Falammaa fasala Taalootu biljunoodi qaala innal laaha mubtaleekum binaharin faman shariba minhu falaisa minnee wa mallam yat`amhu fa innahoo minneee illaa manigh tarafa ghurfatam biyadih; fashariboo minhu illaa qaleelamminhum; falammaa jaawazahoo huwa wallazeena aamanoo ma`ahoo qaaloo laa taaqata lanal yawma bi Jaaloota wa junoodih; qaalallazeena yazunnoona annahum mulaaqul laahi kam min fi`atin qaleelatin ghalabat fi`atan kaseeratam bi iznil laah; wallaahuma`as saabireen
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఆ పిదప `తాలూత్ (సౌల్) తన సైన్యంతో బయలు దేరుతూ అన్నాడు: నిశ్చయంగా, అల్లాహ్ ఒక నది ద్వారా మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. దాని నుండి నీరు త్రాగిన వాడు నా వాడు కాడు. మరియు నది నీటిని రుచి చూడని వాడు నిశ్చయంగా నా వాడు, కాని చేతితో గుక్కెడు త్రాగితే పర్వాలేదు." అయితే వారిలో కొందరు తప్ప అందరూ దాని నుండి (కడుపు నిండా నీరు) త్రాగారు. అతను మరియు అతని వెంట విశ్వాసులు ఆ నదిని దాటిన తరువాత వారన్నారు: జాలూత్ తో మరియు అతని సైన్యంతో పోరాడే శక్తి ఈరోజు మాలో లేదు." (కానీ ఒక రోజున) అల్లాహ్ ను కలవడం తప్పదని భావించిన వారన్నారు: అల్లాహ్ అనుమతితో, ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని జయించటం ఎన్నో సార్లు జరిగింది. మరియు అల్లాహ్ స్థైర్యం గలవారితోనే ఉంటాడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
फिर जब तालूत लशकर समैत (शहर ऐलिया से) रवाना हुआ तो अपने साथियों से कहा देखो आगे एक नहर मिलेगी इस से यक़ीनन ख़ुदा तुम्हारे सब्र की आज़माइश करेगा पस जो शख्स उस का पानी पीयेगा मुझे (कुछ वास्ता) नही रखता और जो उस को नही चखेगा वह बेशक मुझ से होगा मगर हाँ जो अपने हाथ से एक (आधा चुल्लू भर के पी) ले तो कुछ हर्ज नही पस उन लोगों ने न माना और चन्द आदमियों के सिवा सब ने उस का पानी पिया ख़ैर जब तालूत और जो मोमिनीन उन के साथ थे नहर से पास हो गए तो (ख़ास मोमिनों के सिवा) सब के सब कहने लगे कि हम में तो आज भी जालूत और उसकी फौज से लड़ने की सकत नहीं मगर वह लोग जिनको यक़ीन है कि एक दिन ख़ुदा को मुँह दिखाना है बेधड़क बोल उठे कि ऐसा बहुत हुआ कि ख़ुदा के हुक्म से छोटी जमाअत बड़ी जमाअत पर ग़ालिब आ गयी है और ख़ुदा सब्र करने वालों का साथी है
يَطْعَمْهُ (యత్అమ్హు): దానిని రుచి చూడడం, తినడం/త్రాగడం.
اغْتَرَفَ غُرْفَةً (ఇగ్తరఫ గుర్ఫతన్): చేతితో ఒక పిడికెడు తీసుకోవడం.
جَاوَزَهُ (జావజహు): దానిని దాటాడు.
طَاقَةَ (తాఖత): శక్తి, సామర్థ్యం.
فِئَةٍ (ఫిఅతిన్): సమూహం, గుంపు, బృందం.
بِإِذْنِ اللَّهِ (బి ఇద్నిల్లాహ్): అల్లాహ్ అనుమతితో, అల్లాహ్ ఆదేశంతో.
ఆయత్ వ్యాఖ్యానం:
తాలూత్ తన సైన్యంతో యుద్ధానికి బయలుదేరినప్పుడు, వారికి ఇలా చెప్పాడు: "నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని ఒక నది ద్వారా పరీక్షిస్తాడు. ఎవరు దాని నీటిని త్రాగుతారో, వారు నా అనుచరులు కారు, నా మార్గంలో లేరు. ఎవరు దానిని రుచి చూడకుండా ఉంటారో, వారే నా అనుచరులు, నాతో పాటు యుద్ధానికి అర్హులు. అయితే ఎవరైనా తీవ్రమైన దాహంతో తన చేతితో ఒకే ఒక పిడికెడు నీటిని తీసుకుని త్రాగితే, అతనిపై ఎటువంటి దోషం లేదు."
కానీ వారిలో కొద్దిమంది మాత్రమే సహనం వహించారు; మిగిలిన వారందరూ ఆ నది నీటిని విపరీతంగా త్రాగేశారు. తాలూత్ మరియు అతనితో పాటు ఉన్న విశ్వాసులు ఆ నదిని దాటినప్పుడు, కొందరు (బలహీన విశ్వాసులు) ఇలా అన్నారు: "ఈ రోజు జాలూత్ మరియు అతని సైన్యంతో పోరాడే శక్తి మాకు లేదు." అప్పుడు అల్లాహ్ను కలవడాన్ని దృఢంగా నమ్మిన విశ్వాసులు ఇలా అన్నారు: "ఎన్నో సార్లు కొద్దిమంది విశ్వాసుల సమూహం, అల్లాహ్ అనుమతితో పెద్ద సంఖ్యలో ఉన్న సమూహాన్ని ఓడించింది. విజయం సంఖ్యాబలంలో లేదు, విశ్వాసం మరియు సహనంలో ఉంది. అల్లాహ్ సహనం వహించేవారితో పాటు ఉంటాడు, వారికి సహాయం చేస్తాడు."
ఈ ఆయత్ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే: అల్లాహ్ తన దాసులను వివిధ పరీక్షల ద్వారా పరీక్షిస్తాడు. ఈ పరీక్షలు నిజమైన విశ్వాసులను, బలహీనులను, కపటులను వేరు చేయడానికి ఉపయోగపడతాయి. ఆజ్ఞాపాలన, సహనం, దృఢ విశ్వాసం ఉన్నవారే విజయం సాధిస్తారు. సంఖ్యాబలం తక్కువగా ఉన్నా, అల్లాహ్ సహాయంతో విజయం సాధ్యమే. అల్లాహ్ ఎల్లప్పుడూ సహనం వహించేవారితో ఉంటాడు.
ఈ ఆయత్ నుండి ప్రజలను ఇస్లాం వైపు ఆకర్షించే మరియు ఖుర్ఆన్పై ప్రేమ కలిగించే ప్రయోజనాలు:
అల్లాహ్ పరీక్షలు ప్రేమతోనే చేస్తాడు: అల్లాహ్ తన దాసులను పరీక్షించడం వారిని శిక్షించడానికి కాద
ఆ పిదప `తాలూత్ (సౌల్) తన సైన్యంతో బయలు దేరుతూ అన్నాడు: నిశ్చయంగా, అల్లాహ్ ఒక నది ద్వారా మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. దాని నుండి నీరు త్రాగిన వాడు నా వాడు కాడు. మరియు నది నీటిని రుచి చూడని వాడు నిశ్చయంగా నా వాడు, కాని చేతితో గుక్కెడు త్రాగితే పర్వాలేదు." అయితే వారిలో కొందరు తప్ప అందరూ దాని నుండి (కడుపు నిండా నీరు) త్రాగారు. అతను మరియు అతని వెంట విశ్వాసులు ఆ నదిని దాటిన తరువాత వారన్నారు: జాలూత్ తో మరియు అతని సైన్యంతో పోరాడే శక్తి ఈరోజు మాలో లేదు." (కానీ ఒక రోజున) అల్లాహ్ ను కలవడం తప్పదని భావించిన వారన్నారు: అల్లాహ్ అనుమతితో, ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని జయించటం ఎన్నో సార్లు జరిగింది. మరియు అల్లాహ్ స్థైర్యం గలవారితోనే ఉంటాడు
మరియు వారి ప్రవక్త (సామ్యూల్) వారితో: నిశ్చయంగా, అల్లాహ్ మీ కొరకు `తాలూత్ ను (సౌల్ ను) రాజుగా నియమించాడు." అని అన్నాడు. దానికి వారు అన్నారు: మాపై రాజ్యం చేసే హక్కు అతనికి ఎలా సంక్రమిస్తుంది? వాస్తవానికి, రాజ్యం చేసే హక్కు, అతని కంటే ఎక్కువ, మాకే ఉంది. మరియు అతను అత్యధిక ధనసంపత్తులున్న వాడునూ కాడు." (దానికి వారి ప్రవక్త) అన్నాడు: నిశ్చయంగా, అల్లాహ్ మీలో అతనిని ఎన్నుకొని అతనికి బుద్ధిబలాన్నీ, శారీరక బలాన్నీ సమృద్ధిగా ప్రసాదించాడు. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి తన రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు
మరియు వారితో వారి ప్రవక్త (సామ్యూల్) ఇలా అన్నాడు: నిశ్చయంగా, అతని ఆధిపత్యానికి లక్షణం ఏమిటంటే, అతని ప్రభుత్వకాలంలో ఆ పెట్టె (తాబూత్) మీకు తిరిగి లభిస్తుంది. అందులో మీకు మీ ప్రభువు తరఫు నుండి, మనశ్శాంతి లభిస్తుంది. మరియు అందులో మూసా సంతతి మరియు హారూన్ సంతతి వారు వదలి వెళ్ళిన పవిత్ర అవశేషాలు, దేవదూతల ద్వారా మీకు లభిస్తాయి. మీరు విశ్వసించిన వారే అయితే! నిశ్చయంగా, ఇందులో మీకు ఒక గొప్ప సూచన ఉంది
ఆ పిదప `తాలూత్ (సౌల్) తన సైన్యంతో బయలు దేరుతూ అన్నాడు: నిశ్చయంగా, అల్లాహ్ ఒక నది ద్వారా మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. దాని నుండి నీరు త్రాగిన వాడు నా వాడు కాడు. మరియు నది నీటిని రుచి చూడని వాడు నిశ్చయంగా నా వాడు, కాని చేతితో గుక్కెడు త్రాగితే పర్వాలేదు." అయితే వారిలో కొందరు తప్ప అందరూ దాని నుండి (కడుపు నిండా నీరు) త్రాగారు. అతను మరియు అతని వెంట విశ్వాసులు ఆ నదిని దాటిన తరువాత వారన్నారు: జాలూత్ తో మరియు అతని సైన్యంతో పోరాడే శక్తి ఈరోజు మాలో లేదు." (కానీ ఒక రోజున) అల్లాహ్ ను కలవడం తప్పదని భావించిన వారన్నారు: అల్లాహ్ అనుమతితో, ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని జయించటం ఎన్నో సార్లు జరిగింది. మరియు అల్లాహ్ స్థైర్యం గలవారితోనే ఉంటాడు
జాలూత్ (గోలియత్) మరియు అతని సైన్యాన్ని ఎదుర్కొనటానికి బయలు దేరి, వారు: ఓ మా ప్రభూ! మాకు (ధైర్య) స్థైర్యాలను ప్రసాదించు, మా పాదాలను స్థిరంగా నిలపు. మరియు సత్యతిరస్కారులకు విరుద్ధంగా (పోరాడటానికి) మాకు సహాయపడు." అని ప్రార్థించారు
ఆ తరువాత వారు, అల్లాహ్ అనుమతితో వారిని (సత్యతిరస్కారులను) ఓడించారు. మరియు దావూద్, జాలూత్ ను సంహరించాడు మరియు అల్లాహ్ అతనికి (దావూద్ కు) రాజ్యాధికారం మరియు జ్ఞానం ప్రసాదించి, తాను కోరిన విషయాలను అతనికి బోధించాడు. ఈ విధంగా అల్లాహ్ ప్రజలను, ఒకరి నుండి మరొకరిని కాపాడకుంటే, భూమిలో కల్లోలం వ్యాపించి ఉండేది. కానీ అల్లాహ్ సమస్త లోకాల మీద ఎంతో అనుగ్రహం గలవాడు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.