Wul mar Rabbus samaawaati wal ard; qulillaah; qul afattakhaztum min dooniheee awliyaaa`a laa yamlikoona li anfusihim naf`anw wa laa darraa; qul hal yastawil a`maa wal baseeru am hal tastawiz zulumaatu wannoor; am ja`aloo lillaahi shurakaaa`a khalaqoo kakhalqihee fatashaa bahal khalqu `alaihim; qulil laahu Khaaliqu kulli shai`inw wa Huwal Waahidul Qahhar
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఇలా అడుగు: భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?" నీవే ఇలా జవాబివ్వు: అల్లాహ్!" తరువాత ఇలా అను: అయితే మీరు ఆయనను వదలి తమకు తాము మేలు గానీ, కీడు గానీ చేసుకోలేని వారిని, మీకు సహాయకులుగా (సంరక్షకులుగా) ఎన్నుకుంటారా?" ఇంకా ఇలా అడుగు: ఏమీ? గ్రుడ్డివాడు మరియు చూడగలిగే వాడూ సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా, అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా?" వారితో అను: అల్లాహ్ యే ప్రతిదానికి సృష్టికర్త. మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు (తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు)
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
(ऐ रसूल) तुम पूछो कि (आख़िर) आसमान और ज़मीन का परवरदिगार कौन है (ये क्या जवाब देगें) तुम कह दो कि अल्लाह है (ये भी कह दो कि क्या तुमने उसके सिवा दूसरे कारसाज़ बना रखे हैं जो अपने लिए आप न तो नफे पर क़ाबू रखते हैं न ज़रर (नुकसान) पर (ये भी तो) पूछो कि भला (कहीं) अन्धा और ऑंखों वाला बराबर हो सकता है (हरगिज़ नहीं) (या कहीं) अंधेरा और उजाला बराबर हो सकता है (हरगिज़ नहीं) इन लोगों ने ख़ुदा के कुछ शरीक़ ठहरा रखे हैं क्या उन्होनें ख़ुदा ही की सी मख़लूक़ पैदा कर रखी है जिनके सबब मख़लूकात उन पर मुशतबा हो गई है (और उनकी खुदाई के क़ायल हो गए) तुम कह दो कि ख़ुदा ही हर चीज़ का पैदा करने वाला और वही यकता और सिपर (सब पर) ग़ालिब है
الْقَهَّارُ: సర్వులను అణచివేసేవాడు, అందరిపై ఆధిపత్యం కలవాడు.
ఆయత్ వ్యాఖ్యానం:
ఓ ప్రవక్తా! మీరు విగ్రహారాధకులను ఇలా అడగండి: "ఆకాశాలను, భూమిని ఎవరు సృష్టించారు? వాటిని ఎవరు నిర్వహిస్తున్నారు?" వారు తప్పకుండా "అల్లాహ్" అని చెబుతారు, ఎందుకంటే వారు కూడా దానిని అంగీకరిస్తారు. అప్పుడు మీరు చెప్పండి: "అల్లాహ్ వాటిని సృష్టించినవాడు, నిర్వహించేవాడు." తరువాత వారిని హెచ్చరిస్తూ అడగండి: "మీరు అల్లాహ్ను వదిలి, తమకు తామే లాభం కలిగించుకోలేని, నష్టాన్ని తొలగించుకోలేని వాటిని ఎందుకు ఆశ్రయించారు? తమకు తామే సహాయం చేసుకోలేని వారు మీకు ఎలా సహాయం చేస్తారు?"
ఆపై వారిని ఇలా అడగండి: "అవిశ్వాసి అనే గుడ్డివాడు, విశ్వాసి అనే చూపున్నవాడు సమానం కాగలరా? లేదా అవిశ్వాసం అనే చీకట్లు, విశ్వాసం అనే వెలుగు సమానం కాగలవా? ఎప్పటికీ కావు."
ఇంకా వారిని అడగండి: "ఏమైనా, వారు అల్లాహ్కు భాగస్వాములను కల్పించారా? ఆ భాగస్వాములు అల్లాహ్ సృష్టించినట్లు ఏదైనా సృష్టించారా? దాని వల్ల సృష్టి వారికి గందరగోళంగా తోచిందా? అల్లాహ్ సృష్టించినది, విగ్రహాలు సృష్టించినది అని వేరు చేయలేకపోయారా?" వాస్తవానికి విగ్రహాలు ఏమీ సృష్టించలేవు. కాబట్టి మీరు చెప్పండి: "అల్లాహ్ మాత్రమే ప్రతిదానిని సృష్టించేవాడు. ఆయన ఒక్కడే, సర్వులను అణచివేసేవాడు. ఆయనకు ఎటువంటి భాగస్వామి లేడు. ఆయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు."
