلِبُوا مِائَتَيْنِ ۚ وَإِن يَكُن مِّنكُمْ أَلْفٌ يَغْلِبُوا أَلْفَيْنِ بِإِذْنِ اللَّهِ ۗ وَاللَّهُ مَعَ الصَّابِرِينَ(66)

 ఇప్పుడు అల్లాహ్ మీ భారాన్ని తగ్గించాడు, ఎందుకంటే వాస్తవానికి, మీలో బలహీనత ఉన్నదని ఆయనకు తెలుసు. కాబట్టి మీలో వందమంది స్థైర్యం గలవారు ఉంటే వారు రెండు వందల మందిని జయించగలరు. మరియు మీరు వేయి మంది ఉంటే, అల్లాహ్ సెలవుతో రెండు వేల మందిని జయించగలరు. మరియు అల్లాహ్ సహనం గలవారితో ఉంటాడు

مَا كَانَ لِنَبِيٍّ أَن يَكُونَ لَهُ أَسْرَىٰ حَتَّىٰ يُثْخِنَ فِي الْأَرْضِ ۚ تُرِيدُونَ عَرَضَ الدُّنْيَا وَاللَّهُ يُرِيدُ الْآخِرَةَ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ(67)

 (శత్రువులతో తీవ్రంగా పోరాడి, వారిని) పూర్తిగా అణచనంత వరకు, తన వద్ద యుద్ధఖైదీలను ఉంచుకోవటం ధరణిలో, ఏ ప్రవక్తకూ తగదు. మీరు ప్రాపంచిక సామగ్రి కోరుతున్నారు. కాని అల్లాహ్ (మీ కొరకు) పరలోక (సుఖాన్ని) కోరుతున్నాడు. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు

لَّوْلَا كِتَابٌ مِّنَ اللَّهِ سَبَقَ لَمَسَّكُمْ فِيمَا أَخَذْتُمْ عَذَابٌ عَظِيمٌ(68)

 ఒకవేళ అల్లాహ్ (ఫర్మానా) ముందే వ్రాయబడి ఉండకపోతే, మీరు తీసుకున్న దానికి (నిర్ణయానికి) మీకు ఘోరశిక్ష విధించబడి ఉండేది

فَكُلُوا مِمَّا غَنِمْتُمْ حَلَالًا طَيِّبًا ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ(69)

 కావున మీకు ధర్మసమ్మతంగా లభించిన ఉత్తమమైన విజయధనాన్ని అనుభవించండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّمَن فِي أَيْدِيكُم مِّنَ الْأَسْرَىٰ إِن يَعْلَمِ اللَّهُ فِي قُلُوبِكُمْ خَيْرًا يُؤْتِكُمْ خَيْرًا مِّمَّا أُخِذَ مِنكُمْ وَيَغْفِرْ لَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ(70)

 ఓ ప్రవక్తా! నీ ఆధీనంలో ఉన్న యుద్ధఖైదీలతో ఇలా అను: ఒకవేళ అల్లాహ్ మీ హృదయాలలో మంచితనం చూస్తే ఆయన మీ వద్ద నుండి తీసుకున్న దాని కంటే ఎంతో ఉత్తమమైన దానిని మీకు ప్రసాదించి ఉంటాడు. మరియు మిమ్మల్ని క్షమించి ఉంటాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

وَإِن يُرِيدُوا خِيَانَتَكَ فَقَدْ خَانُوا اللَّهَ مِن قَبْلُ فَأَمْكَنَ مِنْهُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ(71)

 కాని ఒకవేళ వారు నీకు నమ్మక ద్రోహం చేయాలని తలచుకుంటే, వారు ఇంతకు పూర్వం అల్లాహ్ కు నమ్మకద్రోహం చేశారు, కావున వారిపై నీకు శక్తినిచ్చాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు

إِنَّ الَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ فِي سَبِيلِ اللَّهِ وَالَّذِينَ آوَوا وَّنَصَرُوا أُولَٰئِكَ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ وَالَّذِينَ آمَنُوا وَلَمْ يُهَاجِرُوا مَا لَكُم مِّن وَلَايَتِهِم مِّن شَيْءٍ حَتَّىٰ يُهَاجِرُوا ۚ وَإِنِ اسْتَنصَرُوكُمْ فِي الدِّينِ فَعَلَيْكُمُ النَّصْرُ إِلَّا عَلَىٰ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَاقٌ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ(72)

