అల్-మాఇదా · 6/120
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-మాఇదా
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى الْمَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الْكَعْبَيْنِ ۚ وَإِن كُنتُمْ جُنُبًا فَاطَّهَّرُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُم مِّنْهُ ۚ مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ وَلَٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ ۝٦
Yaaa aiyuhal lazeena aamanoo izaa qumtum ilas Salaati faghsiloo wujoohakum wa Aidiyakum ilal maraafiqi wamsahoo biru`oosikum wa arjulakum ilal ka`bayn; wa in kuntum junuban fattahharoo; wain kuntum mardaaa aw`alaa safarin aw jaaa`a ahadum minkum minal ghaaa`iti aw laamastumunnisaaa`a falam tajidoo maaa`an fatayammamoo sa`eedan taiyiban famsahoo biwujoohikum wa aideekum minh; ma yureedul laahu liyaj`ala `alaikum min harajinw wa laakidy yureedu liyutahhirakum wa liyutimma m`matahoo `alaikum la`allakum tashkuroon
📖 తెలుగులో
ఓ విశ్వాసులారా! మీరు నమాజ్ కు లేచి నపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి. మరియు మీ తలలను (తడి చేతులతో) తుడుచుకోండి. మరియు మీ కాళ్ళను చీలమండల వరకు కడుక్కోండి. మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబ్) అయి ఉంటే, స్నానం (గుస్ల్) చేయండి. మరియు మీరు అస్వస్థులై ఉన్నా, లేక ప్రయాణంలో ఉన్నా, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని ఉన్నా, లేక మీరు స్త్రీలతో కలిసి (సంభోగం చేసి) ఉన్నా, అప్పుడు మీకు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో తయమ్మమ్ చేయండి. అంటే మీ ముఖాలను మరియు మీ చేతులను, దానితో (పరిశుద్ధమైన మట్టిపై స్పర్శించిన చేతులతో) రుద్దుకోండి. మిమ్మల్ని కష్టపెట్టాలనేది అల్లాహ్ అభిమతం కాదు. మీరు కృతజ్ఞులు కావాలని ఆయన, మిమ్మల్ని శుద్ధపరచి మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరుతున్నాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00
📜

అనువాదం — Tafsir

  1. కఠిన పదాల అర్థాలు:
  • الْمَرَافِقِ (అల్-మరాఫిఖ్): మోచేతులు — చేతికి, భుజానికి మధ్య ఉన్న కీలు.
  • الْكَعْبَيْنِ (అల్-కఅబైన్): రెండు చీలమండలు — కాలికి పాదానికి మధ్య ఉన్న రెండు ఎముకలు.
  • جُنُبًا (జునుబా): పెద్ద అపవిత్రత (స్నానం తప్పనిసరి అయిన స్థితి).
  • الْغَائِطِ (అల్-గాఇత్): మలవిసర్జన స్థలం — ఇక్కడ మలవిసర్జన చేయడం అని అర్థం.
  • لَامَسْتُمُ النِّسَاءَ (లామస్తుమున్-నిసా): భార్యలతో సంభోగం చేయడం.
  • صَعِيدًا طَيِّبًا (సఈదన్ తయ్యిబా): పరిశుద్ధమైన మట్టి/నేల.
  • حَرَجٍ (హరజ్): ఇబ్బంది, కష్టం, పీడన.
  1. ఆయత్ వ్యాఖ్యానం:

ఓ విశ్వాసులారా! మీరు అపవిత్ర స్థితిలో ఉండి నమాజ్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, మొదట మీ ముఖాలను కడుక్కోండి, తరువాత మోచేతులతో సహా మీ రెండు చేతులను కడుక్కోండి, మీ తలలపై తడి చేతులతో మసహ్ (స్పర్శ) చేయండి, మరియు చీలమండలతో సహా మీ రెండు కాళ్లను కడుక్కోండి. ఇది చిన్న అపవిత్రత (హదస్ అస్గర్) నుండి శుద్ధి పొందే విధానం — అనగా వుదూ.

ఒకవేళ మీకు పెద్ద అపవిత్రత (జునుబ్) సంభవించి ఉంటే — అనగా సంభోగం లేదా స్వప్నస్ఖలనం వంటివి జరిగి ఉంటే — పూర్తిగా స్నానం చేసి శుద్ధి పొందండి.

ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉన్నా, లేదా ప్రయాణంలో ఉన్నా, లేదా మలవిసర్జన చేసినా, లేదా భార్యలతో సంభోగించినా — ఈ స్థితులలో మీకు నీరు దొరకకపోతే, పరిశుద్ధమైన నేలను సమీపించి, దానిపై మీ చేతులను కొట్టి, ఆ మట్టితో మీ ముఖాలపైనా, చేతులపైనా మసహ్ చేయండి. ఇదే తయమ్ముమ్.

అల్లాహ్ మీపై ఎటువంటి ఇబ్బందిని లేదా పీడనను మోపాలని కోరడు. కానీ ఆయన మిమ్మల్ని పవిత్రం చేయాలని, మరియు మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయాలని కోరుతున్నాడు — అనారోగ్యం, ప్రయాణం వంటి సమయాలలో నీరు దొరకనప్పుడు తయమ్ముమ్ వంటి సౌలభ్యాన్ని ఇచ్చి, మీపై తన కృపను సంపూర్ణం చేయాలని కోరుతున్నాడు. మీరు ఆయన అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుతారని, ఆయన ఆజ్ఞలను పాలిస్తారని ఆశిస్తున్నాడు.

  1. ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
  • ఇస్లాం శుద్ధి (తహారత్)కు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఈ ఆయత్ స్పష్టం చేస్తుంది. శరీరం, ఆత్మ రెండూ పవిత్రంగా ఉండాలని బోధిస్తుంది.
  • అల్లాహ్ తన దాసులపై కఠినంగా ఉండడు; నీరు దొరకని సమయంలో తయమ్ముమ్ వంటి సులభమైన ప్రత్యామ్నాయాన్ని ఇచ్చాడు. ఇది ఇస్లాం సౌలభ్యాన్ని, దయను చూపిస్తుంది.
  • అనారోగ్యం, ప్రయాణం వంటి క


📜 వచనం 4-8 — సూరా అల్-మాఇదా

4يَسْأَلُونَكَ مَاذَا أُحِلَّ لَهُمْ ۖ قُلْ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۙ وَمَا عَلَّمْتُم مِّنَ الْجَوَارِحِ مُكَلِّبِينَ تُعَلِّمُونَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللَّهُ ۖ فَكُلُوا مِمَّا أَمْسَكْنَ عَلَيْكُمْ وَاذْكُرُوا اسْمَ اللَّهِ عَلَيْهِ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
వారు (ప్రజలు) తమ కొరకు ఏది ధర్మ సమ్మతం (హలాల్) అని నిన్ను అడుగు తున్నారు. నీవు ఇలా అను: పరిశుద్ధ వస్తువులన్నీ మీ కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు మీకు అల్లాహ్ నేర్పిన విధంగా మీరు వేట శిక్షణ ఇచ్చిన జంతువులు మీ కొరకు పట్టినవి కూడా! కావున అవి మీ కొరకు పట్టుకున్న వాటిని మీరు తినండి కాని దానిపై అల్లాహ్ పేరును ఉచ్ఛరించండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు
5الْيَوْمَ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۖ وَطَعَامُ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حِلٌّ لَّكُمْ وَطَعَامُكُمْ حِلٌّ لَّهُمْ ۖ وَالْمُحْصَنَاتُ مِنَ الْمُؤْمِنَاتِ وَالْمُحْصَنَاتُ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ وَلَا مُتَّخِذِي أَخْدَانٍ ۗ وَمَن يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
ఈనాడు మీ కొరకు పరిశుద్ధమైన వస్తువులన్నీ ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు గ్రంథ ప్రజల ఆహారం మీకు ధర్మ సమ్మతమైనది మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథ ప్రజల స్త్రీలు గానీ, మీరు వారికి వారి మహ్ర్ చెల్లించి, న్యాయబద్ధంగా వారితో వివాహ జీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగచాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు
6يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى الْمَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الْكَعْبَيْنِ ۚ وَإِن كُنتُمْ جُنُبًا فَاطَّهَّرُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُم مِّنْهُ ۚ مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ وَلَٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
ఓ విశ్వాసులారా! మీరు నమాజ్ కు లేచి నపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి. మరియు మీ తలలను (తడి చేతులతో) తుడుచుకోండి. మరియు మీ కాళ్ళను చీలమండల వరకు కడుక్కోండి. మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబ్) అయి ఉంటే, స్నానం (గుస్ల్) చేయండి. మరియు మీరు అస్వస్థులై ఉన్నా, లేక ప్రయాణంలో ఉన్నా, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని ఉన్నా, లేక మీరు స్త్రీలతో కలిసి (సంభోగం చేసి) ఉన్నా, అప్పుడు మీకు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో తయమ్మమ్ చేయండి. అంటే మీ ముఖాలను మరియు మీ చేతులను, దానితో (పరిశుద్ధమైన మట్టిపై స్పర్శించిన చేతులతో) రుద్దుకోండి. మిమ్మల్ని కష్టపెట్టాలనేది అల్లాహ్ అభిమతం కాదు. మీరు కృతజ్ఞులు కావాలని ఆయన, మిమ్మల్ని శుద్ధపరచి మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరుతున్నాడు
7وَاذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ وَمِيثَاقَهُ الَّذِي وَاثَقَكُم بِهِ إِذْ قُلْتُمْ سَمِعْنَا وَأَطَعْنَا ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
మరియు మీకు అల్లాహ్ చేసిన అనుగ్రహాన్ని మరియు ఆయన మీ నుండి తీసుకున్న దృఢమైన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీరు: మేము విన్నాము మరియు విధేయుల మయ్యాము." అని అన్నారు. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, హృదయాలలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
8يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ لِلَّهِ شُهَدَاءَ بِالْقِسْطِ ۖ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ عَلَىٰ أَلَّا تَعْدِلُوا ۚ اعْدِلُوا هُوَ أَقْرَبُ لِلتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు న్యాయంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికిలోనై, మీరు న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును
అల్-మాఇదాఖురాన్ సూచిక
120వచనం
MedinanRevelation
6వచనం

అనువాదం — అల్-మాఇదా 6

సూరా అల్-మాఇదా వచనం 6 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఓ విశ్వాసులారా! మీరు నమాజ్ కు లేచి నపుడు, మీ ముఖాలను, మరియు…

సూరా వచనం 6/120 — సూరా అల్-మాఇదా المائدة (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-మాఇదా వినండి, సూరా అల్-మాఇదా అనువాదం, సూరా అల్-మాఇదా mp3, సూరా అల్-మాఇదా pdf. వచనం 4–8. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Sunday, October 18, 2026

Don't forget us in your sincere prayers