Afaman Huwa qaaa`imun `alaa kulli nafsim bimaa kasabat; wa ja`aloo illlaahi shurakaaa`a qul samoohum; am tunabbi`oona hoo bimaa laa ya`lamu fil ardi; am bizaahirim minal qawl; bal zuyyina lillazeena kafaroo makruhum wa suddoo `anis sabeel; wa mai yudlilil laaahu famaa lahoo min haad
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఏమీ? ఆయన (అల్లాహ్), ప్రతి వ్యక్తి అర్జించే దానిని కనిపెట్టుకొని ఉండేవాడు (మరియు లాభనష్టాలు కలుగజేయలేని మీ బూటకపు దైవాలు సరిసమానులా)? అయినా వారు అల్లాహ్ కు భాగస్వాములు (సాటి) కల్పిస్తారు. వారితో ఇలా అను: (నిజంగానే వారు అల్లాహ్ స్వయంగా నియమించుకున్న భాగస్వాములే అయితే) వారి పేర్లను తెలుపండి! లేక భూమిలో ఉన్నట్లు ఆయనకు తెలియని విషయాన్ని మీరు ఆయనకు తెలుపుతున్నారా? లేక మీరు ఇట్లే నోటికి వచ్చినట్లు వాగుతున్నారా? వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారికి, వారి కుట్ర ఆకర్షణీయంగా చేయబడుతోంది. మరియు వారు ఋజుమార్గం నుండి నిరోధించచబడ్డారు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలిన వానికి సన్మార్గం చూపేవాడు ఎవ్వడూ ఉండడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
क्या जो (ख़ुदा) हर एक शख़्श के आमाल की ख़बर रखता है (उनको युं ही छोड़ देगा हरगिज़ नहीं) और उन लोगों ने ख़ुदा के (दूसरे दूसरे) शरीक ठहराए (ऐ रसूल तुम उनसे कह दो कि तुम आख़िर उनके नाम तो बताओं या तुम ख़ुदा को ऐसे शरीक़ो की ख़बर देते हो जिनको वह जानता तक नहीं कि वह ज़मीन में (किधर बसते) हैं या (निरी ऊपर से बातें बनाते हैं बल्कि (असल ये है कि) काफिरों को उनकी मक्कारियाँ भली दिखाई गई है और वह (गोया) राहे रास्त से रोक दिए गए हैं और जिस शख़्श को ख़ुदा गुमराही में छोड़ दे तो उसका कोई हिदायत करने वाला नहीं
سَمُّوهُمْ: వారికి పేర్లు పెట్టండి, వారి లక్షణాలను వివరించండి.
أَمْ تُنَبِّئُونَهُ: లేదా మీరు ఆయనకు తెలియజేస్తున్నారా?
بِظَاهِرٍ مِّنَ الْقَوْلِ: కేవలం మాటల్లో మాత్రమే ఉన్నది, వాస్తవికత లేనిది.
زُيِّنَ: అలంకరించబడింది, అందంగా చూపబడింది.
مَكْرُهُمْ: వారి కుట్ర, వారి మోసపూరిత ప్రవర్తన.
وَصُدُّوا: వారు నిరోధించబడ్డారు, దూరం చేయబడ్డారు.
السَّبِيلِ: సరైన మార్గం, ధర్మమార్గం.
يُضْلِلِ: దారితప్పించు.
هَادٍ: మార్గదర్శకుడు.
ఆయత్ వ్యాఖ్యానం:
అల్లాహ్ తన ప్రవక్తను ఉద్దేశించి ఇలా అంటున్నాడు: ప్రతి ఆత్మపై పర్యవేక్షణ కలిగి, దాని మంచి-చెడు కర్మలను లెక్కించి, వాటికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు అల్లాహ్ ఒక్కడే. అలాంటి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆరాధనకు అర్హుడు కాడా? లేక ఏ శక్తీ లేని ఈ విగ్రహాలు ఆరాధనకు అర్హులా? అయినా అవివేకులు అల్లాహ్కు సమానులుగా కొన్ని విగ్రహాలను కల్పించి పూజిస్తున్నారు.
ఓ ప్రవక్తా! వారిని ఇలా ప్రశ్నించు: మీరు అల్లాహ్తో పాటు ఆరాధించే ఈ భాగస్వాముల పేర్లు, లక్షణాలు చెప్పండి. వారిలో ఆరాధనకు అర్హత కలిగించే ఏ లక్షణమైనా ఉందా? లేదా మీరు భూమిలో అల్లాహ్కు తెలియని భాగస్వాములు ఉన్నారని ఆయనకు తెలియజేస్తున్నారా? వాస్తవానికి అల్లాహ్కు ఎవరూ భాగస్వాములు లేరు, ఆయనకు అందరూ తెలుసు. లేదా మీరు కేవలం నోటితో మాత్రమే వారిని భాగస్వాములని పిలుస్తున్నారా, వాస్తవికత లేకుండా?
