సూరా అన్-నాజిఆత్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)
సూరా అన్-నాజిఆత్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అన్-నాజిఆత్ అనువాదం. సూరా అన్-నాజిఆత్ (Meccan) 46 వచనం.
Related
- సూరా అన్-నాజిఆత్ అనువాదంతెలుగు
- సూరా అన్-నాజిఆత్ mp3వినండి
- Quran Index తెలుగు114
More సూరా PDF
సూరా అన్-నాజిఆత్

ﮢﮣﮤ
79:1
(అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసే వారి (దేవదూతల) సాక్షిగా
ﮥﮦﮧ
79:2
(విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవదూతల) సాక్షిగా
ﮨﮩﮪ
79:3
(విశ్వంలో) తేలియాడుతూ పోయే వారి సాక్షిగా
ﮫﮬﮭ
79:4
మరియు పందెంలో వలే (ఒకరితో నొకరు) పోటీ పడే వారి సాక్షిగా
ﮮﮯﮰ
79:5
మరియు (తమ ప్రభువు) ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించేవారి (దేవదూతల) సాక్షిగా
ﮱﯓﯔﯕ
79:6
ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది
ﯖﯗﯘ
79:7
దాని తర్వాత రెండవ సారి బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు)
ﯙﯚﯛﯜ
79:8
ఆ రోజు (కొన్ని) హృదయాలు (భయంతో) దడదడలాడుతూ ఉంటాయి
ﯝﯞﯟ
79:9
వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి
ﯠﯡﯢﯣﯤﯥ
79:10
వారు ఇలా అంటున్నారు: ఏమీ? మనం మన పూర్వ స్థితిలోకి మళ్ళీ తీసుకు రాబడతామా
ﯦﯧﯨﯩﯪ
79:11
మనం శిథిలమైన ఎముకలుగా మారి పోయిన తరువాత కూడానా
ﯫﯬﯭﯮﯯﯰ
79:12
వారు (ఇంకా ఇలా) అంటారు: అయితే ఈ తిరిగి రావటమనేది చాల నష్టదాయకమైనదే
ﯱﯲﯳﯴﯵ
79:13
కాని అది వాస్తవానికి, ఒకే ఒక (తీవ్రమైన) ధ్వని
ﯶﯷﯸﯹ
79:14
అప్పుడు వారందరూ, ఒకేసారి లేచి మైదానంలోకి వచ్చి ఉంటారు
ﯺﯻﯼﯽﯾ
79:15
ఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా
ﯿﰀﰁﰂﰃﰄﰅ
79:16
అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు
ﭑﭒﭓﭔﭕﭖ
79:17
(ఇలా అన్నాడు): ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు
ﭗﭘﭙﭚﭛﭜﭝ
79:18
ఇక (అతనితో) ఇట్లను: `ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా
ﭞﭟﭠﭡﭢ
79:19
మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా
ﭣﭤﭥﭦ
79:20
తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు
ﭧﭨﭩ
79:21
కాని అతడు (ఫిర్ఔన్) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు
ﭪﭫﭬﭭ
79:22
ఆ తర్వాత అతడు (ఫిర్ఔన్) వెనక్కి మరలి పోయి, (కుట్రలు) పన్నసాగాడు
ﭮﭯﭰ
79:23
పిదప (ప్రజలను) సమావేశపరచి, ఎలుగెత్తి చాటుతూ
ﭱﭲﭳﭴﭵ
79:24
ఇలా అన్నాడు: నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును
ﭶﭷﭸﭹﭺﭻ
79:25
కావున అల్లాహ్ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురి చేశాడు
ﭼﭽﭾﭿﮀﮁﮂ
79:26
నిశ్చయంగా, ఇందులో (అల్లాహ్ కు) భయపడే ప్రతి వ్యక్తి కొరకు గుణపాఠముంది
ﮃﮄﮅﮆﮇﮈﮉﮊ
79:27
ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠినమయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది
ﮋﮌﮍﮎ
79:28
ఆయన దాని కప్పు (ఎత్తు)ను చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు
ﮏﮐﮑﮒﮓ
79:29
మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు
ﮔﮕﮖﮗﮘ
79:30
మరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు
ﮙﮚﮛﮜﮝ
79:31
దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు
ﮞﮟﮠ
79:32
మరియు పర్వతాలను (దానిలో) స్థిరంగా నాటాడు
ﮡﮢﮣﮤ
79:33
మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా
ﮥﮦﮧﮨﮩ
79:34
ఇక ఆ గొప్ప దుర్ఘటన (పునరుత్థాన దినం) వచ్చినప్పుడు
ﮪﮫﮬﮭﮮﮯ
79:35
ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు
ﮰﮱﯓﯔﯕ
79:36
మరియు చూసే వారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది
ﯖﯗﯘﯙ
79:37
ఇక ధిక్కారంతో హద్దులు మీరి ప్రవర్తించిన వాడికి
ﯚﯛﯜﯝ
79:38
మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చిన వాడికి
ﯞﯟﯠﯡﯢ
79:39
నిశ్చయంగా, నరకాగ్నియే, వాని నివాస స్థానమవుతుంది
ﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫﯬ
79:40
మరియు తన ప్రభువు ముందు నిలబడ వలసి వుంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి
ﯭﯮﯯﯰﯱ
79:41
నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థానమవుతుంది
ﯲﯳﯴﯵﯶﯷ
79:42
(ఓ ముహమ్మద్!) వీరు నిన్ను - ఆ ఘడియను గురించి: అసలు అది ఎప్పుడొస్తుంది?" అని అడుగుతున్నారు
ﯸﯹﯺﯻﯼ
79:43
దాని గురించి చెప్పడానికి దాంతో నీకేమి సంబంధం
ﯽﯾﯿﰀ
79:44
దాని వాస్తవ జ్ఞానం నీ ప్రభువుకే ఉంది
ﰁﰂﰃﰄﰅﰆ
79:45
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు, దానికి భయపడే వారిని హెచ్చరించే వాడవు మాత్రమే
ﰇﰈﰉﰊﰋﰌﰍﰎﰏﰐ
79:46
వారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు
పవిత్ర ఖురాన్
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







