Laisa `alal a`maa barajunw wa laa `alal a`raji barajunw wa laa `alal mareedi barajun wa laa `alaa anfusikum an taakuloo mim buyootikum aw buyooti aabaaa`ikum aw buyooti ummahaatikum aw buyooti ikhwaanikum aw buyooti akhawaatikum aw buyooti a`maamikum aw buyooti `ammaatikum aw buyooti akhwaalikum aw buyooti khaalaatikum aw maa malaktum mafaatihahooo aw sadeeqikum; laisa `alaikum junaahun an taakuloo jamee`an aw ashtaata; fa izaa dakhaltum buyootan fasallimoo `alaaa anfusikum tahiyyatam min `indil laahi mubaarakatan taiyibah; kazaalika yubai yinul laahu lakumul Aayaati la`allakum ta`qiloon
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
అంధుని మీద నిందలేదు మరియు కుంటివాని మీద నిందలేదు మరియు రోగి మీద నిందలేదు మరియు మీ మీద కూడా నిందలేదు: ఒకవేళ మీరు మీ ఇండ్లలో లేదా మీ తండ్రితాతల ఇండ్లలో లేదా మీ తల్లి నాయనమ్మల ఇండ్లలో లేదా మీ సోదరుల ఇండ్లలో లేదా మీ సోదరీమణుల ఇండ్లలో లేదా పినతండ్రుల (తండ్రి సోదరుల) ఇండ్లలో లేదా మీ మేనత్తల (తండ్రిసోదరీమణుల) ఇండ్లలో లేదా మీ మేనమామల (తల్లి సోదరుల) ఇండ్లలో లేదా మీ పిన్నమ్మల (తల్లి సోదరీమణుల) ఇండ్లలో లేదా మీ ఆధీనంలో తాళపు చెవులు ఉన్నవారి ఇండ్లలో లేదా మీ స్నేహితుల ఇండ్లలో తింటే! మీరు అందరితో కలిసి తిన్నా లేదా వేరుగా తిన్నా కూడా మీపై నింద లేదు. అయితే మీరు ఇండ్లలోనికి ప్రవేశించినపుడు, మీరు ఒకరి కొకరు సలాం చేసుకోవాలి. ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన దీవెన, శుభప్రదమైనది మేలైనది. ఈ విధంగా, అల్లాహ్ - మీరు అర్థం చేసుకుంటారని - తన ఆజ్ఞలను మీకు విశదీకరిస్తున్నాడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
इस बात में न तो अंधे आदमी के लिए मज़ाएक़ा है और न लँगड़ें आदमी पर कुछ इल्ज़ाम है- और न बीमार पर कोई गुनाह है और न ख़ुद तुम लोगो पर कि अपने घरों से खाना खाओ या अपने बाप दादा नाना बग़ैरह के घरों से या अपनी माँ दादी नानी वगैरह के घरों से या अपने भाइयों के घरों से या अपनी बहनों के घरों से या अपने चचाओं के घरों से या अपनी फूफ़ियों के घरों से या अपने मामूओं के घरों से या अपनी खालाओं के घरों से या उस घर से जिसकी कुन्जियाँ तुम्हारे हाथ में है या अपने दोस्तों (के घरों) से इस में भी तुम पर कोई इल्ज़ाम नहीं कि सब के सब मिलकर खाओ या अलग अलग फिर जब तुम घर वालों में जाने लगो (और वहाँ किसी का न पाओ) तो ख़ुद अपने ही ऊपर सलाम कर लिया करो जो ख़ुदा की तरफ से एक मुबारक पाक व पाकीज़ा तोहफा है- ख़ुदा यूँ (अपने) एहकाम तुमसे साफ साफ बयान करता है ताकि तुम समझो
مَلَكْتُم مَّفَاتِحَهُ: మీరు దాని తాళాలు/కీలు కలిగి ఉన్నారో, అంటే మీ సంరక్షణలో ఉన్న ఇళ్లు.
جُنَاحٌ: పాపం, దోషం.
تَحِيَّةً: అభివాదం, శుభాకాంక్షలు, సలాం.
ఆయత్ వివరణ:
అంధుడికి, కుంటివాడికి, రోగికి ఎటువంటి దోషం లేదు. వారు తమ శక్తికి మించిన విధులను, ఉదాహరణకు జిహాద్ వంటి వాటిని విడిచిపెట్టినందుకు వారిపై పాపం లేదు. అలాగే విశ్వాసులారా! మీరు మీ ఇళ్లలో, మీ తండ్రుల ఇళ్లలో, మీ తల్లుల ఇళ్లలో, మీ సహోదరుల ఇళ్లలో, మీ సహోదరీల ఇళ్లలో, మీ పితృసోదరుల (అబ్బాయి వైపు పెదనాన్నలు, చిన్నాన్నలు) ఇళ్లలో, మీ పితృసోదరీల (అబ్బాయి వైపు అత్తలు) ఇళ్లలో, మీ మాతృసోదరుల (అమ్మాయి వైపు మేనమామలు) ఇళ్లలో, మీ మాతృసోదరీల (అమ్మాయి వైపు అత్తలు) ఇళ్లలో, మీరు సంరక్షణ బాధ్యత కలిగిన ఇళ్లలో (అంటే యజమాని అనుమతితో మీరు కాపలా ఉన్న ఇళ్లలో), లేదా మీ స్నేహితుల ఇళ్లలో భోజనం చేయడంలో ఎటువంటి దోషం లేదు. మీరు కలిసి భోజనం చేయడంలో గానీ, విడివిడిగా భోజనం చేయడంలో గానీ మీపై ఎటువంటి పాపం లేదు. మీరు ఏదైనా ఇంటిలోకి ప్రవేశించినప్పుడు, మీలో మీరే సలాం చెప్పుకోండి — అది అల్లాహ్ తరఫు నుండి శుభప్రదమైన, పవిత్రమైన అభివాదం. ఇలాగే అల్లాహ్ తన ఆయతులను మీకు స్పష్టంగా వివరిస్తాడు, మీరు గ్రహించి ఆచరించడానికి.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
ఇస్లాం అనేది సౌలభ్యం మరియు దయగల మతం. శారీరక బలహీనతలు లేదా అనారోగ్యం ఉన్నవారిపై అల్లాహ్ భారం మోపడు. ఇది ఇస్లాం యొక్క దయను చూపుతుంది.
కుటుంబ సంబంధాలు మరియు స్నేహ సంబంధాలు ఇస్లాంలో ఎంతో గౌరవనీయమైనవి. బంధువులు మరియు స్నేహితుల ఇళ్లలో భోజనం చేయడానికి అనుమతి ఇవ్వడం ద్వారా, పరస్పర ప్రేమ, స్నేహం మరియు ఐక్యత పెరుగుతాయి.
సలాం చెప్పడం ఒక గొప్ప ఆరాధన. ఇది హృదయాలను కలుపుతుంది, ప్రేమను పెంచుతుంది మరియు శత్రుత్వాన్ని తొలగిస్తుంది. ఇది అల్లాహ్ నుండి వచ్చిన శుభప్రదమైన ఆశీర్వాదం.
అల్లాహ్ తన ఆదేశాలను స్పష్టంగా వివరిస్తాడు, మనం వాటిని అర్థం చేసుకుని, ఆలోచించి, ఆచరించాలని కోరుతాడు. ఇది ఇస్లాం యొక్క సరళతను మరియు వివేకాన్ని చూపుతుంది.
ఈ ఆయత్ మనలను ఇస్లాం వైపు ఆకర్షిస్తుంది, ఎందుకంటే ఇది మానవ సహజ స్వభావానికి అనుగుణంగ
అంధుని మీద నిందలేదు మరియు కుంటివాని మీద నిందలేదు మరియు రోగి మీద నిందలేదు మరియు మీ మీద కూడా నిందలేదు: ఒకవేళ మీరు మీ ఇండ్లలో లేదా మీ తండ్రితాతల ఇండ్లలో లేదా మీ తల్లి నాయనమ్మల ఇండ్లలో లేదా మీ సోదరుల ఇండ్లలో లేదా మీ సోదరీమణుల ఇండ్లలో లేదా పినతండ్రుల (తండ్రి సోదరుల) ఇండ్లలో లేదా మీ మేనత్తల (తండ్రిసోదరీమణుల) ఇండ్లలో లేదా మీ మేనమామల (తల్లి సోదరుల) ఇండ్లలో లేదా మీ పిన్నమ్మల (తల్లి సోదరీమణుల) ఇండ్లలో లేదా మీ ఆధీనంలో తాళపు చెవులు ఉన్నవారి ఇండ్లలో లేదా మీ స్నేహితుల ఇండ్లలో తింటే! మీరు అందరితో కలిసి తిన్నా లేదా వేరుగా తిన్నా కూడా మీపై నింద లేదు. అయితే మీరు ఇండ్లలోనికి ప్రవేశించినపుడు, మీరు ఒకరి కొకరు సలాం చేసుకోవాలి. ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన దీవెన, శుభప్రదమైనది మేలైనది. ఈ విధంగా, అల్లాహ్ - మీరు అర్థం చేసుకుంటారని - తన ఆజ్ఞలను మీకు విశదీకరిస్తున్నాడు
మరియు మీ పిల్లలు యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు; వారి కంటే పెద్దవారు (ముందువారు) అనుమతి తీసుకున్నట్లు వారు కూడా అనుమతి తీసుకోవాలి. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
మరియు ఋతుస్రావం ఆగిపోయి, వివాహ ఉత్సాహంలేని స్త్రీలు - తమ సౌందర్యం బయట పడకుండా ఉండేటట్లుగా - తమపై వస్త్రాలను (దుప్పట్లను) తీసి వేస్తే, వారిపై దోషం లేదు. కాని వారు అట్లు చేయకుండా ఉండటమే వారికి ఉత్తమమైనది. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
అంధుని మీద నిందలేదు మరియు కుంటివాని మీద నిందలేదు మరియు రోగి మీద నిందలేదు మరియు మీ మీద కూడా నిందలేదు: ఒకవేళ మీరు మీ ఇండ్లలో లేదా మీ తండ్రితాతల ఇండ్లలో లేదా మీ తల్లి నాయనమ్మల ఇండ్లలో లేదా మీ సోదరుల ఇండ్లలో లేదా మీ సోదరీమణుల ఇండ్లలో లేదా పినతండ్రుల (తండ్రి సోదరుల) ఇండ్లలో లేదా మీ మేనత్తల (తండ్రిసోదరీమణుల) ఇండ్లలో లేదా మీ మేనమామల (తల్లి సోదరుల) ఇండ్లలో లేదా మీ పిన్నమ్మల (తల్లి సోదరీమణుల) ఇండ్లలో లేదా మీ ఆధీనంలో తాళపు చెవులు ఉన్నవారి ఇండ్లలో లేదా మీ స్నేహితుల ఇండ్లలో తింటే! మీరు అందరితో కలిసి తిన్నా లేదా వేరుగా తిన్నా కూడా మీపై నింద లేదు. అయితే మీరు ఇండ్లలోనికి ప్రవేశించినపుడు, మీరు ఒకరి కొకరు సలాం చేసుకోవాలి. ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన దీవెన, శుభప్రదమైనది మేలైనది. ఈ విధంగా, అల్లాహ్ - మీరు అర్థం చేసుకుంటారని - తన ఆజ్ఞలను మీకు విశదీకరిస్తున్నాడు
అల్లాహ్ ను ఆయన ప్రవక్తను హృదయపూర్వకంగా విశ్వసించిన వారే నిజమైన విశ్వాసులు మరియు వారు ఏదైనా సామూహిక కార్యం నిమిత్తం అతనితో (దైవప్రవక్తతో) ఉన్నప్పుడు, అతని అనుమతి లేనిదే వెళ్ళిపోకూడదు. నిశ్చయంగా, ఎవరైతే నీతో (ఓ ముహమ్మద్!) అనుమతి అడుగుతారో అలాంటి వారే వాస్తవంగా! అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించిన వారు. కనుక వారు తమ ఏ పని కొరకైనా అనుమతి అడిగితే, వారిలో నీవు కోరిన వారికి అనుమతినివ్వు. మరియు వారిని క్షమించమని అల్లాహ్ ను ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
(ఓ విశ్వాసులారా!) సందేశహరుని పిలుపును మీరు, మీలో ఒకరి నొకరు పిలుచుకునే పిలుపుగా భావించకండి. మీలో ఒకరి చాటున ఒకరు దాక్కుంటూ మెల్లగా జారిపోయే వారిని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించే వారు, తాము ఏదైనా ఆపదలో చిక్కుకు పోతారేమోననీ లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడాలి
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.