సూరా అల్-ఆలా అరబిక్ మరియు తెలుగు

సూరా అల్-ఆలాని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (19 వచనం — مكية). అల్-ఆలా వినండి, అల్-ఆలా అనువాదం, అల్-ఆలా mp3, అల్-ఆలా pdf.

సూరా అల్-ఆలా చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى ۝١
📖 అనువాదం వచనం 1
అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు
الَّذِي خَلَقَ فَسَوَّىٰ ۝٢
📖 అనువాదం వచనం 2
ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు
وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ ۝٣
📖 అనువాదం వచనం 3
మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు
وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ ۝٤
📖 అనువాదం వచనం 4
మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు
فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ ۝٥
📖 అనువాదం వచనం 5
మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు
سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ ۝٦
📖 అనువాదం వచనం 6
మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు
إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ ۝٧
📖 అనువాదం వచనం 7
అల్లాహ్ కోరింది తప్ప! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు
وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ ۝٨
📖 అనువాదం వచనం 8
మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము
فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ ۝٩
📖 అనువాదం వచనం 9
కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు
سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ ۝١٠
📖 అనువాదం వచనం 10
(అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు
وَيَتَجَنَّبُهَا الْأَشْقَى ۝١١
📖 అనువాదం వచనం 11
మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు
الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ ۝١٢
📖 అనువాదం వచనం 12
అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు
ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ ۝١٣
📖 అనువాదం వచనం 13
అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు
قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ ۝١٤
📖 అనువాదం వచనం 14
సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు
وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ ۝١٥
📖 అనువాదం వచనం 15
మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు
بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا ۝١٦
📖 అనువాదం వచనం 16
అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు
وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ ۝١٧
📖 అనువాదం వచనం 17
కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది
إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ ۝١٨
📖 అనువాదం వచనం 18
నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది
صُحُفِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ ۝١٩
📖 అనువాదం వచనం 19
ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో
← 86 అల్-ఆలా (87/114) 88 →
చదవండి సూరా అల్-ఆలా తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

87الأعلى Al-A'la 📚 19 వచనం مكية

వచనానికి వచనం – సూరా అల్-ఆలా — 19 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers