PDF —
50 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అల్-ముర్సలాత్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అల్-ముర్సలాత్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అల్-ముర్సలాత్ అనువాదం. సూరా అల్-ముర్సలాత్ (Meccan) 50 వచనం.

← అల్-ఇన్సాన్సూరా అల్-ముర్సలాత్ అన్-నబా →


50 వచనం · Meccan · తెలుగు
bismillah
ﮑﮒﮓ
77:1 ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా
ﮔﮕﮖ
77:2 మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా
ﮗﮘﮙ
77:3 మరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా
ﮚﮛﮜ
77:4 మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా
ﮝﮞﮟ
77:5 సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా
ﮠﮡﮢﮣ
77:6 సాకుగా లేక హెచ్చరికగా
ﮤﮥﮦﮧ
77:7 నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది
ﮨﮩﮪﮫ
77:8 అప్పుడు ఎప్పడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో
ﮬﮭﮮﮯ
77:9 మరియు ఆకాశం చీలిపోతుందో
ﮰﮱﯓﯔ
77:10 మరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో
ﯕﯖﯗﯘ
77:11 మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో
ﯙﯚﯛﯜ
77:12 ఏ దినానికి గాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి
ﯝﯞﯟ
77:13 ఆ తీర్పుదినం కొరకా
ﯠﯡﯢﯣﯤﯥ
77:14 మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు
ﯦﯧﯨﯩ
77:15 ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది
ﯪﯫﯬﯭ
77:16 ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా
ﯮﯯﯰﯱ
77:17 తరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము
ﯲﯳﯴﯵ
77:18 ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము
ﯶﯷﯸﯹ
77:19 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
ﭑﭒﭓﭔﭕﭖ
77:20 ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా
ﭗﭘﭙﭚﭛ
77:21 తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము
ﭜﭝﭞﭟ
77:22 ఒక నిర్ణీత కాలం వరకు
ﭠﭡﭢﭣ
77:23 ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము
ﭤﭥﭦﭧ
77:24 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
ﭨﭩﭪﭫﭬ
77:25 ఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా
ﭭﭮﭯ
77:26 జీవులకూ మరియు మృతులకూను
ﭰﭱﭲﭳﭴﭵﭶﭷ
77:27 మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా
ﭸﭹﭺﭻ
77:28 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
ﭼﭽﭾﭿﮀﮁﮂ
77:29 (సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి
ﮃﮄﮅﮆﮇﮈﮉ
77:30 (దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి
ﮊﮋﮌﮍﮎﮏﮐ
77:31 కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు
ﮑﮒﮓﮔﮕ
77:32 వాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది
ﮖﮗﮘﮙ
77:33 వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి
ﮚﮛﮜﮝ
77:34 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
ﮞﮟﮠﮡﮢ
77:35 ఆ దినాన వారు మాట్లాడలేరు
ﮣﮤﮥﮦﮧ
77:36 మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు
ﮨﮩﮪﮫ
77:37 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
ﮬﮭﮮﮯﮰﮱﯓ
77:38 అది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము
ﯔﯕﯖﯗﯘﯙ
77:39 కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి
ﯚﯛﯜﯝ
77:40 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
ﯞﯟﯠﯡﯢﯣ
77:41 నిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు
ﯤﯥﯦﯧ
77:42 మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి
ﯨﯩﯪﯫﯬﯭﯮ
77:43 (వారితో ఇలా అనబడుతుంది): మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి
ﯯﯰﯱﯲﯳ
77:44 నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము
ﯴﯵﯶﯷ
77:45 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
ﯸﯹﯺﯻﯼﯽ
77:46 (ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు
ﯾﯿﰀﰁ
77:47 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
ﰂﰃﰄﰅﰆﰇﰈ
77:48 మరియు వారితో: (అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు
ﰉﰊﰋﰌ
77:49 ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
ﰍﰎﰏﰐﰑ
77:50 దీని (ఈ ఖుర్ఆన్) తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్నివిశ్వసిస్తారు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers