సూరా అల్-గాషియా అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-గాషియాని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (26 వచనం — مكية). అల్-గాషియా వినండి, అల్-గాషియా అనువాదం, అల్-గాషియా mp3, అల్-గాషియా pdf.

సూరా అల్-గాషియా చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
هَلْ أَتَاكَ حَدِيثُ الْغَاشِيَةِ ۝١
📖 అనువాదం వచనం 1
హఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు (పునరుత్థాన దినపు) సమాచారం నీకు అందిందా
وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ ۝٢
📖 అనువాదం వచనం 2
కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి
عَامِلَةٌ نَّاصِبَةٌ ۝٣
📖 అనువాదం వచనం 3
(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి
تَصْلَىٰ نَارًا حَامِيَةً ۝٤
📖 అనువాదం వచనం 4
వారు దహించే అగ్నిలో పడి కాలుతారు
تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ ۝٥
📖 అనువాదం వచనం 5
వారికి సలసల కాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది
لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ ۝٦
📖 అనువాదం వచనం 6
వారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు
لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ ۝٧
📖 అనువాదం వచనం 7
అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు
وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ ۝٨
📖 అనువాదం వచనం 8
ఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి
لِّسَعْيِهَا رَاضِيَةٌ ۝٩
📖 అనువాదం వచనం 9
తాము చేసుకున్న సత్కార్యాలకు (ఫలితాలకు) వారు సంతోషపడుతూ ఉంటారు
فِي جَنَّةٍ عَالِيَةٍ ۝١٠
📖 అనువాదం వచనం 10
అత్యున్నతమైన స్వర్గవనంలో
لَّا تَسْمَعُ فِيهَا لَاغِيَةً ۝١١
📖 అనువాదం వచనం 11
అందులో వారు ఎలాంటి వృథా మాటలు వినరు
فِيهَا عَيْنٌ جَارِيَةٌ ۝١٢
📖 అనువాదం వచనం 12
అందులో ప్రవహించే సెలయేళ్ళు ఉంటాయి
فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ ۝١٣
📖 అనువాదం వచనం 13
అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి
وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ ۝١٤
📖 అనువాదం వచనం 14
మరియు పేర్చబడిన (మధు) పాత్రలు
وَنَمَارِقُ مَصْفُوفَةٌ ۝١٥
📖 అనువాదం వచనం 15
మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు
وَزَرَابِيُّ مَبْثُوثَةٌ ۝١٦
📖 అనువాదం వచనం 16
మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు
أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ ۝١٧
📖 అనువాదం వచనం 17
ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో
وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ ۝١٨
📖 అనువాదం వచనం 18
మరియు ఆకాశం వైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో
وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ ۝١٩
📖 అనువాదం వచనం 19
మరియు కొండల వైపుకు చూడరా?అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో
وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ ۝٢٠
📖 అనువాదం వచనం 20
మరియు భూమి వైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో
فَذَكِّرْ إِنَّمَا أَنتَ مُذَكِّرٌ ۝٢١
📖 అనువాదం వచనం 21
కావున (ఓ ముహమ్మద్!) నీవు హితోపదేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసే వాడవు మాత్రమే
لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ ۝٢٢
📖 అనువాదం వచనం 22
నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు
إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ ۝٢٣
📖 అనువాదం వచనం 23
ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో
فَيُعَذِّبُهُ اللَّهُ الْعَذَابَ الْأَكْبَرَ ۝٢٤
📖 అనువాదం వచనం 24
అప్పుడు అతనికి అల్లాహ్ ఘోరశిక్ష విధిస్తాడు
إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ ۝٢٥
📖 అనువాదం వచనం 25
నిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది
ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم ۝٢٦
📖 అనువాదం వచనం 26
ఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే
← 87 అల్-గాషియా (88/114) 89 →
చదవండి సూరా అల్-గాషియా తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

88الغاشية Al-Ghashiyah 📚 26 వచనం مكية

వచనానికి వచనం – సూరా అల్-గాషియా — 26 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers