PDF —
60 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అద్-దారియాత్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అద్-దారియాత్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అద్-దారియాత్ అనువాదం. సూరా అద్-దారియాత్ (Meccan) 60 వచనం.

← ఖాఫ్సూరా అద్-దారియాత్ అత్-తూర్ →


60 వచనం · Meccan · తెలుగు
bismillah
ﯤﯥﯦ
51:1 దుమ్ము ఎగురవేసే వాటి (గాలుల) సాక్షిగా
ﯧﯨﯩ
51:2 మరియు (నీటి) భారాన్ని మోసే (మేఘాల)
ﯪﯫﯬ
51:3 మరియు సముద్రంలో సులభంగా తేలియాడే (ఓడల)
ﯭﯮﯯ
51:4 మరియు (ఆయన) ఆజ్ఞతో (అనుగ్రహాలను) పంచిపెట్టే (దేవదూతల సాక్షిగా)
ﯰﯱﯲﯳ
51:5 నిశ్చయంగా, మీకు చేయబడ్డ వాగ్దానం సత్యం
ﯴﯵﯶﯷ
51:6 మరియు నిశ్చయంగా తీర్పు రానున్నది
ﭑﭒﭓﭔ
51:7 మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా
ﭕﭖﭗﭘﭙ
51:8 నిశ్చయంగా, మీరు భేదాభిప్రాయాలలో పడి ఉన్నారు
ﭚﭛﭜﭝﭞ
51:9 (సత్యం నుండి) మరలింపబడిన వాడే, మోసగింపబడిన వాడు
ﭟﭠﭡ
51:10 ఆధారం లేని అభిప్రాయాలు గలవారే నాశనం చేయబడేవారు
ﭢﭣﭤﭥﭦﭧ
51:11 ఎవరైతే నిర్లక్ష్యంలో పడి అశ్రద్ధగా ఉన్నారో
ﭨﭩﭪﭫﭬ
51:12 వారు ఇలా అడుగుతున్నారు: తీర్పుదినం ఎప్పుడు రానున్నది
ﭭﭮﭯﭰﭱﭲ
51:13 ఆ దినమున, వారు అగ్నితో దహింపబడతారు (పరీక్షింపబడతారు)
ﭳﭴﭵﭶﭷﭸﭹﭺ
51:14 (వారితో ఇలా అనబడుతుంది): మీ పరీక్షను రుచి చూడండి! మీరు దీని కొరకే తొందర పెట్టేవారు
ﭻﭼﭽﭾﭿﮀ
51:15 నిశ్చయంగా, దైవభీతి గలవారు చెలమలు గల స్వర్గవనాలలో ఉంటారు
ﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋ
51:16 తమ ప్రభువు తమకు ప్రసాదించిన వాటితో సంతోషపడుతూ! నిశ్చయంగా వారు అంతకు పూర్వం సజ్జనులై ఉండేవారు
ﮌﮍﮎﮏﮐﮑﮒ
51:17 వారు రాత్రివేళలో చాలా తక్కువగా నిద్రపోయేవారు
ﮓﮔﮕﮖ
51:18 మరియు వారు రాత్రి చివరి ఘడియలలో క్షమాపణ వేడుకునే వారు
ﮗﮘﮙﮚﮛﮜ
51:19 మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి హక్కు ఉంటుంది
ﮝﮞﮟﮠﮡ
51:20 మరియు భూమిలో కూడా నమ్మేవారి కొరకు ఎన్నో నిదర్శనాలు (ఆయాత్) ఉన్నాయి
ﮢﮣﮤﮥﮦﮧ
51:21 మరియు స్వయంగా మీలో కూడా ఉన్నాయి. ఏమీ? మీరు చూడలేరా
ﮨﮩﮪﮫﮬﮭ
51:22 మరియు ఆకాశంలో మీ జీవనోపాధి మరియు మీకు వాగ్దానం చేయబడినది ఉంది
ﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘ
51:23 కావున భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, ఇది సత్యం; ఏ విధంగానైతే మీరు మాట్లాడగలిగేది (సత్యమో)
ﯙﯚﯛﯜﯝﯞﯟ
51:24 ఏమీ? ఇబ్రాహీమ్ యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా
ﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩﯪ
51:25 వారు అతని వద్దకు వచ్చినపుడు: మీకు సలాం!" అని అన్నారు. అతను: మీకూ సలాం!" అని జవాబిచ్చి : మీరు పరిచయం లేని (కొత్త) వారుగా ఉన్నారు." అని అన్నాడు
ﯫﯬﯭﯮﯯﯰﯱ
51:26 తరువాత అతను తన ఇంటిలోకి పోయి బలిసిన (వేయించిన) ఒక ఆవు దూడను తీసుకొని వచ్చాడు
ﯲﯳﯴﯵﯶﯷ
51:27 దానిని వారి ముందుకు జరిపి: ఏమీ? మీరెందుకు తినటం లేదు?" అని అడిగాడు
ﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃ
51:28 (వారు తినకుండా ఉండటం చూసి), వారి నుండి భయపడ్డాడు. వారన్నారు: భయపడకు!" మరియు వారు అతనికి జ్ఞానవంతుడైన కుమారుని శుభవార్తనిచ్చారు
ﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌﰍ
51:29 అప్పుడతని భార్య అరుస్తూ వారి ముందుకు వచ్చి, తన చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ: నేను ముసలిదాన్ని, గొడ్రాలను కదా!" అని అన్నది
ﰎﰏﰐﰑﰒﰓﰔﰕﰖﰗ
51:30 వారన్నారు: నీ ప్రభువు ఇలాగే అన్నాడు! నిశ్చయంగా, ఆయన మహావివేకవంతుడు, సర్వజ్ఞుడు
ﭑﭒﭓﭔﭕﭖﭗ
51:31 (ఇబ్రాహీమ్) అడిగాడు: ఓ సందేశహరులారా (ఓ దేవదూతలారా)! అయితే మీరు వచ్చిన కారణమేమిటి
ﭘﭙﭚﭛﭜﭝﭞ
51:32 వారన్నారు: వాస్తవానికి, మేము నేరస్థులైన జనుల వైపునకు పంపబడ్డాము
ﭟﭠﭡﭢﭣﭤ
51:33 వారి మీద (కాల్చబడిన) మట్టి రాళ్ళను కురిపించటం కోసం
ﭥﭦﭧﭨﭩ
51:34 నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడిన (రాళ్ళు); మితిమీరి ప్రవర్తించేవారి కొరకు
ﭪﭫﭬﭭﭮﭯﭰ
51:35 అప్పుడు మేము అందులో ఉన్న విశ్వాసులందరినీ బయటికి తీశాము
ﭱﭲﭳﭴﭵﭶﭷﭸ
51:36 మేము అందు ఒక్క గృహం తప్ప! ఇతర విధేయుల (ముస్లింల) గృహాన్ని చూడలేదు
ﭹﭺﭻﭼﭽﭾﭿﮀ
51:37 మరియు బాధాకరమైన శిక్షకు భయపడేవారి కొరకు, మేము అక్కడ ఒక సూచన (ఆయత్) ను వదలి పెట్టాము
ﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉ
51:38 ఇక మూసా (గాథలో) కూడా (ఒక సూచన వుంది) మేము అతనిని ఫిర్ఔన్ వద్దకు స్పష్టమైన ప్రమాణంతో పంపినపుడు
ﮊﮋﮌﮍﮎﮏﮐ
51:39 అతడు (ఫిర్ఔన్) తన సభాసదులతో సహా మరలిపోతూ, ఇలా అన్నాడు: ఇతడు మాంత్రికుడు లేదా పిచ్చివాడు
ﮑﮒﮓﮔﮕﮖﮗﮘ
51:40 కావున మేము అతనిని మరియు అతని సైనికులను పట్టుకొని, వారందరినీ సముద్రంలో ముంచి వేశాము మరియు దానికి అతడే నిందితుడు
ﮙﮚﮛﮜﮝﮞﮟﮠ
51:41 ఇక ఆద్ జాతి వారిలో కూడా (ఒక సూచన వుంది): మేము వారిపై వినాశకరమైన గాలిని పంపినప్పుడు
ﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪ
51:42 అది దేని పైనయితే వీచిందో, దానిని క్షీణింపజేయకుండా వదలలేదు
ﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔ
51:43 మరియు సమూద్ జాతి వారి గాథలో కూడా (ఒక సూచన ఉంది). వారితో: కొంతకాలం మీరు సుఖసంతోషాలను అనుభవించండి." అని అన్నాము
ﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝ
51:44 అప్పుడు వారు తమ ప్రభువు ఆజ్ఞను ఉపేక్షించారు. కావున వారు చూస్తూ ఉండగానే ఒక పెద్ద పిడుగు వారి మీద విరుచుకు పడింది
ﯞﯟﯠﯡﯢﯣﯤﯥ
51:45 అప్పుడు వారికి లేచి నిలబడే శక్తి కూడా లేకపోయింది మరియు వారు తమను తాము కూడా కాపాడు కోలేక పోయారు
ﯦﯧﯨﯩﯪﯫﯬﯭﯮﯯ
51:46 మరియు దీనికి ముందు నూహ్ జాతి వారిని కూడా (నాశనం చేశాము). నిశ్చయంగా, వారు కూడా అవిధేయులు
ﯰﯱﯲﯳﯴﯵ
51:47 మరియు ఆకాశాన్ని మేము (మా) చేతులతో నిర్మించాము. మరియు నిశ్చయంగా, మేమే దానిని విస్తరింపజేయ గలవారము
ﯶﯷﯸﯹﯺ
51:48 మరియు భూమిని మేము పరుపుగా చేశాము, మేమే చక్కగా పరిచేవారము
ﯻﯼﯽﯾﯿﰀﰁﰂ
51:49 మరియు మేము ప్రతిదానిని జంటలుగా సృష్టించాము, మీరు గ్రహించాలని
ﰃﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌ
51:50 కావున మీరు అల్లాహ్ వైపునకు పరుగెత్తండి. నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే
ﰍﰎﰏﰐﰑﰒﰓﰔﰕﰖﰗﰘﰙ
51:51 మరియు మీరు అల్లాహ్ కు సాటిగా ఇతర దైవాన్ని నిలుపకండి! నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞ
51:52 ఇదే విధంగా, వారికి పూర్వం గడిచిన వారి వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు: ఇతను మాంత్రికుడు లేదా పిచ్చివాడు." అని అనకుండా ఉండలేదు
ﭟﭠﭡﭢﭣﭤﭥﭦ
51:53 ఏమీ? దీనిని (ఇలా పలుకుటను) వారు ఒకరికొకరు వారసత్వంగా ఇచ్చుకున్నారా? అలా కాదు! అసలు వారు తలబిరుసుతనంతో ప్రవర్తించే జనం
ﭧﭨﭩﭪﭫﭬ
51:54 కావున నీవు వారి నుండి మరలిపో, ఇక నీపై ఎలాంటి నింద లేదు
ﭭﭮﭯﭰﭱﭲ
51:55 మరియు వారిని ఉపదేశిస్తూ వుండు, నిశ్చయంగా, ఉపదేశం విశ్వాసులకు ప్రయోజనకర మవుతుంది
ﭳﭴﭵﭶﭷﭸﭹ
51:56 మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే
ﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃ
51:57 నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు
ﮄﮅﮆﮇﮈﮉﮊﮋ
51:58 నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు
ﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕ
51:59 కావున నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడినవారి పాపాలు వారి (పూర్వ) స్నేహితుల పాపాల వంటివే! కావున వారు నా (శిక్ష కొరకు) తొందర పెట్టనవసరం లేదు
ﮖﮗﮘﮙﮚﮛﮜﮝ
51:60 కావున సత్యతిరస్కారులకు వినాశం గలదు - వారికి వాగ్దానం చేయబడిన - ఆ దినమున

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers