అన్-నిసా · 10/176
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నిసా
إِنَّ الَّذِينَ يَأْكُلُونَ أَمْوَالَ الْيَتَامَىٰ ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ نَارًا ۖ وَسَيَصْلَوْنَ سَعِيرًا ۝١٠
Innal lazeena yaakuloona amwaalal yataamaa zulman innamaa yaakuloona fee butoonihim Naaranw-wa sayaslawna sa`eeraa
📖 తెలుగులో
నిశ్చయంగా, అన్యాయంగా అనాథుల ఆస్తులను, తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. మరియు వారు సమీపంలోనే భగభగమండే నరకాగ్నిలో కాల్చబడతారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 8-12 — సూరా అన్-నిసా

8وَإِذَا حَضَرَ الْقِسْمَةَ أُولُو الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينُ فَارْزُقُوهُم مِّنْهُ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا
మరియు (ఆస్తి) పంపకం జరిగేటప్పుడు ఇతర బంధువులు గానీ, అనాథులు గానీ, పేదవారు గానీ ఉంటే దాని నుండి వారికి కూడా కొంత ఇవ్వండి మరియు వారితో వాత్యల్యంగా మాట్లాడండి
9وَلْيَخْشَ الَّذِينَ لَوْ تَرَكُوا مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةً ضِعَافًا خَافُوا عَلَيْهِمْ فَلْيَتَّقُوا اللَّهَ وَلْيَقُولُوا قَوْلًا سَدِيدًا
మరియు (పంపకం చేసేటప్పుడు, పంపకం చేసేవారు), ఒకవేళ తామే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపోతే, ఏ విధంగా వారిని గురించి భయపడతారో, అదే విధంగా భయపడాలి. వారు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి, యుక్తమైన మాటలనే పలకాలి
10إِنَّ الَّذِينَ يَأْكُلُونَ أَمْوَالَ الْيَتَامَىٰ ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ نَارًا ۖ وَسَيَصْلَوْنَ سَعِيرًا
నిశ్చయంగా, అన్యాయంగా అనాథుల ఆస్తులను, తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. మరియు వారు సమీపంలోనే భగభగమండే నరకాగ్నిలో కాల్చబడతారు
11يُوصِيكُمُ اللَّهُ فِي أَوْلَادِكُمْ ۖ لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنثَيَيْنِ ۚ فَإِن كُنَّ نِسَاءً فَوْقَ اثْنَتَيْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ ۖ وَإِن كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُ ۚ وَلِأَبَوَيْهِ لِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ إِن كَانَ لَهُ وَلَدٌ ۚ فَإِن لَّمْ يَكُن لَّهُ وَلَدٌ وَوَرِثَهُ أَبَوَاهُ فَلِأُمِّهِ الثُّلُثُ ۚ فَإِن كَانَ لَهُ إِخْوَةٌ فَلِأُمِّهِ السُّدُسُ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِي بِهَا أَوْ دَيْنٍ ۗ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ لَا تَدْرُونَ أَيُّهُمْ أَقْرَبُ لَكُمْ نَفْعًا ۚ فَرِيضَةً مِّنَ اللَّهِ ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
మీ సంతాన వారసత్వాన్ని గురించి అల్లాహ్ మీకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు: ఒక పురుషుని (భాగం) ఇద్దరు స్త్రీల భాగాలకు సమానంగా ఉండాలి. ఒకవేళ ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ స్త్రీ (సంతానం మాత్రమే) ఉంటే, వారికి విడిచిన ఆస్తిలో మూడింట రెండు భాగాలు ఉంటాయి. మరియు ఒకవేళ ఒకే ఆడపిల్ల ఉంటే అర్ధభాగానికి ఆమె హక్కుదారురాలు. మరియు (మృతుడు) సంతానం కలవాడైతే, అతని తల్లిదండ్రులలో ప్రతి ఒక్కరికీ విడిచిన ఆస్తిలో ఆరోభాగం లభిస్తుంది. ఒకవేళ అతనికి సంతానం లేకుంటే అతని తల్లిదండ్రులు మాత్రమే వారసులుగా ఉంటే, అప్పుడు తల్లికి మూడోభాగం. మృతునికి సోదరసోదరీమణులు ఉంటే, తల్లికి ఆరోభాగం. (ఈ పంపకమంతా) మృతుని అప్పులు తీర్చి, అతని వీలునామా పై అమలు జరిపిన తరువాతనే జరగాలి. మీ తల్లిదండ్రులు మరియు మీ సంతానంలో ప్రయోజనం రీత్యా మీకు ఎవరు ఎక్కువ సన్నిహితులో, మీకు తెలియదు. ఇది అల్లాహ్ నియమించిన విధానం. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
12۞ وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ أَزْوَاجُكُمْ إِن لَّمْ يَكُن لَّهُنَّ وَلَدٌ ۚ فَإِن كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِينَ بِهَا أَوْ دَيْنٍ ۚ وَلَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ إِن لَّمْ يَكُن لَّكُمْ وَلَدٌ ۚ فَإِن كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُم ۚ مِّن بَعْدِ وَصِيَّةٍ تُوصُونَ بِهَا أَوْ دَيْنٍ ۗ وَإِن كَانَ رَجُلٌ يُورَثُ كَلَالَةً أَوِ امْرَأَةٌ وَلَهُ أَخٌ أَوْ أُخْتٌ فَلِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ ۚ فَإِن كَانُوا أَكْثَرَ مِن ذَٰلِكَ فَهُمْ شُرَكَاءُ فِي الثُّلُثِ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصَىٰ بِهَا أَوْ دَيْنٍ غَيْرَ مُضَارٍّ ۚ وَصِيَّةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَلِيمٌ
మరియు మీ భార్యలకు సంతానం లేని పక్షంలో, వారు విడిచిపోయిన దానిలో మీకు అర్ధభాగం. కాని ఒకవేళ వారికి సంతానం ఉంటే, వారు విడిచి పోయిన దానిలో నాలుగోభాగం మీది. (ఇదంతా) వారు వ్రాసి పోయిన వీలునామాపై అమలు జరిపి, వారి అప్పులు తీర్చిన తరువాత. మరియు మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచి పోయిన దానిలో వారికి (మీ భార్యలకు) నాలుగోభాగం. కాని ఒకవేళ మీకు సంతానం ఉంటే, మీరు విడిచిన దానిలో వారికి ఎనిమిదో భాగం. ఇదంతా మీరు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి మీ అప్పులు తీర్చిన తరువాత. మరియు ఒకవేళ మరణించిన పురుషుడు లేక స్త్రీ కలాల అయి (తండ్రి, కొడుకు లేక మనమడు లేకుండా) ఒక సోదరుడు మరియు ఒక సోదరి మాత్రమే ఉంటే, వారిలో ప్రతి ఒక్కరికీ ఆరోభాగం. కాని ఒకవేళ వారు (సోదరసోదరీమణులు) ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే, వారంతా మూడో భాగానికి వారసులవుతారు. ఇదంతా మృతుడు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి అప్పులు తీర్చిన తరువాత. ఎవ్వరికీ నష్టం కలుగజేయకుండా జరగాలి. ఇది అల్లాహ్ నుండి వచ్చిన ఆదేశం. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, సహనశీలుడు (శాంతస్వభావుడు)
అన్-నిసాఖురాన్ సూచిక
176వచనం
MedinanRevelation
10వచనం

అనువాదం — అన్-నిసా 10

సూరా అన్-నిసా వచనం 10 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, అన్యాయంగా అనాథుల ఆస్తులను, తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు.…

సూరా వచనం 10/176 — సూరా అన్-నిసా النساء (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నిసా వినండి, సూరా అన్-నిసా అనువాదం, సూరా అన్-నిసా mp3, సూరా అన్-నిసా pdf. వచనం 8–12. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers