అన్-నిసా · 14/176
అనువాదం ఉచ్చారణ — అన్-నిసా
وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ وَيَتَعَدَّ حُدُودَهُ يُدْخِلْهُ نَارًا خَالِدًا فِيهَا وَلَهُ عَذَابٌ مُّهِينٌ ۝١٤
Wa mai ya`sil laaha wa Rasoolahoo wa yata`adda hudoodahoo yudkhilhu Naaran khaalidan feehaa wa lahoo `azaabum muheen
📖 తెలుగులో
మరియు ఎవడైతే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయుడై, ఆయన నియమాలను ఉల్లంఘిస్తాడో! అలాంటి వాడు నరకాగ్నిలోకి త్రోయబడతాడు అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. మరియు అతడికి అవమానకరమైన శిక్ష ఉంటుంది
🎧 వినండి

📜 వచనం 12-16 — అన్-నిసా

12۞ وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ أَزْوَاجُكُمْ إِن لَّمْ يَكُن لَّهُنَّ وَلَدٌ ۚ فَإِن كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِينَ بِهَا أَوْ دَيْنٍ ۚ وَلَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ إِن لَّمْ يَكُن لَّكُمْ وَلَدٌ ۚ فَإِن كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُم ۚ مِّن بَعْدِ وَصِيَّةٍ تُوصُونَ بِهَا أَوْ دَيْنٍ ۗ وَإِن كَانَ رَجُلٌ يُورَثُ كَلَالَةً أَوِ امْرَأَةٌ وَلَهُ أَخٌ أَوْ أُخْتٌ فَلِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ ۚ فَإِن كَانُوا أَكْثَرَ مِن ذَٰلِكَ فَهُمْ شُرَكَاءُ فِي الثُّلُثِ ۚ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصَىٰ بِهَا أَوْ دَيْنٍ غَيْرَ مُضَارٍّ ۚ وَصِيَّةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَلِيمٌ
మరియు మీ భార్యలకు సంతానం లేని పక్షంలో, వారు విడిచిపోయిన దానిలో మీకు అర్ధభాగం. కాని ఒకవేళ వారికి సంతానం ఉంటే, వారు విడిచి పోయిన దానిలో నాలుగోభాగం మీది. (ఇదంతా) వారు వ్రాసి పోయిన వీలునామాపై అమలు జరిపి, వారి అప్పులు తీర్చిన తరువాత. మరియు మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచి పోయిన దానిలో వారికి (మీ భార్యలకు) నాలుగోభాగం. కాని ఒకవేళ మీకు సంతానం ఉంటే, మీరు విడిచిన దానిలో వారికి ఎనిమిదో భాగం. ఇదంతా మీరు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి మీ అప్పులు తీర్చిన తరువాత. మరియు ఒకవేళ మరణించిన పురుషుడు లేక స్త్రీ కలాల అయి (తండ్రి, కొడుకు లేక మనమడు లేకుండా) ఒక సోదరుడు మరియు ఒక సోదరి మాత్రమే ఉంటే, వారిలో ప్రతి ఒక్కరికీ ఆరోభాగం. కాని ఒకవేళ వారు (సోదరసోదరీమణులు) ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే, వారంతా మూడో భాగానికి వారసులవుతారు. ఇదంతా మృతుడు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి అప్పులు తీర్చిన తరువాత. ఎవ్వరికీ నష్టం కలుగజేయకుండా జరగాలి. ఇది అల్లాహ్ నుండి వచ్చిన ఆదేశం. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, సహనశీలుడు (శాంతస్వభావుడు)
13تِلْكَ حُدُودُ اللَّهِ ۚ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
ఇవి అల్లాహ్ (విధించిన) హద్దులు. ఎవరైతే అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో, వారిని ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరియు ఇదే గొప్ప సాఫల్యం (విజయం)
14وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ وَيَتَعَدَّ حُدُودَهُ يُدْخِلْهُ نَارًا خَالِدًا فِيهَا وَلَهُ عَذَابٌ مُّهِينٌ
మరియు ఎవడైతే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయుడై, ఆయన నియమాలను ఉల్లంఘిస్తాడో! అలాంటి వాడు నరకాగ్నిలోకి త్రోయబడతాడు అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. మరియు అతడికి అవమానకరమైన శిక్ష ఉంటుంది
15وَاللَّاتِي يَأْتِينَ الْفَاحِشَةَ مِن نِّسَائِكُمْ فَاسْتَشْهِدُوا عَلَيْهِنَّ أَرْبَعَةً مِّنكُمْ ۖ فَإِن شَهِدُوا فَأَمْسِكُوهُنَّ فِي الْبُيُوتِ حَتَّىٰ يَتَوَفَّاهُنَّ الْمَوْتُ أَوْ يَجْعَلَ اللَّهُ لَهُنَّ سَبِيلًا
మరియు మీ స్త్రీలలో ఎవరైనా వ్యభిచారానికి పాల్పబడితే, వారికి వ్యతిరేకంగా, మీలో నుండి నలుగురి సాక్ష్యం తీసుకోండి. వారు (నలుగురు) సాక్ష్యమిస్తే, వారు మరణించే వరకైనా, లేదా వారి కొరకు అల్లాహ్ ఏదైనా మార్గం చూపించే వరకైనా, వారిని ఇండ్లలో నిర్బంధించండి
16وَاللَّذَانِ يَأْتِيَانِهَا مِنكُمْ فَآذُوهُمَا ۖ فَإِن تَابَا وَأَصْلَحَا فَأَعْرِضُوا عَنْهُمَا ۗ إِنَّ اللَّهَ كَانَ تَوَّابًا رَّحِيمًا
మరియు మీలో ఏ ఇద్దరూ (స్త్రీలు గానీ, పురుషులు గానీ) దీనికి (వ్యభిచారానికి) పాల్పడితే వారిద్దరినీ శిక్షించండి. వారు పశ్చాత్తాప పడి తమ ప్రవర్తనను సవరించుకుంటే వారిని విడిచిపెట్టండి. నిశ్చయంగా, అల్లాహ్ యే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత
అన్-నిసాఖురాన్ సూచిక
176వచనం
MedinanRevelation
14వచనం

అనువాదం — అన్-నిసా 14

సూరా అన్-నిసా వచనం 14 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు ఎవడైతే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయుడై, ఆయన నియమాలను…

సూరా వచనం 14/176 — అన్-నిసా النساء (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అన్-నిసా వినండి, అన్-నిసా అనువాదం, అన్-నిసా mp3, అన్-నిసా pdf. వచనం 12–16. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers