Alyawma uhilla lakumut taiyibaatu wa ta`aamul lazeena ootul Kitaaba hillul lakum wa ta`aamukum hillul lahum wal muhsanaatu minal mu`minaati walmuhsanaatu minal lazeena ootul Kitaaba min qablikum izaaa aataitumoohunna ujoorahunna muhsineena ghaira musaafiheena wa laa muttakhizeee akhdaan; wa mai yakfur bil eemaani faqad habita `amaluhoo wa huwa fil Aaakhirati minal khaasireen
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఈనాడు మీ కొరకు పరిశుద్ధమైన వస్తువులన్నీ ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు గ్రంథ ప్రజల ఆహారం మీకు ధర్మ సమ్మతమైనది మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథ ప్రజల స్త్రీలు గానీ, మీరు వారికి వారి మహ్ర్ చెల్లించి, న్యాయబద్ధంగా వారితో వివాహ జీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగచాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
आज तमाम पाकीज़ा चीजें तुम्हारे लिए हलाल कर दी गयी हैं और अहले किताब की ख़ुश्क चीजें ग़ेहूं (वगैरह) तुम्हारे लिए हलाल हैं और तुम्हारी ख़ुश्क चीजें ग़ेहूं (वगैरह) उनके लिए हलाल हैं और आज़ाद पाक दामन औरतें और उन लोगों में की आज़ाद पाक दामन औरतें जिनको तुमसे पहले किताब दी जा चुकी है जब तुम उनको उनके मेहर दे दो (और) पाक दामिनी का इरादा करो न तो खुल्लम खुल्ला ज़िनाकारी का और न चोरी छिपे से आशनाई का और जिस शख्स ने ईमान से इन्कार किया तो उसका सब किया (धरा) अकारत हो गया और (तुल्फ़ तो ये है कि) आख़ेरत में भी वही घाटे में रहेगा
الطَّيِّبَاتُ (అత్-తయ్యిబాత్): పరిశుద్ధమైనవి, మంచివి, హలాల్ (ధర్మసమ్మతమైన) ఆహార పదార్థాలు.
أُوتُوا الْكِتَابَ (ఊతుల్-కితాబ్): గ్రంథం ఇవ్వబడినవారు — అంటే యూదులు మరియు క్రైస్తవులు.
الْمُحْصَنَاتُ (అల్-ముహ్సనాత్): పతివ్రతలు, సచ్చరిత్రలు, వ్యభిచారం నుండి దూరంగా ఉండే స్వేచ్ఛా స్త్రీలు.
أُجُورَهُنَّ (ఉజూరహున్న): వారి మహర్ (వివాహ ధనం).
مُحْصِنِينَ (ముహ్సినీన్): వివాహం ద్వారా సచ్చరిత్రను కాపాడుకునేవారు.
مُسَافِحِينَ (ముసాఫిహీన్): బహిరంగంగా వ్యభిచారం చేసేవారు.
أَخْدَانٍ (అఖ్దాన్): రహస్య ప్రేమికులు — రహస్యంగా వ్యభిచారం చేసేవారు.
حَبِطَ (హబిత): వ్యర్థమైపోయింది, నిష్ఫలమైంది.
ఆయత్ వ్యాఖ్యానం:
ఈ రోజు అల్లాహ్ మీకు పరిశుద్ధమైన, మంచి వస్తువులను హలాల్ (ధర్మసమ్మతం) చేశాడు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధమైనవి, మంచివి అయిన ఆహార పదార్థాలను తినడం మీకు అనుమతించబడింది. అలాగే యూదులు మరియు క్రైస్తవుల (గ్రంథవాసుల) వధించిన జంతువుల మాంసం కూడా మీకు హలాల్. వారు తమ ధర్మశాస్త్రం ప్రకారం అల్లాహ్ పేరు చెప్పి వధించిన జంతువులను మీరు తినవచ్చు. అదే విధంగా మీరు వధించిన జంతువుల మాంసం కూడా వారికి హలాల్. ఇది అల్లాహ్ మీపై చూపిన విశాలమైన కరుణ.
అలాగే, విశ్వాసులైన సచ్చరిత్ర స్త్రీలను, మరియు మీకు పూర్వం గ్రంథం ఇవ్వబడినవారిలోని సచ్చరిత్ర స్త్రీలను — అంటే యూదులు, క్రైస్తవులలోని పతివ్రతలను — మీరు వివాహం చేసుకోవడం ధర్మసమ్మతం. కానీ షరతు ఏమిటంటే: మీరు వారికి వారి మహర్ (వివాహ ధనం) పూర్తిగా ఇవ్వాలి. మీరు వివాహం ద్వారా సచ్చరిత్రను కాపాడుకునేవారై ఉండాలి — బహిరంగంగా వ్యభిచారం చేసేవారు కాకూడదు, రహస్య ప్రేమికులను ఏర్పరచుకుని వ్యభిచారం చేసేవారు కూడా కాకూడదు.
చివరగా, ఎవరైతే ఈ విశ్వాసాన్ని, అంటే అల్లాహ్ నిర్దేశించిన ధర్మ నియమాలను తిరస్కరిస్తారో, వారి కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. పరలోకంలో వారు నష్టపోయినవారిలో ఉంటారు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
ఇస్లాం ధర్మం విశాలమైనది, సులభమైనది. ఇతర మతస్థులతో సహజీవనం చేయడానికి, వారితో సామాజిక సంబంధాలు కలిగి ఉండడానికి అనుమతి ఇస్తుంది.
అల్లాహ్ తన దాసులపై చూపే కరుణ అపారమైనది — ఆహారం విషయంలో, వివాహం విషయంలో విశాలమైన సౌలభ్యాన్ని ఇచ్చాడు.
వివాహం అనేది సచ్చరిత్రను కాపాడుకోవడానికి, వ్యభిచారం నుండి దూరంగా ఉండడానికి ఉన్న ఒక గొప్ప మార్గం
ఈనాడు మీ కొరకు పరిశుద్ధమైన వస్తువులన్నీ ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు గ్రంథ ప్రజల ఆహారం మీకు ధర్మ సమ్మతమైనది మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథ ప్రజల స్త్రీలు గానీ, మీరు వారికి వారి మహ్ర్ చెల్లించి, న్యాయబద్ధంగా వారితో వివాహ జీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగచాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు
(సహజంగా) మరణించింది, రక్తం, పంది మాంసం మరియు అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేరుతో) వధింపబడినది (జిబ్ హ్ చేయబడినది), గొంతు పిసికి ఊపిరాడక, దెబ్బ తగిలి, ఎత్తు నుండి పడి, కొమ్ము తగిలి మరియు క్రూరమృగం నోట పడి చచ్చిన (పశువు / పక్షి) అన్నీ, మీకు తినటానికి నిషిద్ధం (హరామ్) చేయబడ్డాయి. కాని (క్రూర మృగం నోట పడిన దానిని) చావక ముందే మీరు జిబ్ హ్ చేసినట్లైతే అది నిషిద్ధం కాదు. మరియు బలిపీఠం మీద వధించబడినది, మరియు బాణాల ద్వారా శకునం చూడటం నిషేధింపబడ్డాయి. ఇవన్నీ ఘోర పాపాలు (ఫిస్ ఖున్). ఈనాడు సత్యతిరస్కారులు, మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులు కున్నారు. కనుక మీరు వారికి భయపడకండి, నాకే భయపడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. ఎవడైనా ఆకలికి ఓర్చుకోలేక, పాపానికి పూనుకోక, (నిషిద్ధమైన వస్తువులను తిన్నట్లైతే)! నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
వారు (ప్రజలు) తమ కొరకు ఏది ధర్మ సమ్మతం (హలాల్) అని నిన్ను అడుగు తున్నారు. నీవు ఇలా అను: పరిశుద్ధ వస్తువులన్నీ మీ కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు మీకు అల్లాహ్ నేర్పిన విధంగా మీరు వేట శిక్షణ ఇచ్చిన జంతువులు మీ కొరకు పట్టినవి కూడా! కావున అవి మీ కొరకు పట్టుకున్న వాటిని మీరు తినండి కాని దానిపై అల్లాహ్ పేరును ఉచ్ఛరించండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు
ఈనాడు మీ కొరకు పరిశుద్ధమైన వస్తువులన్నీ ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు గ్రంథ ప్రజల ఆహారం మీకు ధర్మ సమ్మతమైనది మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథ ప్రజల స్త్రీలు గానీ, మీరు వారికి వారి మహ్ర్ చెల్లించి, న్యాయబద్ధంగా వారితో వివాహ జీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగచాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు
ఓ విశ్వాసులారా! మీరు నమాజ్ కు లేచి నపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి. మరియు మీ తలలను (తడి చేతులతో) తుడుచుకోండి. మరియు మీ కాళ్ళను చీలమండల వరకు కడుక్కోండి. మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబ్) అయి ఉంటే, స్నానం (గుస్ల్) చేయండి. మరియు మీరు అస్వస్థులై ఉన్నా, లేక ప్రయాణంలో ఉన్నా, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని ఉన్నా, లేక మీరు స్త్రీలతో కలిసి (సంభోగం చేసి) ఉన్నా, అప్పుడు మీకు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో తయమ్మమ్ చేయండి. అంటే మీ ముఖాలను మరియు మీ చేతులను, దానితో (పరిశుద్ధమైన మట్టిపై స్పర్శించిన చేతులతో) రుద్దుకోండి. మిమ్మల్ని కష్టపెట్టాలనేది అల్లాహ్ అభిమతం కాదు. మీరు కృతజ్ఞులు కావాలని ఆయన, మిమ్మల్ని శుద్ధపరచి మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరుతున్నాడు
మరియు మీకు అల్లాహ్ చేసిన అనుగ్రహాన్ని మరియు ఆయన మీ నుండి తీసుకున్న దృఢమైన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీరు: మేము విన్నాము మరియు విధేయుల మయ్యాము." అని అన్నారు. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, హృదయాలలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.