La sourate Al-Ahzab en Telugu
ఓ ప్రవక్తా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు మరియు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల యొక్క అభిప్రాయాన్ని లక్ష్య పెట్టకు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనా పరుడు |
وَاتَّبِعْ مَا يُوحَىٰ إِلَيْكَ مِن رَّبِّكَ ۚ إِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا(2) మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వహీని) మాత్రమే అనుసరించు. నిశ్చయంగా, అల్లాహ్ మీరు చేసేదంతా ఎరుగును |
కావున అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకో మరియు కార్యసాధకుడుగా అల్లాహ్ చాలు |
అల్లాహ్ ఏ వ్యక్తి ఎదలో కూడా రెండు హృదయాలు పెట్టలేదు. మరియు మీరు మీ భార్యలను `తల్లులు` అని పలికి, జిహార్ చేసినంతటనే వారిని మీకు తల్లులుగా చేయలేదు. మరియు మీరు దత్త తీసుకొన్న వారిని మీ (కన్న) కుమారులుగా చేయలేదు. ఇవన్నీ మీరు మీ నోటితో పలికే మాటలు మాత్రమే! మరియు అల్లాహ్ సత్యం పలుకుతాడు మరియు ఆయన (ఋజు) మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు |
వారిని (మీ దత్త పిల్లలను), వారి (వాస్తవ) తండ్రుల పేర్లతోనే కలిపి పిలవండి. అల్లాహ్ దృష్టిలో ఇదే న్యాయమైనది. ఒకవేళ వారి తండ్రులెవరో మీకు తెలియక పోతే, అపుడు వారు మీ ధార్మిక సోదరులు మరియు మీ స్నేహితులు. మీరు ఈ విషయంలో (ఇంత వరకు) చేసిన పొరపాటు గురించి మీ కెలాంటి పాపం లేదు, కాని ఇక ముందు మీరు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తే (పాపం) అవుతుంది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత |
విశ్వాసులకు (ముస్లింలకు), దైవప్రవక్త స్వయంగా తమ కంటే కూడా ముఖ్యుడు. మరియు అతని భార్యలు వారికి తల్లులు. అల్లాహ్ గ్రంథం ప్రకారం రక్తసంబంధీకులు - ఇతర విశ్వాసుల మరియు వలస వచ్చిన వారి (ముహాజిరీన్) కంటే - ఒకరి కొకరు ఎక్కువగా పరస్పర సంబంధం (హక్కులు) గలవారు. కాని! మీరు మీ స్నేహితులకు మేలు చేయగోరితే (అది వేరే విషయం)! వాస్తవానికి ఇదంతా గ్రంథంలో వ్రాయబడి వుంది |
మరియు (జ్ఞాపకముంచుకో) వాస్తవానికి మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము మరియు నీతో (ఓ ముహమ్మద్), నూహ్ తో, ఇబ్రాహీమ్ తో, మూసాతో మరియు మర్యమ్ కుమారుడైన ఈసాతో కూడా! మరియు మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము |
لِّيَسْأَلَ الصَّادِقِينَ عَن صِدْقِهِمْ ۚ وَأَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا أَلِيمًا(8) ఇది సత్యవంతులను, వారి సత్యాన్ని గురించి ప్రశ్నించడానికి. మరియు ఆయన సత్యతిరస్కారుల కొరకు బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు |
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పైకి సైన్యాలు (దండెత్తి) వచ్చినపుడు, మేము వారి పైకి ఒక తుఫాను గాలిని మరియు మీకు కనబడని సైన్యాలను పంపాము. మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు |
వారు (మీ శత్రువులు) మీ మీదకు పైనుండి మరియు క్రింది నుండి (దండెత్తి) వచ్చినపుడు మరియు మీ కళ్ళు (భయంతో) తిరిగిపోయి, మీ గుండెలు గొంతులోనికి వచ్చినపుడు, మీరు అల్లాహ్ ను గురించి పలువిధాలుగా ఊహించసాగారు |
هُنَالِكَ ابْتُلِيَ الْمُؤْمِنُونَ وَزُلْزِلُوا زِلْزَالًا شَدِيدًا(11) అక్కడ (ఆ సమయంలో) విశ్వాసులు పరీక్షించబడ్డారు. మరియు దానితో వారు తీవ్రంగా కంపింప జేయబడ్డారు |
మరియు ఆ సమయంలో, కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగమున్న వారు: అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాతో చేసిన వాగ్దానాలన్నీ బూటకాలు మాత్రమే!" అని అనసాగారు |
అపుడు వారిలోని ఒక పక్షం వారు: ఓ యస్ రిబ్ (మదీనా మునవ్వరా) ప్రజలారా! ఇక మీరు వీరిని (శత్రువులను) ఎదిరించలేరు. కనుక వెనుదిరగండి!" అని అన్నారు. మరియు వారిలో మరొక వర్గం వారు ప్రవక్తతో ఈ విధంగా పలుకుతూ (వెనుదిరిగి) పోవటానికి అనుమతి అడగసాగారు: మా ఇండ్లు భద్రంగా లేవు." కాని వాస్తవానికి అవి భద్రంగానే ఉండెను. వారు కేవలం అక్కడి నుండి పారిపోదలచారు |
ఒకవేళ నగరపు చుట్టుప్రక్కల నుండి శత్రువులు లోపలికి దూరి, వారిని విద్రోహ చర్యలకు పాల్పడమని పిలిస్తే, వారు వెంటనే సమ్మతించే వారు, మరియు వారు దాని కోసం ఏ మాత్రం ఆలస్యం చేసేవారు కాదు |
వాస్తవానికి వారు ఇంతకు ముందు, తాము వెన్ను చూపి పారిపోమని, అల్లాహ్ తో వాగ్దానం చేసి ఉన్నారు. మరియు అల్లాహ్ తో చేసిన వాగ్దానం గురించి తప్పక ప్రశ్నించటం జరుగుతుంది |
వారితో ఇలా అను: ఒకవేళ మీరు మరణం నుండి గానీ, లేదా హత్య నుండి గానీ, పారిపోదలచు కుంటే! ఆ పారిపోవటం మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు. అప్పుడు మీరు కేవలం కొంతకాలం మాత్రమే సుఖసంతోషాలు అనుభవిస్తారు |
వారితో ఇంకా ఇలా అను: ఒకవేళ అల్లాహ్ మీకు కీడు చేయదలిస్తే! లేదా కరుణించదలిస్తే! ఆయన నుండి మిమ్మల్ని తప్పించే వాడెవడు?" మరియు వారు అల్లాహ్ ను వదలి ఇతరుణ్ణి ఎవడినీ సంరక్షకునిగా గానీ లేక సహాయకునిగా గానీ పొందలేరు |
వాస్తవానికి మీలో ఎవరు ఇతరులను (యుద్ధం నుండి) ఆటంక పరుస్తూ ఉన్నారో మరియు తమ సోదరులతో: మా వైపునకు రండి!" అని పలుకుతూ ఉన్నారో, అలాంటి వారందరి గురించి, అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు వారు మాత్రం యుద్ధంలో చాలా తక్కువగా పాల్గొనేవారు |
(మీకు తోడ్పడే విషయంలో) వారు పరమ లోభులుగా ఉండేవారు. (ఓ ప్రవక్తా!) వారి పైకి ప్రమాదం వచ్చినపుడు వారు (నీ సహాయం కోరుతూ) మరణం ఆసన్నమైన వ్యక్తి కనుగ్రుడ్లు త్రిప్పే విధంగా నీ వైపుకు తిరిగి చూడటాన్ని, నీవు చూస్తావు. కాని ఆ ప్రమాదం తొలగిపోయిన వెంటనే, వారు లాభాలను పొందే ఉద్దేశంతో, కత్తెర వలే ఆడే నాలుకలతో మీతో బడాయీలు చెప్పుకుంటారు. అలాంటి వారు ఏ మాత్రం విశ్వసించలేదు. కావున, అల్లాహ్ వారి కర్మలను నిరర్థకం చేశాడు. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం |
దాడి చేసిన వర్గాలు ఇంకా వెళ్ళి పోలేదు అనే వారు భావిస్తున్నారు. ఒకవేళ ఆ వర్గాలు తిరిగి మళ్ళీ దాడి చేస్తే! ఎడారి వాసులతో (బద్దూలతో) కలిసి నివసించి అక్కడి నుండి మీ వృత్తాంతాలను తెలుసుకుంటే బాగుండేది కదా! అని అనుకుంటారు. ఒకవేళ వారు మీతో పాటు ఉన్నా చాలా తక్కువగా యుద్ధంలో పాల్గొని ఉండేవారు |
వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో |
మరియు విశ్వాసులు, దాడి చేసిన వర్గాల వారిని చూసినపుడు ఇలా పలికారు: అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు సత్యం పలికారు." ఇది వారి విశ్వాసాన్ని మరియు అల్లాహ్ పట్ల వారి విధేయతను మరింత అధికమే చేసింది |
విశ్వాసులలో అల్లాహ్ కు తాము చేసిన ఒప్పందం నిజం చేసి చూపినవారు కూడా ఉన్నారు. వారిలో కొందరు తమ శపథాన్ని పూర్తి చేసుకున్న వారున్నారు, మరికొందరు దానిని పూర్తి చేసుకోవటానికి నిరీక్షిస్తున్నారు. మరియు వారు తమ వైఖరిని ఏ మాత్రం మార్చుకోలేదు |
అల్లాహ్, సత్యవంతులకు వారి సత్యానికి ప్రతిఫలం నొసంగటానికి మరియు కపట విశ్వాసులకు తాను కోరితే శిక్ష విధించటానికి లేదా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత |
మరియు అల్లాహ్ అవిశ్వాసులను వారి క్రోధావేశంతోనే - వారికెలాంటి మేలు లభింప జేయకుండా - వెనుకకు మరలించాడు. యుద్ధరంగంలో విశ్వాసులకు అల్లాహ్ యే (సహాయకునిగా) మిగిలాడు. వాస్తవంగా అల్లాహ్ మహా బలవంతుడు, సర్వశక్తిమంతుడు |
మరియు గ్రంథ ప్రజలలో నుండి వారికి (అవిశ్వాసులకు యుద్ధంలో) తోడ్పడిన వారిని ఆయన (అల్లాహ్) వారి కోటల నుండి క్రిందికి తీసుకు వచ్చాడు. మరియు వారి హృదయాలలో భీతిని ప్రవేశింపజేశాడు. వారిలో కొందరిని మీరు చంపుతున్నారు, మరికొందరిని ఖైదీలుగా చేసుకుంటున్నారు |
మరియు ఆయన (అల్లాహ్) వారి భూమికి, వారి ఇండ్లకు మరియు వారి ఆస్తులకు మిమ్మల్ని వారసులుగా చేశాడు. మరియు మీరు ఎన్నడూ అడుగుమోపని భూమికి కూడా, (మిమ్మల్ని వారసులుగా చేశాడు). మరియు వాస్తవంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు |
ఓ ప్రవక్తా! నీవు నీ భార్యలతో ఇలా అను: ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్ని మరియు దాని శోభను కోరుతున్నట్లైతే, రండి నేను మీకు తప్పక జీవన సామాగ్రినిచ్చి, మిమ్మల్ని మంచి పద్ధతిలో విడిచి పెడతాను |
కాని ఒకవేళ మీరు అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి మరియు పరలోక గృహాన్ని కోరుతున్నట్లైతే, నిశ్చయంగా, అల్లాహ్ మలో సజ్జనులైన వారికి గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు |
ఓ ప్రవక్త స్త్రీలారా! మీలో ఎవరైనా స్పష్టంగా అనుచితమైన పనికి పాల్పడితే ఆమెకు రెట్టింపు శిక్ష విధించబడుతుంది. మరియు వాస్తవంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం |
మరియు మీలో ఏ స్త్రీ అయితే అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి విధేయురాలై ఉండి సత్కార్యాలు చేస్తుందో, ఆమెకు రెట్టింపు ప్రతిఫలమిస్తాము మరియు ఆమె కొరకు గౌరవప్రదమైన జీవనోపాధిని సిద్ధపరచి ఉంచాము |
ఓ ప్రవక్త భార్యలారా! మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. మీరు దైవభీతి గలవారైతే మీరు మెత్తని స్వరంతో మాట్లాడకండి. ఎందుకంటే! దానితో తన హృదయంలో రోగమున్న వానికి దుర్భుద్ధి పుట్టవచ్చు. కావున మీరు స్పష్టంగా, సూటిగానే మాట్లాడండి |
మరియు మీరు మీ ఇండ్లలోనే ఉండిండి మరియు పూర్వపు అజ్ఞానకాలంలో అలంకరణను ప్రదర్శిస్తూ తిరిగినట్లు తిరగకండి. మరియు నమాజ్ స్థాపించండి మరియు విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు అల్లాహ్ కు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి. (ఓ ప్రవక్త) గృహిణులారా! నిశ్చయంగా, అల్లాహ్ మీ నుండి మాలిన్యాన్ని తొలగించి, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగోరు తున్నాడు |
మరియు మీ ఇండ్లలో వినిపించబడే అల్లాహ్ ఆయతులను మరియు జ్ఞాన విషయాలను (హదీస్ లను) స్మరిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ అత్యంత సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసిన వాడు |
నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము`మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము`మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్గాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు; మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు |
మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు, ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, విశ్వసించిన పురుషునికి గానీ లేక విశ్వసించిన స్త్రీకి గానీ ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. మరియు ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి అవిధేయుడవుతాడో, వాస్తవంగా, అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే |
మరియు (ఓ ప్రవక్తా జ్ఞాపకం చేసుకో!) అల్లాహ్ అనుగ్రహించిన మరియు నీవు అనుగ్రహించిన వ్యక్తితో నీవు: నీ భార్యను ఉండనివ్వు (విడిచి పెట్టకు) మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు." అని అన్నప్పుడు; నీవు అల్లాహ్ బయట పెట్టదలచిన విషయాన్ని, నీ మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడ్డావు, వాస్తవానికి నీవు అల్లాహ్ కు భయపడటమే చాలా ఉత్తమమైనది. జైద్, ఆమెతో తన సంబంధాన్ని తన ఇచ్ఛానుసారంగా త్రెంపుకున్న తరువాతనే, మేము ఆమె వివాహం నీతో జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యలతో పెండ్లి చేసుకోవటంలో - వారు తమ భార్యల నుండి తమ ఇష్టానుసారంగా తమ సంబంధం త్రెంపు కున్నప్పుడు - ఏ విధమైన దోషం లేదు. వాస్తవానికి అల్లాహ్ ఆదేశం తప్పక అమలులోకి రావలసిందే |
అల్లాహ్ తన కొరకు ధర్మసమ్మతం చేసిన దానిని ప్రవక్త పూర్తి చేస్తే, అతనిపై ఎలాంటి నింద లేదు. ఇంతకు పూర్వం గతించిన వారి విషయంలో కూడా అల్లాహ్ సంప్రదాయం ఇదే. మరియు అల్లాహ్ ఆజ్ఞ, నిర్దేశింపబడిన (తిరుగులేని) శాసనం |
వారికి, ఎవరైతే అల్లాహ్ సందేశాలను అందజేస్తారో మరియు కేవలం ఆయనకే భయపడతారో మరియు అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడరో! మరియు లెక్క తీసుకోవటానికి కేవలం అల్లాహ్ యే చాలు |
(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు |
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا اللَّهَ ذِكْرًا كَثِيرًا(41) ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను (ఏకాగ్రతతో) అత్యధికంగా స్మరించండి |
మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి |
ఆయన మీపై ఆశీర్వాదాలు (సలాత్) పంపుతూ ఉంటాడు మరియు ఆయన దూతలు మిమ్మల్ని అంధకారం నుండి వెలుగులోకి తీసుకు రావటానికి (ఆయనను ప్రార్థిస్తూ ఉంటారు). మరియు ఆయన విశ్వాసుల పట్ల అపార కరుణా ప్రదాత |
تَحِيَّتُهُمْ يَوْمَ يَلْقَوْنَهُ سَلَامٌ ۚ وَأَعَدَّ لَهُمْ أَجْرًا كَرِيمًا(44) వారు ఆయనను కలుసుకునే రోజున వారికి: మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అనే అభినందనలతో స్వాగతం లభిస్తుంది. మరియు ఆయన వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం సిద్ధపరచి ఉంచాడు |
يَا أَيُّهَا النَّبِيُّ إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا(45) ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేము, నిన్ను సాక్షిగా, శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము |
وَدَاعِيًا إِلَى اللَّهِ بِإِذْنِهِ وَسِرَاجًا مُّنِيرًا(46) మరియు ఆయన అనుమతితో, అల్లాహ్ వైపునకు పిలిచేవానిగా మరియు ప్రకాశించే దీపంగానూ (చేసి పంపాము) |
وَبَشِّرِ الْمُؤْمِنِينَ بِأَنَّ لَهُم مِّنَ اللَّهِ فَضْلًا كَبِيرًا(47) మరియు నిశ్చయంగా, వారి మీద అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం ఉందనే శుభవార్తను విశ్వాసులకు ఇవ్వు |
మరియు నీవు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల మాటలకు లోబడకు మరియు వారి వేధింపులను లక్ష్య పెట్టకు మరియు కేవలం అల్లాహ్ నే నమ్ముకో మరియు కార్యకర్తగా కేవలం అల్లాహ్ యే చాలు |
ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహమాడి, తరువాత - మీరు వారిని తాకక పూర్వమే - వారికి విడాకులిచ్చినట్లైతే, మీ కొరకు వేచి వుండే వ్యవధి (ఇద్దత్) పూర్తి చేయమని అడిగే హక్కు మీకు వారిపై లేదు. కనుక వారికి పారితోషికం ఇచ్చి, మంచితనంతో వారిని సాగనంపండి |
ఓ ప్రవక్తా! నిశ్చయంగా, మేము నీకు: నీవు మహ్ర్ చెల్లించిన నీ భార్యలను మరియు అల్లాహ్ ప్రసాదించిన (బానిస) స్త్రీల నుండి నీ ఆధీనంలోకి వచ్చిన వారిని (స్త్రీలను) మరియు నీతో పాటు వలస వచ్చిన నీ పినతండ్రి (తండ్రి సోదరుల) కుమార్తెలను మరియు నీ మేనత్తల (తండ్రి సోదరీమణుల) కుమార్తెలను మరియు నీ మేనమామల (తల్లిసోదరుల) కుమార్తెలను మరియు నీ పినతల్లుల (తల్లిసోదరీమణుల) కుమార్తెలను; మరియు తనను తాను ప్రవక్తకు సమర్పించుకున్న విశ్వాసిని అయిన స్త్రీని - ఒకవేళ ప్రవక్త ఆమెను వివాహం చేసుకోదలిస్తే ఇతర విశ్వాసుల కొరకు గాక ప్రత్యేకంగా నీ కొరకే - ధర్మసమ్మతం చేశాము. వాస్తవానికి వారి (ఇతర విశ్వాసుల) కొరకు, వారి భార్యల విషయంలో మరియు వారి బానిసల విషయంలో, మేము విధించిన పరిమితులు మాకు బాగా తెలుసు. ఇదంతా మేము నీకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండాలని చేశాము. వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత |
నీవు వారిలో (నీ భార్యలలో) నుండి, నీవు కోరిన ఆమెను నీ నుండి కొంత కాలం వేరుగా ఉంచవచ్చు. మరియు నీవు కోరిన ఆమెను నీతోపాటు ఉంచవచ్చు. మరియు నీవు వేరుగా ఉంచిన వారిలో నుండి ఏ స్త్రీనైనా నీవు తిరిగి పిలుచుకోగోరితే, నీపై ఎలాంటి దోషం లేదు. దీనితో వారి కళ్లకు చల్లదనం కలుగుతుందని, వారు దుఃఖపడరనీ నీవు వారికి ఏమి ఇచ్చినా, వారు సంతోషపడతారని ఆశించవచ్చు! వాస్తవానికి మీ హృదయాలలో ఏముందో అల్లాహ్ కు తెలుసు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, శాంత స్వభావుడు (సహన శీలుడు) |
వీరు గాక, ఇతర స్త్రీలు నీకు (వివాహమాడటానికి) ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా కూడా మరెవ్వరినీ భార్యలుగా తీసుకునే అనుమతి కూడా నీకు లేదు - వారి సౌందర్యం నీకు ఎంత నచ్చినా - నీ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలు తప్ప! వాస్తవానికి అల్లాహ్ ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు |
ఓ విశ్వాసులారా! ప్రవక్త యొక్క ఇండ్లలోకి అనుమతి లేకుండా ప్రవేశించకండి. భోజనార్థం (పిలువబడినపుడు) ఆహారం సిద్ధపరిచే సమయం కొరకు వేచి ఉండకండి, కాని మీరు పిలువబడి నప్పుడు తప్పకుండా వెళ్ళండి. అయితే భోజనం చేసిన వెంటనే వెళ్ళిపొండి మరియు సాధారణ సంభాషణలో కాలక్షేపం చేస్తూ కూర్చోకండి. నిశ్చయంగా, దీని వలన ప్రవక్తకు కష్టం కలుగుతుంది; కాని అతను మిమ్మల్ని (పొమ్మనటానికి) సంకోచిస్తాడు. మరియు అల్లాహ్ సత్యం చెప్పటానికి సంకోచించడు (సిగ్గు పడడు). మరియు మీరు ప్రవక్త భార్యలతో ఏదైనా అడగ వలసి వచ్చినప్పుడు తెరచాటు నుండి అడగండి. ఇది మీ హృదయాలను మరియు వారి హృదయాలను కూడా నిర్మలంగా ఉంచుతుంది. మరియు అల్లాహ్ సందేశహరునికి కష్టం కలిగించటం మీకు తగదు. మరియు అతని తరువాత అతని భార్యలతో మీరు ఎన్నటికీ వివాహం చేసుకోకండి. నిశ్చయంగా ఇది అల్లాహ్ దృష్టిలో మహా అపరాధం |
إِن تُبْدُوا شَيْئًا أَوْ تُخْفُوهُ فَإِنَّ اللَّهَ كَانَ بِكُلِّ شَيْءٍ عَلِيمًا(54) ఒకవేళ మీరు ఏ విషయాన్నైనా వెలిబుచ్చినా లేదా దానిని దాచినా! నిశ్చయంగా, అల్లాహ్ కు మాత్రం ప్రతి విషయం గురించి బాగా తెలుసు |
వారిపై (ప్రవక్త భార్యలపై) - తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల, తమ సోదరీమణుల కుమారుల, తమ స్త్రీల లేదా తమ బానిస (స్త్రీల) - యెదుట వస్తే ఎలాంటి దోషం లేదు. (ఓ స్త్రీలారా!) మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానికి సాక్షి |
నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దరూద్ లు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ లు మరియు మీ హృదయ పూర్వక సలాంలు పంపుతూ ఉండండి |
నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి బాధ కలిగిస్తారో, వారిని అల్లాహ్ ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా శపిస్తాడు (బహిష్కరిస్తాడు) మరియు ఆయన వారికై అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు |
మరియు ఎవరైతే, ఏ తప్పూ చేయని, విశ్వాసులైన పురుషులకు మరియు స్త్రీలకు బాధ కలిగిస్తారో, వాస్తవానికి వారు అపనిందను మరియు స్పష్టమైన పాపభారాన్ని తమ మీద మోపుకున్నట్లే |
ఓ ప్రవక్తా! నీ భార్యలతో, నీ కుమార్తెలతో మరియు విశ్వాసినులైన స్త్రీలతోనూ తమ దుప్పట్లను తమ మీద పూర్తిగా కప్పుకోమని చెప్పు. ఇది వారు గుర్తించబడి బాధింపబడ కుండా ఉండటానికి ఎంతో సముచితమైనది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత |
ఒకవేళ ఈ కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగం (కలుషితం) ఉన్న వారు మరియు మదీనాలో వదంతులు వ్యాపింప జేసేవారు. తమ (దుశ్చేష్టలను) మానుకోక పోతే, మేము తప్పక నీకు వారిపై ఆధిక్యత నొసంగుతాము. ఆ తరువాత వారు ఈ నగరంలో నీ పొరుగు వారిగా కొన్నాళ్ళ కంటే ఎక్కువ ఉండలేరు |
مَّلْعُونِينَ ۖ أَيْنَمَا ثُقِفُوا أُخِذُوا وَقُتِّلُوا تَقْتِيلًا(61) వారు శపించబడ్డ (బహిష్కరించబడ్డ) వారు. వారు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకోబడతారు మరియు వారు దారుణంగా చంపబడతారు |
سُنَّةَ اللَّهِ فِي الَّذِينَ خَلَوْا مِن قَبْلُ ۖ وَلَن تَجِدَ لِسُنَّةِ اللَّهِ تَبْدِيلًا(62) ఇది ఇంతకు పూర్వం గడిచిన వారి విషయంలో జరుగుతున్న అల్లాహ్ సంప్రదాయమే! మరియు అల్లాహ్ సంప్రదాయంలో నీవు ఎలాంటి మార్పును చూడవు |
ప్రజలు నిన్ను అంతిమ ఘడియ (పునరుత్థానం) ను గురించి అడుగు తున్నారు. వారితో ఇలా అను: దాని జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది." మరియు నీకెలా తెలియదు? బహుశా ఆ ఘడియ సమీపంలోనే ఉండవచ్చు |
إِنَّ اللَّهَ لَعَنَ الْكَافِرِينَ وَأَعَدَّ لَهُمْ سَعِيرًا(64) నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులను శపించాడు (బహిష్కరించాడు) మరియు ఆయన వారి కొరకు మండే (నరక) అగ్నిని సిద్ధపరచి ఉంచాడు |
خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ لَّا يَجِدُونَ وَلِيًّا وَلَا نَصِيرًا(65) వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. వారు ఎలాంటి సంరక్షకుణ్ణి గానీ సహాయకుణ్ణి గానీ పొందలేరు |
వారి ముఖాలు నిప్పులపై బొర్లింప బడిన నాడు; వారు: అయ్యే! మేము అల్లాహ్ కు విధేయులమై ఉండి, సందేశహరుణ్ణి అనుసరించి ఉంటే ఎంత బాగుండేది?" అని వాపోతారు |
وَقَالُوا رَبَّنَا إِنَّا أَطَعْنَا سَادَتَنَا وَكُبَرَاءَنَا فَأَضَلُّونَا السَّبِيلَا(67) వారు ఇంకా ఇలా అంటారు: ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము మా నాయకులను మరియు మా పెద్దలను అనుసరించాము. కాని, వారే మమ్మల్ని (ఋజు) మార్గం నుండి తప్పించారు |
رَبَّنَا آتِهِمْ ضِعْفَيْنِ مِنَ الْعَذَابِ وَالْعَنْهُمْ لَعْنًا كَبِيرًا(68) ఓ మా ప్రభూ! వారికి రెట్టింపు శిక్ష విధించు మరియు వారిని పూర్తిగా శపించు (బహిష్కరించు) |
ఓ విశ్వాసులారా! మీరు మూసాను బాధించిన వారి వలే అయి పోకండి. తరువాత అల్లాహ్ వారు (కల్పించిన) ఆరోపణ నుండి అతనికి విముక్తి కలిగించాడు. అతను (మూసా), అల్లాహ్ దృష్టిలో ఎంతో ఆదరణీయుడు |
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا(70) ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే పలకండి |
ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహ్ కు విధేయుడై సందేశహరుని ఆజ్ఞను పాలిస్తాడో! నిశ్చయంగా, అతడే గొప్ప విజయం పొందినవాడు |
నిశ్చయంగా, మేము బాధ్యతను ఆకాశాలకు, భూమికి మరియు పర్వతాలకు సమర్పించగోరాము, కాని అవి దానిని భరించటానికి సమ్మతించలేదు మరియు దానికి భయపడ్డాయి, కాని మానవుడు దానిని తన మీద మోపుకున్నాడు. నిశ్చయంగా అతడు దుర్మార్గుడు, మూఢుడు కూడాను |
(దాని ఫలితంగా!) అల్లాహ్ కపట విశ్వాసులయిన పురుషులను మరియు కపట విశ్వాసులయిన స్త్రీలను మరియు అల్లాహ్ కు సాటి కల్పించే పురుషులను మరియు సాటి కల్పించే స్త్రీలను శిక్షిస్తాడు; మరియు విశ్వాసులైన పురుషుల మరియు విశ్వాసులైన స్త్రీల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Ahzab : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Ahzab complète en haute qualité.















Donnez-nous une invitation valide