سوره شعراء به زبان تلوگو
طسم(1) తా - సీన్ - మీమ్ |
ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయతులు) |
(ఓ ముహమ్మద్) వారు విశ్వసించలేదనే బాధతో బహుశా నీవు నీ ప్రాణాలే కోల్పోతావేమో |
إِن نَّشَأْ نُنَزِّلْ عَلَيْهِم مِّنَ السَّمَاءِ آيَةً فَظَلَّتْ أَعْنَاقُهُمْ لَهَا خَاضِعِينَ(4) మేము కోరితే ఆకాశం నుండి వారిపై ఒక అద్భుత సంకేతాన్ని (ఆయత్ ను) అవతరింపజేసి, దానికి వారి మెడలను నమ్రతతో వంగి పోయేలా చేసేవారము |
وَمَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّنَ الرَّحْمَٰنِ مُحْدَثٍ إِلَّا كَانُوا عَنْهُ مُعْرِضِينَ(5) మరియు వారి వద్దకు అనంత కరుణామయుడని వద్ద నుండి క్రొత్త సందేశం వచ్చినప్పుడల్లా, వారు దాని నుండి విముఖులు కాకుండా ఉండలేదు |
فَقَدْ كَذَّبُوا فَسَيَأْتِيهِمْ أَنبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ(6) వాస్తవానికి, ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చిన దాని యథార్థమేమిటో వారికి తెలిసిపోతుంది |
أَوَلَمْ يَرَوْا إِلَى الْأَرْضِ كَمْ أَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ كَرِيمٍ(7) ఏమీ? వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవరాసుల్ని) పుట్టించామో |
إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ(8) నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు |
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత |
وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰ أَنِ ائْتِ الْقَوْمَ الظَّالِمِينَ(10) మరియు నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించిన విషయాన్ని వారికి జ్ఞాపకం చేయించు: దుర్మార్గులైన జాతి ప్రజల వద్దకు వెళ్ళు |
ఫిర్ఔన్ జాతివారి వద్దకు. ఏమీ? వారికి దైవభీతి లేదా |
(మూసా) అన్నాడు: ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను |
وَيَضِيقُ صَدْرِي وَلَا يَنطَلِقُ لِسَانِي فَأَرْسِلْ إِلَىٰ هَارُونَ(13) నా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది, కావున నీవు హారూన్ వద్దకు కూడా (వహీ) పంపు |
మరియు వారి దగ్గర నా మీద ఒక నేరం మోపబడి ఉన్నది, కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను |
قَالَ كَلَّا ۖ فَاذْهَبَا بِآيَاتِنَا ۖ إِنَّا مَعَكُم مُّسْتَمِعُونَ(15) (అల్లాహ్) సెలవిచ్చాడు: అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతో పాటు ఉండి సర్వమూ వింటూ ఉంటాము |
فَأْتِيَا فِرْعَوْنَ فَقُولَا إِنَّا رَسُولُ رَبِّ الْعَالَمِينَ(16) కావున మీరిద్దరూ ఫిరఔన్ వద్దకు వెళ్ళి అనండి: నిశ్చయంగా, మేము సర్వలోకాల పోషకుని సందేశహరులము |
కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు |
قَالَ أَلَمْ نُرَبِّكَ فِينَا وَلِيدًا وَلَبِثْتَ فِينَا مِنْ عُمُرِكَ سِنِينَ(18) (ఫిర్ఔన్) అన్నాడు: ఏమీ? మేము నిన్ను బాల్యంలో మాతో పాటు పోషించలేదా? మరియు నీవు నీ వయస్సులోని అనేక సంవత్సరాలు మాతో పాటు గడిపావు కదా |
وَفَعَلْتَ فَعْلَتَكَ الَّتِي فَعَلْتَ وَأَنتَ مِنَ الْكَافِرِينَ(19) అయినా నీవు హీనమైన ఆ పని చేశావు, కావున నీవు కృతఘ్నులలోని వాడవు |
(మూసా) అన్నాడు: నేను పొరపాటుగా ఆ పని చేశాను |
فَفَرَرْتُ مِنكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِي رَبِّي حُكْمًا وَجَعَلَنِي مِنَ الْمُرْسَلِينَ(21) ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు |
وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَيَّ أَنْ عَبَّدتَّ بَنِي إِسْرَائِيلَ(22) ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా |
(ఫిర్ఆన్) అడిగాడు: అయితే ఈ సర్వలోకాల ప్రభువు అంటే ఏమిటి |
قَالَ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ(24) (మూసా) జవాబిచ్చాడు: మీరు నమ్మేవారే అయితే! ఆయనే ఆకాశాలకూ మరియు భూమికీ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు |
(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న వారితో: ఏమీ? మీరు వింటున్నారా?" అని ప్రశ్నించాడు |
(మూసా) అన్నాడు: ఆయన (అల్లాహ్) మీ ప్రభువు మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కూడానూ |
قَالَ إِنَّ رَسُولَكُمُ الَّذِي أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌ(27) (ఫిర్ఔన్) అన్నాడు: మీ వద్దకు పంపబడిన మీ ఈ సందేశహరుడు నిశ్చయంగా పిచ్చివాడే |
قَالَ رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ(28) (మూసా) అన్నాడు: మీరు అర్థం చేసుకోగలిగితే! ఆయనే తూర్పూ పడమరలకూ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు |
قَالَ لَئِنِ اتَّخَذْتَ إِلَٰهًا غَيْرِي لَأَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُونِينَ(29) (ఫిర్ఔన్) అన్నాడు: నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకుంటే నేను నిన్ను చెరసాలలో ఉన్నవారితో చేర్చుతాను |
(మూసా) అన్నాడు: ఏమీ? నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని (సత్యాన్ని) తీసుకువచ్చిన తరువాత కూడానా |
(ఫిర్ఔన్) అన్నాడు: నీవు సత్యవంతుడవే అయితే దానిని (ఆ అద్భుత సూచనను) చూపు |
అప్పుడు (మూసా) తన చేతి కర్రను పడవేయగానే, అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది |
తరువాత అతను (మూసా) తన చేతిని (చంక నుండి) వెలుపలికి తీయగానే, అది చూసేవారి యెదుట తెల్లగా ప్రకాశించసాగింది |
قَالَ لِلْمَلَإِ حَوْلَهُ إِنَّ هَٰذَا لَسَاحِرٌ عَلِيمٌ(34) (ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న నాయకులతో అన్నాడు: నిశ్చయంగా, ఇతనొక నేర్పు గల మాంత్రికుడు |
يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِ فَمَاذَا تَأْمُرُونَ(35) ఇతను తన మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి తరుమ గోరుతున్నాడు, అయితే మీ సలహా ఏమిటి |
قَالُوا أَرْجِهْ وَأَخَاهُ وَابْعَثْ فِي الْمَدَائِنِ حَاشِرِينَ(36) వారన్నారు: అతనిని మరియు అతని సోదరుణ్ణి ఆపి ఉంచు మరియు (మంత్రగాళ్ళను) సమావేశ పరచటానికి అన్ని నగరాలకు వార్తాహరులను పంపు |
వారు నీ వద్దకు నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి తెస్తారు |
ఈ విధంగా ఒక నియమిత రోజున ఒక నియమిత ప్రదేశంలో మాంత్రికులంతా సమావేశ పరచబడ్డారు |
మరియు ప్రజలతో ఇలా ప్రశ్నించడం జరిగింది: ఏమీ? మీరంతా సమావేశమయ్యారా |
لَعَلَّنَا نَتَّبِعُ السَّحَرَةَ إِن كَانُوا هُمُ الْغَالِبِينَ(40) ఒకవేళ మాంత్రికులు గెలుపొందితే మనమంతా వారిని అనుసరించాలి కదా |
మాంత్రికులు వచ్చిన తరువాత ఫిర్ఔన్ తో అన్నారు: మేము గెలుపొందితే నిశ్చయంగా మాకు బహుమాన ముంది కదా |
(ఫిర్ఔన్) అన్నాడు: అవును! నిశ్చయంగా, అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరుతారు |
మూసా వారితో అన్నాడు: మీరు విసర దలుచుకున్న దానిని విసరండి |
فَأَلْقَوْا حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوا بِعِزَّةِ فِرْعَوْنَ إِنَّا لَنَحْنُ الْغَالِبُونَ(44) అప్పుడు వారు తమ త్రాళ్ళను మరియు తమ కర్రలను విసిరి ఇలా అన్నారు: ఫిర్ఔన్ శక్తి సాక్షిగా! నిశ్చయంగా మేమే విజయం పొందుతాము |
فَأَلْقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ(45) ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగి వేసింది |
అప్పుడు ఆ మాంత్రికులు సజ్దాలో పడ్డారు |
వారన్నారు: మేము సర్వలోకాల ప్రభువును విశ్వసిస్తున్నాము |
మూసా మరియు హారూన్ ల ప్రభువును |
(ఫిర్ఔన్) అన్నాడు: నేను మీకు అనుమతి ఇవ్వక ముందే మీరు ఇతనిని విశ్వసించారా? నిశ్చయంగా, ఇతడే మీ గురువు, మీకు జాలవిద్యను నేర్పినవాడు. సరే! ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ వ్యతిరేక (ప్రతిపక్ష) దిశల చేతులను మరియు కాళ్ళను నరికిస్తాను మరియు మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను |
قَالُوا لَا ضَيْرَ ۖ إِنَّا إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ(50) (మాంత్రికులు) అన్నారు: బాధ లేదు! నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది |
إِنَّا نَطْمَعُ أَن يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَايَانَا أَن كُنَّا أَوَّلَ الْمُؤْمِنِينَ(51) నిశ్చయంగా, మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే వాస్తవానికి అందరి కంటే ముందుగా విశ్వసించిన వారం మేమే |
۞ وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَسْرِ بِعِبَادِي إِنَّكُم مُّتَّبَعُونَ(52) మరియు మేము మూసాకు ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: నీవు నా దాసులను రాత్రివేళ తీసుకొని వెళ్ళిపో నిశ్చయంగా, మీరు వెంబడించబడతారు |
తరువాత ఫిర్ఔన్ అన్ని పట్టణాలకు వార్తాహరులను పంపాడు |
(ఇలా ప్రకటన చేయించాడు): వాస్తవానికి వీరు (ఈ ఇస్రాయీల్ సంతతి వారు) ఒక చిన్న తెగవారు మాత్రమే |
మరియు నిశ్చయంగా, వారు మాకు చాలా కోపం తెప్పించారు |
మరియు నిశ్చయంగా, మనం ఐకమత్యంతో ఉండి జాగరూకత చూపేవారము |
కావున మేము వారిని, తోటల నుండి మరియు చెలమల నుండి వెళ్ళగొట్టాము |
మరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా |
ఈ విధంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని, వాటికి వారసులుగా చేశాము |
అప్పుడు (ఫిర్ఔన్ జాతి) వారు సూర్యోదయ కాలమున (ఇస్రాయీల్ సంతతి) వారిని వెంబడించారు |
فَلَمَّا تَرَاءَى الْجَمْعَانِ قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ(61) ఆ ఇరుపక్షాల వారు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు, మూసా అనుచరులు అన్నారు: నిశ్చయంగా మేము చిక్కి పోయాము |
(మూసా అన్నాడు): అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు) |
అప్పుడు మేము మూసాకు: నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది |
మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింప జేశాము |
మరియు మూసాను మరియు అతనితో పాటు ఉన్నవారిని అందరినీ రక్షించాము |
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము |
إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ(67) నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు |
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిసంపన్నుడు, అపార కరుణా ప్రదాత |
ఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు |
అతను తన తండ్రితో మరియు తన జాతి వారితో: మీరెవరిని ఆరాధిస్తున్నారు?" అని అడిగినపుడు |
వారన్నారు: మేము విగ్రహాలను ఆరాధిస్తున్నాము మరియు మేము వాటికే ఎల్లప్పుడు భక్తులమై ఉంటాము |
(ఇబ్రాహీమ్) అన్నాడు: మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా |
లేదా, మీకేమైనా మేలు చేయగలవా? లేదా హాని చేయగలవా |
వారన్నారు: అలా కాదు! మేము మా తండ్రితాతలను ఇలా చేస్తూ ఉండగా చూశాము |
అతను అన్నాడు: ఏమీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరెవరిని ఆరాధిస్తున్నారో |
మీరు గానీ మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గానీ (ఆలోచించారా) |
ఎందుకంటే! నిశ్చయంగా, ఇవన్నీ నా శత్రువులే! కేవలం ఆ సర్వలోకాల ప్రభువు తప్ప |
ఆయనే నన్ను సృష్టించాడు. కాబట్టి ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు |
ఆయనే నాకు తినిపించేవాడు మరియు త్రాగించేవాడు |
మరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే, ఆయనే నాకు స్వస్థత నిచ్చేవాడు |
మరియు ఆయనే నన్ను మరణింపజేసేవాడు, తరువాత మళ్ళీ బ్రతికింపజేసేవాడు |
وَالَّذِي أَطْمَعُ أَن يَغْفِرَ لِي خَطِيئَتِي يَوْمَ الدِّينِ(82) మరియు ఆయనే తీర్పుదినమున నా తప్పులను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాను |
మరియు ఓ నా ఫ్రభూ! నాకు వివేకాన్ని ప్రసాదించు మరియు నన్ను సద్వర్తనులలో కలుపు |
మరియు తరువాత వచ్చే తరాల వారిలో నాకు మంచి పేరును ప్రసాదించు |
మరియు సర్వసుఖాల స్వర్గానికి వారసులయ్యేవారిలో నన్ను చేర్చు |
మరియు నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టులలోని వాడే |
మరియు అందరూ తిరిగి బ్రతికింపబడే రోజు నన్ను అవమానం పాల చేయకు |
ఏ రోజునైతే ధనసంపత్తులు గానీ, సంతానం గానీ పనికిరావో |
కేవలం నిర్మలమైన హృదయంతో అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు తప్ప |
మరియు (ఆ రోజు) స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకు రాబడుతుంది |
మరియు నరకం మార్గం తప్పిన వారి ముందు పెట్టబడుతుంది |
మరియు వారితో అనబడుతుంది: మీరు ఆరాధించేవారు (ఆ దైవాలు) ఇప్పుడు ఎక్కడున్నారు |
అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా |
అప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు |
మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ |
వారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు |
అల్లాహ్ సాక్షిగా! మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము |
ఎప్పుడైతే మేము మిమ్మల్ని సర్వలోకాల ప్రభువుతో సమానులుగా చేశామో |
మరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే |
మాకిప్పుడు సిఫారసు చేసేవారు ఎవ్వరూ లేరు |
మరియు ఏ ప్రాణ స్నేహితుడు కూడా లేడు |
فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ(102) ఒకవేళ మళ్ళీ మరలిపోయే అవకాశం మాకు దొరికి ఉంటే, మేము తప్పకుండా విశ్వసించిన వారిలో చేరిపోతాము |
إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ(103) నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు |
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత |
నూహ్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది |
వారి సహోదరుడు నూహ్ వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీకు దైవభీతి లేదా |
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను |
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి |
وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ(109) నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది |
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి |
వారన్నారు: ఏమీ? మేము నిన్ను విశ్వసించాలా? నిన్ను కేవలం అధములైన వారే కదా అనుసరిస్తున్నది |
(నూహ్) అన్నాడు: వారేమి (పనులు) చేస్తూ ఉండేవారో నాకేం తెలుసు |
إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّي ۖ لَوْ تَشْعُرُونَ(113) వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది |
మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించే వాడను కాను |
నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే |
قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا نُوحُ لَتَكُونَنَّ مِنَ الْمَرْجُومِينَ(116) వారన్నారు: ఓ నూహ్! నీవు దీనిని మానుకోకపోతే, నీవు తప్పక రాళ్ళు రువ్వి చంపబడతావు |
(నూహ్) అన్నాడు: ఓ నా ప్రభూ! నా జాతి ప్రజలు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తున్నారు |
فَافْتَحْ بَيْنِي وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِي وَمَن مَّعِيَ مِنَ الْمُؤْمِنِينَ(118) కావున నీవే నాకూ మరియు వారికీ మధ్య తీర్పు చేయి. మరియు నన్నూ మరియు నాతో పాటు ఉన్న విశ్వాసులనూ కాపాడు |
فَأَنجَيْنَاهُ وَمَن مَّعَهُ فِي الْفُلْكِ الْمَشْحُونِ(119) ఆ పిదప మేము అతనిని మరియు అతనితో పాట నిండునావలో ఎక్కి ఉన్న వారినందరినీ కాపాడాము |
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము |
إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ(121) నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు |
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత |
ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది |
వారి సహోదరుడు హూద్ వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీకు దైవభీతి లేదా |
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను |
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి |
وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ(127) నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది |
ఏమీ? మీరు కేవలం ఆడంబరానికి ప్రతి ఎత్తైన స్థలం మీద ఒక స్మారకాన్ని నిర్మిస్తారా |
మరియు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారన్నట్లు పెద్దపెద్ద కోటలు కడతారా |
మరియు మీరు ఎవరినైనా పట్టుకుంటే, అతి క్రూరులై పట్టుకుంటారా |
ఇకనైన మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి |
మరియు మీకు తెలిసివున్న (మంచి) వస్తువులను, మీకు విస్తారంగా ఇచ్చిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి |
ఆయన విస్తారంగా మీకు పశువులను మరియు సంతానాన్ని అనుగ్రహించాడు |
وَجَنَّاتٍ وَعُيُونٍ(134) మరియు తోటలను మరియు చెలమలను |
నిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను |
قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ(136) వారన్నారు: నీవు ఉపదేశించినా, ఉపదేశించక పోయినా మాకు అంతా సమానమే |
ఇది మా పూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే |
మరియు మాకు ఎలాంటి శిక్ష విధించబడదు |
فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ(139) ఈ విధంగా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు |
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత |
సమూద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది |
వారి సహోదరుడు సాలిహ్ వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీకు దైవభీతి లేదా |
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను |
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి |
وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ(145) నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది |
ఏమీ? మీరిప్పుడు ఇక్కడ ఉన్న స్థితిలోనే సుఖశాంతులలో ఎల్లప్పుడూ వదలి వేయబడతారని అనుకుంటున్నారా |
తోటలలో మరియు చెలమలలో |
మరియు ఈ పొలాలలో, మాగిన పండ్లగుత్తులు గల ఖర్జూరపు చెట్ల మధ్య |
మరియు మీరు కొండలను తొలిచి ఎంతో నేర్పుతో గృహాలను నిర్మిస్తూ ఉంటారనీ |
అలా కాదు, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి |
మరియు మితిమీరి ప్రవర్తించే వారి ఆజ్ఞలను అనుసరించకండి |
ఎవరైతే భూమిలో కల్లోలం రేకెత్తిస్తున్నారో మరియు ఎన్నడూ సంస్కరణను చేపట్టరో |
వారన్నారు: నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు |
مَا أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا فَأْتِ بِآيَةٍ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ(154) నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! కావున నీవు సత్యవంతుడవే అయితే, ఏదైనా అద్భుత సూచన తీసుకురా |
قَالَ هَٰذِهِ نَاقَةٌ لَّهَا شِرْبٌ وَلَكُمْ شِرْبُ يَوْمٍ مَّعْلُومٍ(155) (సాలిహ్) అన్నాడు: ఇదిగో ఈ ఆడ ఒంటె. ఇది నీరు త్రాగే (దినం) మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణయించబడ్డాయి |
وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيمٍ(156) దీనికి హాని కలిగించకండి. అలా చేస్తే ఒక మహా దినపు శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది |
కాని వారు దాని వెనుక కాలి మోకాలి పెద్ద నరమును కోసి చంపారు, ఆ తరువాత వారు పశ్చాత్తాప పడతూ ఉండిపోయారు |
فَأَخَذَهُمُ الْعَذَابُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ(158) కావున, వారిని శిక్ష పట్టుకుంది. నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు |
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత |
లూత్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది |
వారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీకు దైవభీతి లేదా |
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను |
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి |
وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ(164) నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది |
(ప్రకృతికి విరుద్ధంగా) సర్వప్రాణులలో కెల్లా మీరే పురుషుల వద్దకు పోతారేమిటీ |
وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُم مِّنْ أَزْوَاجِكُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ عَادُونَ(166) మీ ప్రభువు, మీ కొరకు సహవాసులు (అజ్వాజ్) గా పుట్టించిన వారిని విడిచి పెడుతున్నారేమిటి? అలా కాదు, మీరు హద్దు మీరి ప్రవర్తించే జాతివారు |
قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا لُوطُ لَتَكُونَنَّ مِنَ الْمُخْرَجِينَ(167) (దానికి) వారన్నారు: ఓ లూత్! ఇక నీవు మానుకోక పోతే నీవు దేశం నుండి బహిష్కరించబడిన వారిలో చేరుతావు |
(లూత్) అన్నాడు: నిశ్చయంగా మీ ఈ చేష్టను అసహ్యించుకునే వారిలో నేనూ ఉన్నాను |
(ఇలా ప్రార్థించాడు): ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా కుటుంబం వారినీ వీరి చేష్ట నుండి కాపాడు |
కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరినీ కాపాడాము |
వెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప |
ఆ తరువాత, మిగతా వారిని నిర్మూలించాము |
وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَسَاءَ مَطَرُ الْمُنذَرِينَ(173) వారిపై ఒక వర్షాన్ని కురిపించాము. అది (ముందు) హెచ్చరించబడిన వారిపై (కురిపించబడ్డ) అతి భయంకరమైన వర్షం |
إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ(174) నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు |
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత |
వన (అయ్ కహ్) వాసులు సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించారు |
షుఐబ్ వారితో ఇలా అన్నాడు: ఏమీ? మీకు దైవభీతి లేదా |
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను |
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి |
وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ(180) నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది |
۞ أَوْفُوا الْكَيْلَ وَلَا تَكُونُوا مِنَ الْمُخْسِرِينَ(181) మీరు (ఇచ్చినపుడు) సరిగ్గా కొలిచి ఇవ్వండి. నష్టపరిచే వారిలో చేరకండి |
త్రాసుతో సరిసమానంగా తూచండి |
وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ(183) ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ దౌర్జన్యపరులుగా ప్రవర్తించకండి |
وَاتَّقُوا الَّذِي خَلَقَكُمْ وَالْجِبِلَّةَ الْأَوَّلِينَ(184) మిమ్మల్ని మరియు మీకు పూర్వం గతించిన తరాల వారిని సృష్టించిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి |
వారన్నారు: నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు |
وَمَا أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ الْكَاذِبِينَ(186) నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! నిశ్చయంగా, మేము నిన్ను అసత్యవాదులలో ఒకనిగా పరిగణిస్తున్నాము |
فَأَسْقِطْ عَلَيْنَا كِسَفًا مِّنَ السَّمَاءِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ(187) నీవు సత్యవంతుడవే అయితే ఆకాశం యొక్క ఒక తునకను మాపై పడవేయి |
(షుఐబ్) అన్నాడు: మీరు చేసేది నా ప్రభువుకు బాగా తెలుసు |
فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ الظُّلَّةِ ۚ إِنَّهُ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ(189) కాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చి పడింది. నిశ్చయంగా, అదొక భయంకరమైన దినపు శిక్ష |
إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ(190) నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు |
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత |
మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం) |
దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు |
నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని |
స్పష్టమైన అరబ్బీ భాషలో |
నిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది |
أَوَلَمْ يَكُن لَّهُمْ آيَةً أَن يَعْلَمَهُ عُلَمَاءُ بَنِي إِسْرَائِيلَ(197) ఇస్రాయీల్ సంతతి వారిలోని విద్వాంసులు ఈ విషయాన్ని ఒప్పు కోవటం వారికొక సూచనగా సరిపోదా |
ఒకవేళ మేము దీనిని అరబ్ కాని వానిపై అవతరింపజేసి ఉంటే |
అతను దానిని వారికి చదివి వినిపించినా, వారు దానిని విశ్వసించేవారు కారు |
ఈ విధంగా, మేము దీనిని (తిరస్కారాన్ని) అపరాధుల హృదయాల లోనికి దిగిపోయేలా చేశాము |
لَا يُؤْمِنُونَ بِهِ حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ(201) కఠినశిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు |
అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి పడుతుంది |
అప్పుడు వారంటారు: ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా |
ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా |
చూశావా? మేము కొన్ని సంవత్సరాలు వారికి (ఈ జీవితంలో) సుఖసంతోషాలతో గడిపే వ్యవధినిచ్చినా |
తరువాత వాగ్దానం చేయబడినది (శిక్ష) వారిపైకి వచ్చినపుడు |
వారు అనుభవిస్తూ ఉండిన సుఖసంతోషాలు వారికేమీ పనికిరావు |
మరియు - హెచ్చరిక చేసేవారిని (ప్రవక్తలను) పంపనిదే - మేము ఏ నగరాన్ని కూడా నాశనం చేయలేదు |
హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు |
మరియు దీనిని (ఈ దివ్యగ్రంథాన్ని) తీసుకొని క్రిందికి దిగిన వారు షైతానులు కారు |
మరియు అది వారికి తగినది కాదు; వారది చేయలేరు |
వాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు |
فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ(213) కావున అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు |
మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు |
وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ(215) విశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపై నీ కనికరపు రెక్కలను చాపు |
فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّي بَرِيءٌ مِّمَّا تَعْمَلُونَ(216) ఒకవేళ వారు నీ పట్ల అవిధేయత చూపితే వారితో అను: మీరు చేసే కార్యాలకు నేను బాధ్యుడను కాను |
మరియు ఆ సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత మీద నమ్మకం ఉంచుకో |
ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు |
మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారితో నీ రాకపోకడలను కూడా |
నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు |
షైతాన్ లు ఎవరిపై దిగుతారో నేను మీకు తెలుపనా |
వారు అసత్యవాదులైన పాపాత్ములపై దిగుతారు |
గాలి వార్తలను చెవులలో ఊదుతారు; మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే |
మరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు |
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా వారు (కవులు) తమ కవిత్వంలో ప్రతి విషయాన్ని ఉద్దేశరహితంగా (ప్రశంసిస్తూ) ఉంటారని |
మరియు నిశ్చయంగా, వారు తాము ఆచరించని దానిని చెప్పుకుంటారని |
కాని, (వారిలో) విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ, అల్లాహ్ ను అమితంగా స్మరించే వారూ మరియు - తమకు అన్యాయం జరిగినప్పుడే - ప్రతీకార చర్య తీసుకునే వారు తప్ప! అన్యాయం చేసేవారు తమ పర్యవసానం ఏమిటో త్వరలో తెలుసుకోగలరు |
سورهای بیشتر به زبان تلوگو:
دانلود سوره شعراء با صدای معروفترین قراء:
انتخاب خواننده برای گوش دادن و دانلود کامل سوره شعراء با کیفیت بالا.
أحمد العجمي
ابراهيم الاخضر
بندر بليلة
خالد الجليل
حاتم فريد الواعر
خليفة الطنيجي
سعد الغامدي
سعود الشريم
الشاطري
صلاح بوخاطر
عبد الباسط
عبدالرحمن العوسي
عبد الرشيد صوفي
عبدالعزيز الزهراني
عبد الله بصفر
عبد الله الجهني
علي الحذيفي
علي جابر
غسان الشوربجي
فارس عباد
ماهر المعيقلي
محمد أيوب
محمد المحيسني
محمد جبريل
المنشاوي
الحصري
مشاري العفاسي
ناصر القطامي
وديع اليمني
ياسر الدوسري
به قرآن کریم چنگ بزنید