 నిశ్చయంగా, విశ్వసించి వలస పోయే వారూ మరియు తమ సంపద మరియు ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడేవారూ, వారికి ఆశ్రయమిచ్చేవారూ మరియు సహాయం చేసేవారూ, అందరూ ఒకరికొకరు మిత్రులు. మరియు ఎవరైతే విశ్వసించి వలస పోలేదో వారు, వలస పోనంత వరకు వారి మైత్రిత్వంతో మీకు ఎలాంటి సంబంధం లేదు. కాని వారు ధర్మం విషయంలో మీతో సహాయం కోరితే, వారికి సహాయం చేయటం మీ కర్తవ్యం; కాని మీతో ఒడంబడిక ఉన్న జాతి వారికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా చూస్తున్నాడు

وَالَّذِينَ كَفَرُوا بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ إِلَّا تَفْعَلُوهُ تَكُن فِتْنَةٌ فِي الْأَرْضِ وَفَسَادٌ كَبِيرٌ(73)

 మరియు సత్యతిరస్కారులు ఒకరికొకరు స్నేహితులు. కావున (ఓ విశ్వాసులారా!) మీరు కూడా అలా చేయక (విశ్వాసుల మధ్య పరస్పర మైత్రిత్వాన్ని పెంచక) పోతే, భూమిలో ఉపద్రవం మరియు కల్లోలం చెలరేగుతాయి

وَالَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ وَالَّذِينَ آوَوا وَّنَصَرُوا أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا ۚ لَّهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ(74)

 మరియు ఎవరైతే విశ్వసించి వలస పోయి అల్లాహ్ మార్గంలో పోరాడారో వారూ మరియు ఎవరైతే వారికి ఆశ్రయమిచ్చి సహాయపడ్డారో వారూ; ఇలాంటి వారే నిజమైన విశ్వాసులు. వారికి వారి (పాపాల) క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి

وَالَّذِينَ آمَنُوا مِن بَعْدُ وَهَاجَرُوا وَجَاهَدُوا مَعَكُمْ فَأُولَٰئِكَ مِنكُمْ ۚ وَأُولُو الْأَرْحَامِ بَعْضُهُمْ أَوْلَىٰ بِبَعْضٍ فِي كِتَابِ اللَّهِ ۗ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ(75)

 మరియు ఎవరైతే తరువాత విశ్వసించి మరియు వలస పోయి మరియు మీతో బాటు (అల్లాహ్ మార్గంలో) పోరాడారో, వారు కూడా మీ వారే! కాని అల్లాహ్ గ్రంథం ప్రకారం, రక్తసంబంధం గలవారు (వారసత్వ విషయంలో) ఒకరిపై నొకరు ఎక్కువ హక్కుదారులు. నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు


More surahs in Telugu:


Al-Baqarah Al-'Imran An-Nisa'
Al-Ma'idah Yusuf Ibrahim
Al-Hijr Al-Kahf Maryam
Al-Hajj Al-Qasas Al-'Ankabut
As-Sajdah Ya Sin Ad-Dukhan
Al-Fath Al-Hujurat Qaf
An-Najm Ar-Rahman Al-Waqi'ah
Al-Hashr Al-Mulk Al-Haqqah
Al-Inshiqaq Al-A'la Al-Ghashiyah

Download surah Al-Anfal with the voice of the most famous Quran reciters :

surah Al-Anfal mp3 : choose the reciter to listen and download the chapter Al-Anfal Complete with high quality
surah Al-Anfal Ahmed El Agamy
Ahmed Al Ajmy
surah Al-Anfal Bandar Balila
Bandar Balila
surah Al-Anfal Khalid Al Jalil
Khalid Al Jalil
surah Al-Anfal Saad Al Ghamdi
Saad Al Ghamdi
surah Al-Anfal Saud Al Shuraim
Saud Al Shuraim
surah Al-Anfal Abdul Basit Abdul Samad
Abdul Basit
surah Al-Anfal Abdul Rashid Sufi
Abdul Rashid Sufi
surah Al-Anfal Abdullah Basfar
Abdullah Basfar
surah Al-Anfal Abdullah Awwad Al Juhani
Abdullah Al Juhani
surah Al-Anfal Fares Abbad
Fares Abbad
surah Al-Anfal Maher Al Muaiqly
Maher Al Muaiqly
surah Al-Anfal Muhammad Siddiq Al Minshawi
Al Minshawi
surah Al-Anfal Al Hosary
Al Hosary
surah Al-Anfal Al-afasi
Mishari Al-afasi
surah Al-Anfal Yasser Al Dosari
Yasser Al Dosari


Wednesday, January 22, 2025

لا تنسنا من دعوة صالحة بظهر الغيب