PDF —
55 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-ఖమర్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-ఖమర్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ఖమర్ అనువాదం. సూరా అల్-ఖమర్ (Meccan) 55 వచనం.



55 వచనం · Meccan · తెలుగు
bismillah
ﮬﮭﮮﮯﮰ
54:1 ఆ ఘడియ దగ్గరకు వచ్చింది మరియు చంద్రుడు పూర్తిగా చీలిపోయాడు
ﮱﯓﯔﯕﯖﯗﯘﯙ
54:2 అయినా (సత్యతిరస్కారులు), అద్భుత సూచనను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటున్నారు. మరియు: ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న మంత్రజాలమే." అని అంటున్నారు
ﯚﯛﯜﯝﯞﯟﯠﯡ
54:3 మరియు వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని తిరస్కరించారు. మరియు తమ మనోవాంఛలను అనుసరించారు. మరియు ప్రతి వ్యవహారం ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది
ﯢﯣﯤﯥﯦﯧﯨﯩ
54:4 మరియు వాస్తవానికి, వారి వద్దకు సమాచారాలు వచ్చాయి. అందు వారికి మందలింపులు ఉండేవి
ﯪﯫﯬﯭﯮﯯﯰ
54:5 కావలసినంత వివేకమూ ఉండేది. కాని ఆ హెచ్చరికలు వారికి ప్రయోజనకరం కాలేదు
ﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺ
54:6 కావున (ఓ ముహమ్మద్!) నీవు వారి నుండి మరలిపో! పిలిచేవాడు భయంకరమైన ఒక విషయం వైపునకు పిలిచే రోజున
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙ
54:7 వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, వారు చెల్లాచెదురైన మిడతల వలే, తమ గోరీల నుండి లేచి బయటికి వస్తారు
ﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣ
54:8 వేగంగా పిలిచేవాని వైపునకు! సత్యతిరస్కారులు: ఇది చాలా కఠినమైన రోజు." అని అంటారు
ﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮ
54:9 వారికి పూర్వం నూహ్ జాతి వారు (తమ ప్రవక్తను) అసత్యవాదుడని తిరస్కరించి ఉన్నారు, అప్పుడు వారు మా దాసుణ్ణి: అసత్యవాది!" అని అన్నారు. మరియు : ఇతడు పిచ్చివాడు" అని అన్నారు. మరియు అతను కసిరికొట్టబడ్డాడు
ﭯﭰﭱﭲﭳﭴ
54:10 అప్పుడతను తన ప్రభువును ఇలా ప్రార్థించాడు: నిశ్చయంగా నేను ఓడిపోయాను కావున నాకు సహాయం చేయి
ﭵﭶﭷﭸﭹﭺ
54:11 అప్పుడు మేము ఆకాశపు ద్వారాలు తెరిచి కుంభవర్షాన్ని కురిపించాము
ﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄ
54:12 మరియు భూమి నుండి ఊటలను పొంగింపజేశాము అపుడు నిర్ణీత కార్యానికి గాను నీళ్ళన్నీ కలిసి పోయాయి
ﮅﮆﮇﮈﮉﮊ
54:13 మరియు మేము అతనిని (నూహ్ ను) పలకలు మరియు మేకులు గల దాని (ఓడపై) ఎక్కించాము
ﮋﮌﮍﮎﮏﮐﮑ
54:14 అది మా కన్నుల ముందు తేలియాడుతూ పోయింది. (తన జాతి వారి చేత) తిరస్కరించబడిన వానికి ప్రతిఫలంగా
ﮒﮓﮔﮕﮖﮗﮘ
54:15 మరియు వాస్తవానికి మేము దానిని (ఆ ఓడను) ఒక సూచనగా చేసి వదలి పెట్టాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా
ﮙﮚﮛﮜﮝ
54:16 చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో
ﮞﮟﮠﮡﮢﮣﮤﮥ
54:17 మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము. అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా
ﮦﮧﮨﮩﮪﮫﮬ
54:18 ఆద్ జాతి సత్యాన్ని తిరస్కరించింది. చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో
ﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗ
54:19 నిశ్చయంగా, మేము పూర్తిగా దురదృష్టకరమైన (అరిష్టదాయకమైన) ఒక రోజున, తీవ్రమైన ఎడతెగని తుఫాను గాలిని పంపాము
ﯘﯙﯚﯛﯜﯝﯞ
54:20 అది ప్రజలను వేర్లతో పెళ్ళగింపబడిన ఖర్జూరపు చెట్ల వలే పెళ్ళగించి వేసింది
ﯟﯠﯡﯢﯣ
54:21 ఇక చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో
ﯤﯥﯦﯧﯨﯩﯪﯫ
54:22 మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము, అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా
ﯬﯭﯮﯯ
54:23 సమూద్ జాతి హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది
ﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺ
54:24 అప్పుడు వారు ఇలా అన్నారు: ఏమీ? మాలోని ఒక వ్యక్తిని, ఒంటరివాడిని, మేము అనుసరించాలా? అలా అయితే నిశ్చయంగా, మేము మార్గభ్రష్టులం మరియు పిచ్చివారం అయినట్లే కదా
ﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄ
54:25 ఏమీ? మా అందరిలో, కేవలం అతని మీదనే (దివ్య) సందేశం పంపబడిందా? అలా కాదు! అసలు అతను అసత్యవాది, డంబాలు పలికేవాడు
ﰅﰆﰇﰈﰉﰊ
54:26 అసత్యవాది, డంబాలు పలికేవాడు! ఎవడో రేపే (త్వరలోనే) వారికి తెలిసిపోతుంది
ﰋﰌﰍﰎﰏﰐﰑﰒ
54:27 నిశ్చయంగా, మేము ఆడ ఒంటెను, వారిని పరీక్షించటం కోసం పంపుతున్నాము, కావున (ఓ సాలిహ్!) వారి విషయంలో వేచి ఉండు మరియు సహనం వహించు
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚ
54:28 మరియు వారి మధ్య నీరు (న్యాయంగా) పంచబడాలని వారికి బోధించు. ప్రతి ఒక్కరూ తమ వంతు వచ్చే రోజునే త్రాగాలని నియమించబడింది
ﭛﭜﭝﭞﭟ
54:29 ఆ పిదప వారు తమ సహచరుణ్ణి పిలిచారు. వాడు దాన్ని పట్టుకొని (దాని వెనుక కాలి మోకాలి నరాలు కోసి) చంపాడు
ﭠﭡﭢﭣﭤ
54:30 అప్పుడు చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో
ﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭ
54:31 నిశ్చయంగా, మేము వారి మీదకు ఒక భయంకరమైన శబ్దాన్ని (సయ్ హాను) పంపాము, దాంతో వారు త్రొక్క బడిన పశువుల దొడ్డి కంచె వలే నుగ్గునుగ్గు అయి పోయారు
ﭮﭯﭰﭱﭲﭳﭴﭵ
54:32 మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటానికి సులభం చేశాము. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా
ﭶﭷﭸﭹﭺ
54:33 లూత్ జాతి కూడా హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది
ﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅ
54:34 నిశ్చయంగా, మేము లూత్ ఇంటివారు తప్ప! ఇతరుల మీదికి రాళ్ళు విసిరే తుఫాన్ గాలిని పంపాము. (లూత్ ఇంటి) వారిని మేము వేకువ ఝామున రక్షించాము
ﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎ
54:35 మా తరఫు నుండి అనుగ్రహంగా. ఈ విధంగా మేము కృతజ్ఞులకు ప్రతిఫలం ఇస్తాము
ﮏﮐﮑﮒﮓﮔ
54:36 మరియు వాస్తవానికి (లూత్ తన జాతి) వారిని మా రాబోయే శిక్షను గురించి హెచ్చరించాడు. కాని వారు మా హెచ్చరికలను సందేహించి (మొండి) వాదనలకు దిగారు
ﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞ
54:37 మరియు వాస్తవానికి వారు అతని అతిథులను అతని నుండి బలవంతంగా లాక్కోవాలని అనుకున్నారు. కావున మేము వారి కళ్ళను పోగొట్టాము. (వారితో ఇలా అన్నాము): ఇప్పుడు నా శిక్షను మరియు నా హెచ్చరికను చవి చూడండి
ﮟﮠﮡﮢﮣﮤ
54:38 మరియు వాస్తవానికి, ఉదయపు వేళ శాశ్వతమైన శిక్ష వారి మీద పడింది
ﮥﮦﮧﮨ
54:39 ఇప్పుడు మీరు నా శిక్షను మరియు నా హెచ్చరికలను చవి చూడండి
ﮩﮪﮫﮬﮭﮮﮯﮰ
54:40 మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటానికి సులభం చేశాము. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా
ﮱﯓﯔﯕﯖﯗ
54:41 మరియు వాస్తవానికి ఫిర్ఔన్ జాతి వారికి కూడా హెచ్చరికలు వచ్చాయి
ﯘﯙﯚﯛﯜﯝﯞﯟ
54:42 వారు మా సూచనలను అన్నిటినీ అబద్ధాలని తిరస్కరించారు, కావున మేము వారిని పట్టుకున్నాము, సర్వశక్తిమంతుడు సర్వసమర్ధుడు పట్టుకునే విధంగా
ﯠﯡﯢﯣﯤﯦﯧﯨﯩﯪ
54:43 (ఓ ఖురేషులారా!) ఏమీ? మీ సత్యతిరస్కారులు మీకు పూర్వం గడిచిన వారి కంటే శ్రేష్ఠులా? లేక దివ్యగ్రంథాలలో మీ కొరకు (మా శిక్ష నుండి) ఏదైనా మినహాయింపు వ్రాయబడి ఉందా
ﯫﯬﯭﯮﯯﯰ
54:44 లేక వారు: మాది ఒక శక్తిగల వర్గం, (కావున) మేము ప్రాబల్యం పొందగలం" అని అంటున్నారా
ﯱﯲﯳﯴﯵ
54:45 కాని త్వరలోనే ఈ శక్తిగల వర్గం పరాజయం పొందగలదు. మరియు వారు వెన్నుచూపి పారిపోతారు
ﯶﯷﯸﯹﯺﯻﯼ
54:46 అంతేకాదు! అంతిమ ఘడియయే, వారి వాగ్దాన సమయం మరియు ఆ ఘడియ ఎంతో దారుణమైనది మరియు ఎంతో తీవ్రమైనదీను (చేదైనదీను)
ﯽﯾﯿﰀﰁﰂ
54:47 నిశ్చయంగా, పాపాత్ములు మార్గభ్రష్టత్వంలో ఉన్నారు మరియు వారు (పరలోకంలో) నరకాగ్నిలో కాలుతారు
ﰃﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌ
54:48 ఆ రోజు వారు తమ ముఖాల మీద నరకాగ్ని లోకి ఈడ్చబడతారు; (వారితో):"నరకాగ్ని స్పర్శను చవి చూడండి!" అని అనబడుతుంది
ﰍﰎﰏﰐﰑﰒ
54:49 నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్) తో సృష్టించాము
ﭑﭒﭓﭔﭕﭖﭗ
54:50 మరియు మా ఆజ్ఞ కేవలం ఒక్కటే చాలు, కనురెప్పపాటుది, (అది అయిపోతుంది)
ﭘﭙﭚﭛﭜﭝﭞ
54:51 మరియు వాస్తవానికి, మేము మీ వంటి వారిని, ఎందరినో నాశనం చేశాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా
ﭟﭠﭡﭢﭣﭤ
54:52 మరియు వారు చేసిన ప్రతి విషయం వారి కర్మ గ్రంథాలలో (చిట్టాలలో) వ్రాయబడి ఉంది
ﭥﭦﭧﭨﭩ
54:53 మరియు ప్రతి చిన్న మరియు ప్రతి పెద్ద విషయం అన్నీ వ్రాయబడి ఉన్నాయి
ﭪﭫﭬﭭﭮﭯ
54:54 నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో సెలయేళ్ళ దగ్గర ఉంటారు
ﭰﭱﭲﭳﭴﭵﭶ
54:55 సత్యపీఠం మీద, విశ్వసామ్రాట్టు, సర్వసమర్ధుని సన్నిధిలో

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers