Walmuhsanaatu minan nisaaa`i illaa maa malakat aimaanukum kitaabal laahi `alaikum; wa uhilla lakum maa waraaa`a zaalikum an tabtaghoo bi amwaali kum muhsineena ghaira musaa fiheen; famastamta`tum bihee minhunna fa aatoohunna ujoorahunna fareedah; wa laa junaaha `alaikum feemaa taraadaitum bihee mim ba`dil fareedah; innal laaha kaana `Aleeman Hakeemaa
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు ఇతరుల వివాహబంధంలో ఉన్న స్త్రీలు - (ధర్మయుద్ధంలో) మీ చేతికి చిక్కిన బానిస స్త్రీలు తప్ప- (మీరు వివాహమాడటానికి నిషేధించబడ్డారు). ఇది అల్లాహ్ మీకు విధించిన అనుశాసనం. మరియు వీరు తప్ప మిగతా స్త్రీలంతా మీకు వివాహమాడటానికి ధర్మసమ్మతం చేయబడ్డారు. మీరు వారికి తగిన స్త్రీశుల్కం (మహ్ర్) ఇచ్చి వ్యభిచారంగా కాకుండా వివాహబంధంలో తీసుకోవటానికి కోరవచ్చు. కావున మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించాలనుకున్న వారికి, వారి స్త్రీశుల్కం (మహ్ర్) విధిగా చెల్లించండి. కాని స్త్రీ శుల్కం (మహ్ర్) ఒప్పందం జరిగిన తరువాత పరస్పర అంగీకారంతో మీ మధ్య ఏమైనా రాజీ కుదిరితే, అందులో దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और शौहरदार औरतें मगर वह औरतें जो (जिहाद में कुफ्फ़ार से) तुम्हारे कब्ज़े में आ जाएं हराम नहीं (ये) ख़ुदा का तहरीरी हुक्म (है जो) तुमपर (फ़र्ज़ किया गया) है और उन औरतों के सिवा (और औरतें) तुम्हारे लिए जायज़ हैं बशर्ते कि बदकारी व ज़िना नहीं बल्कि तुम इफ्फ़त या पाकदामिनी की ग़रज़ से अपने माल (व मेहर) के बदले (निकाह करना) चाहो हॉ जिन औरतों से तुमने मुताअ किया हो तो उन्हें जो मेहर मुअय्यन किया है दे दो और मेहर के मुक़र्रर होने के बाद अगर आपस में (कम व बेश पर) राज़ी हो जाओ तो उसमें तुमपर कुछ गुनाह नहीं है बेशक ख़ुदा (हर चीज़ से) वाक़िफ़ और मसलेहतों का पहचानने वाला है
مَا مَلَكَتْ أَيْمَانُكُمْ: మీ కుడిచేతులు స్వాధీనం చేసుకున్నవి (యుద్ధంలో చెరపట్టబడిన స్త్రీలు).
كِتَابَ اللَّهِ: అల్లాహ్ విధించిన తీర్పు.
مَا وَرَاءَ ذَٰلِكُمْ: వారు కాకుండా మిగిలినవారు.
مُحْصِنِينَ: వివాహం చేసుకుని సన్మార్గంలో జీవించేవారు, పవిత్రతను కాపాడుకునేవారు.
غَيْرَ مُسَافِحِينَ: వ్యభిచారం చేయనివారు.
أُجُورَهُنَّ: వారి మహర్ (వివాహ ధనం).
فَرِيضَةً: తప్పనిసరిగా విధించబడినది.
ఆయత్ వ్యాఖ్యానం:
అల్లాహ్ తఆలా ఈ ఆయత్లో వివాహం విషయంలో కొన్ని ముఖ్యమైన నియమాలను తెలియజేస్తున్నాడు. భర్త ఉన్న స్త్రీలను వివాహం చేసుకోవడం హరామ్ (నిషిద్ధం) అని తెలిపాడు. అయితే, యుద్ధంలో శత్రువుల నుండి చెరపట్టబడిన స్త్రీల విషయంలో మినహాయింపు ఉంది — వారి గర్భం శుద్ధి అయిన తర్వాత వారిని వివాహం చేసుకోవడం లేదా వారితో సంబంధం ఏర్పరచుకోవడం అనుమతించబడింది. ఇది అల్లాహ్ విధించిన తీర్పు.
ఇవి తప్ప, మిగిలిన స్త్రీలను మీ ధనంతో వివాహం చేసుకోవడం మీకు హలాల్ (అనుమతించబడినది) చేయబడింది — కానీ వ్యభిచారం చేయడానికి కాదు, పవిత్రతను కాపాడుకోవడానికి మరియు సన్మార్గంలో జీవించడానికి. మీరు వివాహం ద్వారా స్త్రీలతో సుఖానుభవం పొందినప్పుడు, వారికి వారి మహర్ (వివాహ ధనం) తప్పనిసరిగా ఇవ్వండి. మహర్ నిర్ణయించిన తర్వాత, పరస్పర అంగీకారంతో మహర్లో తగ్గింపు లేదా పెంపు చేసుకున్నా మీపై ఎటువంటి దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
ఇస్లాం వివాహ వ్యవస్థను పవిత్రంగా, గౌరవప్రదంగా నిర్వహించడానికి స్పష్టమైన నియమాలను ఇస్తుంది — ఇది సమాజంలో నైతికతను, కుటుంబ వ్యవస్థను రక్షిస్తుంది.
స్త్రీలకు మహర్ రూపంలో ఆర్థిక హక్కు, గౌరవం ఇవ్వబడింది — ఇది ఇస్లాం స్త్రీలకు ఇచ్చే గౌరవానికి నిదర్శనం.
వ్యభిచారం నుండి దూరంగా ఉండి, పవిత్రమైన జీవితం గడపడం ఇస్లాం ఆదేశం — ఇది వ్యక్తి ఆత్మగౌరవాన్ని, సమాజ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
అల్లాహ్ సర్వజ్ఞుడు, వివేకవంతుడు — ఆయన ఇచ్చిన ప్రతి నియమం మన మేలు కోసమే. ఆయన చట్టాలను పాటించడం ద్వారా మనం ఇహలోకంలోనూ, పరలోకంలోనూ విజయం పొందగలము.
ఇస్లాం వివాహాన్ని సులభతరం చేస్తుంది, కానీ అనైతికతను ప్రోత్సహించదు — ఇది సహజమైన మానవ అవసరాలను గౌరవిస్తూనే, నైతిక విలువలను కాపాడుతుంది.
మరియు ఇతరుల వివాహబంధంలో ఉన్న స్త్రీలు - (ధర్మయుద్ధంలో) మీ చేతికి చిక్కిన బానిస స్త్రీలు తప్ప- (మీరు వివాహమాడటానికి నిషేధించబడ్డారు). ఇది అల్లాహ్ మీకు విధించిన అనుశాసనం. మరియు వీరు తప్ప మిగతా స్త్రీలంతా మీకు వివాహమాడటానికి ధర్మసమ్మతం చేయబడ్డారు. మీరు వారికి తగిన స్త్రీశుల్కం (మహ్ర్) ఇచ్చి వ్యభిచారంగా కాకుండా వివాహబంధంలో తీసుకోవటానికి కోరవచ్చు. కావున మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించాలనుకున్న వారికి, వారి స్త్రీశుల్కం (మహ్ర్) విధిగా చెల్లించండి. కాని స్త్రీ శుల్కం (మహ్ర్) ఒప్పందం జరిగిన తరువాత పరస్పర అంగీకారంతో మీ మధ్య ఏమైనా రాజీ కుదిరితే, అందులో దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు వివాహమాడకండీ. ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, ఇది అసభ్యకరమైనది (సిగ్గుమాలినది), జుగుప్సాకరమైనది మరియు చెడుమార్గము
మీకు ఈ స్త్రీలు నిషేధింపబడ్డారు. మీ తల్లులు, మీ కురమార్తెలు, మీ సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లిసోదరీ మణులు (పినతల్లులు), మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరీమణుల కుమార్తెలు, మీకు పాలిచ్చిన తల్లులు (దాదులు), మీతో పాటు పాలు త్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు; మీ సంరక్షణలో ఉన్న మీ భార్యల కుమార్తెలు - ఏ భార్యలతోనైతే మీరు సంభోగించారో - కాని మీరు వారితో సంభోగించక ముందు (వారికి విడాకులిచ్చి వారి కూతుళ్ళను పెండ్లాడితే) తప్పులేదు; మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు మరియు ఏక కాలంలో అక్కా చెల్లెళ్ళను ఇద్దరినీ చేర్చటం (భార్యలుగా చేసుకోవటం నిషిద్ధం); కాని ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత
మరియు ఇతరుల వివాహబంధంలో ఉన్న స్త్రీలు - (ధర్మయుద్ధంలో) మీ చేతికి చిక్కిన బానిస స్త్రీలు తప్ప- (మీరు వివాహమాడటానికి నిషేధించబడ్డారు). ఇది అల్లాహ్ మీకు విధించిన అనుశాసనం. మరియు వీరు తప్ప మిగతా స్త్రీలంతా మీకు వివాహమాడటానికి ధర్మసమ్మతం చేయబడ్డారు. మీరు వారికి తగిన స్త్రీశుల్కం (మహ్ర్) ఇచ్చి వ్యభిచారంగా కాకుండా వివాహబంధంలో తీసుకోవటానికి కోరవచ్చు. కావున మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించాలనుకున్న వారికి, వారి స్త్రీశుల్కం (మహ్ర్) విధిగా చెల్లించండి. కాని స్త్రీ శుల్కం (మహ్ర్) ఒప్పందం జరిగిన తరువాత పరస్పర అంగీకారంతో మీ మధ్య ఏమైనా రాజీ కుదిరితే, అందులో దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
మరియు మీలో ఎవరికైనా స్వతంత్రులైన ముస్లిం స్త్రీలను, వివాహం చేసుకునే స్తోమత లేకుంటే, అప్పుడు మీ స్వాధీనంలో ఉన్న ముస్లిం లైనటువంటి బానిస స్త్రీలను వివాహమాడవచ్చు. మరియు అల్లాహ్ కు మీ విశ్వాసం గురించి తెలుసు. మీరంతా ఒకే ఒక వర్గానికి చెందిన వారు. (ఒకరి కొకరు సంబంధించిన వారు), అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారితో వివాహం చేసుకొని, ధర్మప్రకారంగా వారి స్త్రీ శుల్కం (మహ్ర్) ఇవ్వండి. ఇది వారిని వివాహ బంధంలో సురక్షితంగా ఉంచటానికి,స్వేచ్ఛా కామక్రీడలకు దిగకుండా ఉంచటానికి మరియు దొంగచాటు సంబంధాలు ఏర్పరచుకోకుండా ఉంచటానికి (ఆదేశించబడింది). వారు (ఆ బానిస స్త్రీలు) వివాహ బంధంలో రక్షణ పొందిన తరువాత కూడా వ్యభిచారానికి పాల్పడితే, స్వతంత్రులైన స్త్రీలకు విధించే శిక్షలోని సగం శిక్ష వారికి విధించండి. ఇది మీలో పాపభీతి గలవారికి వర్తిస్తుంది. ఒకవేళ మీరు నిగ్రహం పాటిస్తే అది మీకే మంచిది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు. అపార కరుణాప్రదాత
అల్లాహ్ మీకు (ధర్మ-అధర్మాలను) స్పష్టం చేయాలనీ మరియు మీ కంటే పూర్వం ఉన్న (సత్పురుషుల) మార్గం వైపునకు, మీకు మార్గదర్శకత్వం చేయాలనీ మరియు మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలనీ కోరుతున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.