PDF —
31 వచనం Medinan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-ఇన్సాన్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-ఇన్సాన్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ఇన్సాన్ అనువాదం. సూరా అల్-ఇన్సాన్ (Medinan) 31 వచనం.



31 వచనం · Medinan · తెలుగు
bismillah
ﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧ
76:1 అనంత కాలచక్రంలో, మానవుడు తాను చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉన్న సమయం గడవలేదా
ﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲ
76:2 నిశ్చయంగా, మేము మానవుణ్ణి ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము. అతనిని పరీక్షించటానికి, మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము
ﯳﯴﯵﯶﯷﯸﯹﯺ
76:3 నిశ్చయంగా, మేము అతనికి మార్గం చూపాము. ఇక అతడు కృతజ్ఞుడు కావచ్చు, లేదా కృతఘ్నుడూ కావచ్చు
ﯻﯼﯽﯾﯿﰀﰁ
76:4 నిశ్చయంగా, మేము సత్యతిరస్కారుల కొరకు సంకెళ్ళను, మెడలో పట్టాలను మరియు భగభగ మండే నరకాగ్నిని (సఈరానుసిద్ధపరచి ఉంటాము)
ﰂﰃﰄﰅﰆﰇﰈﰉﰊ
76:5 నిశ్చయంగా, పుణ్యాత్ములు కాఫూర్ అనే ఒక చెలమ నుండి ఒక గిన్నెలో తెచ్చిన (పానీయాన్ని) త్రాగుతారు
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘ
76:6 ధారాళంగా పొంగి ప్రవహింప జేయబడే ఊటల నుండి, అల్లాహ్ దాసులు త్రాగుతూ ఉంటారు
ﭙﭚﭛﭜﭝﭞﭟﭠ
76:7 వారు తమ మొక్కుబడులను పూర్తి చేసుకున్నవారై ఉంటారు. మరియు దాని హాని అన్ని వైపులా క్రమ్ముకొనే, ఆ దినమును గురించి భయపడుతూ ఉంటారు
ﭡﭢﭣﭤﭥﭦﭧﭨ
76:8 మరియు అది తమకు ప్రీతికరమైనప్పటికీ వారు నిరుపేదలకు మరియు అనాథలకు మరియు ఖైదీలకు, ఆహారం పెట్టేవారై ఉంటారు
ﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳ
76:9 వార (వారితో ఇలా అంటారు): వాస్తవానికి మేము అల్లాహ్ ప్రసన్నత కొరకే మీకు ఆహారం పెడుతున్నాము. మేము మీ నుండి ఎలాంటి ప్రతిఫలం గానీ, లేదా కృతజ్ఞతలు గానీ ఆశించటం లేదు
ﭴﭵﭶﭷﭸﭹﭺﭻ
76:10 నిశ్చయంగా, మేము మా ప్రభువు నుండి వచ్చే ఉగ్రమైన, దుర్భరమైన, ఆ దినానికి భయపడుతున్నాము
ﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄ
76:11 కావున అల్లాహ్ వారిని ఆ దినపు కీడు నుండి కాపాడాడు. మరియు వారికి ఉల్లాసాన్ని మరియు ఆనందాన్ని ప్రసాదించాడు
ﮅﮆﮇﮈﮉﮊ
76:12 మరియు వారి సహనానికి ప్రతిఫలంగా వారికి స్వర్గాన్ని మరియు పట్టు వస్త్రాలను ఇచ్చాడు
ﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖ
76:13 అందులో, వారు ఎత్తైన పీఠాల మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. అందులో వారు ఎండ (బాధ) గానీ, చలి తీవ్రతను గానీ చూడరు
ﮗﮘﮙﮚﮛﮜﮝ
76:14 మరియు అందులో వారిపై నీడలు పడుతుంటాయి. దాని ఫలాల గుత్తులు వారికి అందుబాటులో ఉంటాయి
ﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦ
76:15 మరియు వారి మధ్య వెండి పాత్రలు మరియు గాజుగ్లాసులు త్రిప్ప బడుతూ ఉంటాయి
ﮧﮨﮩﮪﮫﮬ
76:16 ఆ గాజు గ్లాసులు స్ఫటికం వలే తెల్లవైన వెండితో చేయబడి ఉంటాయి. అవి నియమబద్ధాం నింపబడి ఉంటాయి
ﮭﮮﮯﮰﮱﯓﯔ
76:17 మరియు వారికి సొంటి కలిపిన మధుపాత్రలు త్రాగటానికి ఇవ్వబడతాయి
ﯕﯖﯗﯘﯙ
76:18 అది స్వర్గంలోని సల్ సబీల్ అనే పేరు గల ఒక ఊట
ﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤ
76:19 మరియు వారి మద్య శాశ్వతంగా, యవ్వనులుగా ఉంటే బాలురు తిరుగుతూ ఉంటారు. మరియు నీవు వారిని చూస్తే, వారిని వెదజల్లిన ముత్యాలుగా భావిస్తావు
ﯥﯦﯧﯨﯩﯪﯫﯬ
76:20 మరియు నీవు అక్కడ (స్వర్గంలో) చూస్తే, ఎక్కడ చూసినా ఆనందమే పొందుతావు. మరియు ఒక మహత్తర సామ్రాజ్య వైభవం కనిపిస్తుంది
ﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻ
76:21 వారి ఒంటి మీద సన్నని ఆకుపచ్చని శ్రేష్ఠమైన పట్టు వస్త్రాలు మరియు బంగారు జలతారు అల్లిన దుస్తులుంటాయి. మరియు వారికి వెండి కంకణాలు తొడిగించబడతాయి. మరియు వారి ప్రభువు వారికి నిర్మలమైన పానీయాన్ని త్రాగటానికి ప్రసాదిస్తాడు
ﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄ
76:22 (వారితో ఇలా అనబడుతుంది): నిశ్చయంగా, ఇది మీకు ఇవ్వబడే ప్రతిఫలం. ఎందుకంటే, మీ శ్రమ అంగీరించబడింది
ﰅﰆﰇﰈﰉﰊﰋ
76:23 నిశ్చయంగా, మేమే, ఈ ఖుర్ఆన్ ను, నీ పై (ఓ ముహమ్మద్!) క్రమక్రమంగా అవతరింపజేశాము
ﰌﰍﰎﰏﰐﰑﰒﰓﰔﰕ
76:24 కావున నీవు నీ ప్రభువు యొక్క ఆజ్ఞపై స్థిరంగా ఉండు మరియు వీరిలోని ఏ పాపి యొక్క లేదా సత్యతిరస్కారుని యొక్క మాట గాని వినకు
ﰖﰗﰘﰙﰚﰛ
76:25 మరియు నీ ప్రభువు నామాన్ని ఉదయం మరియు సాయంత్రం స్మరిస్తూ ఉండు
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘ
76:26 మరియు రాత్రివేళ ఆయన సన్నిధిలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉండు మరియు రాత్రివేళ సుదీర్ఘ కాలం, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు
ﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡ
76:27 నిశ్చయంగా, వీరు అనిశ్చితమైన ఈ ప్రాపంచిక జీవితం పట్ల మోహితులై వున్నారు. మరియు మున్ముందు రానున్న భారమైన దినాని విస్మరిస్తున్నారు
ﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬ
76:28 మేమే వీరిని సృష్టించినవారము మరియు వీరి శరీరాన్ని దృఢ పరిచిన వారము. మరియు మేము కోరినప్పుడు వీరికి బదులుగా వీరి వంటి వారిని తేగలము
ﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷ
76:29 నిశ్చయంగా, ఇదొక హితోపదేశం కావున ఇష్టపడినవాడు తన ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు
ﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄ
76:30 మరియు అల్లాహ్ కోరకపోతే, మీరు కోరేదీ (జరగదు)! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు
ﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐ
76:31 ఆయన తాను కోరినవారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. మరియు దుర్మార్గుల కొరకు ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers