Wa in kuntum `alaa safarinw wa lam tajidoo kaatiban farihaanum maqboodatun fa in amina ba`dukum ba`dan falyu`addil lazi tumina amaa natahoo walyattaqil laaha Rabbah; wa laa taktumush shahaadah; wa mai yaktumhaa fa innahooo aasimun qalbuh; wallaahu bimaa ta`maloona `Aleem
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, (పత్రం) వ్రాసేవాడు దొరకని పక్షంలో సొమ్మును కుదువ పెట్టుకోవచ్చు. మీకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే నమ్మకంగా ఇచ్చిన దానిని (అప్పును) తిరిగి అతడు వాపసు చేయాలి. మరియు తన ప్రభువైన అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరియు మీరు సాక్ష్యాన్ని (ఎన్నడూ) దాచకండి. మరియు (సాక్ష్యాన్ని) దాచేవాని హృదయం పాపభరితమైనది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और अगर तुम सफ़र में हो और कोई लिखने वाला न मिले (और क़र्ज़ देना हो) तो रहन या कब्ज़ा रख लो और अगर तुममें एक का एक को एतबार हो तो (यूं ही क़र्ज़ दे सकता है मगर) फिर जिस शख्स पर एतबार किया गया है (क़र्ज़ लेने वाला) उसको चाहिये क़र्ज़ देने वाले की अमानत (क़र्ज़) पूरी पूरी अदा कर दे और अपने पालने वाले ख़ुदा से डरे (मुसलमानो) तुम गवाही को न छिपाओ और जो छिपाएगा तो बेशक उसका दिल गुनाहगार है और तुम लोग जो कुछ करते हो ख़ुदा उसको ख़ूब जानता है
كَاتِبًا (కాతిబన్): రాయసగాడు, ఋణపత్రం రాసే వ్యక్తి.
فَرِهَانٌ (ఫరిహానున్): రుణం తీర్చే వరకు పెట్టే తాకట్టు వస్తువులు (బహువచనం).
مَّقْبُوضَةٌ (మఖ్బూదా): స్వాధీనం చేసుకోబడినవి, రుణదాత చేతికి అప్పగించబడినవి.
اؤْتُمِنَ (ఉతుమిన): నమ్మకం ఉంచబడినవాడు.
أَمَانَتَهُ (అమానతహు): అతని నమ్మకం, అప్పగించిన వస్తువు.
تَكْتُمُوا (తక్తుమూ): దాచిపెట్టడం, గోప్యం చేయడం.
آثِمٌ (ఆథిమున్): పాపం చేసేవాడు.
ఆయత్ యొక్క వివరణ:
మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, అప్పు రాసే రాయసగాడు దొరకని పరిస్థితి ఏర్పడితే, రుణగ్రహీత తన అప్పుకు హామీగా రుణదాత చేతికి ఏదైనా వస్తువును తాకట్టుగా అప్పగించాలి. ఈ తాకట్టు రుణదాత స్వాధీనంలో ఉండాలి; స్వాధీనం లేకుండా తాకట్టు పూర్తికాదు. అయితే, ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉంటే, రాయడం, సాక్షులు పెట్టడం, తాకట్టు పెట్టడం ఇవేమీ తప్పనిసరి కాదు. అలాంటి సందర్భంలో అప్పు అనేది రుణగ్రహీత మెడలో నమ్మకంగా ఉంటుంది; అతను దానిని తప్పకుండా తిరిగి చెల్లించాలి. తన ప్రభువైన అల్లాహ్ను భయపడుతూ, ఆ నమ్మకాన్ని ద్రోహం చేయకుండా, ఏ మాత్రం తగ్గించకుండా పూర్తిగా చెల్లించాలి. ఒకవేళ రుణగ్రహీత అప్పును తిరస్కరించినట్లయితే, ఆ లావాదేవీకి సాక్షులుగా ఉన్నవారు తమ సాక్ష్యాన్ని తప్పకుండా చెప్పాలి; దానిని దాచిపెట్టకూడదు. ఎవరైనా సాక్ష్యాన్ని దాచిపెడితే, అతని హృదయం పాపాత్మకమైనది, ద్రోహియైనది అవుతుంది. మీరు చేసే ప్రతి పనిని అల్లాహ్ బాగా ఎరిగినవాడు; మీ హృదయాల్లో దాగి ఉన్నది కూడా ఆయనకు తెలుసు, తదనుగుణంగా ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
ఇస్లాం మతం వ్యాపార లావాదేవీలలో పారదర్శకతకు, న్యాయానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఈ ఆయత్ చూపిస్తుంది. రుణదాత హక్కులు కాపాడబడాలని, రుణగ్రహీత బాధ్యతలు నెరవేర్చాలని ఇది బోధిస్తుంది.
ఇస్లాం కేవలం ఆచారాల మతం మాత్రమే కాదు; దైనందిన జీవితంలోని ప్రతి అంశానికి, వ్యాపారానికి సైతం మార్గదర్శనం ఇచ్చే సంపూర్ణ జీవన విధానం.
నమ్మకం (అమానత్) అనేది ఇస్లాంలో ఎంతో గొప్ప విలువ. ఒకరు మీపై నమ్మకం ఉంచి ఏదైనా అప్పగించినప్పుడు, దానిని తిరిగి ఇచ్చేయడం, దానిలో ద్రోహం చేయకపోవడం ప్రతి ముస్లింకు పవిత్రమైన కర్తవ్యం.
సాక్ష్యాన్ని దాచిపెట్టడం హృదయాన్ని కలుషితం చేసే పాపమని, అది అల్లాహ
మరియు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, (పత్రం) వ్రాసేవాడు దొరకని పక్షంలో సొమ్మును కుదువ పెట్టుకోవచ్చు. మీకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే నమ్మకంగా ఇచ్చిన దానిని (అప్పును) తిరిగి అతడు వాపసు చేయాలి. మరియు తన ప్రభువైన అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరియు మీరు సాక్ష్యాన్ని (ఎన్నడూ) దాచకండి. మరియు (సాక్ష్యాన్ని) దాచేవాని హృదయం పాపభరితమైనది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
మరియు మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారి కెలాంటి అన్యాయం జరుగదు
ఓ విశ్వాసులారా! మీరు పరస్పరం ఒక నిర్ణీతకాలం కొరకు అప్పు తీసుకున్నప్పుడు, దానిని వ్రాసిపెట్టుకోండి. మరియు మీలో పత్రం వ్రాసేవాడు, న్యాయంగా వ్రాయాలి. మరియు వ్రాసేవాడు నిరాకరించకుండా, అల్లాహ్ నేర్పినట్లు వ్రాయాలి. ఋణగ్రహీత అల్లాహ్ కు భయపడి, నిర్ణీత షరతులను తగ్గించకుండా, చెప్పి వ్రాయించాలి. ఋణగ్రహీత అల్పజ్ఞాని లేక సామర్థ్యం లేనివాడు లేక బలహీనుడు మరియు తాను చెప్పి వ్రాయించలేని వాడైతే, అతని సంరక్షకుడు న్యాయంగా వ్రాయించాలి. మరియు మీలో ఇద్దరు మగవారిని సాక్ష్యమివ్వటానికి సాక్షులుగా ఉంచుకోండి. ఇద్దరు పురుషులు దొరకని పక్షమున ఒక పురుషుడు మరియు మీకు సమ్మతమైన ఇద్దరు స్త్రీలను సాక్షులుగా తీసుకోండి. (ఎందుకంటే) వారిలో ఒకామె మరచిపోతే, రెండవ స్త్రీ ఆమెకు జ్ఞాపకం చేయించవచ్చు. మరియు పిలువబడినప్పుడు సాక్షులు, సాక్ష్యమివ్వటానికి నిరాకరించకూడదు. మరియు వ్యవహారం చిన్నదైనా పెద్దదైనా దానిని గడువు నిర్ణయంతో పాటు వ్రాసిపెట్టటానికి అశ్రద్ధ చూపకూడదు. అల్లాహ్ దృష్టిలో ఇది న్యాయసమ్మతమైనది మరియు స్థిరమైన సాక్ష్యంగా తోడ్పడుతుంది మరియు ఏ విధమైన సందేహాలకు అవకాశం లేకుండా చేస్తుంది. కాని, మీరు అప్పటికప్పుడు ఇచ్చి పుచ్చుకునే (సాధారణ) లావాదేవీలు చేస్తున్నపుడు వ్రాయకున్నా దోషం లేదు. కాని, వ్యాపార వ్యవహారాలు నిర్ణయించేటప్పుడు సాక్షులను పెట్టుకోండి. కాని వ్రాసేవానికి గానీ, సాక్షులకు గానీ ఏ విధమైన హాని జరుగకూడదు. ఒకవేళ అలా జరిగితే! నిశ్చయంగా, అది మీకు పాపం. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఇది అల్లాహ్ మీకు నేర్పుతున్నాడు. మరియు అల్లాహ్ కు ప్రతిదాని జ్ఞానం ఉంది
మరియు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, (పత్రం) వ్రాసేవాడు దొరకని పక్షంలో సొమ్మును కుదువ పెట్టుకోవచ్చు. మీకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే నమ్మకంగా ఇచ్చిన దానిని (అప్పును) తిరిగి అతడు వాపసు చేయాలి. మరియు తన ప్రభువైన అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరియు మీరు సాక్ష్యాన్ని (ఎన్నడూ) దాచకండి. మరియు (సాక్ష్యాన్ని) దాచేవాని హృదయం పాపభరితమైనది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ దే! మీరు మీ మనస్సులలో ఉన్నది, వెలుబుచ్చినా లేక దాచినా అల్లాహ్ మీ నుంచి దాని లెక్క తీసుకుంటాడు. మరియు ఆయన తాను కోరిన వానిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వానిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు
ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.