Yaa ayyuhal lazeena aamanoo izaa jaaa`akumul mu`minaatu muhaajiraatin famtah inoohunna Allaahu a`lamu bieemaanihinna fa in `alimtumoohunna mu`minaatin falaa tarji`oohunna ilal kuffaar; laa hunna hillul lahum wa laa hum uahilloona lahunna wa aatoohum maa anfaqoo wa laa junaaha `alaikum an tankihoohunna izaaa aataitumoohunna ujoorahunn; wa laa tumsikoo bi `isamil kawaafiri was`aloo maaa anfaqtum walyas`aloo maaa anfaqoo zaalikum hukmul laahi yahkumu bainakum wallaahu `aleemun hakeem
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు, మీ వద్దకు వలస వచ్చినపుడు, వారిని పరీక్షించండి. అల్లాహ్ కు వారి విశ్వాసం గురించి బాగా తెలుసు. వారు వాస్తవంగా విశ్వసించిన వారని మీకు తెలిసినప్పుడు, వారిని సత్యతిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. (ఎందుకంటే) ఆ స్త్రీలు వారికి (సత్యతిరస్కారులకు) ధర్మసమ్మతమైన (భార్యలు) కారు మరియు వారు కూడా ఆ స్త్రీలకు ధర్మసమ్మతమైన (భర్తలు) కారు. కాని, వారు (సత్యతిరస్కారులు), వారికిచ్చిన (మహ్ర్) మీరు వారికి చెల్లించండి మరియు వారికి వారి మహ్ర్ ఇచ్చిన తరువాత, ఆ స్త్రీలను వివాహమాడితే మీకు ఎలాంటి దోషం లేదు. మరియు మీరు కూడా సత్యతిరస్కారులైన స్త్రీలను మీ వివాహబంధంలో ఉంచుకోకండి. (అవిశ్వాసులుగా ఉండి పోదలచిన) మీ భార్యల నుండి మీరు ఇచ్చిన మహర్ అడిగి తీసుకోండి. (అలాగే అవిశ్వాసులను, విశ్వాసులైన తమ) భార్యల నుండి మహ్ర్ అడిగి తీసుకోనివ్వండి. ఇది అల్లాహ్ తీర్మానం. ఆయన ఈ విధంగా మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
ऐ ईमानदारों जब तुम्हारे पास ईमानदार औरतें वतन छोड़ कर आएँ तो तुम उनको आज़मा लो, ख़ुदा तो उनके ईमान से वाकिफ़ है ही, पस अगर तुम भी उनको ईमानदार समझो तो उन्ही काफ़िरों के पास वापस न फेरो न ये औरतें उनके लिए हलाल हैं और न वह कुफ्फ़ार उन औरतों के लिए हलाल हैं और उन कुफ्फार ने जो कुछ (उन औरतों के मेहर में) ख़र्च किया हो उनको दे दो, और जब उनका महर उन्हें दे दिया करो तो इसका तुम पर कुछ गुनाह नहीं कि तुम उससे निकाह कर लो और काफिर औरतों की आबरू (जो तुम्हारी बीवियाँ हों) अपने कब्ज़े में न रखो (छोड़ दो कि कुफ्फ़ार से जा मिलें) और तुमने जो कुछ (उन पर) ख़र्च किया हो (कुफ्फ़ार से) लो, और उन्होने भी जो कुछ ख़र्च किया हो तुम से माँग लें यही ख़ुदा का हुक्म है जो तुम्हारे दरमियान सादिर करता है और ख़ुदा वाक़िफ़कार हकीम है
مُهَاجِرَاتٍ (ముహాజిరాత్): కుఫ్ర్ (అవిశ్వాస) దేశం నుండి ఇస్లాం దేశానికి వలస వచ్చిన స్త్రీలు.
فَامْتَحِنُوهُنَّ (ఫమ్తహినూహున్న): వారిని పరీక్షించండి, వారి విశ్వాస సత్యతను పరిశీలించండి.
حِلٌّ (హిల్ల్): ధర్మశాస్త్రపరంగా అనుమతించబడినది, వివాహం చేసుకోవడానికి యోగ్యమైనది.
أُجُورَهُنَّ (ఉజూరహున్న): వారి మహర్ (వివాహ ధనం).
بِعِصَمِ الْكَوَافِرِ (బి ఇసమిల్ కవాఫిర్): అవిశ్వాసిని స్త్రీల వివాహ బంధాన్ని పట్టుకోవడం, అంటే వారితో వివాహ సంబంధాన్ని కొనసాగించడం.
يَحْكُمُ (యహ్కుము): తీర్పు చేస్తాడు, నిర్ణయిస్తాడు.
ఆయత్ వ్యాఖ్యానం:
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మీద మరియు ఆయన ప్రవక్త మీద విశ్వాసం కలిగి, ఆయన ధర్మశాసనాన్ని పాటించేవారైతే, అవిశ్వాస దేశం నుండి ఇస్లాం దేశానికి వలస వచ్చిన విశ్వాసిని స్త్రీలు మీ వద్దకు వచ్చినప్పుడు, వారి విశ్వాసం నిజమైనదో కాదో పరీక్షించండి. వారి హృదయాలలో ఏముందో అల్లాహ్కు బాగా తెలుసు. మీరు వారిని పరీక్షించి, వారు నిజంగా విశ్వాసినులని తెలుసుకున్నట్లయితే, వారిని అవిశ్వాసులైన వారి భర్తల వద్దకు తిరిగి పంపకండి. ఎందుకంటే విశ్వాసిని స్త్రీలు అవిశ్వాసులకు ధర్మశాస్త్రపరంగా అనుమతించబడరు, అలాగే అవిశ్వాసులు విశ్వాసిని స్త్రీలకు అనుమతించబడరు. ఆ స్త్రీల అవిశ్వాస భర్తలు వారి వివాహానికి ఖర్చు చేసిన మహర్ ధనాన్ని వారికి తిరిగి ఇవ్వండి. మీరు ఆ స్త్రీలకు వారి మహర్ ధనాన్ని ఇచ్చి, వారిని వివాహం చేసుకోవడంలో మీకు ఎటువంటి దోషం లేదు. అలాగే, అవిశ్వాసిని అయిన మీ భార్యలతో వివాహ బంధాన్ని కొనసాగించకండి. ఇస్లాంను విడిచి అవిశ్వాసుల వద్దకు వెళ్లిన మీ భార్యల కోసం మీరు చెల్లించిన మహర్ ధనాన్ని మీరు అడగండి, అలాగే వారి భార్యలు ఇస్లాంలోకి వచ్చి మీ వద్దకు వచ్చినప్పుడు వారు చెల్లించిన మహర్ ధనాన్ని వారు అడగాలి. ఇది అల్లాహ్ యొక్క తీర్పు, ఆయన మీ మధ్య తీర్పు చేస్తాడు. అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
ఇస్లాం ధర్మం విశ్వాసం మరియు కుటుంబ సంబంధాల విషయంలో చాలా స్పష్టమైన మరియు న్యాయమైన నియమాలను ఏర్పాటు చేస్తుంది. ఇది ధర్మం యొక్క పరిపూర్ణతను మరియు వివేకాన్ని చూపిస్తుంది.
విశ్వాసం అనేది కేవలం పైకి చెప్పే మాట కాదు, అది హృదయంలో నిజాయితీగా ఉండాలి. అల్లాహ్ ప్రతి ఒక్కరి హృదయాన్ని గురించి పూర్తిగా తెలిసినవాడు.
ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు, మీ వద్దకు వలస వచ్చినపుడు, వారిని పరీక్షించండి. అల్లాహ్ కు వారి విశ్వాసం గురించి బాగా తెలుసు. వారు వాస్తవంగా విశ్వసించిన వారని మీకు తెలిసినప్పుడు, వారిని సత్యతిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. (ఎందుకంటే) ఆ స్త్రీలు వారికి (సత్యతిరస్కారులకు) ధర్మసమ్మతమైన (భార్యలు) కారు మరియు వారు కూడా ఆ స్త్రీలకు ధర్మసమ్మతమైన (భర్తలు) కారు. కాని, వారు (సత్యతిరస్కారులు), వారికిచ్చిన (మహ్ర్) మీరు వారికి చెల్లించండి మరియు వారికి వారి మహ్ర్ ఇచ్చిన తరువాత, ఆ స్త్రీలను వివాహమాడితే మీకు ఎలాంటి దోషం లేదు. మరియు మీరు కూడా సత్యతిరస్కారులైన స్త్రీలను మీ వివాహబంధంలో ఉంచుకోకండి. (అవిశ్వాసులుగా ఉండి పోదలచిన) మీ భార్యల నుండి మీరు ఇచ్చిన మహర్ అడిగి తీసుకోండి. (అలాగే అవిశ్వాసులను, విశ్వాసులైన తమ) భార్యల నుండి మహ్ర్ అడిగి తీసుకోనివ్వండి. ఇది అల్లాహ్ తీర్మానం. ఆయన ఈ విధంగా మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు
ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు
కాని, వాస్తవానికి ఎవరైతే, ధర్మ విషయంలో మీతో యుద్ధం చేస్తారో మరియు మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొడ్తారో మరియు మిమ్మల్ని వెళ్ళగొట్టటంలో పరస్పరం సహకరించుకుంటారో; వారితో స్నేహం చేయటాన్ని అల్లాహ్ మీ కొరకు నిషేధిస్తున్నాడు. మరియు ఎవరైతే వారితో స్నేహం చేస్తారో, అలాంటి వారు, వారే! దుర్మార్గులు
ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు, మీ వద్దకు వలస వచ్చినపుడు, వారిని పరీక్షించండి. అల్లాహ్ కు వారి విశ్వాసం గురించి బాగా తెలుసు. వారు వాస్తవంగా విశ్వసించిన వారని మీకు తెలిసినప్పుడు, వారిని సత్యతిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. (ఎందుకంటే) ఆ స్త్రీలు వారికి (సత్యతిరస్కారులకు) ధర్మసమ్మతమైన (భార్యలు) కారు మరియు వారు కూడా ఆ స్త్రీలకు ధర్మసమ్మతమైన (భర్తలు) కారు. కాని, వారు (సత్యతిరస్కారులు), వారికిచ్చిన (మహ్ర్) మీరు వారికి చెల్లించండి మరియు వారికి వారి మహ్ర్ ఇచ్చిన తరువాత, ఆ స్త్రీలను వివాహమాడితే మీకు ఎలాంటి దోషం లేదు. మరియు మీరు కూడా సత్యతిరస్కారులైన స్త్రీలను మీ వివాహబంధంలో ఉంచుకోకండి. (అవిశ్వాసులుగా ఉండి పోదలచిన) మీ భార్యల నుండి మీరు ఇచ్చిన మహర్ అడిగి తీసుకోండి. (అలాగే అవిశ్వాసులను, విశ్వాసులైన తమ) భార్యల నుండి మహ్ర్ అడిగి తీసుకోనివ్వండి. ఇది అల్లాహ్ తీర్మానం. ఆయన ఈ విధంగా మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు
మరియు ఒకవేళ మీ (విశ్వాసుల) భార్యలలో ఒకామె, మిమ్మల్ని విడిచి సత్యతిరస్కారుల వద్దకు వెళ్ళిపోతే! (ఆ సత్యతిరస్కారులు, మీరు ఆ స్త్రీలకు చెల్లించిన మహ్ర్ మీకు వాపసు ఇవ్వడానికి నిరాకరిస్తే)! ఆ తరువాత మీకు వారితో ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికితే (మీరు వారిపై యుద్ధం చేసి విజయం పొందితే)! దాని (విజయ ధనం) నుండి, ఎవరి భార్యలైతే సత్యతిరస్కారుల వద్దకు పోయారో వారికి - వారు (తమ భార్యలకు) ఇచ్చిన దానికి (మహ్ర్ కు) సమానంగా - చెల్లించండి. మరియు మీరు విశ్వసించిన అల్లాహ్ యందు, భయభక్తులు కలిగి ఉండండి
ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు ప్రమాణం (బైఅత్) చేయటానికి నీ వద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహ్ కు సాటి కల్పించము అని మరియు దొంగతనం చేయము అని మరియు వ్యభిచారం చేయము అని మరియు తమ సంతానాన్ని హత్య చేయము అని మరియు తమ చేతుల మద్య మరియు తమ కాళ్ళ మధ్య నిందారోపణ కల్పించము అని మరియు ధర్మసమ్మతమైన విషయాలలో నీకు అవిధేయత చూపము అని, ప్రమాణం చేస్తే, వారి నుండి ప్రమాణం (బైఅత్) తీసుకో మరియు వారిని క్షమించమని అల్లాహ్ ను ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.