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త, నిర్వాహకుడు అని గుర్తించడం విశ్వాసానికి మూలం.
అల్లాహ్ కాకుండా ఇతరులను ఆరాధించడం వ్యర్థం, ఎందుకంటే వారు తమకు తామే లాభం కలిగించుకోలేరు.
విశ్వాసం వెలుగు లాంటిది, అవిశ్వాసం చీకటి లాంటిది; రెండూ ఎప్పటికీ సమానం కావు.
ఇలా అడుగు: భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?" నీవే ఇలా జవాబివ్వు: అల్లాహ్!" తరువాత ఇలా అను: అయితే మీరు ఆయనను వదలి తమకు తాము మేలు గానీ, కీడు గానీ చేసుకోలేని వారిని, మీకు సహాయకులుగా (సంరక్షకులుగా) ఎన్నుకుంటారా?" ఇంకా ఇలా అడుగు: ఏమీ? గ్రుడ్డివాడు మరియు చూడగలిగే వాడూ సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా, అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా?" వారితో అను: అల్లాహ్ యే ప్రతిదానికి సృష్టికర్త. మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు (తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు)
ఆయనను ప్రార్థించటమే విద్యుక్త ధర్మం. ఆయనను వదలి వారు ప్రార్థించేవి (ఇతర శక్తులు) వారికి ఏ విధమైన సమాధాన మివ్వలేవు. అది (వాటిని వేడుకోవడం): ఒకడు తన రెండు చేతులు నీటి వైపుకు చాచి, అది (నీరు) నోటి దాకా రావాలని ఆశించటమే! కాని అది అతని (నోటి వరకు) చేరదు కదా! (అలాగే) సత్యతిరస్కారుల ప్రార్థనలన్నీ వ్యర్థమై పోతాయి
మరియు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టంగానో అయిష్టంగానో అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటుంది. మరియు వాటి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం (సాష్టాంగం చేస్తూ ఉంటాయి)
ఇలా అడుగు: భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?" నీవే ఇలా జవాబివ్వు: అల్లాహ్!" తరువాత ఇలా అను: అయితే మీరు ఆయనను వదలి తమకు తాము మేలు గానీ, కీడు గానీ చేసుకోలేని వారిని, మీకు సహాయకులుగా (సంరక్షకులుగా) ఎన్నుకుంటారా?" ఇంకా ఇలా అడుగు: ఏమీ? గ్రుడ్డివాడు మరియు చూడగలిగే వాడూ సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా, అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా?" వారితో అను: అల్లాహ్ యే ప్రతిదానికి సృష్టికర్త. మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు (తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు)
ఆయన (అల్లాహ్) ఆకాసం నుండి నీరు కురిపించగా (ఎండిపోయిన) సెలయేళ్ళు తమ తమ పరిమాణాలకు సరిపడేలా ప్రవహింప సాగుతాయి. అప్పుడు వరద (ఉపరితలం మీద) నురుగులు ఉబ్బి వస్తాయి. మరియు అగ్నిని రగిలించి నగలు, పాత్రలు చేసేటప్పుడు కూడా కరిగించే లోహాల మీద కూడా అదే విధంగా నురుగులు వస్తాయి. ఈ విధంగా అల్లాహ్ సత్యమేదో అసత్యమేదో పోల్చి వివరిస్తున్నాడు. ఎందుకంటే నురుగంతా ఎగిరి పోతుంది, కాని మానవులకు లాభదాయకమైనది భూమిలో మిగులుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణలను వివరిస్తున్నాడు
తమ ప్రభువు సందేశాన్ని స్వీకరించిన వారికి మంచి ప్రతిఫలం ఉంటుంది. మరియు ఆయన సందేశాన్ని స్వీకరించని వారి దగ్గర భూమిలో ఉన్నదంతా, మరియు దానితో పాటు దానికి సమానంగా ఉన్నా, వారు అదంతా పరిహారంగా ఇవ్వదలచుకున్నా (అది స్వీకరించబడదు). అలాంటి వారి లెక్క దారుణంగా ఉంటుంది. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది ఎంతో దుర్భరమైన విరామ స్థలము
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.