అత్-తౌబా · 103/129
అనువాదం ఉచ్చారణ — సూరా అత్-తౌబా
خُذْ مِنْ أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا وَصَلِّ عَلَيْهِمْ ۖ إِنَّ صَلَاتَكَ سَكَنٌ لَّهُمْ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ ۝١٠٣
Khuz min amwaalihim sadaqtan tutahhiruhum wa tuzakkeehim bihaa wa salli `alaihim inna salaataka sakanul lahum; wallaahu Samee`un `Aleem
📖 తెలుగులో
(కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు. మరియు వారి కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు. మరియు నిశ్చయంగా, నీ ప్రార్థనలు వారికి మనశ్శాంతిని కలిగిస్తాయి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 101-105 — సూరా అత్-తౌబా

101وَمِمَّنْ حَوْلَكُم مِّنَ الْأَعْرَابِ مُنَافِقُونَ ۖ وَمِنْ أَهْلِ الْمَدِينَةِ ۖ مَرَدُوا عَلَى النِّفَاقِ لَا تَعْلَمُهُمْ ۖ نَحْنُ نَعْلَمُهُمْ ۚ سَنُعَذِّبُهُم مَّرَّتَيْنِ ثُمَّ يُرَدُّونَ إِلَىٰ عَذَابٍ عَظِيمٍ
మరియు మీ చుట్టుప్రక్కల ఉండే ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు కపట విశ్వాసులున్నారు. మరియు (ప్రవక్త) నగరం (మదీనా మునవ్వరా)లో కూడా (కపటవిశ్వాసులు) ఉన్నారు. వారు తమ కాపట్యంలో నాటుకొని ఉన్నారు. కాని (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఎరుగవు. మేము వారిని ఎరుగుతాము. మేము వారికి రెట్టింపు శిక్షను విధించగలము. తరువాత వారు ఘోరశిక్ష వైపుకు మరలింపబడతారు
102وَآخَرُونَ اعْتَرَفُوا بِذُنُوبِهِمْ خَلَطُوا عَمَلًا صَالِحًا وَآخَرَ سَيِّئًا عَسَى اللَّهُ أَن يَتُوبَ عَلَيْهِمْ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
మరియు ఇతరులు, తమ పాపాలను ఒప్పుకున్న వారున్నారు. వారు తమ సత్కార్యాన్ని ఇతర పాపకార్యంతో కలిపారు. అల్లాహ్ వారిని తప్పక క్షమిస్తాడు! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
103خُذْ مِنْ أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا وَصَلِّ عَلَيْهِمْ ۖ إِنَّ صَلَاتَكَ سَكَنٌ لَّهُمْ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
(కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు. మరియు వారి కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు. మరియు నిశ్చయంగా, నీ ప్రార్థనలు వారికి మనశ్శాంతిని కలిగిస్తాయి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
104أَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ هُوَ يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ وَيَأْخُذُ الصَّدَقَاتِ وَأَنَّ اللَّهَ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
ఏమీ? వాస్తవానికి అల్లాహ్ తన దాసుల పశ్చాత్తాపాన్ని (తౌబహ్ ను) అంగీకరిస్తాడని మరియు వారి దానాలను (సదఖాత్ లను) స్వీకరిస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత
105وَقُلِ اعْمَلُوا فَسَيَرَى اللَّهُ عَمَلَكُمْ وَرَسُولُهُ وَالْمُؤْمِنُونَ ۖ وَسَتُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
మరియు (ఓ ప్రవక్తా!) వారితో అను: మీరు (మీ పని) చేస్తూ ఉండండి, అల్లాహ్ ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు మీరు చేస్తున్న పనులు చూస్తున్నారు. తరువాత మీరు తప్పక అగోచర మరియు గోచర విషయాలను ఎరుగు ఆయన (అల్లాహ్) వద్దకు తిరిగి పంపబడగలరు. అప్పుడాయన మీరు చేస్తూ వున్న కర్మలను గురించి మీకు తెలియజేస్తాడు
అత్-తౌబాఖురాన్ సూచిక
129వచనం
MedinanRevelation
103వచనం

అనువాదం — అత్-తౌబా 103

సూరా అత్-తౌబా వచనం 103 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని,…

సూరా వచనం 103/129 — సూరా అత్-తౌబా التوبة (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అత్-తౌబా వినండి, సూరా అత్-తౌబా అనువాదం, సూరా అత్-తౌబా mp3, సూరా అత్-తౌబా pdf. వచనం 101–105. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers