📖 0/604 చదివిన పేజీలు
📄 455
وَمَا خَلَقۡنَا ٱلسَّمَآءَ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَا بَٰطِلًاۚ ذَٰلِكَ ظَنُّ ٱلَّذِينَ كَفَرُواْۚ فَوَيۡلٌ لِّلَّذِينَ كَفَرُواْ مِنَ ٱلنَّارِ  ۝٢٧ أَمۡ نَجۡعَلُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ كَٱلۡمُفۡسِدِينَ فِي ٱلۡأَرۡضِ أَمۡ نَجۡعَلُ ٱلۡمُتَّقِينَ كَٱلۡفُجَّارِ  ۝٢٨ كِتَٰبٌ أَنزَلۡنَٰهُ إِلَيۡكَ مُبَٰرَكٌ لِّيَدَّبَّرُوٓاْ ءَايَٰتِهِۦ وَلِيَتَذَكَّرَ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ  ۝٢٩ وَوَهَبۡنَا لِدَاوُۥدَ سُلَيۡمَٰنَۚ نِعۡمَ ٱلۡعَبۡدُ إِنَّهُۥٓ أَوَّابٌ  ۝٣٠ إِذۡ عُرِضَ عَلَيۡهِ بِٱلۡعَشِيِّ ٱلصَّٰفِنَٰتُ ٱلۡجِيَادُ  ۝٣١ فَقَالَ إِنِّيٓ أَحۡبَبۡتُ حُبَّ ٱلۡخَيۡرِ عَن ذِكۡرِ رَبِّي حَتَّىٰ تَوَارَتۡ بِٱلۡحِجَابِ  ۝٣٢ رُدُّوهَا عَلَيَّۖ فَطَفِقَ مَسۡحَۢا بِٱلسُّوقِ وَٱلۡأَعۡنَاقِ  ۝٣٣ وَلَقَدۡ فَتَنَّا سُلَيۡمَٰنَ وَأَلۡقَيۡنَا عَلَىٰ كُرۡسِيِّهِۦ جَسَدًا ثُمَّ أَنَابَ  ۝٣٤ قَالَ رَبِّ ٱغۡفِرۡ لِي وَهَبۡ لِي مُلۡكًا لَّا يَنۢبَغِي لِأَحَدٍ مِّنۢ بَعۡدِيٓۖ إِنَّكَ أَنتَ ٱلۡوَهَّابُ  ۝٣٥ فَسَخَّرۡنَا لَهُ ٱلرِّيحَ تَجۡرِي بِأَمۡرِهِۦ رُخَآءً حَيۡثُ أَصَابَ  ۝٣٦ وَٱلشَّيَٰطِينَ كُلَّ بَنَّآءٍ وَغَوَّاصٍ  ۝٣٧ وَءَاخَرِينَ مُقَرَّنِينَ فِي ٱلۡأَصۡفَادِ  ۝٣٨ هَٰذَا عَطَآؤُنَا فَٱمۡنُنۡ أَوۡ أَمۡسِكۡ بِغَيۡرِ حِسَابٍ  ۝٣٩ وَإِنَّ لَهُۥ عِندَنَا لَزُلۡفَىٰ وَحُسۡنَ مَـَٔابٍ  ۝٤٠ وَٱذۡكُرۡ عَبۡدَنَآ أَيُّوبَ إِذۡ نَادَىٰ رَبَّهُۥٓ أَنِّي مَسَّنِيَ ٱلشَّيۡطَٰنُ بِنُصۡبٍ وَعَذَابٍ  ۝٤١ ٱرۡكُضۡ بِرِجۡلِكَۖ هَٰذَا مُغۡتَسَلُۢ بَارِدٌ وَشَرَابٌ  ۝٤٢
38:27
وَمَا خَلَقۡنَا ٱلسَّمَآءَ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَا بَٰطِلًاۚ ذَٰلِكَ ظَنُّ ٱلَّذِينَ كَفَرُواْۚ فَوَيۡلٌ لِّلَّذِينَ كَفَرُواْ مِنَ ٱلنَّارِ  ۝٢٧
మరియు మేము ఈ ఆకాశాన్ని మరియు ఈ భూమిని మరియు వాటి మధ్య ఉన్న దాన్నంతా వృథాగా సృష్టించలేదు! ఇది సత్యాన్ని తిరస్కరించిన వారి భ్రమ మాత్రమే. కావున అట్టి సత్యతిరస్కారులకు నరకాగ్ని బాధ పడనున్నది
38:28
أَمۡ نَجۡعَلُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ كَٱلۡمُفۡسِدِينَ فِي ٱلۡأَرۡضِ أَمۡ نَجۡعَلُ ٱلۡمُتَّقِينَ كَٱلۡفُجَّارِ  ۝٢٨
ఏమీ? మేము విశ్వసించి, సత్కార్యాలు చేసేవారిని భూమిలో కల్లోలం రేకెత్తించే వారితో సమానులుగా చేస్తామా? లేక మేము దైవభీతి గలవారిని దుష్టులతో సమానులుగా చేస్తామా
38:29
كِتَٰبٌ أَنزَلۡنَٰهُ إِلَيۡكَ مُبَٰرَكٌ لِّيَدَّبَّرُوٓاْ ءَايَٰتِهِۦ وَلِيَتَذَكَّرَ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ  ۝٢٩
(ఓ ముహమ్మద్!) మేము ఎంతో శుభవంతమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింప జేశాము. ప్రజలు దీని సూచనలను (ఆయాత్ లను) గురించి యోచించాలని మరియు బుద్ధిమంతులు దీని నుండి హితబోధ గ్రహించాలని
38:30
وَوَهَبۡنَا لِدَاوُۥدَ سُلَيۡمَٰنَۚ نِعۡمَ ٱلۡعَبۡدُ إِنَّهُۥٓ أَوَّابٌ  ۝٣٠
మరియు మేము దావూద్ కు సులైమాన్ ను ప్రసాదించాము. అతను ఉత్తమ దాసుడు! నిశ్చయంగా, అతను ఎల్లప్పుడు మా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండేవాడు
38:31
إِذۡ عُرِضَ عَلَيۡهِ بِٱلۡعَشِيِّ ٱلصَّٰفِنَٰتُ ٱلۡجِيَادُ  ۝٣١
ఒకరోజు సాయంకాలం అతని ముందు మేలు జాతి, వడి గల గుర్రాలు ప్రవేశపెట్టబడినప్పుడు
38:32
فَقَالَ إِنِّيٓ أَحۡبَبۡتُ حُبَّ ٱلۡخَيۡرِ عَن ذِكۡرِ رَبِّي حَتَّىٰ تَوَارَتۡ بِٱلۡحِجَابِ  ۝٣٢
అతను అన్నాడు: అయ్యో! వాస్తవంగా నేను నా ప్రభువు స్మరణకు బదులుగా ఈ సంపదను (గుర్రాలను) ప్రేమించాను." చివరకు (సూర్యుడు) కనుమరుగై పోయాడు
38:33
رُدُّوهَا عَلَيَّۖ فَطَفِقَ مَسۡحَۢا بِٱلسُّوقِ وَٱلۡأَعۡنَاقِ  ۝٣٣
(అతను ఇంకా ఇలా అన్నాడు): వాటిని నా వద్దకు తిరిగి తీసుకురండి." తరువాత అతను వాటి పిక్కలను మరియు మెడలను నిమరసాగాడు
38:34
وَلَقَدۡ فَتَنَّا سُلَيۡمَٰنَ وَأَلۡقَيۡنَا عَلَىٰ كُرۡسِيِّهِۦ جَسَدًا ثُمَّ أَنَابَ  ۝٣٤
మరియు వాస్తవానికి మేము సులైమాన్ ను పరీక్షకు గురి చేశాము మరియు అతని సింహాసనంపై ఒక కళేబరాన్ని పడవేశాము, అప్పుడతను పశ్చాత్తాపంతో మా వైపునకు మరలాడు
38:35
قَالَ رَبِّ ٱغۡفِرۡ لِي وَهَبۡ لِي مُلۡكًا لَّا يَنۢبَغِي لِأَحَدٍ مِّنۢ بَعۡدِيٓۖ إِنَّكَ أَنتَ ٱلۡوَهَّابُ  ۝٣٥