నిజానికి సత్యాన్ని తిరస్కరించినవారికి షైతాన్ వారి దుష్కార్యాలను అందంగా చూపించాడు, వారిని సరైన మార్గం నుండి దూరం చేశాడు. అల్లాహ్ ఎవరిని దారితప్పించాలని నిర్ణయిస్తాడో, వారికి సరైన మార్గం చూపే ఎవరూ ఉండరు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
అల్లాహ్ ప్రతి ఆత్మను పర్యవేక్షిస్తాడు, ప్రతి చిన్న కర్మకు ప్రతిఫలం ఇస్తాడు — ఇది మనలను మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంది.
అల్లాహ్ ఒక్కడే ఆరాధనకు అర్హుడు; ఎవరూ ఆయనకు సమానం కాదు.
అల్లాహ్ సర్వజ్ఞుడు — భూమిలో ఏదీ ఆయనకు తెలియకుండా లేదు.
షైతాన్ చెడు పనులను అందంగా చూపిస్తాడు, కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి.
ఏమీ? ఆయన (అల్లాహ్), ప్రతి వ్యక్తి అర్జించే దానిని కనిపెట్టుకొని ఉండేవాడు (మరియు లాభనష్టాలు కలుగజేయలేని మీ బూటకపు దైవాలు సరిసమానులా)? అయినా వారు అల్లాహ్ కు భాగస్వాములు (సాటి) కల్పిస్తారు. వారితో ఇలా అను: (నిజంగానే వారు అల్లాహ్ స్వయంగా నియమించుకున్న భాగస్వాములే అయితే) వారి పేర్లను తెలుపండి! లేక భూమిలో ఉన్నట్లు ఆయనకు తెలియని విషయాన్ని మీరు ఆయనకు తెలుపుతున్నారా? లేక మీరు ఇట్లే నోటికి వచ్చినట్లు వాగుతున్నారా? వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారికి, వారి కుట్ర ఆకర్షణీయంగా చేయబడుతోంది. మరియు వారు ఋజుమార్గం నుండి నిరోధించచబడ్డారు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలిన వానికి సన్మార్గం చూపేవాడు ఎవ్వడూ ఉండడు
మరియు నిశ్చయంగా, (ఖుర్ఆన్ ను) పఠించటం వలన కొండలు కదలింపబడినా, లేదా దాని వల్ల భూమి చీల్చబడినా, లేదా దాని వల్ల మృతులు మాట్లాడేటట్లు చేయబడినా! (అవిశ్వాసులు దానిని విశ్వసించరు). వాస్తవానికి సర్వ నిర్ణయాల అధికారం కేవలం అల్లాహ్ కే చెందుతుంది. ఏమీ? ఒకవేళ అల్లాహ్ కోరితే సర్వ మానవులకు సన్మార్గం చూపేవాడని తెలిసి కూడా విశ్వాసులు ఎందుకు ఆశ వదులుకుంటున్నారు? మరియు అల్లాహ్ వాగ్దానం పూర్తి అయ్యేవరకు సత్యతిరస్కారంలో మునిగి ఉన్న వారిపై, వారి కర్మల ఫలితంగా, ఏదో ఒక ఆపద కలుగుతూనే ఉంటుంది. లేదా అది వారి ఇండ్ల సమీపంలో పడుతూ ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగ పరచడు
మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలు పరిహసించ బడ్డారు, కావున (మొదట) నేను సత్యతిరస్కారులకు వ్యవధి నిచ్చాను తరువాత వారిని పట్టుకున్నాను. (చూశారా!) నా ప్రతీకారం (శిక్ష) ఎలా ఉండిందో
ఏమీ? ఆయన (అల్లాహ్), ప్రతి వ్యక్తి అర్జించే దానిని కనిపెట్టుకొని ఉండేవాడు (మరియు లాభనష్టాలు కలుగజేయలేని మీ బూటకపు దైవాలు సరిసమానులా)? అయినా వారు అల్లాహ్ కు భాగస్వాములు (సాటి) కల్పిస్తారు. వారితో ఇలా అను: (నిజంగానే వారు అల్లాహ్ స్వయంగా నియమించుకున్న భాగస్వాములే అయితే) వారి పేర్లను తెలుపండి! లేక భూమిలో ఉన్నట్లు ఆయనకు తెలియని విషయాన్ని మీరు ఆయనకు తెలుపుతున్నారా? లేక మీరు ఇట్లే నోటికి వచ్చినట్లు వాగుతున్నారా? వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారికి, వారి కుట్ర ఆకర్షణీయంగా చేయబడుతోంది. మరియు వారు ఋజుమార్గం నుండి నిరోధించచబడ్డారు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలిన వానికి సన్మార్గం చూపేవాడు ఎవ్వడూ ఉండడు
దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గపు ఉదాహరణ ఇదే! దాని క్రింద సెలయేళ్ళు పారుతూ ఉంటాయి. దాని ఫలాలు మరియు నీడ సదా ఉంటాయి. దైవభీతి గలవారి అంతిమ ఫలితం ఇదే. మరియు సత్యతిరస్కారుల అంతిమ ఫలితం నరకాగ్నియే
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.