Attalaaqu marrataani fa imsaakum bima`roofin aw tasreehum bi ihsaan; wa laa yahillu lakum an taakhuzoo mimmaaa aataitumoohunna shai`an illaaa ai yakhaafaaa alla yuqeemaa hudoodallahi fa in khiftum allaa yuqeemaa budoodal laahi falaa junaaha `Alaihimaa feemaf tadat bihee tilka hudoodul laahi falaa ta`tadoohaa; wa mai yata`adda hudoodal laahi fa ulaaa`ika humuzzaa limoon
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
విడాకులు రెండు సార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగనంపాలి. మరియు సాగనంపేటప్పుడు మీరు వారికిచ్చిన వాటి నుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహారమిచ్చి (విడాకులు / ఖులా తీసుకంటే) అందులో వారికి ఎలాంటి దోషం లేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించకండి. మరియు ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటి వారే దుర్మార్గులు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
तलाक़ रजअई जिसके बाद रुजू हो सकती है दो ही मरतबा है उसके बाद या तो शरीयत के मवाफिक़ रोक ही लेना चाहिए या हुस्न सुलूक से (तीसरी दफ़ा) बिल्कुल रूख़सत और तुम को ये जायज़ नहीं कि जो कुछ तुम उन्हें दे चुके हो उस में से फिर कुछ वापस लो मगर जब दोनों को इसका ख़ौफ़ हो कि ख़ुदा ने जो हदें मुक़र्रर कर दी हैं उन को दोनो मिया बीवी क़ायम न रख सकेंगे फिर अगर तुम्हे (ऐ मुसलमानो) ये ख़ौफ़ हो कि यह दोनो ख़ुदा की मुकर्रर की हुई हदो पर क़ायम न रहेंगे तो अगर औरत मर्द को कुछ देकर अपना पीछा छुड़ाए (खुला कराए) तो इसमें उन दोनों पर कुछ गुनाह नहीं है ये ख़ुदा की मुक़र्रर की हुई हदें हैं बस उन से आगे न बढ़ो और जो ख़ुदा की मुक़र्रर की हुईहदों से आगे बढ़ते हैं वह ही लोग तो ज़ालिम हैं
الطَّلَاقُ (అత్-తలాఖ్): వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయడం; భార్యను విడిచిపెట్టడం.
مَرَّتَانِ (మర్రతాని): రెండుసార్లు.
فَإِمْسَاكٌ (ఫ ఇమ్సాకున్): అప్పుడు భార్యను తన దగ్గర ఉంచుకోవడం, తిరిగి కలుపుకోవడం.
بِمَعْرُوفٍ (బి మఅరూఫిన్): మంచి పద్ధతిలో, ధర్మశాస్త్రం నిర్దేశించిన విధంగా, ఆమె హక్కులు నెరవేర్చుతూ.
تَسْرِيحٌ (తస్రీహున్): విడిచిపెట్టడం, వదిలేయడం.
بِإِحْسَانٍ (బి ఇహ్సానిన్): మంచితనంతో, ఆమె హక్కులు తీర్చి, గౌరవంగా పంపివేయడం.
يَحِلُّ (యహిల్లు): ధర్మసమ్మతం అవడం, అనుమతించబడటం.
آتَيْتُمُوهُنَّ (ఆతైతుమూహున్న): మీరు వారికి ఇచ్చినది (మహర్ మొదలైనవి).
يَخَافَا (యఖాఫా): వారిద్దరూ భయపడటం.
حُدُودَ اللَّهِ (హుదూదల్లాహ్): అల్లాహ్ నిర్ణయించిన హద్దులు, ధర్మశాసనాలు.
جُنَاحَ (జునాహ): పాపం, దోషం.
افْتَدَتْ (ఇఫ్తదత్): ఆమె తనను తాను విడిపించుకోవడానికి ధనం ఇవ్వడం (ఖుల్అ).
تَعْتَدُوهَا (తఅ్తదూహా): వాటిని ఉల్లంఘించడం, మించిపోవడం.
الظَّالِمُونَ (అజ్-జాలిమూన్): అన్యాయం చేసుకునేవారు, తమకు తామే నష్టం కలిగించుకునేవారు.
ఆయత్ వ్యాఖ్యానం:
విడాకుల విషయంలో అల్లాహ్ తన దాసులకు మార్గదర్శకత్వం ఇస్తున్నాడు. భార్యను తిరిగి కలుపుకునే అధికారం భర్తకు ఉండే విడాకులు రెండుసార్లు మాత్రమే. అంటే మొదటి విడాకుల తర్వాత భర్త భార్యను తిరిగి కలుపుకోవచ్చు, రెండవ విడాకుల తర్వాత కూడా తిరిగి కలుపుకోవచ్చు. కానీ ప్రతిసారీ తిరిగి కలుపుకున్నప్పుడు, ఆమెతో మంచిగా, ధర్మశాస్త్రం నిర్దేశించిన విధంగా, ఆమె హక్కులు నెరవేర్చుతూ జీవించాలి. లేదా ఆమెను గౌరవంగా, మంచితనంతో, ఆమె హక్కులు తీర్చి విడిచిపెట్టాలి. విడాకుల తర్వాత ఆమెను అవమానించడం, ఆమెకు చెడు పేరు తెచ్చడం ధర్మసమ్మతం కాదు.
ఓ భర్తలారా! మీరు మీ భార్యలకు మహర్ రూపంలో ఇచ్చిన ధనం లేదా ఇతర వస్తువులలో ఏదైనా తిరిగి తీసుకోవడం మీకు ధర్మసమ్మతం కాదు. అయితే ఒక పరిస్థితి మాత్రం మినహాయింపు: భార్యాభర్తలిద్దరూ తమ మధ్య ఉన్న వివాహ బాధ్యతలను, హక్కులను పాటించలేమని భయపడినప్పుడు — అంటే భార్య భర్త స్వభావం లేదా రూపం వల్ల అతన్ని అసహ్యించుకుని, ఇద్దరూ కలిసి జీవించడం అసాధ్యమని భావించినప్పుడు — వారు ఈ విషయాన్ని బంధువులకు లేదా విశ్వసనీయులకు తెలియజేయాలి. ఆ మధ్యవర్తులు కూడా ఈ దంపతులు అల్లాహ్ నిర్ణయించిన హద్దులను పాటించ
విడాకులు రెండు సార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగనంపాలి. మరియు సాగనంపేటప్పుడు మీరు వారికిచ్చిన వాటి నుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహారమిచ్చి (విడాకులు / ఖులా తీసుకంటే) అందులో వారికి ఎలాంటి దోషం లేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించకండి. మరియు ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటి వారే దుర్మార్గులు
మరియు విడాకులివ్వబడిన స్త్రీలు మూడు ఋతువుల వరకు (మరొకతనితో పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి. మరియు వారు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసమున్నవారే అయితే, అల్లాహ్ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచటం వారికి ధర్మసమ్మతం కాదు. మరియు వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకోవటానికి సిద్ధంగా ఉంటే! ఈ నిరీక్షణ కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మరియు వారికి (స్త్రీలకు) వారి (భర్తల)పై ధర్మసమ్మతమైన హక్కులున్నాయి. ఏ విధంగానైతే వారికి (భర్తలకు) వారిపై ఉన్నాయో. కాని పురుషులకు స్త్రీలపై (కర్తవ్య) ఆధిక్యత ఉంది. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు
విడాకులు రెండు సార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగనంపాలి. మరియు సాగనంపేటప్పుడు మీరు వారికిచ్చిన వాటి నుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహారమిచ్చి (విడాకులు / ఖులా తీసుకంటే) అందులో వారికి ఎలాంటి దోషం లేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించకండి. మరియు ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటి వారే దుర్మార్గులు
ఒకవేళ అతడు (మూడవసారి) విడాకులిస్తే, ఆ తర్వాత ఆ స్త్రీ అతనికి ధర్మసమ్మతం కాదు, ఆమె వివాహం వేరే పురుషునితో జరిగితే తప్ప! ఒకవేళ అతడు (రెండవ భర్త) ఆమెకు విడాకులిస్తే! అప్పుడు ఉభయులూ (మొదటి భర్త, ఈ స్త్రీ) తాము అల్లాహ్ హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే వారు పునర్వివాహం చేసుకోవటంలో దోషం లేదు మరియు ఇవి అల్లాహ్ నియమించిన హద్దులు. వీటిని ఆయన గ్రహించే వారికి స్పష్టపరుస్తున్నాడు
మరియు మీరు స్త్రీలకు విడాకులిచ్చినప్పుడు, వారి కొరకు నిర్ణయించబడిన గడువు (ఇద్దత్) సమీపిస్తే వారిని సహృదయంతో మీ వద్ద ఉంచుకోండి, లేదా సహృదయంతో విడిచి పెట్టండి. కేవలం వారికి బాధ కలిగించే మరియు పీడించే ఉద్దేశ్యంతో వారిని ఉంచుకోకండి మరియు ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకన్నట్లు. మరియు అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకోకండి. మరియు అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని మరియు మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు వివేకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన (అల్లాహ్) మీకు ఈ విధంగా బోధిస్తున్నాడు. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసని తెలుసుకోండి
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.