అతను ఇలా ప్రార్థించాడు: ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నా తరువాత మరెవ్వరికీ లభించనటువంటి సామ్రాజ్యాన్ని నాకు ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు
38:36
فَسَخَّرۡنَا لَهُ ٱلرِّيحَ تَجۡرِي بِأَمۡرِهِۦ رُخَآءً حَيۡثُ أَصَابَ  ۝٣٦
అప్పుడు మేము గాలిని అతనికి వశ పరచాము. అది అతని ఆజ్ఞానుసారంగా, అతడు కోరిన వైపునకు తగినట్లుగా మెల్లగా వీచేది
38:37
وَٱلشَّيَٰطِينَ كُلَّ بَنَّآءٍ وَغَوَّاصٍ  ۝٣٧
మరియు షైతానులలో (జిన్నాతులలో) నుండి కూడా రకరకాల కట్టడాలు నిర్మించే వాటినీ మరియు సముద్రంలో మునిగి (ముత్యాలు తీసే) వాటినీ (అతనికి వశ పరచి ఉన్నాము)
38:38
وَءَاخَرِينَ مُقَرَّنِينَ فِي ٱلۡأَصۡفَادِ  ۝٣٨
మరికొన్ని సంకెళ్ళతో బంధింపబడినవి కూడా ఉండేవి
38:39
هَٰذَا عَطَآؤُنَا فَٱمۡنُنۡ أَوۡ أَمۡسِكۡ بِغَيۡرِ حِسَابٍ  ۝٣٩
(అల్లాహ్ అతనితో అన్నాడు): ఇది నీకు మా కానుక, కావున నీవు దీనిని (ఇతరులకు) ఇచ్చినా, లేక నీవే ఉంచుకున్నా, నీతో ఎలాంటి లెక్క తీసుకోబడదు
38:40
وَإِنَّ لَهُۥ عِندَنَا لَزُلۡفَىٰ وَحُسۡنَ مَـَٔابٍ  ۝٤٠
మరియు నిశ్చయంగా, అతనికి మా సాన్నిహిత్యం మరియు ఉత్తమ గమ్యస్థానం ఉన్నాయి
38:41
وَٱذۡكُرۡ عَبۡدَنَآ أَيُّوبَ إِذۡ نَادَىٰ رَبَّهُۥٓ أَنِّي مَسَّنِيَ ٱلشَّيۡطَٰنُ بِنُصۡبٍ وَعَذَابٍ  ۝٤١
మరియు మా దాసుడు అయ్యూబ్ ను గురించి ప్రస్తావించు; అతను తన ప్రభువుతో ఇలా మొరపెట్టుకున్నాడు: నిశ్చయంగా షైతాన్ నన్ను ఆపదకు మరియు శిక్షకు గురి చేశాడు
38:42
ٱرۡكُضۡ بِرِجۡلِكَۖ هَٰذَا مُغۡتَسَلُۢ بَارِدٌ وَشَرَابٌ  ۝٤٢
(మేము అతనితో అన్నాము): నీ కాలును నేల మీద కొట్టు. అదిగో చల్ల (నీటి చెలిమ)! నీవు స్నానం చేయటానికి మరియు త్రాగుటకూను


📚Juz 23 📄455 / 604



Mishary Rashid Alafasy
Mahmoud Khalil Al-Husary
Abdurrahman As-Sudais
Mohamed Siddiq Al-Minshawi
Abdul Basit Abdul Samad
Ali Al-Hudhaify
Ahmed ibn Ali al-Ajamy
Abu Bakr Ash-Shaatree
Muhammad Ayyoub
Abdullah Basfar
Abdullah Al-Juhani
Maher Al Muaiqly
0:00
0:00
-

పవిత్ర ఖురాన్


Saturday, August 29, 2026

Don't forget us in your sincere prayers